విజయనగరం అర్బన్: ఒడిశాలోని ఫకీర్ మోహన్ యూనివర్సిటీలో ఈ నెల 15 నుంచి జరగనున్న అఖిల భారత అంతర విశ్వవిద్యాలయ మహిళల తైక్వాండో పోటీలకు స్థానిక సీతం ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని సీహెచ్ యశస్విని ఎంపికై ంది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల విశాఖ జిల్లా తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన అంతర్ కళాశాల తైక్వాండో పోటీల్లో కుర్గి ఓవర్ వెయిట్ 73 కిలోల విభాగంతో పాటు పూమ్సే వ్యక్తిగత, టీం ఈవెంట్లలో ప్రతిభ కనబరిచి జేఎన్‌టీయూ జీవీ జట్టుకు అర్హత సాధించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు యశస్వినిని అభినందించారు.


