విజయనగరం: జోయలుక్కాస్ అంటేనే నమ్మకమైన బ్రాండ్ అని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జోయలుక్కాస్ విజయనగరం జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన నూతన షోరూంను వారు ప్రారంభించారు. అనంతరం షోరూంలో విక్రయానికి ఉంచిన ఆభరణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విజయనగరంలో కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపారాలు విస్తరించటం మంచి పరిణామంగా పేర్కొన్నారు. వినియోగదారులు మెచ్చే నాణ్యమైన ఆభరణాలను సరసమైన ధరలకు అందించాలని ఆకాంక్షించారు. కేరళలోని కొట్టాయంలో ప్రారంభించిన జోయలుక్కాస్ వివిధ దేశాల్లో 190 షోరూమ్‌లు నిర్వహిస్తుండగా... భారతదేశంలో 113 షోరూమ్‌లు నిర్వహిస్తోందన్నారు. నమ్మకం, విశ్వాసం, మన్నికకు పేరెన్నికగన్న సంస్థగా పేరుగాంచిన జోయలుక్కాస్ విజయనగరంలో షోరూం ప్రారంభించటం శుభపరిణామంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన డైమండ్లను అందిస్తోందన్నారు. జోయలుక్కాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ మాథ్యు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజుల్లో నాలుగు కొత్త షోరూమ్‌లు ప్రారంభిస్తున్నట్టు వివరించారు. శుక్రవారం ఒక్క రోజే విజయనగరంతో పాటు శ్రీకాకుళం ప్రాంతాల్లో నూతన షోరూంలు ప్రారంభించామన్నారు. దేశంలో వ్యాపార విస్తరణలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు. జోయలుక్కాస్‌లో ఒకే చోట బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినం, వివాహ ఆభరణాల విస్తృత శ్రేణిని చూడొచ్చని వివరించారు. వ్యక్తిగతీకరించిన సేవల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్రాండ్ గుర్తింపు పొందిందన్నారు. ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జోయలుక్కాస్ ఈ నెల 29 వరకు తయారీ చార్జీలపై ఫ్లాట్ 40 శాతం తగ్గింపుతో పరిమిత కాలపు ప్రారంభ ఆఫర్ అందిస్తోందన్నారు. జోయలుక్కాస్ సీఓఓ హెన్రీ జార్జ్, మార్కెటింగ్ హెడ్ అనిష్ వర్గీస్, రిటైల్ హెడ్ రాజేశ్ కృష్ణన్, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకుడు జి.ఈశ్వర్‌కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.


