న్యూస్‌రీల్
ధర పెంపు, గ్యాస్ కొరతతో హోటళ్ల నిర్వాహకులు అవస్థలు మూతపడుతున్న చిరు వ్యాపారాలు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తోన్న మెస్‌ల నిర్వాహకులు ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్న గృహ వినియోగదారులు కమర్షియల్ గ్యాస్ సిలెండర్ల పంపిణీపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
ప్రత్యామ్నాయాల వైపు..
విజయనగరం
సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026
బండ రానిదే..
ఎండాకాలం వచ్చిందంటే కొన్ని రకాల వ్యాధు లు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయి.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ల సరఫరాపై అనిశ్చితి నెలకొంది. యుద్ధానికి ముందు రోజు వారి ఇండెంట్ పెడితే సరఫరా చేసే ఏజెన్సీలు ప్రస్తుతం 10 రోజులు ముందుగా డీడీల రూపంలో నగదు చెల్లించినా సరఫరా చేసేందుకు ముందుకు రావటం లేదు. దీంతో గ్యాస్ తక్కువగా వినియోగమయ్యే వంటలు మాత్రమే వండుతున్నాం. ప్రభుత్వం ఓ వైపు గ్యాస్ కొరత లేదంటూ ప్రకటనలు చేస్తున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. లేకుంటే హోటల్ రంగం నష్టాల ఊబిలో కూరుకుపోతుంది.
– జి.శ్రీనివాస్, అధ్యక్షుడు, ఏపీ హోటల్స్ అసోసియేషన్
విజయనగరం:
పశ్చిమాసియాలో యుద్ధం భారత్‌లో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. వంట గ్యాస్ ఫిల్లింగు టెర్మినల్స్‌లో నాన్ డొమిస్టిక్ సిలిండర్ల (ఎన్టీసీ) ఉత్పత్తి, అమ్మకాలపై ఇప్పటికే కోత పడగా.. గత రెండు రోజుల నుంచి ఏకంగా వంట గ్యాస్ సిలిండర్ల ఫిల్లింగ్ కూడా మందకొడిగా సాగుతోంది. ఉత్తరాంధ్రలోని అన్ని గ్యాస్ ఏజెన్సీల డీలర్లకు.. ఒక్కో డీలరుకి రోజుకు ఒక్క లోడు మాత్రమే ఇచ్చేందుకు ఆయిల్ కంపెనీలు ఉత్తర్వులను జారీ చేసినట్టు సమాచారం. యుద్ధ ప్రభావానికి ముందు ఒక్కో డీలరుకు గరిష్టంగా రెండు లేదా మూడు లోడ్ల వరకు ఫిల్లింగ్ జరిగేది. ఇప్పుడు ఒక్క లోడుకే పరిమితం చేయడంతో డీలర్ల వద్ద క్రమేణ నిల్వలు తగ్గుతున్నాయి. మరో వైపు వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిచి హోటళ్లు, చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరంలోనే సగటున 70 వేల వరకు వాణిజ్య సిలిండర్లు వినియోగిస్తారు. వాటికి సరఫరా నిలిచి పలు హోటళ్లలో వంటకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇదే సమయంలో గృహాలకు వంటగ్యాస్ సరఫరాలో సైతం ఆంక్షలు మొదలయ్యాయి. గ్యాస్ సిలిండరు తీసుకున్న 25 రోజులు పూర్తయితేనే మరొక సిలిండర్ బుకింగ్‌కు అవకాశం ఉంది. పలువురు బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్నా కావడం లేదు. వారం రోజుల నుంచి గ్యాస్ బుకింగ్ చేద్దామని ఆన్లైన్ నెంబరుకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వస్తోంది. దీంతో డీలర్ల వద్దకు పరుగెడుతున్నారు.
భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సరఫరా
జిల్లాలో గ్యాస్ ధరల భారం మోస్తున్న పెద్ద, చిన్న హోటళ్ల నిర్వాహకులకు వేధిస్తున్న గ్యాస్ కొరత గోరుచుట్టుపై రోకటిపోటులా మారింది. కొరతను సాకుగా చూపి కొందరు డీలర్లు చేస్తున్న నల్లబజారు వ్యాపారంతో నలిగిపోతున్నామని వాపోతున్నారు. ఫలితంగా ఎంతో మంది ఉపాధికి కష్టం అవుతోంది. ధరలు పెరిగితే ప్రజలపై ఆర్థిక భారం పడుతుంది. ధర పెరగడంతో పాటు సరఫరా నిలిచిపోయింది. రోజుకు 5 సిలిండర్లు అవసరమైతే అసలు అందడం లేదు. బ్లాక్ మార్కెట్‌లో రూ.500 నుంచి రూ.1000 అదనపు వసూలు చేస్తున్నారు. జిల్లా హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు అందించిన సమాచారం ప్రకారం జిల్లాలోని ఆహార పదార్దాలు తయారు చేసి విక్రయించేందుకు అవసరమైన కమర్షియల్ గ్యాస్ ప్రతి నెల 30వేల కేజీల అవసరం కాగా... ప్రస్తుతం కేవలం 8వేల కేజీల అందిస్తుండటం గమనార్హం. ఇదే ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగితే టిఫిన్లు, ఫాస్ట్‌ఫుడ్, బిర్యానీలు, స్వీట్లు, పిండి వంటలు, కర్రీ పాయింట్లు, బేకరీ ఆహారాల రేట్లు పెరిగిపోతాయి. బయట ఉండి చదువుకుంటున్న విద్యారులు, ఉద్యోగులపై పెనుభారం పడనుంది.
పెరిగిన ధరలు
గ్యాస్ బండ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. వంట గ్యాస్‌పై రూ.60, వాణిజ్య (కమర్షియల్) సిలిండరుపై రూ.115 పెంచింది. యుద్ధం ఇలానే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. జిల్లాలో రోజుకు సరాసరి 4 వేల నుంచి 6 వేల సిలిండర్లు వినియోగదారులకు ఏజెన్సీల నుంచి పంపిణీ జరుగుతోంది. పెరిగిన ధరలతో వినియోగదారులపై రూ.5 లక్షల వరకు భారం పడే అవకాశాలున్నాయి.
ప్రతీ రోజు వేలాది మంది స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారు ఆకలిని తీర్చుకునేందుకు హోటల్స్, మెస్‌లును ఆశ్రయిస్తుంటారు. గ్యాస్ కొరత తీవ్ర ఇబ్బందికరంగా మారింది. కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నాం. మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి.
– పి.వాసు, అధ్యక్షుడు,
విజయనగరం హోటల్ అసోసియేషన్
నగరంలో పలు హోటళ్ల నిర్వాహకులు వాణిజ్య సిలిండర్లకు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి పెట్టారు. కొన్ని చిన్న హోటళ్ల నిర్వాహకులు ఏకంగా కట్టెల పొయ్యిలు వాడుతున్నారు. కొన్ని హోటళ్ల యాజమాన్యాలు గతంలో మాదిరి అన్ని రకాలు పెట్టలేమని చెబుతున్నారు. ఆహార సరఫరాలో సైతం మూడు, నాలుగు రకాలు మాత్రమే అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలో చిన్నహోటళ్లు, టిఫిన్ తోపుడు బళ్లు, వాహన టిఫిన్ సెంటర్ల ఆధారంగా వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. ఒక్కో హోటల్‌లో ముగ్గురు నుంచి పది మంది వరకు పని చేస్తున్నారు. వీరి సంఖ్య క్రమంగా తగ్గించుకుంటున్నారు.


