పాలనపై పట్టులేని చంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

పాలనపై పట్టులేని చంద్రబాబు

Mar 16 2026 7:18 AM | Updated on Mar 16 2026 7:18 AM

పాలనపై పట్టులేని చంద్రబాబు

ఇచ్చిన హామీలు గాలికొదిలేశారు..

ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌

రేగిడి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 40 సంవత్సరాల అనుభవమని డప్పు కొట్టుకోవడమే తప్ప పాలనపై పట్టులేదని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ అన్నారు. మండలంలోని అక్కన్నఅగ్రహా రం గ్రామానికి ఆదివారం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి కాకుండా కేవలం అబద్దపు ప్రచారాలకే పరిమితమైందని అన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో చేసి న అప్పు కంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కాకముందే రూ.3.35 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై ప్రజలకున్న అభిమానాన్ని చూసి ఓర్వలేకే పార్టీపై బురదజల్లే కార్యక్రమం చేపడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికొదిలేసి సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ అని డబ్బా కొట్టుకోవడమేనని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంత వరకు బడుగు బలహీన వర్గాల వారికి ఇళ్లు, అర్హులైన వారికి పింఛన్లు అందజేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసిందని మండిపడ్డారు. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతులకే ఏటా రూ.13వేలు పెట్టుబడి సాయం అందించి ఆదుకుందని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చి మొండి చేయి చూపించారని విమర్శించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు టి.అచ్చెన్నాయుడు, మండల పార్టీ కన్వీనర్‌ వి.జగన్మోహనరావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు కె.వెంకటేశ్వరరావు, బీసీ సెల్‌ అధ్యక్షులు కరణం శ్రీనివాసరావు, సర్పంచ్‌లు కె.గోవిందరావు, గార రమణ, ఉప సర్పంచ్‌ బాలి తవిటినాయుడు, పి.ధవళేశ్వరరావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement