వీరఘట్టం: స్థానిక శ్రీకోటదుర్గ తల్లి ఆలయ తృతీయ వార్షికోత్సవం ఆదివారం కనులపండువగా నిర్వహించారు. యజ్ఞకర్త ఎస్.వి.ఎల్.ఎన్ శర్మయాజీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పరిషత్ కృఛ్చత్రయం, పంచగవ్వ ఆరాధన, అఖండ దీపారాధన, ఋత్విక్ వరుణ ప్రధానం, యాగశాల ప్రవేశ ద్వారపూజ, ధ్వజ పతాకావిష్కరణ, మండల మండపారాధనతో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు అమ్మవారి నిజరూప దర్శనాన్ని భక్తులు తిలకించారు. నిజరూపంలో ఉన్న దుర్గాదేవికి భక్తులు మట్టి కుండలతో తెచ్చిన పాలతో అర్చకులు దుర్గాదేవిరి క్షీరాభిషేకాలు చేశారు. సాయంత్రం దుర్గాదేవి భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు.


