బొండపల్లి వద్ద పట్టుకున్న ఎన్‌సీబీ టీం
కాయగూరల మాటున యథేచ్ఛగా రవాణా
647 కేజీల గంజాయి స్వాధీనం
బొండపల్లి: ఒడిశా కేంద్రంగా విశాఖపట్నంకు భారీగా తరలిస్తున్న గంజాయిని విశాఖకు చెందిన నార్కోటిక్ సెంట్రల్ బ్యూరో(ఎన్‌సీబీ) పోలీసులు ఆదివారం వేకువజామున పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు.. ఒడిశాలోని సిమిలిగూడ ప్రాంతానికి చెందిన అజయ్‌రాయ్ తన బొలెరో వ్యాన్‌లో వేకువజామున వ్యాన్‌లో కింద గంజాయి ప్యాకెట్లు పేర్చి పైన క్యాబేజీలను వేసి రవాణా చేస్తుండగా ఎన్‌సీబీ పోలీసులకు అందిన సమాచా రం మేరకు బొండపల్లి పోలీస్‌స్టేషన్ మీదుగా వెళ్తు న్న బొలెరో వాహనాన్ని పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
647 కేజీల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం ఎన్‌సీబీకి అందిన సమాచారం మేర కు ఒడిశాలోని సిమిలిగూడ నుంచి విశాఖపట్నం తరలిస్తున్న 647కేజీల గంజాయిని పట్టుకోవడంతో పాటు వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. దాడుల్లో ఎన్‌సీబీ పోలీసులు, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్‌ఐలతో పాటు సిబ్బంది పాల్గొని బొలెరో వ్యాన్‌ను పట్టుకున్నారు. ఆరా తీ యగా కాయగూరలు రవాణా మాటున గంజాయి తరలింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
గంజాయి విలువ రూ.3.20 కోట్లు
పోలీసులకు పట్టుబడిన గంజాయి విలువ సుమా రు రూ.3.20 కోట్లు ఉంటుందని పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడంతో పాటు అందుకు సహకరించిన వారిపై ఆరా తీసే పనిలో ఎన్‌సీబీ పోలీసులు నిమగ్నమయ్యారు.


