పనుల్లేక.. | - | Sakshi
Sakshi News home page

పనుల్లేక..

Mar 18 2026 7:37 AM | Updated on Mar 18 2026 7:37 AM

నా చిన్నతనం నుంచి టైలరింగ్‌ చేస్తున్నా.. గతంలో ఎంతో వైభవంగా ఉండే ఈ వృత్తి ప్రస్తుతం రడీమేడ్‌ రాకతో కుదేలైంది. ప్రస్తుతం పనుల్లేక ఖాళీగా ఉంటున్నాం. పండగల సమయంలో కూడా పనులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇంతకు ముందు పండగల సమయంలో రాత్రి పగలు పనిచేసేవాళ్లం. –డి.సూర్యగణపతి, టైలర్‌, రాజాం

ప్రభుత్వం ఆదుకోవాలి..

టైలరింగ్‌ పనిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. పనుల్లేక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా మంది రడీమేడ్‌ దుస్తులు వాడడంతో కుట్టించుకునే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఇతర వృత్తి చేసుకోలేక జీవనాన్ని నెట్టుకొస్తున్నాం. రోజు కూలి గిట్టుబాటు అయితే చాలు అన్న చందంగా టైలర్ల పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి.

– కె.సత్యం, టైలర్‌, వస్త్రపురి కాలనీ, రాజాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement