డెంకాడ: చింతలవలస ఐదో ఏపీఎస్పీ బెటాలియన్‌లో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి కల్యాణం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజాము నుంచే సుప్రభాత సేవ, అర్చనలు, ప్రత్యేక హోమాలు చేపట్టారు. సాయంత్రం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య స్వామి కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్, ఉమాదేవి దంపతులు శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసునికి కల్యాణంలో పాల్గొన్నారు. వందలాది మంది భక్తులు, బెటాలియన్ అధికారులు, సిబ్బంది కల్యాణాన్ని తిలకించారు.


