ఒక్క నిమిషం ఆలోచిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చు.. ఆలస్యమైనా సురక్షితంగా ఇంటికి వెళ్లాలన్నా ఆలోచనా ఉన్నా ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఓవర్ లోడ్ వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అటు ఆటో డ్రైవర్లలో గాని ఇటు ప్రయాణికుల్లో గాని మార్పు రావడం లేదు. ముగ్గురు, నలుగురు ఎక్కాల్సిన ఆటోలో పదుల సంఖ్యలో ప్రయాణికులను కుక్కేస్తున్నారు.. దీంతో ఏమాత్రం అదుపు తప్పినా విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోక తప్పదు. అలాగే ద్విచక్ర వాహనదారులు కూడా ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు.. జిల్లా కేంద్రంలో శనివారం సాక్షి కంట పడిన ప్రమాదకర ప్రయాణాలు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం
లగేజ్
వాహనంలో ప్రయాణికులు
ఆటోల్లో కిక్కిరిసిన
ప్రయాణికులు


