హెచ్‌పీవీ టీకాతో క్యాన్సర్‌కు చెక్‌.. | - | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీ టీకాతో క్యాన్సర్‌కు చెక్‌..

Mar 15 2026 1:32 AM | Updated on Mar 15 2026 1:32 AM

హెచ్‌పీవీ టీకాతో క్యాన్సర్‌కు చెక్‌..

సీతానగరం: మహిళలకు ఆశించే ప్రమాదకర గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌) క్యాన్సర్‌ నుంచి రక్షణకు హెచ్‌పీవీ టీకా ఉపయోగపడుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్‌. భాస్కరరావు తెలిపారు. స్థానిక పీహెచ్‌సీలో చేపడుతున్న హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను జిల్లా ఎన్‌సీడీ అధికారి టి. జగన్‌మోహన్‌రావుతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ భాస్కరరావు మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు నిండి పదిహేనేళ్ల లోపున్న బాలికలకు ఈ టీకా వేస్తున్నట్లు చెప్పారు. ఏ ఒక్క బాలిక సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం టీకా ఉచితంగా వేస్తోందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు పది వేల బాలికలకు టీకాలు వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్‌కు ముందు ఆభా ఐడీతో యువిన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారి పి. ఉషారాణి, యుడీసీ మురళి, సూపర్‌వైజర్‌ వెంకటరమణ, ఆ రోగ్య పర్యవేక్షకులు భవానీ, రవణమ్మ, గోపాల్‌నాయుడు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ భాస్కరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement