● జనసేన నేత బొలిశెట్టి
సత్యనారాయణ
గుర్ల: మండలంలోని కెల్ల, బెల్లానపేట, దమరసింగి, వల్లాపురం, మన్యపురిపేట గ్రామాలలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయునున్న ఇంటిగ్రేటేడ్ స్టీల్ ప్లాంట్‌కు జనసేన వ్యతిరేకమని జనసేన రాష్ట్ర నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. మండలంలోని బెల్లానపేటలో ఐదు గ్రామాల రైతులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా, రైతుల పక్షాన పోరాటం చేస్తామని హమీ ఇచ్చారు. పరిశ్రమలు మొట్ట ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, మూడు పంటలు పండే పల్లం ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల రెతులుకు అన్యాయం జరుగుతుందన్నారు. సాగు భూములను పరిశ్రమలకు కట్టబెట్టడాన్ని తప్పుబట్టారు. పంచాయతీల తీర్మానం లేకుండా ప్లాంట్లు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈ సమస్యను జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో జనసేన చీపురుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు, జనసేన నేత రమేష్ రాజు ఉన్నారు.


