ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధి.. | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధి..

Mar 17 2026 7:20 AM | Updated on Mar 17 2026 7:20 AM

కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి

పార్వతీపురం రూరల్‌: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కారవేదిక (పీజీఆర్‌ఎస్‌)లో ఆయన పాల్గొని అర్జీదారుల నుంచి 110 వినతులు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ విభాగానికి 40, ఇతర శాఖలకు 70 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన తప్పనిసరని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వచ్చిన వినతుల్లో కొన్ని..

● పార్వతీపురం బైపాస్‌ రోడ్డు ధూళి సమస్యను పరిష్కరించి, మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరారు.

● కురుపాం మండలం దొమ్మిడిని కొత్త పంచాయతీగా ప్రకటించాలని సర్పంచ్‌ ఎం. గౌరి, తదితరులు అర్జీ సమర్పించారు.

● గరుగుబిల్లి మండలంలో చెరువుల ఆక్రమణలను తొలగించాలని.. కొమరాడ, ఉక్కాడవలస ప్రాంతాల్లో భూములను ఆన్‌లైన్‌ చేయాలని అర్జీలు సమర్పించారు.

● బీఈడీ పూర్తి చేసిన తమకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, వ్యవసాయానికి బోర్‌ మంజూరు చేయాలని గిరిజన యువకులు కోరారు.

● నాగావళి నదిపై 20 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న పూర్ణపాడు – లాభేసు వంతెన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు డిమాండ్‌ చేస్తూ జేసీ యశ్వంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

● గిరిజన వేతనదారుల నుంచి సొమ్ము వసూలు చేస్తున్న డ్వామా పీడీని సస్పెండ్‌ చేయాలని.. డీఈఓ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డిప్యుటేషన్లను రద్దు చేయాలని గిరిజన సంక్షేమ సంఘం నేత పాలక రంజిత్‌కుమార్‌ కోరుతూ వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement