విజయనగరం కలెక్టరేట్: ఆంధ్రరాష్ట్ర సాధకుడు పొట్టి శ్రీరాములు 125వ జయంతిని కలెక్టరేట్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, పీసీఓ బాలాజీ, ఆర్య వైశ్య సంఘం సభ్యులు రవ్వ శ్రీనివాస్, బండారు చంద్ర శేఖర్, ఎస్‌వీఎన్ శివ, కాపుగంటి ప్రకాష్, చెరుకూరి నాగార్జున, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన త్యాగం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు.
మహనీయుడు పొట్టి శ్రీరాములు
విజయనగరం క్రైమ్: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఎస్పీ దామోదర్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు 125వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. అమరజీవి చిత్రపటానికి ఎస్పీ, ఏఎస్పీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఇ.కోటిరెడ్డి, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


