దారి చూపండి.. ప్లీజ్‌.. | - | Sakshi
Sakshi News home page

దారి చూపండి.. ప్లీజ్‌..

Mar 17 2026 7:20 AM | Updated on Mar 17 2026 7:20 AM

గజపతినగరం: ఓ వ్యక్తి ఇంటి నిర్మాణంలో రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారు.. కనీసం ఆటో కూడా వెళ్లడంలేదు.. తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలంటూ గజపతినగరం మండలం పురిటిపెంట న్యూకాలనీ వాసులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను చుట్టుముట్టి గోడు వినిపించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. రహదారికి అడ్డంగా ఉండే గోడను తొలగించి రహదారి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఉద్యానవన పంటల సాగుకు ప్రాధ్యాన్యమివ్వాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సూచించారు. గజపతినగరం పంచాయతీ ఎమ్‌.వెంకటాపురం గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పలు రకాల నూతన వంగడాలు, పరికరాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ వి.టి.రామారావు, పశుసవంర్ధక శాఖ ఎ.డి. ఎన్‌.చంద్ర శేఖర్‌, ఎ.డి.ఎ. ఎ.నిర్మళాజ్యోతి, ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక, జెడ్పీటీసీ సభ్యుడు గార తవుడు, ఏఓ కిరణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement