సమస్యల పరిష్కారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారమే లక్ష్యం

Mar 10 2026 7:07 AM | Updated on Mar 10 2026 7:07 AM

కలెక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి

పార్వతీపురం: పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జేసీ సి. యశ్వంత్‌కుమార్‌ రెడ్డి , డీఆర్‌ఓ కె. హేమలత, ఎస్‌డీసీ దిలీప్‌ చక్రవర్తితో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ అర్జీని వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమయపాలన, ప్రజాస్పందన, పారదర్శకత మీదే పరిపాలన ఆదారపడి ఉంటుందన్నారు. ఫిర్యాదులకు తక్షణం పరిష్కారం చూపితే అర్జీదారుల్లో విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వచ్చిన వినతుల్లో కొన్ని..

● గుమ్మలక్ష్మీపురం మండలం మంత్రజోల గ్రామానికి ప్రభుత్వం మంజూరు చేసిన బీటీ రహదారి నిర్మాణ పనులు పూర్తిగా చేపట్టాలని గ్రామస్తులు సురేష్‌ కుమార్‌, తదితరులు వినతిపత్రం అందించారు.

● మక్కువ మండలం బురదగెడ్డ గ్రామంలోని ఐటీడీఏ ట్రైబుల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని గ్రామానికి చెందిన డి. లక్ష్మి కోరుతూ అర్జీ అందజేశారు.

● పార్వతీపురం పట్టణంలోని మజ్జిగౌరీ కాలనీలో ఉన్న అపార్ట్‌మెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ రహదారి మధ్యలో ఉండడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌ను మార్చాలని పట్టణానికి చెందిన కేబీకే ప్రసాద్‌ అర్జీ సమర్పించారు.

● పదో తగరతి మార్కుల లిస్ట్‌లో ఇంటిపేరు తప్పుగా పడిందని..రైతుభరోసా డబ్బులు జమకాలేదని.. పాస్‌పుస్తకాల్లో మార్పులకోసం..భూ ఆక్రమణలను అరికట్టాలని పలువురు అర్జీలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement