● పరాభవనామ సంవత్సరాదికి స్వాగతం
గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026
8 మంది పోలీస్ ఉద్యోగులకు ఉగాది పురస్కారాలు
విజయనగరం క్రైమ్:
జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఎనిమిది మందికి ఉగాది పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. సేవా పతకాలు లభించిన వారందరూ ఎస్పీ దామోదర్‌ను బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. మున్ముందు అకుంఠిత దీక్షతో పనిచేయాలని వారికి ఎస్పీ సూచించారు. ఎనిమిది మందిలో ఒకరి ఉత్తమ సేవా పతకం, మిగిలిన ఏడుగురురికి సేవా పతకాలు వరించాయి. పతకాలకు ఎంపికై న వారిలో చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, ఏఎస్‌ఐ దేవీ, ఏఎస్‌ఐ త్రినాథరావు, ఏఆర్ ఎస్‌ఐ నాగేశ్వరరావు, రామపండు, హెచ్‌సీలు రామరాజు, కృష్ణ, కానిస్టేబుల్ రాంబాబు ఉన్నారు.
చైత్రమాసం.. వసంత రుతువు.. శిశిరంలో మోడైపోయిన చెట్లన్నీ చిగుళ్లు తొడిగే ఆహ్లాదకర వాతావరణంలో వచ్చే పరాభవనామ తెలుగు సంవత్సరాదికి విజయనగరం బాబామెట్టలోని వరలక్ష్మి నాట్యాలయం విద్యార్థినులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. షడ్రుచుల సమ్మేళనమే జీవితమని చెబుతూ ఉగాది పచ్చడిని బుధవారం పంచిపెట్టారు. తెలుగు సంవత్సరాది జిల్లా ప్రజలందరికీ శుభాలివ్వాలని ఆకాంక్షించారు.
– సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం


