బాధను దిగమింగి.. | - | Sakshi
Sakshi News home page

బాధను దిగమింగి..

Mar 17 2026 7:20 AM | Updated on Mar 17 2026 7:20 AM

తల్లి మరణించిన మరుచటి రోజే పరీక్షకు హాజరు

రామభద్రపురం: తండ్రి ఎలా ఉంటాడో తెలియదు.. అన్నీ తానై పెంచిన తల్లి అనారోగ్యంతో మృతి చెందింది.. తల్లి కళ్లెదుటే విగతజీవిగా పడి ఉంటే కుమిలి కుమిలి ఏడ్చిన కుమారుడు అంతటి బాధను కూడా దిగమింగుకుని మరుచటి రోజు పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొట్టక్కి గ్రామానికి చెందిన ముల్లు రామలక్ష్మి (33) గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె భర్త విడిచిపెట్టి మరో మహిళతో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి రామలక్ష్మి ఇళ్లల్లో పనులు చేసుకుంటూ బిడ్డను (కోటేశ్వరావు) సాకుతూ వచ్చింది. కుమారుడిని గారాబంగా పెంచుకుంటూ పదో తరగతి వరకు చదివించింది. ఇక పై చదువులు చదివి తనను ఆదుకుంటాడనుకున్న సమయంలో విధి వక్రించింది. అనారోగ్యంతో రామలక్ష్మి ఆదివారం కన్నుమూసింది. దీంతో గుండెలవిసేలా ఏడ్చిన కోటేశ్వరరావు.. ఇంతటి బాధలోనూ సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement