చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడిలో గల శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం ఆవరణలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చీపురుపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోని దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం చీపురుపల్లి నుంచి భారీ ర్యాలీగా వెళ్లి గరివిడిలో జరిగిన వేడుకల్లో వైఎస్‌ఆర్సీపీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ, పార్టీ పీఏపీమెంబర్ బెల్లాన చంద్రశేఖర్, శాసన మండలి విపక్ష నేత కుమార్తె బొత్స అనూష, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కొయ్యన శ్రీవాణి, నియోజకవర్గ పరిశీలకులు పెడాడ రమణి కుమారి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కేవీ సూర్యనారాయణరాజు, తదితరులు పాల్గొన్నారు.


