నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థాన క్షేత్ర పాలకులగా విరాజిల్లుతున్న ఉమాసదాశివస్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు మంగళవారం వైభవం జరిగాయి. ఆలయ అర్చకులు రేజేటి మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో ముందుగా గణపతి పూజ, ప్రత్యేక హోమం అనంతరం శివుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో విశేష అభిషేకాలు జరిపించారు. అనంతరం కామాక్షి అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలు చేపట్టి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కా ర్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


