వ్యవస్థ మెరుగుపడేలా కథనాలు.. | - | Sakshi
Sakshi News home page

వ్యవస్థ మెరుగుపడేలా కథనాలు..

Mar 17 2026 7:20 AM | Updated on Mar 17 2026 7:20 AM

కలెక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి

పార్వతీపురం: వ్యవస్థను మెరుగుపరిచేలా, ప్రజలకు ఉపయోగపడేలా వార్త కథనాలు ఉండాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా మీడియా అక్రిడేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు 196 కార్డులు అందజేసినట్లు చెప్పారు. జర్నలిజం సూత్రాలపై రిపోర్టర్లకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయాలని పలువురు జర్నలిస్టులు కోరారు. కార్యక్రమంలో జేసీ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, సబ్‌ కలెక్టర్లు ఆర్‌. వైశాలి, పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీపీఆర్‌ఓ కె. బాల్మాన్‌సింగ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement