● అర్ధ గంట పాటు కనిమెరక
గేటు సమీపంలో నిలిచిపోయిన రైలు
● మంటలు ఆర్పిన తర్వాత బయలుదేరిన రైలు
బొండపల్లి: మండలంలోని కనిమెరక – దావాలపేట రెల్వేగేట్లకు సమీపంలో విశాఖపట్టణం నుంచి గజపతినగరం వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో బొగ్గు వ్యాగిన్‌లో శనివారం మంటలు రావడంతో అర్ధ గంట పాటు నిలిపేశారు. బొగ్గు వ్యాగన్‌లో మంటలు రావడాన్ని గ్యాంగ్‌మన్‌లు పైడి సీతారాం, బి.సూర్యనారాయణ గమనించి అప్రమత్తమై రైలుకు ఎర్ర జెండా ఊపి నిలిపేశారు. దీంతో గూడ్స్ డ్రైవర్ల వద్ద ఉన్న మంటలను ఆర్పే యంత్రాలతో వాటిని అదుపు చేశారు. తరువాత రైలును యధావిధిగా పంపించారు. దీంతో ఆ మార్గంలో కాసేపు రైళ్ల రాకపోకలను నిలిపేశారు. అదే మార్గంలో వస్తున్న వందేభారత్ రైతులను వేరే మార్గం ద్వారా పంపించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు.


