పార్వతీపురం రూరల్ : నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ – ఒడిశా సరిహద్దు గ్రామాల్లో గురువారం ఎకై ్సజ్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పార్వతీపురం ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.శిరీష ఆధ్వర్యంలో ఒడిశాలోని కోరాపుట్ జిల్లా కర్లీ, కప్పలాడ, పిప్పలబద్ర గ్రామాల్లో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 4,800 లీటర్ల బెల్లపు ఊటతో పాటు 170 లీటర్ల నాటుసారాను గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురిపై ఒడిశా ఎకై ్సజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడుల్లో పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం, సీతానగరం, సాలూరు ఎకై ్సజ్ స్టేషన్ల సిబ్బంది, విజయనగరం ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇ.ఎస్.టి.ఎఫ్ బృందాలు, సాలూరు బీఎంపీపీ సిబ్బంది పాల్గొన్నారు.
4,800 లీటర్ల ఊట ధ్వంసం


