అంబరాన్నంటిన
రాజాంలో వైఎస్సార్‌సీపీ జెండాను ఆవిష్కరిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం
నియోజకవర్గ ఇన్‌చార్జి
తలేరాజేష్ తదితరులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. విజయనగరం, బొబ్బిలి, రాజాం, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్.కోట నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు, నాయకులు వేడుకల్లో పాల్గొని పార్టీ పతాకాలను ఎగురవేశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు మండలాల్లో పార్టీ నేతలు కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. సామాజిక సేవల్లో నిమగ్నమయ్యారు.
విజయనగరంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభధ్రస్వామి తొలుత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అభిమానుల జేజేలు నడుమ వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేశారు. పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు. వైఎస్సార్‌సీపీ 16వ వసంతంలోకి అడుగుపెట డం సంతోషంగా ఉందన్నారు. పార్టీని నడిపిస్తున్న శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
రాజాం నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ హాజరయ్యారు. పార్టీ రాజాం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలే రాజేష్, పార్టీ పరిశీలకుడు కేవీ సూర్యనారాయణరాజుతో కలిసి పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో చర్చించారు. రేగిడి మండలకేంద్రంలో ఆ మండల ఎంపీపీ దార అప్పలనరసమ్మ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మండల కన్వీనర్ జగన్‌మోహన్‌రావులు పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.
బొబ్బిలి పట్టణం బలిజిపేట రోడ్డులో ఉన్న అమ్మిగారి కోనేటి గట్టు దరిలో ఉన్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాల నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఇంటి గోపాలరావు, పట్టణ అధ్యక్షుడు చోడిగంజి రమేష్ నాయుడు తదితరుల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ బొబ్బిలి సమన్వయకర్త శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు. బాడంగి, తెర్లాం, రామభద్రపురం మండలాల్లో ఊరూరా ఉత్సవంలా నిర్వహించారు. వేడుకల్లో పార్టీ నేతలు తమ్మిరెడ్డి దామోదరరావు, బొద్దల సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూసపాటిరేగలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు బడ్డుకొండ ప్రదీప్ నాయుడు, మండల వైస్సార్సీపీ అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు పార్టీ జెండా ఎగురవేశారు, భోగాపురంలో మండల వైస్సార్సీపీ అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి వైస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళలు అర్పించారు, అనంతరం వైఎస్సార్ సీపీ జెండాను ఎగురవేశారు. నెల్లిమర్లలో నగర పార్టీ అధ్యక్షుడు చిక్కాల సాంబశివరావు, వైస్సార్సీపీ నాయకుడు సముద్రపు రామారావులు పాల్గొన్నారు.
గజపతినగరం నియోజవర్గంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పార్టీ జెండాను ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు పాల్గొని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గతంలో అందించిన సుపరిపాలనను గుర్తుచేశారు. దత్తిరాజేరులో పార్టీ మండలాధ్యక్షుడు రాపాక కృష్ణార్జున, రాజుల రామచంద్రపురంలో ఎంపీపీ గేదెల గేదెల సింహాద్రి అప్పలనాయుడు, జెడ్పీటీసీ రౌతు రాజేశ్వరి, గంట్యాడలో పార్టీ అధ్యక్షుడు జాగరపు అప్పారావు పార్టీ జెండాలను ఆవిష్కరించారు. కేక్‌లు కట్‌చేసి అభిమానులకు పంచిపెట్టారు.
ఊరూరా వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలు
16వ వసంతంలోకి అడుగిడుతున్న వేళ.. సంబరాలు చేసుకున్న పార్టీ శ్రేణులు
సమన్వయకర్తలు, పార్టీనేతల
సమక్షంలో జెండా ఆవిష్కరణలు


