25న న్యాయవాదుల సంఘం ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

25న న్యాయవాదుల సంఘం ఎన్నికలు

Mar 17 2026 7:20 AM | Updated on Mar 17 2026 7:20 AM

విజయనగరం లీగల్‌: ప్రతిష్టాత్మకమైన జిల్లా కేంద్ర న్యాయవాదుల సంఘ ఎన్నికలు ఈనెల 25 న జరుగనున్నాయి. సంఘంలో సుమారు 600 మంది సభ్యులున్నారు. అధ్యక్ష పదవికి నళితం రమేష్‌కుమార్‌, గువ్వల తిరుపతిరావు పోటీపడుతున్నారు. వీరిద్దరూ తమ మద్దతుదారులతో సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 25న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్‌ నిర్వహిస్తామని ముఖ్య ఎన్నికల అధికారి కంటుభుక్త శ్రీనివాస్‌ తెలిపారు. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఆదేశాలు, సూచనల మేరకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అధ్యక్ష పదవితో పాటు కార్యదర్శి, ఉపాధ్యక్ష, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, గ్రంథాలయ కార్యదర్శి, స్పోర్ట్స్‌ సెక్రటరీ, సీనియర్‌, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుల పదవికి ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎన్నికల అధికారులు వై. హరికృష్ణ, దాసరి పద్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement