సాధారణ రైతుల సంఖ్యను తగ్గించేసిన చంద్రబాబు సర్కార్ కౌలు రైతులకు మొండి చేయి చూపింది. మొదటి, రెండు విడతల్లో కౌలు రైతులకు మొండిచేయి చూపిన చంద్రబాబు సర్కార్ మూడో విడతలోనూ ఒక్క రుపాయి విదల్చలేదు. దీంతో కౌలు రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. జిల్లాలో 13 ,635 మంది కౌలు రైతులను వ్యవసాయ అధికారులు గుర్తించారు. భూమి లేని రైతులు భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తారు. సాగు పెట్టుబడికి అప్పులు చేస్తారు. పెట్టుబడి సాయం అందిస్తే సాగుఖర్చు కష్టాల నుంచి గట్టెక్కుతారు. కానీ చంద్రబాబు సర్కారు వారికి ఆర్థిక సాయం అందించ లేదు. సచివాలయాల్లో దరఖాస్తు చేసినా ఫలితం లేకపోయింది.


