విజయనగరం: జాతీయ లోక్‌అదాలత్‌ను ఈ నెల 14న విజయనగరం హనుమాన్ నగర్‌లోని ఎంఆర్ పీజీ కళాశాల హాస్టల్ ప్రాంగణంలో నిర్వహిస్తామని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్‌అదాలత్‌లో వాహన ప్రమాదాలు, బ్యాంకులకు సంబంధించిన కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎన్‌ఐ యాక్టు, ఎకై ్సజ్ కేసులు, కుటుంబ తగదాలు, కార్మిక సంబంధిత కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభయ్యే లోక్‌అదాలత్‌ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పోలీస్ సిబ్బంది ‘చేయూత’
విజయనగరం క్రైమ్: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గజపతినగరం కానిస్టేబుల్ టి.తిరుపతిరావు కుటుంబానికి పోలీస్ సిబ్బంది అండగా నిలిచారు. ‘చేయూత’ కింద సేకరించిన రూ.1,47,800లను చెక్కురూపంలో కానిస్టేబుల్ భార్య దమయంతికి అదనపు ఎస్పీ సౌమ్యలత తన కార్యాలయంలో సోమవారం అందజేశారు. కార్యక్రమంలో ఏఓ పి.శ్రీనివాసరావు, ఆఫీస్ సూపరింటెండెంట్ వి.లలిత, అడహాక్ కమిటీ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
హమాలీల సమస్యలు పరిష్కరించండి
నెల్లిమర్ల: జిల్లాలోని విద్యుత్‌స్టోర్స్‌లో పనిచేస్తున్న హమాలీల సమస్యలను పరిష్కరించాలని ఏపీ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిక్ట్ స్టోర్స్ హమాలీస్ యూనియన్ (సీఐటీయూ) సభ్యులు ఏపీ ఈపీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇ.పృద్విరాజ్‌కు విన్నవించారు. యూనియన్ నాయకులు కెల్ల గోవిందరావు, ఎ.భాష తదితరులు విశాఖపట్నంలో సోమవారం ఎం.డిని కలిశారు. ఏపీ ఈపీడీసీఎల్ కంపెనీ పరిధిలోని ఐదు జిల్లాల జట్టు కార్మికుల లోడింగ్, అన్‌లోడింగ్ బిల్లులను త్వరితగతిన చెల్లించాలని, సోర్స్ సిబ్బందికి ఉద్యోగభద్రత కల్పించాలని, నెలవారీ వేతనాలు చెల్లించాలని కోరారు. ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు 50 శాతం పెంచి, లోడింగ్, ఆన్ లోడింగ్ బిల్లులు త్వరితగతిన చెల్లించాలన్నారు.
మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
● మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం కలెక్టరేట్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళా దినోత్సవ వేడుకల్లో నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలకు అవార్డులు ప్రదానం చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు.
వలసలు అరికట్టడమే లక్ష్యం
విజయనగరం ఫోర్ట్: వీబీ–జీ రామ్‌జీ కింద పనులు కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో వలసలను అరికట్టడమే లక్ష్యమని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో వీబీ–జీరామ్‌జీ చట్టంపై రూపొందించిన అవగాహన వాల్ పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఏటా ప్రతి కుటుంబానికి 125 రోజుల ఉపాధిహామీ కల్పిస్తామన్నారు. పనిచేసిన 15 రోజుల్లోగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేతనం జమచేయాలని, పనికోరిన 15 రోజుల్లో పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పారు. కృత్రిమ మేధ(ఏఐ) జీపీఎస్ మొబైల్ యాప్‌ల ద్వారా పనుల పర్యవేక్షణ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ శారదాదేవి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి, తదితరులు పాల్గొన్నారు.


