బ్రాయిలర్
లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్
శ్రీ167 శ్రీ304 శ్రీ314
చికెన్
విజయనగరం అర్బన్: మాజీ సైనికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన అడుగు వేసింది. మాజీ సైనికుల కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్‌ఎస్) పరిధిలో విజయనగరంలో కొత్త పాలిక్లినిక్‌ను ఏర్పాటు చేశారు. ఈ వైద్య కేంద్రాన్ని ఈస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్) రియర్ అడ్మిరల్ ఎం.మురళీమోహన్ రాజు సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కమాండ్ మెడికల్ ఆఫీసర్ సర్జన్ రియర్ అడ్మిరల్ దిలీప్ రాఘవన్, మాజీ సైనికుల ప్రతినిధులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా పరిధిలో నివసిస్తున్న సుమారు 15 వేల మంది ఈసీహెచ్‌ఎస్ లబ్ధిదారులకు ఈ పాలీక్లినిక్ ద్వారా వైద్య సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎం. మురళీ మోహన్‌రాజు మాట్లాడుతూ.. దేశానికి సేవలందించిన మాజీ సైనికులకు సమయానుకూలంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో రీజినల్ సెంటర్ ఈసీహెచ్‌ఎస్ సెల్ అధికారి కెప్టెన్ ఎంవీఎస్ కుమార్, మాజీ సైననికులు పాల్గొన్నారు.


