ఉపాధ్యాయులపై పనిభారం తగ్గించాలి.. | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులపై పనిభారం తగ్గించాలి..

Mar 16 2026 7:18 AM | Updated on Mar 16 2026 7:18 AM

పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు

కృష్ణయ్య

గజపతినగరం రూరల్‌: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులపై తీవ్రమైన పని ఒత్తిడి ఉందని.. వెంటనే ప్రభుత్వం స్పందించి పనిభారం తగ్గించాలని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. మండలంలోని మరుపల్లిలో గల బాలాజీ పాలిటెక్నిక్‌ కళాశాలలో పీఆర్‌టీయూ ఐదో జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్‌టీయమూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు అవసరమైన సభ్యత్వ నమోదు మరింత ఎక్కువ స్థాయిలో చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఎం గిరిప్రసాద్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉపాధ్యాయలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాలు చేయక తప్పదన్నారు. అనంతరం జనరల్‌ సెక్రెటరీ డి. శ్రీనివాస్‌ సంఘ వార్షిక నివేదికను సభకు సమర్పించారు. ఈ సందర్భంగా మూడోసారి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తమ సంఘం తరఫున ఎన్నికై న గాదె శ్రీనివాసులునాయుడును రాష్ట్ర నాయకులు ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి రవీంద్రనాయుడు, జిల్లా జనరల్‌ సెక్రెటరీ డి.శ్రీనివాస్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రావాడ రాంబాబు, బైరి అప్పారావు, పప్పల రాజశేఖర్‌, ఆల్తి రాంబాబు, డెక్క వెంకటరావు, బండారు రవికుమార్‌, బూడి వెంకటరావు, పీఆర్‌టీయూ మండల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement