బొబ్బిలి రూరల్: మండలంలోని ఎం బూర్జివలస వద్ద ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీతో చెరువులో మట్టిని తవ్వి తరలిస్తున్న టిప్పర్‌ను రెవెన్యూ అధికారులు సోమవారం రాత్రి దాడి చేసి పట్టుకున్నారు. జేసీబీ డ్రైవర్ తప్పించుకుని అక్కడ నుంచి పారిపోగా.. మట్టితో నిండిన టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నామని ఆర్‌ఐ రామ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు మైనింగ్ శాఖ సూచనలతో మట్టితో దొరికిన టిప్పర్‌కు 16,200 రూపాయిలు జరిమానా విధించిందని తహసీల్దార్ ఎం.శ్రీను తెలిపారు. ఇక మీదట మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు, తరలింపులకు పాల్పడితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.


