బస్సులో ప్రయాణం.. నరకప్రాయం | - | Sakshi
Sakshi News home page

బస్సులో ప్రయాణం.. నరకప్రాయం

Mar 15 2026 1:31 AM | Updated on Mar 15 2026 1:31 AM

యూఎన్‌ఓకు విద్యార్థిని ఫిర్యాదు

భామిని: పాఠశాలలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న బాలికలు శారీరక హింస, అసభ్యకరమైన మాటలు, దూషణలకు గురవుతున్నట్టు హోలీక్రాస్‌ గ్రో క్లబ్‌ సభ్యురాలు చాందిని ఐక్యరాజ్యసమితికి శనివారం ఫిర్యాదు చేశారు. జనాలతో నిండిన బస్సుల్లో ప్రయాణంతో విద్యార్థినులు నిత్యం నరకం అనుభవిస్తున్నట్టు వివరించారు. ఐక్యరాజ్యసమితి నిర్వహించే మహిళల స్థితిగతుల కమిషన్‌ సమావేశం (సీఎస్‌డబ్ల్యూ – 70) సందర్భంగా జరిగిన అంతర్జాతీయ వర్చువల్‌ కార్యక్రమంలో గర్ల్స్‌ రోడ్‌ మ్యాప్‌ టు జస్టీస్‌లో యువ ప్యానల్‌ స్పీకర్‌గా చాందిని తన అభిప్రాయాలు వెల్లడించారు. బాలికలు హింసకు గురైనప్పుడు వారి తల్లిదండ్రులు నిర్భయంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగలిగే స్నేహపూర్వక పోలీస్‌ వ్యవస్థ ఉండాలన్నారు. ిఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచాలని కోరారు. హోలీక్రాస్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్లో క్లబ్‌లు బాలికల అవసరాలను గుర్తించి చైతన్యపరుస్తున్నట్టు డైరెక్టర్‌ ప్రభుదాస్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement