రామభద్రపురం: పదో తరగతి విద్యార్థుల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు పబ్లిక్ పరీక్షలలో వెసులుబాటు కల్పించారు. వీరికున్న శారీరక వైకల్యాన్ని బట్టి అర్హులైన వారికి సహాయకులను నియమించుకునేందుకు అవకాశం కల్పించారు. 9వ తరగతి చదివే బాల బాలికలను సహాయకునిగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. చూపు సరిగా లేని విద్యార్థులు ఏదైనా ఒక భాష (లాంగ్వేజ్ సబ్జెక్టు) పరీక్ష రాయకుండా మినహాయింపు ఉంది. మిగిలిన పరీక్షల్లో 20 మార్కులు పొందితే ఉత్తీర్ణులవుతారు. వినికిడి లోపం ఉన్నవారు రెండు భాషలు రాయనవసరం లేదు. మిగిలిన పరీక్షల్లో సబ్జెక్టుకు 20 మార్కులు చొప్పున్న పొందాల్సి ఉంటుంది. మాట లోపం గల విద్యార్థులు ఒక్కో సబ్జెక్టులో 20 మార్కులు సాధించాలి. పరీక్ష సమయం అదనంగా అరగంట కేటాయిస్తారు.


