● డీఎంహెచ్‌ఓ జీవనరాణి
విజయనగరం ఫోర్ట్: నేత్ర సమస్యలపై అలసత్వం వహించరాదని డీఎంహెచ్‌ఓ ఎస్.జీవనరాణి అన్నారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్లకోమా వ్యాధిపై అవగాహన పెంచుకోవాలన్నారు. గ్లకోమా పట్ల నిర్లక్ష్యం వహిస్తే చూపుకోల్పోయే ప్రమాదం ఉందన్నారు. 40 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ గ్లకోమా పరీక్షలు చేయించుకోవాలన్నారు. మధుమేహవ్యాధి ఉన్న వారు కూడా గ్లకోమా పరీక్షలు చేయించుకోవాలన్నారు. కంటికి సంబంఽధించి ఏ చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం వహించరాదన్నారు. కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ శాఖ ప్రొగ్రాం మేనేజర్ డాక్టర్ కె.త్రినాథరావు, చిన్నతల్లి, తారక్, తదితరులు పాల్గొన్నారు.


