నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం

Mar 13 2026 7:30 AM | Updated on Mar 13 2026 7:30 AM

సంయుక్త కలెక్టర్‌ సేతుమాధవన్‌

విజయనగరం కలెక్టరేట్‌: ప్రపంచ వినియోగదారుల దినోత్సవం (ఈ నెల 15)ను పురస్కరించుకుని జిల్లాలో ఈ నెల 13న మధ్యాహ్నం 4 గంటలకు కలెక్టరేట్‌లో వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు సంయుక్త కలెక్టర్‌ సేతుమాధవన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ఫోరం సభ్యులంతా హాజరు కావాలని ఆ ప్రకటనలో జేసీ కోరారు.

ఆపదసమయంలో మహిళలు ధైర్యంగా స్పందించాలి

సీ్త్ర, శిశు సంక్షేమశాఖ సాధికారత అధికారిణి బాలామణి

విజయనగరం ఫోర్ట్‌: ఆపద సమయంలో మహిళలు ధైర్యంగా స్పందించాలని సీ్త్ర, శిశు సంక్షేమశాఖ సాధికారత అధికారిణి కె.వి.బాలామణి అన్నారు. స్థానిక ఎం.ఆర్‌. కళాశాలలో మిషన్‌ శక్తి పథకంపై గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. గుడ్‌టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై విద్యార్థినులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. సైబర్‌ క్రైమ్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. 18 ఏళ్ల లోపు బాలలు ఆపద సమయంలో హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1098కు ఫోన్‌ చేయాలన్నారు. 18 ఏళ్లు దాటిన మహిళలు రక్షణ, సంరక్షణ, వైద్య, న్యాయ సహాయం కోసం వన్‌స్టాప్‌ సెంటర్‌ను ఆశ్రయించాలన్నారు. కార్యక్రమంలో వన్‌స్టాప్‌ సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ పి.సాయివిజయలక్ష్మి, కేస్‌ వర్కర్‌ అనిత తదితరులు పాల్గొన్నారు.

మహిళలు పిల్లలనుకనే యంత్రాలు కాదు

జేవీవీ సమతా రాష్ట్ర కన్వీనర్‌ నిర్మల

విజయనగరం గంటస్తంభం: ముగ్గురు పిల్లలకు జన్మనిస్తే రూ.25 వేల ప్రోత్సాహకం ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పడం మహిళలను పిల్లలను కనే యంత్రాలుగా చూడటంలో భాగమని జేవీవీ సమతా రాష్ట్ర కన్వీనర్‌ జి.నిర్మల దుయ్యబట్టారు. మహిళలు ఎంత మంది పిల్లలను కనాలనే నిర్ణయం వారి హక్కు అని పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టకుండా పిల్లలను కనాలని ప్రోత్సహించడం సరైది కాదన్నారు. సీఎం వ్యాఖ్యలను జేవీవీ సమతా రాష్ట్ర కమిటీ ఖండించినట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

టెన్త్‌ విద్యార్థులకు

ఉచిత బస్సు సదుపాయం

విజయనగరం అర్బన్‌: పదోతరగతి పబ్లిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణాఅధికారి జి.వరలక్ష్మి తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు హాల్‌టికెట్‌ చూపించి ఆల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

వీనెక్స్‌ నిర్వాహకుడిని తక్షణమే అరెస్టు చేయాలి

విజయనగరం గంటస్తంభం/క్రైమ్‌: విజయనగరం పట్టణంలో డీసీసీబీ బ్యాంకు సమీపంలో ఉన్న వినెక్స్‌ కోచింగ్‌ సెంటర్‌ యాజమాని శ్రీనివాసరావును తోణమే అరెస్టు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్మి పి.రమణమ్మ డిమాండ్‌ చేశారు. శిక్షణ కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వివాహిత, అవివాహితులపై గురువు ముసుగులో లైంగిక వేధింపులకు పాల్పడడం దారుణమన్నారు. ఇలాంటి నీచపు గురువుకు కఠిన శిక్ష విధించాలని, కోచింగ్‌ సెంటర్లపై నిఘాపెట్టి, విద్యార్థినులకు భద్రత కల్పించాలని కోరారు.

లైంగిక వేధింపుల కేసు విచారణాధికారి శిరీష మహిళా పోలీస్‌ స్టేషన్‌లో వీనెక్స్‌ శిక్షణ సంస్థ నిర్వాహకుడి లైంగిక వేధింపులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణాధికారిగా ఎస్‌ఐ శిరీషను పోలీస్‌ ఉన్నతాధికారులు నియమించారు.

భామినిలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు త్రిసభ్య కమిటీ

పాలకొండ రూరల్‌: పాలకొండ నియోజకవర్గంలోని భామిని మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, కళాశాల విద్య, రాజమండ్రి ఆదేశాల మేరకు వేసిన కమిటీలో పాలకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.శ్యామ్‌బాబు, భౌతికశాస్త్రం విభాగాధిపతి కె.శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా నోడల్‌ అధికారి, సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ జి.శ్రీనివాస్‌లు సభ్యులుగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement