చికెన్
విజయనగరం క్రైమ్: నిద్రిస్తున్న వదిన మెడలో బంగారాన్ని దొంగిలించిన మరిదిని విజయనగరం టూటౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి టుటౌన్ సీఐ శ్రీనివాస్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయఘడకు చెందిన బుడుపూరు మణికంఠ సుబుద్ది ఈ ఏడాది జనవరి 10న విజయనగరంలోని తన అన్న బుడుమూరు రామారావు ఇంటికి వచ్చాడు. కొద్ది రోజులు మంచిగానే ఉన్న మణికంఠ అదే నెల 25న నిద్రిస్తున్న వదిన మెడలోనుంచి పుస్తెలతాడు, నల్లపూసలను దొంగిలించి పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అప్పటి నుంచి నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు విజయనగరం రైల్వేస్టేషన్ వద్ద సోమవారం పట్టుబడ్డాడు. సుమారు 3 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు.
గంజాయి నిందితుడు..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన గంజాయి నిందితుడిని విజయనగరం రూరల్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. 2020లో దాదాపు 30 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. అప్పటి నుంచి రూరల్ సీఐ లక్ష్మణరావు, క్రైమ్ పార్టీ సిబ్బంది వెతుకుతుండగా.. ఎట్టకేలకు పట్టుకున్నారు.


