రెవెన్యూ ఉద్యోగుల తీరుపై ఎమ్మెల్సీ మండిపాటు | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ ఉద్యోగుల తీరుపై ఎమ్మెల్సీ మండిపాటు

Mar 11 2026 9:01 AM | Updated on Mar 11 2026 9:01 AM

టూ.. పన్నులు కడుతూ.. విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నా పోలీసులను ఉసిగొల్పి బెదిరించి లాక్కుంటున్నారని ఆరోపించారు. కేసులు పెడితే రూ.2లక్షలు కట్టి బయటకు రావాల్సి ఉంటుందని చెప్పి భయపెడుతున్నారని పేర్కొన్నారు. అసలు ఈ ప్రాంతంలో ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయా.. అధికారులు, ప్రజాప్రతినిదులు కార్పొరేట్‌ కంపెనీలకు కార్పెట్లు పరచడానికే ఉన్నారంటూ మండిపడ్డారు. వాల్టా చట్టానికి తూట్లు పొడిచి నాలుగు దశాబ్దాలు వయసు గల భారీ చెట్లు, తోటలు ధ్వంసం చేస్తుంటే రెవెన్యూ, పోలీసు శాఖలు కళ్లు మూసుకుంటూ జిందాల్‌ అక్రమాలకు కాపలా కాస్తున్నారని ఆరోపించారు. కోర్టును ఆశ్రయించిన 33 మంది రైతులను ఆ భూములను తరలించకూడదని ఆదేశిస్తే వారిలో చలుమూరి రామారావు తాలూకా రెండెకరాల భూమిని ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. బీరువాల్లో ముక్కిపోయిన నోటీసులను కలెక్టర్‌ చూడాలని, 18 మంది రైతుల భూములను దోచేస్తున్న రెవెన్యూ లీలలను డీఆర్‌ఓ పట్టించుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అధికారులు స్పందించకుంటే రైతుల కోసం తానే నిరాహార దీక్షకు కూర్చుంటానని తేల్చి చెప్పారు.

శృంగవరపుకోట: పీఓటీ అంటే పవర్‌ చూపించు... ఆక్రమించు.. తొలగించు... అన్న చందంగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ రఘురాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో పెదఖండేపల్లి గ్రామానికి చెందిన జిందాల్‌ భాదిత రైతులు, ఎంపీపీ సోమేశ్వరరావు, సర్పంచ్‌ యాళ్ల వెంకటరమణ, ఎంపీటీసీ బోదల దేముడు సహ పలువురు రైతులతో కలిసి తహసీల్దార్‌ శ్రీనివాసరావు కార్యాలయం వద్ద మంగళవారం బైఠాయించారు. పీఓటీ రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ల భూములు జిందాల్‌ ఎలా లాక్కుంటుందని, మీరెలా మద్దతు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌కు వాస్తవాలు చెప్పాలని నిలదీశారు. తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిందాల్‌ యాజమాన్యం, రెవెన్యూ అధికారులు పీఓటీ భూములు 18 మంది రైతులకు చెందిన 74 ఎకరాలను కబ్జా చేశారన్నారు. 18 మంది రైతుల పీఓటీ భూములను జిందాల్‌కు ఎలా విక్రయించారని, 2002లో జిందాల్‌కు ఎలా రిజిస్ట్రేషన్‌ చేశారని ప్రశ్నించారు. నాటి నుంచి నేటి వరకూ రైతుల ఆధీనంలో ఉన్న భూములను లాక్కొని గెంటేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇళ్లు ఉం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement