అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు

Mar 10 2026 7:07 AM | Updated on Mar 10 2026 7:07 AM

ఎస్పీ మాధవ్‌రెడ్డి

పార్వతీపురం రూరల్‌: అర్జీదారులు తెలియజేసిన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ కలహాలు, సైబర్‌ మోసాలు, భూ వివాదాలు, ఆన్‌లైన్‌ వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను ఆయన పరిశీలించారు. అనంతరం సంబంధిత పోలీస్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ.. ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్‌నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement