నెల్లిమర్ల: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్ మీట్‌లో నెల్లిమర్ల మిమ్స్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వహించిన క్రీడా పోటీల్లో పత కాలు సాధించారు. ఎంబీబీఎస్ పైనల్ ఇయర్ విద్యార్థిని పల్లా ప్రమీల 100, 200 మీటర్ల పరుగులో మొదటిస్థానం.. లాంగ్‌జంప్‌లో రెండో స్థానం సాధించి వర్సిటీ ఉత్తమ అథ్లెటిక్‌గా నిలిచింది. ఫైనల్ ఇయర్ విద్యార్థి అద్యాస సమంత్‌రాయ్ డిస్క్‌త్రోలో మొదటి స్థానం.. జావెలిన్ త్రోలో రెండో స్థానం సాధించినట్లు పీడీ కళా వెంకటరావు తెలిపారు. వారిని కళాశాల యాజమాన్యం అభినందించింది.


