పూసపాటిరేగ: రైతులంతా తాము పండించే పంటలకు సంబంధించి, ఈ–క్రాప్ నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ వీటీ రామారావు అన్నారు. మండలంలోని కుమిలి గ్రామంలో మంగళవారం పర్యటించిన ఆయన..అక్కడి రైతులతో సమావేశమై పలు సూచనలు చేశారు. మార్చి 15వ తేదీలోగా ఈ–క్రాప్ నమోదు చేసుకుని, ఆ తర్వాత ఈ–క్రాప్ నమోదు చేసుకున్న వారి జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవో రైతులు చూసుకోవాలన్నారు. పంట నమోదు చేసుకున్న వారు ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల పంట నష్టపోతే వారికి పంట నష్టపరిహారం వస్తుందన్నారు. రైతులంతా నవధాన్యాల సాగు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ నాగభూషణరావు, మండల వ్యవసాయాధికారి కె.నీలిమ తదితరులు పాల్గొన్నారు.


