విజయనగరం క్రైమ్ : విధి నిర్వహణలో ప్రతిభ కనబరిస్తే ప్రోత్సాహకాలు అందిస్తామని ఎస్పీ దామోదర్ అన్నారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడడంతో, చోరీలు, హిట్ అండ్ రన్ కేసులను ఛేదించడం తదితర అంశాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు, సిబ్బందిని డీపీలో మంగళవారం ఎస్పీ అభినందించారు. ప్రోత్సాహక నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బందిని ప్రోత్సహిస్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయన్నారు. క్షేత్ర స్థాయిలో క్రియాశీలకంగా పని చేసే వారిని గుర్తించి ప్రోత్సహిస్తే మిగతా వారు స్ఫూర్తిగా తీసుకుంటారన్నారు. ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో సీఐలు టి.శ్రీనివాసరావు, ఎల్.అప్పలనాయుడు, హెచ్ ఉపేంద్ర, ఎస్‌ఐలు డి.సాయికృష్ణ, వై.వీరజనార్దన్, యు.మహేష్, ఎస్.సుదర్శన్, చంద్రశేఖర్, ఆర్.గోపాలరావు, కె.లక్ష్మణరావు, హెచ్‌సీలు ఎండీ ఇమ్రాన్‌ఖాన్, డి.శంకరరావు, పీసీలు ఎరుబోతు సురేష్‌కుమార్, ఎం.వాసు, కేవీ గణేష్, షేక్ షపీ, ఆర్.శివరావు, బి.నర్సింగరావు, సీహెచ్ జగ్గునాయుడు, పి.శివ, ఎ.సంతోష్, వై.సురేష్‌కుమార్, ఎం.రమేష్, జి.సింహాచలం, ఎన్.కృష్ణకిశోర్, టి.సురేష్, కె.అప్పారావు, సీహెచ్ పవన్‌కుమార్, జె.చంద్రరావు, పి.పాపినాయుడు, ఎం.వెంకటరమణ, బొంతు రాంబాబు తదితరులు ఉన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సైలెన్స్‌ర్లు ధ్వంసం
భారీ శబ్దాలు, దట్టమైన పొగలతో సైలెన్స్‌ర్లు వాడితే సంబంధిత బైక్స్‌ను సీజ్ చేస్తామని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్‌లకు అమర్చిన 550 సెలెన్స్‌ర్లను సీజ్ చేశారు. అనంతరం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఎస్పీ సమక్షంలోనే నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద రోడ్డు రోలరుతో వాటిని ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్స్‌ర్లు అమర్చిన వారికి ఒక్కొక్కరికీ రూ.1500 జరిమానా విధించారు. ఇన్‌చార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు, ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్‌బీ సీఐ ఏవీ లీలారావు, టుటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, వన్‌టౌన్ ఎస్‌ఐ శంభాన రవి, ట్రాఫిక్ ఎస్‌ఐలు ఎస్.భాస్కరరావు, నూకరాజు, చిన్నారావు, హెచ్‌సీ సింహాచలం, భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.


