గజపతినగరం: పోస్టల్ సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన సాధించాలని విజయనగరం డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని సబ్‌పోస్టాఫీస్ కార్యాలయంలో సిబ్బందితో మంగళవారం సమావేశమైన ఆయన..మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున మన ముందున్న లక్ష్యాలను చేరుకోవాలని, అలాగే పోస్టాఫీస్‌లో అందించే ఆధార్ సేవలను ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పోస్టాఫీస్ ప్రగతి నివేదికను వివరించారు. కార్యక్రమంలో సబ్‌డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ ఉపేంద్ర, సబ్ పోస్ట్‌మాస్టర్ అప్పలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


