చేతివృత్తులకు కష్టకాలం.. | - | Sakshi
Sakshi News home page

చేతివృత్తులకు కష్టకాలం..

Mar 17 2026 7:20 AM | Updated on Mar 17 2026 7:20 AM

మంగలి, చాకలి వృత్తులు కూడా అంతంతమాత్రమే..

పూర్వం గ్రామాల్లో మంగలి, కలి వృత్తులకు ప్రత్యేక గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు ఆధునిక సెలూన్లు, వాషింగ్‌ మెషీన్లు, లాండ్రీలు పెరగడంతో ఈ వృత్తుల ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇతర కులస్తులు పట్టణాల్లో ఆధునిక సెలూన్లు, లాండ్రీ షాపులు నిర్వహిస్తుంటే.. అసలైన కులవృత్తిదారులు వారితో పోటీ పడలేక వృత్తినే వదిలేస్తున్నారున.

విజయనగరం గంటస్తంభం: ఒకప్పుడు గ్రామాలు అన్నిరకాల వృత్తిదారులతో సందడిగా ఉండేవి. సూర్యోదయం నుంచే చేతివృత్తిదారులు తమ పనుల్లో బిజీగా కనిపించేవారు. ప్రతి రోజూ కుమ్మరి ఇంట్లో మట్టిచక్రం తిరిగేది. చేనేత కార్మికుడి ఇంట్లో మగ్గం సవ్వడి చేసేది. కంసాలి పనిముట్ల శబ్దం ఊరంతా వినిపించేది. మంగలి కత్తెర చప్పుడు.. చాకలి ఇస్సు ఇస్సు శబ్దాలతో గ్రామాలన్నీ కళకళలాడేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. గ్రామం అంటే కేవలం ఇళ్లు, పొలాలకే పరిమితమైపోయింది. ఆధునిక జీవన విధానం పెరిగింది. యంత్రాలు, ఫ్యాక్టరీలు, ప్లాస్టిక్‌ వస్తువులు మార్కెట్‌ను ఆక్రమించాయి. ఫలితంగా శతాబ్దాలుగా కొనసాగిన సంప్రదాయ కులవృత్తులు నిశ్శబ్దంగా కనుమరుగవుతున్నాయి. ఈ వృత్తులు కేవలం జీవనోపాధి మాత్రమే కాదు..మన సంస్కృతీ, సంప్రదాయాలకు పునాది. కానీ నేడు ఆ వృత్తులపై ఆధారపడి జీవించే కుటుంబాలు తీవ్ర కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.

కంసాలి వృత్తికి కాలం పరీక్ష..

వ్యవసాయ పనులకు కావాల్సిన పరికరాలు

గొడ్డళ్లు, కొడవళ్లు, కత్తులను గతంలో గ్రామాల్లో ఉండే కంసాలులే తయారు చేసేవారు. ఇప్పుడు ఫ్యాక్టరీల్లో తయారయ్యే వస్తువులు మార్కెట్‌ను ఆక్రమించడంతో కంసాలి వృత్తి కూడా క్షీణిస్తోంది. ఇనుప మోగులు మసకబారుతున్నాయి. ఆ వృత్తిపై ఆధారపడి జీవించిన కుటుంబాలు ఆర్థికంగా బలహీనపడుతున్నాయి.

తండ్రి వృత్తి కొనసాగించని కొత్త తరం..

పూర్వం తండ్రి చేసే వృత్తినే కొడుకు కొనసాగించడం సంప్రదాయంగా వచ్చేది. కానీ నేటి పరిస్థితుల్లో యు వత ఆ వృత్తులపై ఆసక్తి చూపడం లేదు. తక్కువ ఆ దాయం, కష్టమైన పని, భవిష్యత్‌పై భయం కారణంగా యువత పట్టణాలకు వెళ్లి ఇతర ఉద్యోగాలు వెతు క్కుంటోంది. దీంతో పూర్వీకుల వృత్తుల కొత్త తరానికి చేరకుండా నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి.

గ్రామ సంస్కృతికి ముప్పు..

కులవృత్తులు కేవలం పనులు కాదు. అవి గ్రామ జీవన విధానానికి ప్రతిబింబం. ఆ వృత్తులు మాయమ్తెతే గ్రామ సంస్కృతీ, సంప్రదాయాలు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు అవి గతకాల జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి.

ప్రభుత్వం – సమాజం కలిసి రక్షించాలి..

ఈ సంప్రదాయ వృత్తులను కాపాడాలంటే ప్రభుత్వంతో పాటు సమాజం కూడా ముందుకు రావాలి. సంప్రదాయ వృత్తులకు ప్రోత్సాహక పథకాలు, మార్కెట్‌ అవకాశాలు కల్పించడం, హస్తకళల పదర్శనలు నిర్వహించడం, యువతకు శిక్షణ ఇవ్వడం. వంటి చర్యలు తీసుకుంటేనే ఈ వృత్తులు తిరిగి బతికే అవకాశం ఉంటుంది.

చేతిలో పని లేక ఇబ్బంది పడుతున్న వృత్తిదారులు

పాత వృత్తులను దెబ్బతీస్తున్న

ఆధునికత

కనమరుగవుతున్న గ్రామ సంస్కృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement