ఘనంగా ఆర్‌ఎస్‌ రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ సక్సెస్‌ మీట్‌ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఆర్‌ఎస్‌ రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ సక్సెస్‌ మీట్‌

Mar 16 2026 7:18 AM | Updated on Mar 16 2026 7:18 AM

విజయనగరం అర్బన్‌: నగరంలోని ఓ ప్రైవేట్‌ సమావేశ మందిరంలో ఆర్‌ఎస్‌ రెడ్డి ఇన్‌న్‌స్టిట్యూట్‌ సక్సెస్‌ మీట్‌ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆఫ్‌లైన్‌ కోచింగ్‌తో పాటు ఆర్‌ఎస్‌ రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ శిక్షణ అందించడం గొప్ప విషయమన్నారు. గ్రూప్‌ వన్‌లో ఒకరు, గ్రూప్‌–2లో 66 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడం విజయనగరం జిల్లాకే గర్వకారణమన్నారు. అనంతరం గ్రూప్స్‌ విజేతలను సన్మానించారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, మాజీ ఎమ్మెల్సీ రఘువర్మ, ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డి. రామకృష్ణ, ఎయిమ్స్‌ గ్రూప్స్‌ ప్రతినిధి కడగల ఆనంద్‌, ఏఎంసీ ప్రతినిధి గేదెల రాజారావు, సువ్వాడ రవిశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement