● కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి
బొబ్బిలిరూరల్: రానున్న రోజుల్లో వ్యవసాయ రంగంలో ఏఐ సాంకేతికత విస్తరిస్తుందని, పంటల సాగు, తెగుళ్లు, నీటి తడుల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని కలెక్టర్ ఎస్ రాంసుందర్‌రెడ్డి తెలిపారు. సంప్రదాయ వరి రకాలకు స్వస్థి చెప్పాలన్నారు. ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ‘పీఎం కిసాన్–అన్నదాతసుఖీభవ’ మూడోవిడత నిధులను విడుదల చేశారు. పెట్టుబడి సాయం సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. కార్యక్రమంలో బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు, ఆర్డీఓ రామ్మోహనరావు, జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు, ఏడీ మదుసూధనరావు, ఏఓ శ్యాంసుందర్, తహసీల్దార్ ఎం.శ్రీను తదితరులు పాల్గొన్నారు.


