Eluru
-
హడలెత్తిన భీమడోలు
భీమడోలు: మంగళవార అర్ధరాత్రి భీమడోలు హడలిపోయింది. క్షతగాత్రులు, ప్రయాణికుల ఆర్తనాదాలతో, అంబులెన్స్‌లు, పోలీసుల సైరన్లతో ఆ ప్రాంతం దద్ధరిల్లింది. వరుస ప్రమాదాలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఆగి ఉన్న వ్యాన్‌ను మరో వ్యాన్ ఢీకొనడంతో తణుకుకు చెందిన కోడూరి వెంకట రామచరణ్ (17) అనే యుడకుడు అక్కడికక్కడే మృతి చెందగా గుంటూరు జిల్లా తిమ్మలపాలెంకు చెందిన వ్యాన్ డ్రైవర్ మామిడి జయరామ్, భార్య మామిడి ప్రశాంతి క్యాబిన్లో ఇరుక్కుపోయారు. ఎస్సై వై.సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్‌లో ఇరుక్కున దంపతులను బయటకు తీసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఢీకొన్న మూడు ప్రైవేట్ బస్సులు అదే సమయంలో వస్తున్న ట్రావెల్ బస్సు ట్రాఫిక్ కోన్లను గుర్తించకుండా సడన్ బ్రేక్ కొట్టి ఢీకొంది. దాని వెనుక మరో రెండు బస్సులు రాగా మొత్తం మూడు బస్సులు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. మధ్యలో ఉన్న బస్సు డ్రైవర్‌తో పాటు 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యలో ఇరుక్కున్న బస్సు ముందు, వెనుక భాగాలు నుజ్జయ్యాయి. మూడో బస్సుల్లోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు పెదపట్నం బాపన్న, అదే జిల్లాలోని ద్రాక్షారామలోని వనుం రామారావు, రావులపాలెంలోని లక్ష్మీపురంనకు చెందిన కొట్టింగ నాగరాజు, కొట్టింగ మీరమ్మలకు గాయాయ్యాయి. మరో బస్సులో అమలాపురంలోని నడిపూడి విత్తనాల నాగరాజు, హైదరాబాద్‌కు చెందిన కేసినకుర్తి చంటిబాబు, విత్తనాల పవన్‌కుమార్, పీసకాయల మోగవల్లిక, శ్రీపూర్ణ దీప్తి గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి, అనంతరం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో భార్యాభర్తలు కొట్టింగ నాగరాజు, కొట్టింగ మీరమ్మలు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి వరుస ప్రమాదాలు యువకుడి మృతి, పది మందికి తీవ్ర గాయాలు అన్నకు బై చెబుదామని వచ్చి.. తణుకుకు చెందిన కోడూరి దుర్గాలోకేష్, వెంకట రామచరణ్ (17) అన్నదమ్ములు. వీరు అమ్మమ్మ ఊరైన పోలసానిపల్లి వచ్చారు. తండ్రి లేకపోవడంతో దుర్గాలోకేష్ చేపల ప్యాకింగ్ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వెంకట రామచరణ్ ఇంటర్ చదువుతున్నాడు. లోకేష్ గుంటూరు జిల్లా వినుకొండలోని చేపల ప్యాకింగ్‌కు రాత్రి బయలుదేరాడు. అన్నను భీమడోలు రైల్వేగేటు వద్ద డీసీఎం వాహనం ఎక్కించి రామచరణ్ బై చెబుతుండగా వెనుక నుంచి అశోక్ లేలాండ్ వ్యాన్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామచరణ్ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. తన కళ్లముందే తమ్ముడు మృతి చెందడంతో దుర్గాలోకేష్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. తల్లి, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
రెండో మత్స్యకార సంఘం వద్దు
టి.నరసాపురం: బొర్రంపాలెంలో రెండో మత్స్యకార సంఘాన్ని ఏర్పాటు చేయవద్దు అంటూ అమలులో ఉన్న మత్స్యకార సహకార సంఘ నాయకులు బత్తుల రమేష్, గుండె చిన్న చిట్టయ్య పలువురు సభ్యులు బుధవారం ఉన్నతాధికారులకు వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్, నాయకులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా బొర్రంపాలెంలో ఒకే మత్స్యకార సంఘం ఉందన్నారు. ఆ సంఘంలో 300 మంది సభ్యులు ఉండి కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలవ జలాశయంలో బొర్రంపాలెం రేవులో చేపల వేటకు వెళ్లి జీవనోపాధి సాగిస్తున్నామన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం మరో మత్స్యకార సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒక మత్స్యకార సంఘం అమలులో ఉండగా మరో సంఘం ఏర్పాటు చట్ట ప్రకారం తప్పని వివరించారు. కొత్త సంఘం ఏర్పాటును వ్యతిరేకిస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, మత్స్య శాఖ జెడీ, పంచాయతీరాజ్ కమిషనర్లకు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదులను సమర్పించామని వివరించారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ద్వారకాతిరుమల: స్థానిక లింగయ్య చెరువు వద్ద పడిపోయిన గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాలు ప్రకారం. లింగయ్య చెరువు వద్ద సుమారు 50 సంవత్సరాల వయస్సుగల వ్యక్తి మంగళవారం ఉదయం పడిపోయాడు. వెంటనే దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని స్థానిక పీహెచ్‌సీకి, అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సెల్ నెంబర్ 94407 96653కు సమాచారం అందించాలని ఆయన కోరారు. చికిత్స పొందుతూ జట్టు కూలీ మృతి భీమడోలు: గుండుగొలను శివారు బీసీ కాలనీ వద్ద తవుడు లారీ బోల్తా ఘటనలో జట్టు కూలీ గొర్జి శ్రీనివాసరావు(52) బుధవారం మృతి చెందాడు. ఈనెల 20వ తేదీ సాయంత్రం రత్నాపురంలోని ఆక్వా చెరువుల వద్దకు తవుడు బస్తాలను దిగుమతి చేసేందుకు ఏడుగురు జట్టు కూలీలు లారీ ఎక్కారు. గుండుగొలను నుంచి రత్నాపురం వెళ్తుండగా మార్గమధ్యమైన గుండుగొలను బీసీ కాలనీ వద్ద లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలకు గాయాలయ్యాయి. వారిలో తీవ్ర గాయాలైన గొర్జి శ్రీను ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి దెందులూరు: విద్యుత్ షాక్‌తో ఒక వ్యక్తి మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఎలా ఉన్నాయి. బుధవారం ఏలూరు రూరల్ మండలం లింగారావు గూడెం చెరువు వద్ద పనికి వచ్చిన పెరుమాళ్ళ తాతారావు (50) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ప్రమాదంలో చెరువు యజమాని మార్త శివకుమార్ కూడా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. మనవడి దాడి.. అమ్మమ్మ మృతి భీమవరం: మనవడు కొట్టడంతో అమ్మమ్మ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఇది. భీమవరం టూటౌన్ సీఐ జి.కాళీచరణ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్రి మాణిక్యం (79) అనే వృద్ధురాలు రాయలం ప్రాంతానికి చెందిన భూదేవి తోటలో తన కుమార్తె ఇంట్లో ఉంటుంది. కాగా ఆమె కుమార్తెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో పెద్ద మనవడికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఆ చిన్నారి ఇంటి ఆవరణలోని పూల మొక్కలు లాగేస్తుండగా మృతురాలు ఆగ్రహం వ్యక్తం చేసి తిట్టింది. అమ్మమ్మ తీరుపై ఆమె రెండో మనవడు తోట మధు ప్రశ్నించగా ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆవేశానికి గురైన మధు కొట్టడంతో అమ్మమ్మ మాణిక్యం కింద పడి మృతి చెందింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. తాతారావు మృతదేహం వద్ద రోదిస్తున్నబంధువులు -
అక్రమ కేసులకు బెదరం
ఏలూరు (టూటౌన్): అక్రమ కేసులు, వేధింపులు, బెదిరింపులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు భయపడరని, పార్టీ మూల స్తంభాలు కార్యకర్తలే అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఏలూరు క్రిస్టల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పార్టీ ఏలూరు జిల్లా సర్వ సభ్య సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. పార్టీ పరంగా ఒక్క పిలుపు ఇవ్వగానే వేలాది మంది కార్యకర్తలు తరలి వచ్చి ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారన్నారు. ప్రతీ కార్యకర్తకు పార్టీ పరంగా అండగా ఉంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిని చేయడమే తమ ధ్యేయమని చెప్పారు. హామీలు అమలు చేయలేక సతమతం ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ.. పాలక ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను వేధిస్తోందని తప్పుపట్టారు. అక్రమ కేసులు పెడుతున్నారని, కొన్ని చోట్ల చంపడం వంటి నీచమైన పనులు చేస్తున్నారన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అనేక కేసులు పెట్టి హింసించారని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను మానసిక క్షోభకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. ‘పేదలకు మూడు సెంట్లతో పాటు.. నాలుగు లక్షలు ఇస్తామన్నారు.. ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. ఎంతమందికీ ఇళ్లు కట్టారో చెప్పే దమ్ముందా.. జగనన్న కాలనీ బోర్డులు మార్చడమే వీరి అభివృద్ధి. కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేక సతమతమవుతున్నారు. అరెస్టులు, అక్రమ కేసులు తప్ప ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏం లేదు’ అని దూలం నాగేశ్వరరావు విమర్శించారు. జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ పిలుపు నిచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పార్టీ శ్రేణుల ఎంపికలో నియమ నిబంధనలకు పెద్ద పీట వేశారన్నారు. వైఎస్సార్సీపీకి మూల స్తంభాలు కార్యకర్తలే జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడటమే ధ్యేయం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటాం వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా సర్వసభ్య సమావేశంలో డీఎన్నార్ -
యోగాతో మెరుగైన జీవనం
ఏలూరు (టూటౌన్): యోగా మెరుగైన జీవనానికి దోహద పడుతుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. వట్లూరు టీటీడీసీలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యోగా ఓరియెంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జెడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన పెంచేందుకు శ్రీయోగాంధ్రశ్రీ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ప్రతీ మండలంలో మాస్టర్ ట్రైనర్ల ద్వారా యోగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. శ్రీయోగాంధ్రశ్రీ కార్యక్రమం నిర్వహణలో భాగంగా రూపొందించిన యాప్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. వేముల ధర్మారావు ఆధ్వర్యంలో యోగా శిక్షణా జరిగింది. కార్యక్రమంలో డీఆర్ఓ వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం సుబ్రహ్మణ్యేశ్వ రరావు తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర 2025పై అవగాహన కల్పించాలి ఏలూరు(మెట్రో): జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాంధ్ర 2025పై జిల్లాలో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం యోగాంధ్ర కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
ఐరన్, సిమెంట్ బస్తాల చోరీ వాస్తవమే
దెందులూరు: జిల్లాలో పేదల గృహ నిర్మాణ కాలనీల్లో ఇళ్ల నిర్మాణ సామగ్రి దొంగతనాలు, దుర్విని యోగం జరిగాయని జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.సత్యనారాయణ చెప్పారు. బుధవారం ఏలూరులో తన కార్యాలయంలో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై స్పందిచారు. దెందులూరు గృహ నిర్మాణ శాఖ గొడౌన్ నుంచి స్టీల్ దొంగతనం జరిగిందని, నూజివీడు గోడౌన్లో డోర్స్, కిటికీలు, స్టీల్, ఎలక్ట్రికల్ సామాన్లు చోరీకి గురయ్యాయాన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసు ఫిర్యాదు చేశామన్నారు. గత సంవత్సరం ఆడిట్లో పెదవేగి, అగిరిపల్లి మండలాల్లో ఇళ్లనిర్మాణ సామాగ్రి దుర్వినియోగం జరిగినట్లు గుర్తించామన్నారు. -
కోకోకు మద్దతు ధర కల్పించాలి
ఏలూరు (టూటౌన్): కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఏలూరు అన్నే భవనంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ్ణ అధ్యక్షతన బుధవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కోకో రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోండలీజ్ కంపెనీ ఎదుట చేసిన మహాధర్నా, దీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈనెల 23న ఏలూరు కలెక్టరేట్‌కు చర్చలకు పిలవడాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా రైతులకు మద్దతు ధర ఇచ్చి కోకో రైతులను ఆదుకోవాలని కోరారు. కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతవరకు కంపెనీలు, ట్రేడర్లు కొనుగోలు చేసిన కోకో గింజలకు కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర వర్తింపజేసి వ్యత్యాసపు ధర చెల్లించాలన్నారు. కోకో రైతుల సంఘం గౌరవాధ్యక్షుడు సింహాద్రి గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శులు గుదిబండి వీరారెడ్డి, కొసరాజు రాధాకృష్ణ, ఉప్పల కాశీ తదితరులు పాల్గొన్నారు. -
చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.3.92 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు ప్రమోద కల్యాణ మండపంలో బుధవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగింది. లెక్కింపులో శ్రీవారికి భారీగా ఆదాయం సమకూరింది. గత 34 రోజులకు నగదు రూపేణా స్వామికి రూ. 3,92,94,035 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 556 గ్రాముల బంగారం, 8.100 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.66,500 లభించినట్టు చెప్పారు. ఈఏపీ సెట్‌కు 938 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో భాగంగా ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలకు బుధవారం మూడు పరీక్షా కేంద్రాల్లో 973 మంది విద్యార్థులకు 938 మంది హాజరయ్యారు. ఉదయం సిద్ధార్థ క్వెస్ట్ పరీక్షా కేంద్రంలో 160 మందికి గాను 155 మంది హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్లో 160 మందికి 150 మంది హాజరయ్యారు. ఏలూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 149 మందికి 145 మంది హాజరు కాగా.. మధ్యాహ్నం 150 మందికి 146 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 177 మందికి 171 మంది హాజరు కాగా మధ్యాహ్నం 177 మందికి 171 మంది హాజరయ్యారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు 1504 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పది సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా బుధవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు మొత్తం 2,356 మంది విద్యార్థులకు 1504 మంది హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. దూరవిద్యావిధానంలో నిర్వహిస్తున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా రసాయన శాస్త్రం పరీక్షకు 69 మందికి 60 మంది హాజరయ్యారు. ఆర్థిక శాస్త్రం పరీక్షకు 146 మందికి 118 హాజరయ్యారు. పదో తరగతి తెలుగు పరీక్షకు 150 మందికి 125 హాజరయ్యారు. ఏలూరులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నూజివీడు: ఏలూరులో బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని త్వరలో ఏర్పాటు చేయనుండటం ఈ ప్రాంతానికి వరమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. నూజివీడులో బుధవారం మాట్లాడుతూ చదువును మధ్యలోనే మానేసిన వారి కోసం దూరవిద్య ద్వారా చదువుకునేలా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 32 కేసులు నమోదు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా వ్యాప్తంగా బుధవారం మోటారు వాహనాల తనిఖీ అధికారులు 32 కేసులు నమోదు చేసి రూ.1.42 లక్షల అపరాధ రుసుం విధించినట్లు జిల్లా ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో హెల్మెట్లు ధరించని, లైసెనన్స్ లేని కేసులు ఉన్నాయన్నారు. టీచర్స్ బదిలీల హెల్ప్ డెస్క్ ఏర్పాటు భీమవరం: యూటీఎఫ్ భీమవరం కార్యాలయంలో బుధవారం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి హెల్ప్‌డెస్క్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీఎస్ విజయ రామరాజు, ఏకేవీ రామభద్రం మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్స్ విషయంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సహాయ కేంద్రంలో ఉపాధ్యాయులు ఆన్లైన్ అప్లికేషన్స్ ఉచితంగా చేయించుకోవడమేగాక అనుమానాలు ఉంటే నివృతి చేసుకోవచ్చనన్నారు. -
వంకా రవీంద్రకు సత్కారం
జిల్లా పార్లమెంట్ పరిశీలకులుగా నియమితులైన ఎమ్మెల్సీ వంక రవీంద్ర జిల్లా సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆయనను సత్కరించి కార్యకర్తలు, నాయకులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా వంకా రవీంద్ర మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే ధ్యేయంగా ప్రతీ కార్యకర్త ,నాయకుడు పనిచేయాలని పిలుపు నిచ్చారు. కార్యకర్తలకు అండగా ఉంటామని, ఏ కష్టం వచ్చినా ముందుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్, నియోజకవర్గాల ఇన్చార్జులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, మామిళ్ళపల్లి జయప్రకాష్(జేపీ), కంభం విజయ రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు. నగర పార్టీ అధ్యక్షుడు గుడిదేశీ శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి గాదిరాజు సుబ్బరాజు, రాష్ట్ర కార్యదర్శులు చిత్తూరు మురళీకృష్ణ, దాసరి రమేష్, సూర్య బలిజ విభాగం అధ్యక్షుడు శక్తి త్యాగరాజు, వడ్డీల విభాగం అధ్యక్షుడు ముంగర సంజీవ్ కుమార్, పార్టీ ఉపాధ్యక్షులు జగ్గవరపు జానకి రెడ్డి, చేబోయిన వీర్రాజు, జెడ్పీటీసీలు ములుగుమాటి నీరజ, కడిమి రమేష్, పోల్నాటి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. -
కడుపు కొట్టిన సర్కారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సర్కారు బడుగుల ఉపాధికి గండికొడుతుంది. వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడటంతో ప్రారంభమైన సర్కారు కక్షపూరిత చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి చూపుతున్న రేషన్ డోర్ డెలివరీ వాహనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో జిల్లాలో 395 మంది ఆపరేటర్లు ఉపాధి కోల్పోనున్నారు. వచ్చే నెల నుంచి వాహనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో జిల్లాలో ఎండీయూ ఆపరేటర్లు ఆందోళన బాట పడుతున్నారు. రేషన్ షాపుల్లో అవకతవకలకు చెక్ పెట్టడం.. గంటల తరబడి క్యూలైన్లలో అవస్థలకు పరిష్కారంగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వాహనాలు ప్రవేశపెట్టింది. జిల్లాలో ప్రతి మూడు రేషన్‌షాపులకు ఒక డోర్ డెలివరీ వాహనాన్ని కేటాయించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు 50 శాతం సబ్సిడీపై ప్రభుత్వం ఈ వాహనాలను అందించింది. 395 వాహనాలను జిల్లాలోని 1123 రేషన్ షాపులకు అనుసంధానం చేశారు. జిల్లా వ్యాప్తంగా 6,31,044 రేషన్‌కార్డుదారులకు ప్రతి నెల 8,791.03 టన్నుల బియ్యం, 218.75 టన్నుల పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, ఆయిల్ ప్యాకెట్లను ఇంటి ముంగిటే పంపిణీ చేసేలా వ్యవస్థను రూపొందించారు. ఒక్కొక్క వాహ నాన్ని రూ.5.80 లక్షల ఖర్చుతో కొనుగోలు చేస్తే.. 50 శాతం ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లించింది. మిగిలిన 50 శాతం వాహన ఆపరేటర్ నెలకు రూ.3 వేల చొప్పున చెల్లించుకునేలా వాహనాలను పంపిణీ చేశారు. 2021 జనవరిలో ప్రారంభమైన ఈ వ్యవస్థ 72 నెలల పాటు విజయవంతంగా పూర్తి చేసుకుంది. 72 వాయిదాలు చెల్లించారు. మరో 20 వాయిదాలు పెండింగ్‌లో ఉన్నాయి. నాడు వలంటీర్లు.. నేడు ఆపరేటర్లు కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే జిల్లాలో సుమారు 10,800 మంది వలంటీర్ల కడుపుకొట్టింది. ఎన్నికల సమయంలో వలంటీర్ల వ్యవస్థ కొనసాగించి నెలకు రూ.10 వేల జీతం ఇస్తామని చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. తాజాగా 395 మంది ఎండీయూ ఆపరేటర్లను తొలగించేశారు. ఆపరేటర్‌కు నెలకు రూ.21 వేలు జీతం ఇస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ పక్కాగా అమలయ్యేలా చేసింది. దీని కోసం జిల్లాలో 82.95 లక్షలు ప్రతి నెల ఖర్చు చేస్తోంది. ఉపాధి కల్పించాల్సింది పోయి ఉన్న ఉపాధి అవకాశాలకు గండికొట్టారు. మళ్ళీ రేషన్ షాపుల వద్దకు జనాలు వెళ్ళి క్యూ లైన్లో గంటల తరబడి నిలబడే పరిస్థితులు తెస్తున్నారు. ఉపాధిపై దెబ్బకొట్టారు నా జీతంతో నా కుటుంబం జీవిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం మా అవసరం లేదంటూ రద్దు చేసింది. ఇప్పుడు మా పరిస్థితి అర్థం కావడం లేదు. ప్రభుత్వం ప్రత్యా మ్నాయం చూపించాలని కోరుతున్నాం. – కుంచే నాగిరెడ్డి, ఎండీయూ డ్రైవర్, అయ్యవారిరుద్రవరం, మండవల్లి మండలం మా పరిస్థితి అగమ్యగోచరం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మాపై ఆధారపడ్డ కుటుంబ సభ్యుల పోషణ భారం కానుంది. కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుందని ఊహించలేదు. మా భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. – ధనికొండ దుర్గారావు, డ్రైవర్ జిల్లాలో నిలిచిపోనున్న 395 ఎండీయూ వాహనాలు దశలవారీగా వ్యవస్థ నిర్వీర్యం నాడు వలంటీర్లు, నేడు రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్లు -
నేడు కాపాడుకుంటేనే.. రేపు మనది!
కై కలూరు: మానవ మనుగడలో ‘జీవ వైవిధ్యం’ అనే పదాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. జీవ వైవిధ్యం అంటే భూమిపై ఉండే.. జన్యువులు, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులుసహా పలు జాతులు, పర్యావరణ వ్యవస్థల సముదాయం. భవిష్యత్ తరాలకు అపారమైన విలువలను అందించే ప్రపంచ ఆస్తిగా ఈ అంశాన్ని పరిగణిస్తారు. ఏటా మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రాష్ట్రానిది జీవ వైవిధ్యంలో కీలక స్థానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు (ఏపీఎస్‌బీబీ) బయోడైవర్సటీపై అవగాహన కల్పిస్తోంది. రాష్ట్రం ప్రత్యేకతలు రాష్ట్రంలో 37,258 చదరపు కిలోమీటర్లలో అటవీ విస్తీర్ణం ఉంది. తూర్పుతీరంలో రెండో అతిపెద్ద మడ అడవులు ఉన్నాయి. జీవ వైవిధ్య హాట్స్పాట్లుగా చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు వినతికెక్కాయి. మొట్టమొదటి బయోస్పియర్ రిజ ర్వ్గా శేషాచలం కొండలను గుర్తించారు. నల్లమల ఏపీలో అతిపెద్ద అడవి. జీవ వైవిధ్యపరంగా ఏపీలో 2,800కంటే ఎక్కువ మొక్కల జాతులు, 5,757కంటే ఎక్కువ వివిధ జాతుల జంతువులు ఉన్నాయి. రాష్ట్రంలో జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలు (బీఎంసీ) 14,157 ఉండగా, వీటిలో 1,800 కమిటీలకు అంతరించిపోతున్న జాతులు, ఔషద మొక్కల నర్సరీలను పెంచడానికి ఏపీఎస్‌బీబీ హోమ్ హెర్బల్ గార్డెన్ పైలెట్ ప్రాజక్టును మంజూరు చేసింది. అంతరిస్తున్న అరుదైన జాతులు అడవుల నరికివేత, రసాయనాల వాడకం, కాంక్రిట్ జంగిల్, ఆహార, ఆవాసాల కొరత వల్ల అరుదైన జాతులు అంతరించిపోతున్నాయి. ఈ పరిణామాలను 1964 స్థాపించిన ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) రెడ్ లిస్ట్ వెల్లడిస్తోంది. రాష్ట్రానికి చెందిన దాదాపు 65 రకాల జాతులకు చెందిన మొక్కలు, పక్షులు, క్షీరదాలు, చేపలు, సరిసృపాలు రెడ్ జాబితాలో ఉన్నాయి. ఆరుదైన జీవ వైవిధ్యం.. మన సొంతం పర్యాటకులను కట్టిపడేసే పర్యావరణ అందాలతో పాటు జీవ వైవిధ్య ఏపీ సొంతం. కొల్లేరు సరస్సు, రోళ్లపాడు, కోరింక, నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్, పాపికొండలు, శ్రీ వేంకటేశ్వర జాతీయ ఉద్యానవనం, శేషాచల కొండలు, పులులు, చిరుతలు, ఏనుగులు, పక్షులు ఆకట్టుకుంటాయి. రాష్ట్రంలో ఆంజియో స్పెర్మ్స్ మొక్కల జాతులు 3,000, జిమ్నోస్పెర్మ్స్ జాతి మొక్కలు 3, ప్టెరిడోఫైట్ జాతులు 72, బ్రయోఫైట్స్ జాతులు 100 మొక్కలతో పాటు 550 చెట్ల జాతులు, 285 పొదలు, 1,765 మొక్కలు ఉన్నాయి. కొల్లేరు అభయారణ్య పరివాహక ప్రాంతాలో 185 జాతుల పక్షులు విహరిస్తాయి. కొత్త జీవులను గుర్తించండి ప్రజా నివాస పరిసరాలలో కొత్త జీవులు, మొక్కలను ప్రతి ఒక్కరూ నిశితంగా గమనించి గుర్తించండి. భావితరాలకు వాటిని అందించవచ్చు. – ఫరిదా టంపాల్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, తెలుగు రాష్ట్రాల డైరెక్టర్, హైదరాబాద్ జీవ వైవిధ్యం ప్రమాదంలో ఉంది మానవ తప్పిదాల వల్ల జీవ వైవిధ్యం ప్రమాదంలో ఉంది. అడవుల నరికివేత, అధిక కాలుష్యం, వాతావరణ మార్పులు ఇందుకు కారణం. – డాక్టర్ ఎం.విజయ్‌కుమార్, జంతుశాస్త్ర అధ్యాపకులు, వైవీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కై కలూరు. జీవ వైవిధ్యం.. జిందగీ నేస్తం ఈ విషయంలో రాష్ట్రానిది కీలక స్థానం మీకు తెలుసా..? ఒక ఎకరం వరి పొలాన్ని కీటకాలు లేకుండా కాపాడడానికి సుమారు 50 కప్పలు అవసరం. ఒకప్పుడు జరిగిన కప్పమాంసం ఎగుమతులను భారత్ నిషేధించింది. 1990 నుంచి రాష్ట్రంలో రాబందుల సంఖ్య 95 శాతం తగ్గింది. మడ అడవులు ఏటా వాతావరణం నుంచి కార్బన్‌డయాకై ్సడ్ ఉద్గారాల్లో 15 శాతం తొలగించగలవు. అమెజాన్ రెయిన్ ఫారెస్టు మాత్రమే ఏటా వాతావరణానికి 8 ట్రిలియన్ టన్నుల నీటి ఆవిరిని విడుదల చేస్తుంది. ఈ కారణంగానే ఎర్త్ లంగ్స్‌గా అమెజాన్‌ను పిలుస్తారు. ప్రపంచంలో 53 శాతం అడవులు కేవలం బ్రెజిల్, చైనా, కెనడా, రష్యా, అమెరికా ఉన్నాయి. -
అలరించిన నాటిక పోటీలు
ఉద్యాన పంటల సాగుపై శ్రద్ధ ఉద్యాన పంటల సాగుపై వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో అధికారులు, రైతులతో ఏపీఎంఐపీ పీడీ, ఉద్యాన శాఖ జేడీ సమీక్షించారు. 8లో uఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అంబికా సంస్థల వ్యవస్థాపకుడు ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం, హేలాపురి కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి నాటిక పోటీలు మంగళవారంతో ముగిశాయి. నాలుగో రోజు కొలకలూరు శ్రీ సాయి ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శించిన జనరల్ బోగీలు, రెండో ప్రదర్శనగా వీరన్నపాలెం కళానికేతన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన రుతువు లేని కాలం నాటికలకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. అద్భుతమైన కథాంశాలతో నటీనటుల హృద్యమైన నటనతో నాటికలు రక్తికట్టించాయి. అంబికా సంస్థ ఛైర్మన్ అంబికా కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు యర్రా సోమలింగేశ్వరరావు, సెక్రటరీ కళారత్న కేవీ సత్యనారాయణ, ఎగ్జి క్యూటివ్ కమిటీ అధ్యక్షుడు ఇరదల ముద్దుకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
హౌసింగ్‌లో ఇంటి దొంగలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా గృహ నిర్మాణ శాఖలో దొంగలు పడ్డారు. నిరుపేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందించే హౌసింగ్ సామగ్రి చోరీకి గురైంది. టన్నుల కొద్దీ ఐరన్, వందల సిమెంట్ బస్తాలు మాయమయ్యాయని గృహనిర్మాణ శాఖ అధికారులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఇంటి దొంగలే పనేనని అనుమానం వ్యక్తమవుతుండగా మరికొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్లతో అధికార యంత్రాంగం మౌనం వహించింది. మొత్తంగా జిల్లాలోని దెందులూరు, పెదవేగి, ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో చోటు చేసుకున్న ఈ చోరీ ఘటనలు తీవ్ర సంచలనంగా మారాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నియోజకవర్గంలోనూ చోరీ ఘటనలు జరగడం గమనార్హం.వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో జిల్లాలో పేదల ఇళ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఐదేళ్ళ పాలనలో 1,16,431 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో రూ.713.17 కోట్లతో 98,874 ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత పేదలందరికీ ఇళ్లు పథకం పేరు మార్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి సబ్సిడీతో కూడిన రుణం ఇచ్చేవారు. ప్రతి ఇంటికి 500 కేజీల ఐరన్, 90 బస్తాల సిమెంట్, డోర్లు, ఎలక్ట్రికల్ సామగ్రి ఇలా రూ.1.80 లక్షలు ఖరీదు చేసే మెటీరియల్‌ను పూర్తి సబ్సిడీతో అందించేవారు. దీంతో ఇళ్ళ నిర్మాణ పురోగతి వేగంగా ఉండేది. కొత్త ప్రభుత్వం జిల్లాలో ఈ ఏడాది 49,381 గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 33,522 అర్బన్, 15,859 గ్రామీణ ప్రాంతాల్లో గతంలో మంజూరైన ఇళ్ళనే గుర్తించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోగా ఇంతవరకు 25,729 ఇళ్ల పనులు ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి విరుద్ధంగా ఉందిరూ.కోటికిపైగా సొత్తు మాయంప్రతి మండలంలో గృహనిర్మాణ శాఖ ఏఈ పర్యవేక్షణలో గొడౌన్ ఏర్పాటు చేశారు. సిమెంట్, ఐరన్, ఎలక్ట్రిల్ సామాన్లు, ఇతర నిర్మాణ సామగ్రి అంతా గొడౌన్లలో ఉంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇంతవరకు దెందులూరు మండలంలో 16 టన్నుల స్టీల్, పెదవేగి మండలంలో 16 టన్నుల స్టీల్, 300 సిమెంట్ బస్తాలు, ఆగిరిపల్లిలో 42 టన్నుల స్టీల్, 500 సిమెంట్ బస్తాలు, నూజివీడులో 600 ఇళ్ల విద్యుత్ మీటర్లు, ఇతర మెటీరియల్ చోరీకి గురైంది. వీటిపై సంబంధిత అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదు చేసి.. హౌసింగ్ పీడీకి నివేదిక పంపారు. స్థానిక అధికార పార్టీ ఒత్తిళ్లతో వ్యవహారం ముందుకు సాగడం లేదు. మరోవైపు కొందరు స్థానిక అధికారులు 70 శాతం ధరకు బయట మార్కెట్లో విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఈ తరహా చోరీలు జరిగి ఉండొచ్చనే వాదన వినిపిస్తుంది. స్థానికంగా పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు విచారణను పూర్తిగా పక్కనపెట్టారు. టన్ను ఐరన్ ధర రూ. 60 వేల నుంచి 65 వేలు, సిమెంట్ బస్తా ధర రూ.350గా ఉంది. ఈ క్రమంలో రూ.48.10 లక్షల ఐరన్, రూ. 2.80 లక్షల సిమెంట్, రూ.42 లక్షల ఎలక్ట్రికల్ సామగ్రి చోరీకి గురైనట్లు నిర్ధారించారు.దర్యాప్తు చేస్తున్నాంచోరీ ఘటనలు మా దృష్టికి వచ్చాయి. దీనిపై శాఖపర విచారణ నిర్వహిస్తున్నాం. పూర్తి నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించి బాధ్యులపై చర్యలతో పాటు కేసు నమోదు చేస్తాం.– జీ.సత్యనారాయణ, హౌసింగ్ పీడీ -
ఏలూరు జిల్లాలో భారీ వర్షం
కై కలూరు:ఏలూరు జిల్లాలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలంలో అత్యధికంగా 81.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లాలో 444.8 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదవగా.. సరాసరి వర్షపాతం 16.08 మిల్లీమీటర్లుగా నమోదైంది. ముదినేపల్లి మండలంలో 80.4 మి.మీ, మండవల్లి మండలంలో 72.4 మి.మీ, కై కలూరు మండలంలో 51.6 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు కై కలూరు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. టౌన్‌హాలు, హైవే, రైల్వే స్టేషన్ రోడ్డు, బస్టాండ్ ప్రాంతాలలో వర్షపు నీరు చేరింది. ఆక్వా రంగం హడల్ : ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షాలు కురిస్తే చేపల చెరువుల్లో ఆక్సిజన్ సమస్య ఉత్నన్నమవుతుంది. వాతావరణంలో మార్పుల కారణంగా చేపలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఆక్సిజన్ సమస్య కారణంగా ప్రతీ ఏటా రూ. కోట్లలో ఆక్వా రైతులు నష్టపోతున్నారు. జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదు -
మంత్రిగారూ.. మెడికల్ కాలేజీ గుర్తుందా?
సాక్షి, భీమవరం: వైద్య విద్యను పేద విదార్థులకు చేరువ చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని దగ్గులూరులో రెండేళ్ల క్రితమే నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆ సమయంలో శ్రీఇక్కడ బురద తప్ప మెడికల్ కళాశాల పనులేమి జరగడం లేదుశ్రీ అంటూ ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల రామానాయుడు ఎంతో హడావుడి చేశారు. పనుల వేగం పెంచాలంటూ పార్టీ పెద్దలను సైతం తీసుకువచ్చి నిరసనలు తెలిపారు. కూటమి వచ్చాక ఆయన్ను మంత్రి పదవి వరించడంతో ఏడాదిలోనే పనులు పూర్తవుతాయని అంతా ఆశించారు. ఇంతవరకూ ఆయన కళాశాల వైపు కన్నెత్తి చూడలేదు. పాలకొల్లు మండలం దగ్గులూరులోని సుమారు 60 ఎకరాల్లో రూ.475 కోట్లతో కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కళాశాల నిర్మాణంతో జిల్లా వాసులకు మేలు జరుగుతుందని, ఎంతో మందికి ఉపాది లభిస్తుందని స్థానికులు ఆశించారు. నిధుల లేక నిలిచిన పనులు 2023 ఆగస్టులో నిర్మాణ సంస్థ పనులు ప్రారంభించింది. ఇనన్పేషెంట్, అవుట్ పేషెంట్, ఎమర్జన్సీ సేవల బ్లాకులకు సంబంధించి రూ.75 కోట్ల విలువైన పునాది పనులు దాదాపు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల పనులకు బ్రేక్ వేసింది. ఈ పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంతో నిర్మాణ సంస్థ పనులను నిలిపివేసింది. సైట్‌లోని ఐరన్, ఇసుక, కంకర, ఇతర నిర్మాణ సామగ్రిని తరలించుకుపోతోంది. పనులు ఆగిపోవడంతో స్థానికుల ఆశలపై నీళ్లు చల్లారు. కాలేజీని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దీని వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవనుంది. కళాశాల వైపు చూడని మంత్రి నిమ్మల గత ప్రభుత్వంలో ఒకపక్క పనులు జరుగుతుంటే.. బురద తప్ప ఇక్కడ నిర్మాణాలు ఏమీ చేయడం లేదంటూ పలుమార్లు సైట్ వద్దకు వచ్చి నిమ్మల హడావుడి చేశారు. మాజీ మంత్రి నిమ్మ కాయల రాజప్ప, తదితర పార్టీ పెద్దలను తీసుకొచ్చి నిరసనలు తెలిపి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. అప్పట్లో వైద్య కళాశాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేసిన నిమ్మల మంత్రిగా ఈ ఏడాది కాలంలో ఒక్కసారి కూడా ఇటు వైపు వచ్చి చూసిన దాఖలాలు లేవు. పబ్లిసిటీ కోసమే గతంలో హడావుడి చేశారని అంటున్నారు. గత ప్రభుత్వంలో పనులు ప్రారంభం.. రూ.75 కోట్ల విలువైన పనులు పూర్తి గతంలో పలుమార్లు సైట్ వద్దకు వచ్చి హడావుడి చేసిన నిమ్మల కూటమి వచ్చాక కన్నెత్తి చూడని వైనం -
ధాన్యం బకాయిలు చెల్లించాలి
ఏలూరు (టూటౌన్): జిల్లాలో రైతులు, కౌలు రైతులకు చెల్లించాల్సిన రబీ ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించి అన్నదాతలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ కోరారు. స్థానిక అన్నే భవనంలో ధాన్యం బకాయిల సమస్యలపై మంగళవారం ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చివరి దశలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి దాదాపు రూ.89 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. గత 15 రోజులుగా ధాన్యం సొమ్ములు చెల్లింపులు నిలిచిపోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ పంటకు తెచ్చిన పెట్టుబడి అప్పులు తీర్చి ఖరీఫ్ సాగుకు సన్నద్ధం కావాల్సిన దశలో ధాన్యం బకాయిలు చెల్లించకపోవడం తగదన్నారు. చివరి దశలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బకాయిలు కూడా చెల్లించి ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ధాన్యం సొమ్ము అందాల్సిన బైరెడ్డి లక్ష్మణరావు మాట్లాడుతూ ఏలూరు శివారు సుంకరి వారి తోటకు చెందిన తనకు గత 15 రోజులు క్రితం తోలిన ధాన్యానికి సొమ్ములు అందలేదన్నారు. ధాన్యం బకాయిలు చెల్లించి ఆదుకోవాలని కోరారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
ఏలూరు (టూటౌన్): కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీఎన్వీడి ప్రసాద్, ఏఐటీయూసీ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస, ఐఎఫ్టీయు నాయకుడు గడసాల రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడాలని డిమాండ్ చేశారు. జూలై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొని నిరసన తెలియజేయాలని కోరారు. కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్ పేరుతో కాలరాస్తుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలను కార్పొరేట్లకు, ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా మోదీ ప్రభుత్వం అప్పగిస్తుందని వారు తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, బి.సోమయ్య, వీవీఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఐసెట్‌లో 794 మంది ఉత్తీర్ణత ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ నెల 7న నిర్వహించిన ఐ సెట్ పరీక్షల ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ మంగళవారం విడుదల చేసింది. ఈ పరీక్షల్లో ఏలూరు జిల్లా నుంచి 794 మంది అర్హత సాధించారు. 414 మంది బాలురు హాజరు కాగా వారిలో 399 మంది అర్హత సాధించారు. 412 మంది బాలికలు హాజరు కాగా వారిలో 395 మంది అర్హత సాధించారు. -
102 ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి
ఏలూరు (టూటౌన్): తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ 102 ఉద్యోగుల వేతన బకాయిలు విడుదల చేయా లని, కనీస వేతనం రూ.18,500 ఇవ్వాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఏలూరులో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.లింగరాజు, డీఎన్వీడి ప్రసాద్ మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని రోజుకి 10 గంటలు పని చేస్తున్నా ఉద్యోగులకు కేవలం రోజుకు రూ.280 మాత్రమే జీతం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలల నుంచి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే గత నాలుగు నెలల బకాయిలను విడుదల చేయాలని, కనీస వేతనం రూ.18,500కి పెంచాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈఏపీ సెట్‌కు 949 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల్లో భాగంగా అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలకు మంగళవారం మూడు పరీక్షా కేంద్రాల్లో 999 మంది విద్యార్థులకు 949 మంది హాజరయ్యారు. ఉదయం సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో 161 మందికి 149 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 161 మందికి 152 మంది హాజరయ్యారు. ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 150 మందికి 141 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 147 మందికి 141 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 190 మందికి 181 మంది, మధ్యాహ్నం 190 మందికి 185 మంది హాజరయ్యారు. రేషన్ పంపిణీకి చర్యలు బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామాల మధ్య నిర్వాసితుల కోసం నిర్మించిన నిర్వాసిత కాలనీకి తరలివచ్చిన నిర్వాసితులు రేషన్ బియ్యం కోసం సుమారు 335 కిలోమీటర్ల దూరం వెళ్ళి బియ్యం తెచ్చుకుంటూ పడుతున్న అవస్థలపై సాక్షి పత్రికలో మంగళవారం ‘రేషన్ కోసం అవస్థలు’ శీర్షికన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ శీర్షికపై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించారు. దీనిపై విచారణ జరిపారు. కార్డుదారుల జాబితాను సేకరించి పోర్టబిలిటీ విధానంలో వచ్చే జూన్ నుంచి రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సివిల్ సప్లయిస్ మేనేజర్ పీఎస్ఆర్ శివరామమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలకు 599 మంది గైర్హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పది సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన హిందీ పరీక్షకు మొత్తం 754 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా కేవలం 155 మంది మాత్రమే హాజరయ్యారు. 599 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. దూరవిద్యావిధానం సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ఇంటర్ తెలుగు పేపర్‌కు మొత్తం 86 మందికి 71 మంది హాజరయ్యారు. హిందీ పరీక్షకు ముగ్గురుకు ముగ్గురూ హాజరయ్యారు. పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 112 మందికి 89 మంది హాజరు కాగా 23 మంది గైర్హాజరయ్యారు. సర్పంచ్ చెక్ పవర్ రద్దు టి.నరసాపురం: టి.నరసాపురం మండలం బొర్రంపాలెం పంచాయతీ సర్పంచ్ కలపర్తి వెంకటేశ్వరమ్మ చెక్ పవర్‌ను రద్దు చేస్తూ పంచాయతీ అధికారి కె.అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీలో నిధుల దుర్వినియోగమయ్యాయని అదే గ్రామానికి చెందిన పాండురంగ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ నిర్వహించారు. నివేదిక ఆధారంగా సర్పంచ్ చెక్‌పవర్‌ను రద్దు చేశారు. ఇదే అభియోగంపై బొర్రంపాలెంలో గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి కేఎస్ కృష్ణను ఇప్పటికే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన ముగ్గురు కార్యదర్శులు, సర్పంచ్ వెంకటేశ్వరమ్మ నుంచి దుర్వినియోగమైన నిధులు రికవరీ చేయాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీవో జి.మణికుమారి తెలిపారు. -
ఉద్యాన పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధ
తాడేపల్లిగూడెం రూరల్: ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ సీ.వెంకటరమణ, ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండలంలోని వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ జిల్లాలకు చెందిన ఉద్యాన శాఖ అధికారులు, రైతులతో ప్రాంతీయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం సహాయ పరిశోధన సంచాలకులు డాక్టర్ డి.వెంకటస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ టమాట, మిరపలో ప్రొసెసింగ్ టెక్నాలజీలను పెంపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కోత అనంతరం పండ్ల తోటల్లో నష్టాన్ని అంచనా వేయడం, తద్వారా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అరటి దిగుబడిలో కోస్తా జిల్లాలతో పోలిస్తే రాయలసీమ ముందంజలో ఉందని, దానికి కారణాలు వెతకాలన్నారు. ఏఐని ఉపయోగించి తెగుళ్ల ఉద్ధృతిని అరికట్టాలి రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ విదేశీ పంటల సాగుపై దృష్టి పెట్టాలన్నారు. ఈ పంటల సాగుపై రైతులకు కావలసిన సూచనలను, సలహాలను శాస్త్రవేత్తలు అందించాలన్నారు. ఆయిల్ పామ్‌లో అంతర పంటగా సాగు చేసే కోకోలో కొత్త రకాలను తీసుకురావాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఆధారం చేసుకుని పురుగు, తెగుళ్ల ఉధృతిని, ఉనికిని కనిపెట్టడం, అవసరాన్ని బట్టి ఎరువులు, నీటి యాజమాన్యం చేపట్టాలన్నారు. వాతావరణ మార్పులకనుగుణంగా పంటల్లో పురుగు, తెగుళ్ల ఉద్ధృతిపై విస్తారంగా పరిశోధనలు జరగాలన్నారు. ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ జమదగ్ని, ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ కే.టి.వెంకటరమణ, యూనివర్సిటి డీఐపీ అధికారి డాక్టర్ కే.ధనుంజయరావు, విస్తరణ పంచాలకులు డాక్టర్ బి.గోవిందరాజులు, పరిశోధన సహాయ సంచాలకులు కోస్టల్ జోన్–1 డాక్టర్ డి.వెంకటస్వామి, కోస్టల్ జోన్–1 డాక్టర్ సి.వెంకటరమణ గత ఏడాదికి గాను అధికారులు, రైతులు అడిగిన సమస్యలకు పరిష్కారాలపై చేపట్టిన పరిశోధనలు తెలిపారు. శాస్త్రవేత్తలు డాక్టర్ ఎన్‌బీవీ.చలపతిరావు, డాక్టర్ ఇ.కరుణశ్రీ, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త విజయలక్ష్మి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు చెందిన ఉద్యాన శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఏపీఎంఐపీ పీడీ డాక్టర్ వెంకటరమణ -
శ్రమజీవులకు ఎంత కష్టం..
ద్వారకాతిరుమల: వేర్వేరుగా జరిగిన రెండు ప్రమాదాల్లో 20 మంది కూలీలు, ఒక డ్రైవర్ గాయపడ్డారు. ద్వారకాతిరుమల మండలంలోని లైన్గోపాలపురం జాతీయ రహదారిపై ఎండు కొబ్బరి కాయల లోడుతో వెళుతున్న బొలేరో వాహనం వెనుక టైరు పేలడంతో అదుపు తప్పి బోల్తా పడగా 14 మంది గాయాలపాలయ్యారు. గుండుగొలను శివారు బీసీ కాలనీ వద్ద చేపల చెర్వులకు మేత తరలిస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో ఏడుగురు కూలీలు గాయపడ్డారు. టైరు పేలి బోల్తా పడ్డ వ్యాన్ ద్వారకాతిరుమల మండలం కప్పలకుంట నుంచి ఎండు కొబ్బరి కాయల లోడుతో బొలేరో వాహనం దెందులూరు మండలం గోపన్నపాలెంకు వెళుతోంది. లైన్ గోపాలపురం జాతీయ రహదారిపైకి వచ్చేసరికి వాహనం వెనుక టైరు పేలింది. ఈ ప్రమాదంలో 5 గురు తీవ్రంగా, 9 మంది స్వల్పంగా గాయపడ్డారు. డ్రైవర్ వాన కిషోర్‌తో పాటు, వాహనంపై ఉన్న గోపన్నపాలెం, వేగవరంనకు చెందిన 13 మంది కూలీలు కొండేటి గంగాధరరావు, కాసగాని ఆంజనేయులు, బెజవాడ రత్తయ్య, వాన తిరుపతి, మోర్ల రాము, ఆరే రామకృష్ణ, తాడి సత్యవతి, తాడి సంతోష్, అప్పల నాయుడు, ఒగ్గుల చరణ్, బి.అప్పన్న, ఐక రాంబాబు, రెగాన రామ్మూర్తి, బోణె అప్పమ్మ తదితరులు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను 108, హైవే ఆంబులెన్స్‌లో హుటాహుటీన భీమడోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం తీవ్రంగా గాయపడ్డ ఆంజనేయులు, సంతోష్, అప్పలనాయుడు, సత్యవతి, గంగాధరరావు లను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ బోల్తా.. కూలీలకు గాయాలు భీమడోలు: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి గుండుగొలను శివారు రత్నాపురంలోని ఆక్వా చెర్వులకు మేత తవుడు దిగుమతి చేసేందుకు లారీ వచ్చింది. లారీ డ్రైవర్ సత్తార్ తవుడు దించేందుకు జట్టు కూలీలను పురమాయించుకుని ఆక్వా చెరువుల వద్దకు వెళుతుండగా గుండుగొలను శివారు బీసీ కాలనీ వద్ద గల మలుపు వద్దకు వచ్చేసరికి లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో లారీ కేబిన్‌లో ఉన్న కూలీలు బూరి తిరపతయ్య, పెద్దింటి కృష్ణ, మంత్రి పాపారావు, చిగడాపు వెంకన్న, గొర్జి శ్రీను, నేలబుల్లి సూర్యానారాయణలతో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమడోలు పోలీసులు తెలిపారు. ద్వారకాతిరుమలలో వ్యాన్ బోల్తా పడి 14 మందికి గాయాలు గుండుగొలనులో లారీ అదుపు తప్పి ఏడుగురు కూలీలకు గాయాలు -
వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వినియోగదారులు తమ హక్కులపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, తూనికలు, కొలతలకు సంబంధించిన చట్టాలను తెలుసుకోవాలని తూనికలు, కొలతల శాఖ ఏలూరు జిల్లా ఉప నియంత్రకులు బి.వెంకట హరిప్రసాద్ అన్నారు. ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం సందర్భంగా నగరంలోని ఆ శాఖ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వినియోగదారులకు తాము మోసపోతున్నామని గ్రహిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. పెట్రోల్ బంకుల్లో కొలతల్లో మోసం జరుగుతున్నా, వస్తువుల తూకాల్లో తేడా ఉన్నట్లు గ్రహించినా వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు. వ్యాపారస్తులు వినియోగదారులకు అందించాల్సిన సేవలు, వ్యాపారస్తులు పాటించాల్సిన నియమ నిబంధనలపై వివరించారు. అలాగే వ్యాపారస్తులు ఉత్పత్తి చేసి, విక్రయించే ప్రతి ప్యాకేజీపై తయారీదారుని పేరు, ప్యాకేజీ చేయబడిన వస్తువు పేరు, దాని నికర బరువు ముద్రించాలన్నారు. కార్యక్రమంలో సహాయ నియంత్రకులు బీఎన్వీఎస్ ఈశ్వర రామ్, పరిశీలకులు వి. ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల ధర్నా కామవరపుకోట: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం స్థానిక శ్రీవేంకటేశ్వర జూనియర్ కళాశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం ధర్నా నిర్వహించారు. అడ్మిషన్లు తీసుకోకుండా కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తూ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. 42 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాలేజిని మూసివేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు కాగా దీనిపై కళాశాలకు వచ్చిన ఆర్ఐఓ యోహాన్ను వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాలకు వచ్చానని కానీ ఇక్కడ తిరుపతి దేవస్థానం ఈవో చెబితేనే గాని అడ్మిషన్లు ఇవ్వమని యాజమాన్యం చెప్పారని త్వరలో అడ్మిషన్ తీసుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
జూన్ 10న ఆక్వా రైతుల చలో అమరావతి
పాలకొల్లు సెంట్రల్: ప్రభుత్వం హెచ్చరించినా ధరల విషయంలో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు, ఫీడ్ కంపెనీలు దిగిరావడం లేదని, దీంతో ఆక్వా రైతులందరూ చలో అమరావతి కార్యక్రమాన్ని చేపట్టనున్నామని ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్ రాజు తెలిపారు. మంగళవారం పాలకొల్లు మండలం పూలపల్లి ఎస్ఎస్ఎస్ కళ్యాణ మండపంలో జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాంధీభగవాన్ రాజు మాట్లాడుతూ అమెరికా పన్నులు పెంచిందని ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ సభ్యులు కొనుగోలు నిలుపుదల చేశారని తెలిపారు. సరుకు పట్టుబడులు పట్టుకున్న రైతులు గగ్గోలు పెడితే రూ.50 నుంచి రూ.100 వరకూ ధరలను తగ్గించేశారని అన్నారు. దీనిపై జై భారత్ ఆక్వా సంఘం స్పందించి ఎంతో పోరాటం చేసి క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగిందన్నారు. క్రాఫ్ హాలీడేకు మద్దతుగా ఇప్పటికే పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాల్లో రైతులు చెరువులను ఎండగట్టే పనిలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. అలాగే ఫీడ్ కంపెనీలు ముడి సరుకు ధరలు పెరిగితే వెంటనే రూ. 25 పెంచేసి, ధరలు తగ్గినప్పుడు కేవలం రూ.4 లేక రూ.5 తగ్గించడం దారుణమన్నారు. 60 కౌంట్‌ను మినిమమ్‌గా నిర్ణయించాలని, ధర రూ.320 చేయాలని డిమాండ్ చేశారు. వీటిపై ప్రభుత్వం ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయకుంటే క్రాఫ్ హాలీడే తథ్యం అని స్పష్టం చేశారు. చలో అమరావతి కార్యక్రమాన్ని రైతులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బోణం చినబాబు, బోణం రంగయ్యనాయుడు, ఆర్ సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం హెచ్చరికలను బేఖాతర్ చేస్తున్న ప్రాసెసింగ్, ఫీడ్ కంపెనీలు క్రాఫ్ హాలిడేకు మద్దతుగా రైతులు సమాయత్తం -
మట్టి తవ్వకాల అడ్డగింత
చాట్రాయి: చనుబండ గ్రామంలోని పెద్ద చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను అధికారులు అడ్డుకున్నారు. సోమవారం అర్ధరాత్రి మట్టి తవ్వకాలు చేస్తున్నారని సమాచారం రావడంతో రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని ఒక పొక్లయిన్, జేసీబీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాలుగు రోజల క్రితం మట్టి తవ్వకాలకు అనుమతి కావాలంటూ కొందరు అధికారులకు అర్జీ ఇచ్చారు. అర్జీ ఇచ్చినందుకు ఇచ్చిన రసీదుని చూపించి మూడు రోజులపాటు అక్రమంగా మట్టిని తరలించారు. సోమవారం రాత్రి సమాచారం అందుకున్న అధికారులు రెండు యంత్రాలను సీజ్ చేశారు. పారిజాతగిరీశుడికి శేష వాహన సేవ జంగారెడ్డిగూడెం: బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. రాజమండ్రికి చెందిన పండితులు పాండంగిపల్లి దుర్గా రామ సత్య పవన్ కుమార్ ఆచార్యులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ధ్వజరోహణం, అగ్ని ప్రతిష్ట, కుంభ స్థాపన, నిత్య హోమాలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు అత్యంత వైభవంగా శేష వాహన సేవ జరిపారు. సంతానం లేని భక్త దంపతులు స్వామివారి గరుడ ప్రసాదం స్వీకరించారు. పూజా కార్యక్రమాలను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. మద్ది క్షేత్రంలో విశేష పూజలు జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు జరిపారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వరకు ఆలయానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,87,132 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 1600 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారన్నారు. ఈవో చందన మాట్లాడుతూ క్షేత్రంలో హనుమద్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 21 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం స్వామి వారి నిజరూప సందర్శనం (సింధూరం వలుపు) అనంతరం విశేష దర్శనములు ఉంటాయన్నారు. -
ములపర్రు సొసైటీలో మరోసారి కలకలం
పెనుగొండ: డిపాజిట్లు గల్లంతుతో 2018 నుంచి కలకలం రేపుతున్న ములపర్రు హిందూ ముస్లీం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం మరోసారి కలకలం రేపింది. మంగళవారం సీఐడీ పోలీసులు ఆనాటి అధ్యక్ష, కార్యదర్శులను అదుపులోకి తీసుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. 2017 సంవత్సరం పాలకవర్గ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఆనాటి కార్యదర్శి వెంకటేశ్వరరావు నిధుల గోల్‌మాల్‌కు పాల్పడ్డారంటూ పాలకవర్గంలోని డైరక్టర్లే ఆనాడు రోడ్డేక్కారు. దీంతో డిపాజిట్టుదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి డిపాజిట్లు తిరిగి చెల్లించాలంటూ ప్రదక్షిణలు చేశారు. అప్పట్లోనే 51 ఎంక్వయిరీ వేసి పలుమార్లు విచారణ జరిపి, ఎంత మోసం జరిగిందో బయటపెట్టకుండా కాలం వెళ్లబుచ్చారు. రూ.50 లక్షల నుంచి రెండ్లు కోట్లకుపైగా అంటూ రకరకాలుగా ప్రకటించే వారు. చివరకు డిపాజిట్టు దారుల ఒత్తిడి పెరగడంతో అప్పటి కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆత్మహత్యాయత్నం సైతం చేశారు. అప్పట్లో రాజకీయ ఒత్తిళ్లతో కేసు ముందకు సాగకుండా యత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా కొందరి పెద్దల సమక్షంలో రాజీ కుదర్చుకొని కొంత మేర నగదు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చినా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఈ తరుణంలో ఓ డిపాజిట్టు దారుడు హైకోర్టును ఆశ్రయించడంతో, పూర్తి స్థాయి విచారణ జరిపి నిగ్గు తేల్చాలంటూ సీఐడీకి ఆదేశాలు జారీ చేయడంతో విచారణ చేపట్టారు. విచారణ అనంతరం రూ.రెండు కోట్లకు పైగా నిధుల దుర్వినియోగం జరిగిందని గుర్తించినట్లు సమాచారం. తణుకులో అదుపులోకి ? మాజీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, మాజీ కార్యదర్శి వెంకటేశ్వరరావులను మంగళవారం తణుకులో సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మరోసారి ములపర్రు సొసైటీ డిపాజిట్లు దుర్వినియోగం కేసు కలకలం రేపింది. సీఐడీ అదుపులో మాజీ అధ్యక్ష, కార్యదర్శులు -
చినవెంకన్న బంగారం.. బ్యాంకులో భద్రం
ద్వారకాతిరుమల: శ్రీవారికి భక్తుల నుంచి ఏడాది కాలంగా హుండీలు, కానుకల ద్వారా లభించిన 4.940 కేజీల బంగారాన్ని దేవస్థానం అధికారులు గోల్డ్ బాండ్ స్కీమ్ కింద విజయవాడలోని భారతీయ స్టేట్‌బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌లో మంగళవారం డిపాజిట్ చేశారు. ముందుగా ఆలయ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచిన బంగారాన్ని ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి, డిప్యూటీ ఈఓ పి.బాబురావు, దేవాదాయశాఖ జ్యూయలరీ వెరిఫికేషన్ అధికారి (రాజమహేంద్రవరం) వీవీ పల్లంరాజు, ఆలయ అర్చకులు కొండూరి జనార్ధనాచార్యులు, కమిటీ సభ్యుల సమక్షంలో బయటకు తీశారు. అనంతరం బంగారాన్ని తూకం వేసి, ప్యాక్ చేశారు. ఆ ప్యాకెట్‌కు సీలు వేసి, సంబంధిత పత్రాలతో పాటు దాన్ని బ్యాంకు అధికారులకు ఆలయ ఈఓ సత్యన్నారాయణ మూర్తి, కమిటీ సభ్యులు అందజేశారు. -
కంప్యూటర్ కోర్సుకు వెళ్లి వస్తుండగా..
● మోటార్‌సైకిల్‌ను ఢీకొన్న కంటైనర్ లారీ ● ప్రమాదంలో యువకుడి మృతి పెంటపాడు: కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొనడంతో మోటార్‌సైకిల్‌పై వెళుతున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పెంటపాడు ఎస్సై స్వామి తెలిపిన వివరాల ప్రకారం చింతపల్లి గ్రామానికి చెందిన యర్రంశెట్టి వీరవెంకట సత్యనారాయణ (సతీష్) ఇంటర్ విద్యను పూర్తి చేసుకొన్నాడు. అనంతరం ప్రతి రోజు పెంటపాడు వచ్చి కంప్యూటర్ కోర్సు నేర్చుకొంటున్నాడు. సోమవారం యథావిధిగా కంప్యూటర్ క్లాస్ ముగించుకుని మోటార్‌సైకిల్‌పై స్వగ్రామం వెళ్తూ ఉండగా పెంటపాడు కళాశాల వద్ద విశాఖపట్నం నుంచి భీమవరం వెళుతున్న కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో సతీష్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా అర్ధాంతరంగా చనిపోయాడని తండ్రి నాగరాజు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా నాగరాజుకు ఒక కుమారుడు, కుమార్తె. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రేషన్ కోసం అవస్థలు
బుట్టాయగూడెం: రేషన్ బియ్యం కోసం నిర్వాసితులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా వీఆర్‌పురం మండలం తుమ్ములూరు, జిల్లేడుగొంది, కొల్లూరు, కొత్తూరు, టి.పోచవరం గ్రామాల నుంచి కొందరు నిర్వాసితులు బుట్టాయగూడెం మండలం నిమ్మలగూడెం, రామన్నగూడెంల మధ్య నిర్వాసిత కాలనీకి తరలివచ్చారు. అయితే రేషన్‌బియ్యం కోసం మాత్రం తమ సొంత గ్రామమైన వీఆర్‌పురం మండలం తుమ్ములూరు గ్రామానికి వెళ్లి వస్తున్నారు. బుట్టాయగూడెం మండలంలో ప్రస్తుతం వీరు ఉంటున్న నిర్వాసిత కాలనీ నుంచి వీఆర్ పురం మండలం తుమ్ములూరు గ్రామానికి సుమారు 235 కిలోమీటర్లు దూరం. దీంతో ప్రతినెలా రూ. 13 వేలు చెల్లించి 46 కార్డుల లబ్ధిదారులు ఆ బియ్యం తెచ్చుకుంటున్నామని నిర్వాసితులు వేట్ల ముత్యాలరెడ్డి, అందెల రామిరెడ్డి, అందెల సీతారామరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ వేరే జిల్లా కావడంతో వీలుపడడం లేదని, దీంతో ప్రతి నెలా రేషన్ కోసం సొంత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో గ్రామాలు తరలిరాకపోవడం వల్ల తమ కార్డులు ఈ మండలానికి బదిలీ కాలేదని నిర్వాసితులు చెబుతున్నారు. జూన్ మొదటి వారంలో నిర్వాసితులను పూర్తిస్థాయిలో తరలిస్తున్నామని అధికారులు చెబుతున్నారని, కార్డులు ఈ మండలానికి మారే వరకు తమకు ఈ కష్టాలు తప్పవని వాపోయారు. -
మోటార్‌సైకిళ్లు ఢీకొని యువకుడి మృతి
పెనుగొండ: రెండు మోటార్‌సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆచంట మండలం కోడేరు వద్ద సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెనుగొండ మండలం దేవ శివారు తాళ్లపాలెంకు చెందిన గడ్డం సన్నిబాబు (18) సోమవారం తన అమ్మమ్మ ఊరు పాలకొల్లుకు వెళుతున్నాడు. కోడేరు నుంచి మోటారు సైకిల్‌పై ఆచంట వైపు వస్తున్నాడు. అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లా గన్నవరం మండలం లంకల గన్నవరం శివారు నడిగడి గ్రామానికి చెందిన యన్నాబత్తుల సత్యనారాయణ, అతని భార్య కృష్ణకుమారి ఇద్దరు మోటారు సైకిల్ పై ఆచంట నుంచి కోడేరు వెళుతున్నారు. ఈ రెండు మోటార్‌సైకిళ్లు కోడేరు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సన్నిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. యన్నాబత్తుల సత్యనారాయణకు, అతని భార్య కృష్ణకుమారికి గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన సన్నిబాబు పెనుగొండ కళాశాలలో ఇంటర్ చదువుతూ ఇటీవల విడుదలైన ఫలితాలలో ఉత్తీర్ణత సాధించాడు. గత ఏడాది కాలంగా అతను చదువుకుంటూనే పాలకొల్లులో వీడియో ఎడిటింగ్ కూడా చేస్తున్నాడు.మరో ఇద్దరికి గాయాలు -
పారిజాతగిరిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
జంగారెడ్డిగూడెం: స్థానిక గోకులతిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. విశ్వక్సేనపూజ, పుణ్యాహవచన, మేదిని పూజ, మృత్ సంగ్రహణము, అంకురారోపణము తదితర వైదిక కార్యక్రమాలతో శ్రీ వైఖానసాగమోక్తంగా ఉత్సవాలు ప్రారంభించారు. ముందుగా ఆలయ ప్రధానార్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో శ్రీనివాసుడిని పెండ్లి కుమారుడిగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పేరిచర్ల జగపతిరాజు, సభ్యులు దండు ధనరాజు, వాసవి సాయి నగేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాలను కార్యనిర్వహణ అధికారి మాణికల రాంబాబు పర్యవేక్షించారు. -
డ్వాక్రా మహిళల బైఠాయింపు
బుట్టాయగూడెం: రెడ్డిగణపవరం బ్యాంక్ ఎదుట గాడిదబోరు గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల మహిళలు సోమవారం బైటాయించారు. బ్యాంకు రుణాలు మంజూరు చేసిన విషయం తమకు తెలియదని, దీంతో తాము వడ్డీ నష్టపోయామని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మేనేజర్ కుమార్, ఏపీఎం పద్మావతి మాట్లాడుతూ రుణాల సొమ్ములు డ్వాక్రా సంఘాల ఖాతాలోనే ఉన్నందుకు వాటిని తిరిగి రికవరీ చేయడంతోపాటు, వారికి ఎటువంటి వడ్డీ పడకుండా ఉండేలా మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనితో డ్వాక్రా మహిళలు శాంతించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జోడే సత్యదుర్గాప్రసాద్, డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
హెల్మెట్ లేకుంటే లైసెన్స్ సస్పెన్షన్
● ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం ● జిల్లాలో ద్విచక్ర వాహనాల తనిఖీ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం ఆదేశాల మేరకు జిల్లా రవాణా శాఖ అధికారులు ఏలూరు నగరంతో పాటు జంగారెడ్డిగూడెం, నూజివీడు ప్రాంతాల్లో సోమవారం ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 61 ద్విచక్ర వాహన చోదకులపై కేసులు నమోదు చేసి రూ.1,56,000 అపరాధ రుసుము విధించారు. ఈ సందర్భంగా కరీమ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించాలని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని తెలిపారు. మోటార్ సైకిల్ లేదా స్కూటర్లను నడిపే వాహన చోదకులు హెల్మెట్ ధరించని పక్షంలో జరిమానా విధించడంతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. రహదారి ప్రమాదాల్లో ద్విచక్ర వాహన చోదకులే అధిక శాతం మర ణిస్తున్నారని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణనష్టం జరుగకుండా నివారించవచ్చన్నారు. రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించిన నాడే మరణాలను తగ్గించగలుగుతామన్నారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో ఎంవీఐ శేఖర్, ఏఎంవీఐలు స్వామి, నరేంద్ర, సురేష్ బాబు, జమీర్, కళ్యాణి, కృష్ణవేణి, అన్నపూర్ణ, జగదీష్ పాల్గొన్నారు. -
అలరించిన నాటిక ప్రదర్శనలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అంబికా సంస్థల వ్యవస్థాపకులు ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం, హేలాపురి కళా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి నాటిక పోటీలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. సోమవారం హైదరాబాద్ యువభేరి థియేటర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన నా శత్రువు, సహృదయ ద్రోణాదుల సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శించిన వర్క్ ఫ్రమ్ హోమ్ నాటికలకు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభించింది. తొలుత అంబికా సంస్థల చైర్మన్ అంబికా కృష్ణ అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి మాట్లాడుతూ ఏలూరులో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలోను, కళలను ప్రోత్సహించడంలో అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం ఎప్పుడూ ముందుంటాయన్నారు. నాటక రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న కళాకారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ యువజన సంఘం మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు యర్రా సోమలింగేశ్వరరావు, సెక్రటరీ కళారత్న కేవీ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు ఇరదల ముద్దుకృష్ణ, సెక్రటరీ మజ్జి కాంతారావు, అంబికా ప్రసాద్, అంబికా రాజా, వేణు గోపాల్ లునాని, ఎంవీవీ నాగేశ్వరరావు, ఎల్.వెంకటేశ్వరరావు, కేబీ రావు, సంకు సురేష్, ఎం.సూర్యనారాయణ యాదవ్, తదితరులు పాల్గొనగా ఈ కార్యక్రమాన్ని మహమ్మద్ ఖాజావలి సమన్వయం చేశారు. -
గ్యాస్ లీకేజీకి పరిష్కారం
ఆగిరిపల్లి: స్థానిక యూనియన్ బ్యాంకు వద్ద గ్యాస్ లీకేజీ సమస్యను మేఘా గ్యాస్ సిబ్బంది పరిష్కరించారు. ఆదివారం ‘గ్యాస్ లీకేజ్‌తో ఇక్కట్లు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి సోమవారం మేఘా గ్యాస్ సిబ్బంది స్పందించారు. పైప్‌లైన్‌కు మరమ్మతులు చేసి లీకేజీ సమస్యను పరిష్కరించారు. దీంతో బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. కవర్లు విక్రయిస్తే చర్యలు ద్వారకాతిరుమల: చినవెంకన్న క్షేత్రంలో ప్లాస్టిక్ కవర్లు విక్రయించినా, వినియోగించినా చర్యలు తప్పవని శ్రీవారి దేవస్థానం సూపరింటెండెంట్ ఐవీ రామారావు వ్యాపారులను హెచ్చరించారు. ‘సాక్షి’ లో ‘అమలు కాని ప్లాస్టిక్ నిషేధం’ శీర్షికన సోమవారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఆలయ తూర్పు ప్రాంతంలోని దేవస్థానం షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. భక్తులకు కవర్లు ఇచ్చినా, విక్రయించినా, వినియోగించినా అపరాధ రుసుం విధిస్తామన్నారు. -
పీజీఆర్ఎస్లో అర్జీల వెల్లువ
ఏలూరు(మెట్రో): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి 248 అర్జీలను స్వీకరించారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె.భాస్కర్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 45 ఫిర్యాదులు ఏలూరు (టూటౌన్): ఏలూరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ 45 ఫిర్యా దులు స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ త గాదాలు, మోసపూరిత లావాదేవీలు, పోలీసు వి చారణకు సంబంధించిన సమస్యలు మొదలైన వా టిపై ప్రజలు అర్జీలు అందించారు. చొదిమెళ్ల నుంచి వచ్చిన ఓ వృద్ధుడు నడవలేని స్థితిలో ఉండగా ఆయన వద్దకు వెళ్లి సమస్య తెలుసుకుని పరిష్కారానికి ఎస్పీ ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. -
కూటమి నిస్సిగ్గు రాజకీయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: భారీ ప్రలోభాలకు అధికార పార్టీ తెరలేపింది. ప్రలోభాలకు లొంగకపోవడంతో వ్యక్తిగత ఆస్తులు, వ్యాపారాలపై దాడులు చేయిస్తామని బెదిరించింది. దానికి భయపడకపోవడంతో అక్రమ కేసులు బనాయించింది. అయినా యలమంచిలి వైఎస్సార్సీపీ ఎంపీటీసీలంతా మంత్రి నిమ్మల రామానాయుడు చర్యలను సమర్థంగా తట్టుకుని నిలబడటంతో సోమవారం మంత్రి నిమ్మల చేతులెత్తేశారు. పర్యవసానంగా యలమంచిలి ఎంపీపీ స్థానాన్ని వైఎస్సార్సీపీ దక్కించింది. జిల్లాలో ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ బలం లేకపోయినా అడ్డగోలుగా ఎన్నికల్లో పోటీ చేసి బెదిరింపు, దౌర్జన్యాలతో అత్తిలి ఎంపీపీ, కైకలూరు వైస్ ఎంపీపీ స్థానాలను దక్కించుకుంది. తద్వారా జిల్లాలో నిస్సిగ్గు రాజకీయాలకు టీడీపీ యథేచ్ఛగా కొనసాగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.యలమంచిలిలో నిబద్ధతకు పట్టం కట్టి..యలమంచిలి, అత్తిలి ఎంపీపీ స్థానాలకు, కై కలూరు వైస్ ఎంపీపీ స్థానాలకు ప్రత్యేకాధికారులు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. యలమంచిలిలో 18 మంది ఎంపీటీసీలకుగాను ఒక స్థానం ఖాళీ కావడంతో 17 మంది సభ్యులుండగా దానిలో 13 మంది వైఎస్సార్సీపీ సభ్యులు కాగా మిగిలిన ముగ్గురు టీడీపీ, ఒకరు జనసేన. 13 మంది సభ్యుల్లో ఒకరు జనసేనలో చేరడంతో 12 మంది సభ్యులు వైఎస్సార్సీపీలో ఉన్నారు. ఈ క్రమంలో గత మార్చి 27న ఎన్నిక జరగాల్సి ఉండగా టీడీపీ మంత్రి నిమ్మల డైరెక్షన్లో చిల్లర రాజకీయాలు చేసి 28కి వాయిదాపడేలా చేసింది. 28న కూడా హైడ్రామా నడిపి ఎన్నిక వాయిదా వేయించారు. ఈ క్రమంలో ఎన్నిక నిరవధికంగా వాయిదా ప్రకటించిన క్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఎన్నికల అధికారులకు మొట్టికాయలు వేసింది. దీంతో అధికారులు మరలా ఎన్నిక నిర్వహించారు. మంత్రి రామానాయుడు వైఎస్సార్సీపీ జెండా ఎగురకూడదనే కక్షతో సభ్యులను రకరకాలుగా భయభ్రాంతులకు గురిచేయడం, పార్టీ నేతలపై కక్షపూరితంగా కేసులు బనాయించి నానాయాగీ చేసినా వైఎస్సార్సీపీ శ్రేణులు ధైర్యంగా ముందడుగు వేశారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు ఎన్నికకు హాజరుకావడంతో కూటమి ముఖం చాటేసింది. ఎంపీపీగా ఇనుకొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు అధికారులు ప్రకటించి డిక్లరేషన్ అందజేశారు.ఆరిమిల్లి అంబులెన్స్ రాజకీయంకై కలూరులో బీజేపీ కాకుండా టీడీపీకి కామినేని పట్టంఉమ్మడి జిల్లాలో ముగిసిన ఉప పోరుకై కలూరులో టీడీపీకే కామినేని మద్దతుకైకలూరులో భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కామినేని శ్రీనివాస్ స్థానికంగా ఆ పార్టీ నేతలకు పదవులు దక్కకుండా బలంగా చక్రం తిప్పుతున్నారు. సాధారణ నామినేట్ పదవులు మొదలు అన్నింటిలోనూ టీడీపీ సభ్యులు మినహా సొంత పార్టీకి ప్రాధాన్యం లేదు. ఇదే క్రమంలో కై కలూరు వైస్ ఎంపీపీ–1 స్థానాన్ని టీడీపీకి కట్టపెట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు పార్టీ విప్ జారీ చేసింది. అయినా ఎమ్మెల్యే ఒత్తిళ్లతో పార్టీ మారిన సభ్యులు విప్ ధిక్కరించి టీడీపీకి ఓటు వేశారు. కై కలూరులో మొత్తం 22 స్థానాలకు 21 స్థానాలు వైఎస్సార్సీపీ, ఒకటి టీడీపీ గతంలో గెలుచుకుంది.తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మరోసారి తనదైన శైలిలో చిల్లర రాజకీయాలకు తెరతీశారు. అత్తిలి మండలంలో 20 మంది ఎంపీటీసీ సభ్యులకుగాను 16 మంది వైఎస్సార్సీపీ, రెండు టీడీపీ, రెండు జనసేన గెలుపొందారు. ఒక వైఎస్సార్సీపీ సభ్యుడు గల్ఫ్‌లో ఉండటంతో మొత్తం 19 మంది ప్రస్తుతం ఎంపీటీసీలుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గత మార్చిలో అత్తిలి ఎంపీటీసీలతో మాజీ మంత్రి కారుమూరి తన నివాసం నుంచి ఓటింగ్‌కు వెళ్తున్న క్రమంలో దాదాపు వెయ్యి మందికిపైగా టీడీపీ కార్యకర్తలు కారుమూరి ఇంటిని చుట్టుముట్టి దౌర్జన్యం చేసి దాడికి యత్నించి ఎంపీటీసీలు ఓటింగ్‌కు వెళ్లనీయకుండా నిలువరించారు. ఇదంతా పోలీసుల కళ్లెదుట జరిగినా స్పందించని పరిస్థితి. ఆ మరుసటి రోజు కూడా ఓటింగ్‌కు వెళ్లనీయకుండా ఎంపీటీసీలను ఒక రకంగా ఇంట్లోంచి బయటకు రాకుండా ఆందోళనకర వా తావరణం సృష్టించారు. నిరవధిక వాయిదా పడి సోమవారం ఎన్నిక జరుగుతుందని అధికారులు ప్రకటించిన క్రమంలో మూడు రోజుల ముందే వైఎస్సార్సీపీ సభ్యులు కొందరిపై తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. ఒక ఎంపీటీసీ దుబాయిలో పనిచేస్తున్న క్రమంలో ఆయన ఇంటికి పోలీసులను పంపి బెదిరించి తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడం, మరో ఎంపీటీసీ ఇల్లు రోడ్డుపై ఉందని ఆక్రమణ కింద ఇంటిని కూల్చేస్తామని బెదిరించడం, మరికొందరు ఎంపీటీసీల వ్యాపారాలపై దాడులు చేయిస్తామని బెదిరించడం ఇలా తీవ్రస్థాయిలో భయపెట్టి అత్తిలి ఎంపీపీ స్థానాన్ని టీడీపీ దక్కించుకునేలా వ్యవహరించారు. కట్ చేస్తే.. టీడీపీ నుంచి ఎంపీపీగా గెలుపొందిన మక్కా సూర్యనారాయణ మూడేళ్ల క్రితం వైఎస్సార్సీపీ నుంచి ఎంపీపీగా గెలుపొందిన వ్యక్తే కావడం గమనార్హం. పర్యవసానంగా టీడీపీలో మొదటి నుంచి ఉన్న ఎంపీటీసీలకు ఆరిమిల్లి హ్యాండ్ ఇచ్చారనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. మరోవైపు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఓటింగ్ వద్ద అడ్డుకుని ఆందోళన నిర్వహిస్తారనే భయంతో ఆరిమిల్లి ఎంపీటీసీలందరినీ అంబులెన్స్‌లో ఎన్నికకు తీసుకురావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
రుణాలకు సిఫార్సులు సరికాదు
ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ సిఫార్సులతో రుణాలు మంజూరు చేయడం సరి కాదని ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ అన్నారు. డీఆర్సీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులకు కార్పొరేషన్ రుణాలు అందితే వారు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. అయితే ఇటీవల బీసీ రుణాలను ఎమ్మెల్యే ల సిఫార్సులతో మంజూరు చేశారని, ఇది మంచి పాలన కాదన్నారు. అలాగే గత ప్ర భుత్వ హయాంలో పాఠశాల ల అభివృద్ధి, నూతన భవన నిర్మాణాల కోసం నిధులు కేటాయించారని, సెకండ్ ఫేజ్‌లో స్కూల్ భవనాల నిర్మాణాలు ఆగిపోయా యన్నారు. ఆగిపోయిన భవన నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని కోరారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలుకు కొనుగోలు కేంద్రాల సిబ్బంది ఇబ్బందులు పెడుతున్నాయన్నారు. అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో రైతు లు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సమస్య రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
యుద్ధప్రాతిపదికన సాగునీటి పనులు
ఏలూరు(మెట్రో): జిల్లాలో సాగునీటి వనరులకు సంబంధించిన పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనీ పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జిల్లా సమీక్షా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇరిగేషన్ పూడికతీత పనులు, ఉపాధి హామీ, తాగునీరు సరఫరా, రెవెన్యూ, విద్య ఉద్యాన తదితర అంశాలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జెడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్‌కుమార్, మద్దిపాటి వెంకటరాజు, కలెక్టర్ కె.వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు. 2.50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జిల్లాలో 2.50 లక్షల టన్నుల రబీ ధాన్యం సేకరణ పూర్తయ్యిందని మంత్రి మనోహర్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ 20,225 మంది రైతుల నుంచి రూ.575 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఇప్పటికే రూ.486 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేశామన్నారు. ఇన్చార్జి మంత్రి మనోహర్ -
తల్లీబిడ్డ సేవలకు సుస్తీ
వేధిస్తున్న సమస్యలు మార్చి 30తో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను నడుపుతున్న ప్రైవేట్ సంస్థతో టెండరు గడువు ముగియగా ప్రభుత్వం మరో రెండు నెలలు పాటు పొడిగించినట్టు యూనియన్ నాయకులు చెబుతున్నారు. గతంలో అవసరమైన మేర వాహనాల్లో డీజిల్ పోయించుకునే వెసులుబాటు ఉండగా కొద్దినెలలుగా పరిమితం చేసినట్టు చెబుతున్నారు. దీంతో నెలలో డీజిల్ ఉన్న మేర వాహనాలను నడిపి అయిపోయినప్పుడు మూలకు చేరుస్తున్నారు. మరోపక్క సకాలంలో ఆయిల్ ఛేంజింగ్, మరమత్ముల చేయకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తోందంటున్నారు. సేవలు సరిగా అందక తల్లీబిడ్డలను ఇళ్లకు తీసుకువెళ్లేందుకు వారు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి వారు అడిగిన మొత్తం చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. సాక్షి, భీమవరం: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలకు సమస్యల సుస్తీ చేసింది. డీజిల్ కొరత, మరమ్మతులతో సేవ లందించేందుకు ఆపసోపాలు పడుతోంది. అరకొర సేవలతో బాలింతలు, వారి కుటుంబ సభ్యులు అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఒక్క రోజు సమ్మె నిర్వహణకు యూనియన్ సిద్ధమైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు ప్రసవానంతరం ప్రభుత్వం 102 పేరిట తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనంలో తల్లీబిడ్డలను సురక్షితంగా వారి ఇంటికి చేరవేస్తుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా 32 వాహనాలు ఉండగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వాహనాలు సేవలందిస్తున్నాయి. రోజుకు 200 మంది వరకు తల్లీబిడ్డలను వారి ఇళ్లకు చేరుస్తున్నాయి. గతంలో సాఫీగా సాగిన సేవలు కొంత కాలంగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలో 14 వాహనాలు ఉండగా వాటిలో తొమ్మిది మాత్రమే సేవలు అందిస్తున్నాయి. ఆచంట, తాడేపల్లిగూడెం, తణుకు తదితర చోట్ల ఐదు వాహనాల కెప్టెన్లు (డ్రైవర్లు) కొరత, మరమ్మతులతో మూలకు చేరాయి. డిమాండ్ల సాధన కోసం పోరుబాట ప్రస్తుతం ఇస్తున్న రూ.8,850 జీతం సకాలంలో ఇవ్వకపోగా నెలల తరబడి బకాయిలు పేరుకుపోతున్నాయి. ఏపీ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ పలుమార్లు ప్రభుత్వానికి వినతులు అందజేయడంతో ఇటీవల ఫిబ్రవరి వరకు బకాయిలు విడుదల చేసింది. మరో రెండు నెలలు జీతాలు రావాల్సి ఉన్నట్టు నాయకులు చెబుతున్నారు. కనీస వేతనం రూ.18,500 ఇవ్వాలని, వాహనాలకు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని, ఆదివారం, వీక్లీ ఆఫ్‌లు, పండుగ సెలవులు అమలుచేయాలని, యజమాని వాటా పీఎఫ్‌ను యాజమాన్యమే చెల్లించాలని, ఈఎస్ఐ అమలుచేయాలని, 8 గంటలు పని విధానం, బఫర్ సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. డిమాండ్ల సాధన కోసం యూనియన్ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో మంగళవారం ఒక్క రోజు సమ్మెలో భాగంగా కలెక్టరేట్ల వద్ద నిరసన వ్యక్తం చేయనున్నట్టు యూనియన్ నాయకులు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మెరుగైన సేవలుతల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను పేదలకు ఎంతో మెరుగ్గా అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేసింది. ఎయిర్ కండిషన్డ్ సౌకర్యాలతో కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి దూరప్రాంతాలకు సైతం ఈ వాహనాల్లో తల్లీబిడ్డలను వారి గమ్యస్థానాలకు చేరవేసేలా కార్యాచరణ చేసి అమలుచేశారు. ప్రసవానంతరం తల్లీబిడ్డలతో ఇళ్లకు చేరుకునేందుకు పేదవర్గాల వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పుడు సేవలందించేందుకు వాహనాలు మొరాయిస్తుండటంతో వారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తల్లీబిడ్డ సేవలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని పేదలు కోరుతున్నారు. ప్రజారోగ్యానికి ప్రమాదం డీజిల్ కొరతతో నిలిచిపోతున్న వాహనాలు అరకొర సేవలతో బాలింతల అవస్థలు రెండు నెలలుగా డ్రైవర్ల జీతాల బకాయిలు ఉమ్మడి జిల్లాలో 32 వాహనాలు రోజుకు 200 మంది తల్లీబిడ్డలను ఇంటికి చేరుస్తున్న వైనం సమస్యల పరిష్కారానికి నేడు సమ్మెకు పిలుపు -
రేపు వైఎస్సార్సీపీ కార్యవర్గ సమావేశం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైఎస్సార్సీపీ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఈనెల 21న నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం ఏలూరులోని గన్‌బజారులోని ఓ కల్యాణ మండపంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఆ సమావేశంలో పార్టీకి సంబంధించిన జిల్లాస్థాయి కమిటీలతో పాటు మండల స్థాయి కమిటీల నియామకాల గురించి చర్చిస్తామన్నారు. పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ), నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకం ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. టి.వేదకుమారి (దెందులూరు)ని రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా, గురజాల పార్థసారథిని (చింతలపూడి) రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా, పోకల రాంబాబుని (దెందులూరు) రాష్ట్ర పంచాయతీ విభాగం ప్రధాన కార్యదర్శిగా, మేడూరి రంగబాబుని (చింతలపూడి) రాష్ట్ర పంచాయతీరాజ్ విబాగం కార్యదర్శిగా, కుంజ భూమయ్యని (పోలవరం) రాష్ట్ర దివ్యాంగుల విభాగం కార్యదర్శిగా నియమించారు. -
పని భారంపై వీఆర్వోల నిరసన
కొయ్యలగూడెం: క్లస్టర్ విధానంలో రేషనలైజేషన్ పేరుతో విడుదల చేసిన జీవో నెంబర్–4 విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని వీఆర్వో అసోసియేషన్ డివిజనల్ అధ్యక్షుడు అడపా రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్వోలు నిరసన కార్యక్రమం చేపట్టారు. రెండు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్‌గా నిర్ణయిస్తూ దానికి ఒక వీఆర్ఓని మాత్రమే నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని వీఆర్వో అసోసియేషన్ ఖండించింది. ఒక్కో సచివాలయానికి మిగిలిన శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులను ఒక్కొక్కరిని నియమిస్తూ, రెవెన్యూ వ్యవస్థ వచ్చేసరికి రెండు సచివాలయాలకు కలిపి ఒకరినే నియమించడం వల్ల తీవ్రమైన పనిభారం, ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందంటూ పేర్కొన్నారు. ఇప్పటికే ఒక సచివాలయంలోనే ఉన్న విధులను నిర్వహించడానికి తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఎదుర్కొంటుండగా రెండు సచివాలయాలను కలపడం అన్యాయం అన్నారు. అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కె.చెల్లన్నదొరకు వినతిపత్రం సమర్పించారు. వీఆర్వోలు కె.మధు, బట్టు వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
డీఈఓ కార్యాలయ ముట్టడికి సన్నాహాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్ ప్రక్రియలో ప్రభు త్వ ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా ఉపాధ్యాయ సంఘాలు ఈనెల 21న డీఈఓ కార్యాలయాలను ముట్టడించాలని నిర్ణయించాయి. ఈ మేరకు సోమవారం ఏలూరులో ఉపాధ్యాయ సంఘాలు సన్నాహక సమావేశం నిర్వహించాయి. ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కులను కాలరాయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈనెల 21న నిర్వహించే డీఈఓ కా ర్యాలయ ముట్టడి కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్టీయూ నాయకుడు ఎం. శామ్యూల్, కేఆర్ పవన్ కుమార్, యూటీఎఫ్ నా యకులు జీవీ రంగమోహన్, ఎస్కే అలీ, వైఎస్సార్ టీఏ నాయకులు జి.సాంబశివరావు, వి.రామ్మోహన్, ఏపీటీఎఫ్ 1938, పీఆర్టీయూ, ఏపీటీఎఫ్ 257, ఏపీటీఏ, పీడీ, పీఈటీ సంఘ, ఆర్‌యూపీపీ నాయకులు పాల్గొన్నారు. -
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్ ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని పుట్టలో పాలు పోసి స్వామిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ళశాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. స్వామిని దర్శించుకునే భక్తులు అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొంటే మేలు జరుగుతుందనే విశ్వాసం ఉంది. దీంతో అన్నదాన కార్యక్రమానికి భక్తలు పోటెత్తడంతో ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. స్వామికి గుడివాడకు చెందిన వన్నెంరెడ్డి మధుసూదనరావు కుటుంబసభ్యుడు దినేష్ వెండి పుష్పమాలను అందజేశారు. -
పెద్దింట్లమ్మా... చల్లంగా చూడమ్మా..
కై కలూరు: అమ్మా పెదింట్లమ్మా.. నీ చల్లనీ దీవెనలు మాకు అందించమ్మా.. అంటూ భక్తులు అమ్మను భక్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. కోనేరులో స్నానాలు చేసి అమ్మవారికి భక్తులు వేడి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు చేశారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాయ దర్శనాలు, కేశఖండనశాల, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదాలు, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు విక్రయం, భక్తుల విరాళాల ద్వారా రూ.78,001 ఆదాయం వచ్చిందని తెలిపారు. -
రసాయన ఎరువులతో అనర్థాలు
చింతలపూడి: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. రైతులు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట పండించడానికి విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. ఫలితంగా భూముల్లో పంటకు కావలసిన పోషకాలు అందుబాటులో లేక సమతుల్యత లోపించి ముందెన్నడూ లేని విధంగా ద్వితీయ సూక్ష్మ పోషక లోపాలు కనిపిస్తున్నాయి. ఈ పోషకాలు లోపించినప్పుడు సాగులో మిగతా యాజమాన్య పద్ధతులన్నీ సక్రమంగా పాటించినా దిగుబడులు తగ్గుతాయి. వీటిని అధిగమించడానికి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మేలని వ్యవసాయ సహాయ సంచాలకులు బి.నాగకుమార్ సూచిస్తున్నారు. చింతలపూడి సబ్‌డివిజన్ పరిధిలో ఏటా ఖరీఫ్ సీజన్లో 35,500 ఎకరాల్లో వరి సాగు చేస్తుంటారు. 350 ఎకరాల్లో మొక్కజొన్న, 160 ఎకరాల్లో వేరుశెనగ పండిస్తారు. రబీ సీజన్లో సుమారు 1,500 హెక్టార్లల్లో వరి, 18,000 హెక్టార్లలో మొక్కజొన్న, 2,500 హెక్టార్లలో వేరుశెనగ పంటను రైతులు సాగు చేస్తున్నారు. జిప్సంతో మంచి దిగుబడి జిప్సంలో 24 శాతం కాల్షియం, 18 శాతం గంధకం ఉంటుంది. కాల్షియం, గంధకం మొక్కల పెరుగుదలకు అవసరమైన ద్వితీయ పోషకాలను చౌకగా జిప్సం అందిస్తుంది. ముఖ్యంగా నూనె గింజలు, పప్పు ధాన్యాల వంటి పంటల్లో గంధకం ఆవశ్యకత ఉంటుంది. కాల్షియం మొక్కల్లోని జీవకణాల అంచులు గట్టిగా ఉండటానికి, కణ విభజనకు, వేర్ల అభివద్ధికి, గింజ కట్టడానికి అవసరమవుతుంది. దీని వల్ల మొక్కలకు చీడపీడలు ఎదుర్కొనే శక్తి సమకూరుతుంది. వేరుశెనగ పంటలో అధిక దిగుబడులకు జిప్సం పూత దశలో వేసుకుని భూముల్లో కలియ బెట్టడం వల్ల అధిక దిగుబడులు వస్తాయి. వేరుశెనగలో జిప్సం వినియోగం వల్ల కాయలు గట్టిగా ఉండి కాయ నిండా పప్పు వృద్ధి చెంది గింజల్లో అధిక నూనె శాతం ఉంటుంది. ఫలితంగా కాయలు అధిక బరువు ఉండి మంచి ధర పలుకుతాయి. పూత సమయంలో ఎకరాకు 200 కిలోల చొప్పున భూమిలో తగిన తేమ ఉన్నప్పుడు మొక్కలకు దగ్గరగా జిప్సం వేసుకోవాలి. బీడు, చౌడు భూముల్లో నీరు సరిగా ఇంకదు. గాలి ప్రసరణ తక్కువగా ఉంటుంది. భూమి భౌతిక లక్షణాలు క్షీణించి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మొక్కల వేర్లు సరిగా వృద్ధి చెందక మొక్కల్లో ఎదుగుదల ఉండదు. ఇలాంటి భూముల్లో జిప్సం వినియోగం వల్ల నేల గుల్లబారి భూమిలో నీరు ఇంకే స్వభావం పెరిగి మొక్కల వేర్లు బాగా వృద్ధి చెందుతాయి. పంట దిగుబడి పెరుగుతుంది. బి.నాగకుమార్, ఏడీఏ, వ్యవసాయ సబ్‌డివిజన్ సేంద్రియ పద్ధతులే మేలంటున్న అధికారులు -
మట్టి లారీలపై గ్రామస్తుల ఆందోళన
కొయ్యలగూడెం: మండలంలోని దిప్పకాయలపాడు శివారు దళిత పేటలో మట్టి తోలకాలను అడ్డుకుని స్థానికులు ఆందోళన చేశారు. ఆదివారం సాయంత్రం దాదాపు యాభై మందికి పైగా యువకులు మట్టి తోలకాల వల్ల రోడ్లు అధ్వానంగా మారాయంటూ వాగ్వాదానికి దిగారు. సుమారు పాతికకు పైగా లారీలను నిలిపేసి రోడ్డుపై బైఠాయించారు. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం లారీలు ప్రయాణిస్తుండటంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవి సెలవుల కారణంగా పిల్లలు బయట ఎక్కువగా తిరుగుతున్నారని, ఈ లారీల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకొని, మట్టి లారీల రవాణాపై నియంత్రణ విధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. జలవనరుల శాఖ సబ్ డివిజన్ అధికారులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రచారం సాగుతోంది. -
లోతు దుక్కులతో మేలు
ముసునూరు: మెట్ట ప్రాంతాల్లో వర్షాధార పంటలు పండించే భూములకు వేసవి (లోతు) దుక్కులు ఎంతో ప్రయోజనకరం. ఈ నేపథ్యంలో జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు వర్షాలు పలకరిస్తుండడంతో వేసవి దుక్కులపై దృష్టి పెట్టారు. తొలకరి వర్షాలు కురిసినపుడు భూమిని లోతుగా దుక్కి చేసుకోవడం వల్ల భూమి పై పొరలు లోపలికి, లోపలి పొరలు బయటకు చేరి, చేనుకు మంచి చేస్తుందని రైతులు చెబుతున్నారు. లోతు దుక్కుల ప్రాధాన్యత: ● దుక్కి లోతుగా చేయడం పండించే పంటపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి పెద్ద మరతో 30 సెం.మీ లోతు వరకు దుక్కు చేయడం మంచిది. ఏటా వర్షాలను బట్టి భూమిని 15–20 సెం.మీ లోతు వరకు దున్నుకోవాలి. ● సాధారణంగా తల్లి వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ ఉన్న పంటలకు తక్కువ లోతు దుక్కి సరిపోతుంది. తేలికపాటి నేలల్లో 1–3 సార్లు దున్నాలి. కలుపు మొక్కలు, పంటల అవశేషాలు ఎక్కువగా ఉంటే కనీసం మూడు దఫాలుగా దున్నాలి. వేసవి దుక్కులకు అనుకూల పరిస్థితులు ● భూమిలో నిల్వ ఉంచుకునే తేమ 25 నుంచి 50 శాతం ఉంటే అది దుక్కులకు పూర్తి అనుకూలం. ● భూమిలో తేమ తక్కువ ఉన్నప్పుడు దుక్కి దున్నకూడదు. దీని వల్ల భూమి గుల్ల బారదు. ● భూమిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు నాగలికి మట్టి అంటుకుంటుంది. కింద ఉన్న మట్టి గట్టిపడి, భూమిలో గట్టి పొరలు ఏర్పడతాయి. వేసవి దుక్కులతో ప్రయోజనాలు ● వేసవి దుక్కులతో నేల గుల్ల బారుతుంది. తదుపరి వచ్చే వర్షపు నీరు వృథా కాకుండా సద్వినియోగం చేసుకోవచ్చు. ● తగినంత తేమ ఉన్నప్పుడు నేలను లోతుగా వాలుకు అడ్డంగా దున్నడం వల్ల నేల కోతను నివారించి, భూమి పైపొర, భూసారాన్ని కొట్టుకుపోకుండా అరికట్టవచ్చు. ● లోతు దుక్కుల వల్ల భూమిలో నీరు ఉండి, తేమ శాతం పెరగడం వల్ల సేంద్రీయ పదార్థాలు త్వరగా కుళ్ళి పోషకాల రూపంలో అందుబాటులోకి వస్తాయి. ● భూమిని అడుగు లోతు వరకు దున్నుకుంటే విత్తనం మొలకెత్తి, వేర్లు సులభంగా భూమిలోకి దిగి, భూమిలో ఉండే పోషకాలను గ్రహించి, మొక్క పెరుగుదలకు తోడ్పడుతుంది. ● పంట పొలాల్లో లోతు దుక్కులు దున్నడం వల్ల భూమిలో దాగి ఉన్న చీడ పీడలు, కోశస్థ దశలో ఉన్న పురుగులు, బాక్టీరియా, శిలీంద్రాలు, సిద్ధబీజాలు, కలుపు మొక్కల ఎండ వేడికి నశిస్తాయి. పరుగుల్ని పక్షులు తినేయడంతో తెగుళ్ల బెడద తప్పుతుంది. ● పొలంలో మట్టి గడ్డలు తొలగిపోయి, మెత్తని మట్టి ఏర్పడి పంట త్వరగా పెరిగేందుకు దోహద పడుతుంది. వేసవి దుక్కులు భూసారానికి మంచిది పంటలను బట్టి వేసవి దుక్కులు చేసి, భూసారం పెంచి, రైతులు లాభం పొందాలి. తమ శాఖ ద్వారా లభించే సలహాలు, సూచనలు పాటించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత సులభతరం చేసుకోవాలి. సబ్సిడీపై లభించే వనరులు పొంది, రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలి. కె.చిన సూరిబాబు, మండల వ్యవసాయాధికారి -
అభయాంజనేయస్వామికి మల్లెపూలతో పూజ
పెదపాడు: అప్పనవీడులోని అభయాంజనేయస్వామి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం మల్లెపూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు భజన మండలిచే సంప్రదాయ సంకీర్తనలు నిర్వహించారు. సాయంత్రం విజయదుర్గ కోలాట బృందంచే కోలాటం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు వెండి బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజ, నక్షత్ర హారతి నిర్వహించారు. శ్రీ విజయదుర్గా నాట్యమండలి బృందం సత్యహరిశ్చంద్ర కాటి సీను ప్రదర్శించింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఈ నెల 30న భైరవం సినిమా రిలీజ్ పురస్కరించుకుని అభయాంజనేయస్వామి ఆలయంలో సినీ నటులు మంచు మనోజ్, నారా రోహిత్, విజయ్ కనకమేడల, కేకే రాధామోహన్ స్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేదాశీర్వాదం అందించారు. -
శ్రీమన్నారాయణుడికి చందనోత్సవం
రేపటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని శ్రీ చతుర్భుజ లక్ష్మీతాయారు సమేత శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయం(చినగోపురంలో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఆదివారం స్వామివారికి చందనోత్సవం నిర్వహించారు. ఉదయం సహస్రనామ పూజలు, అలంకార తిరుమంజనం, సుప్రభాతసేవ, స్వస్తివాచకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి స్వామి వారిని పట్టణ పురవీధుల్లో రథంపై ఊరేగించారు. సోమవారం వసంతోత్సవం, ధ్రువ మూర్తుల తిరుమంజనం, మహా పూర్ణాహుతి, ఏడు ముసుగుల ఉత్సవ కార్యక్రమాలు జరగనున్నట్లు ఆలయ ఈవో బిరుదుకోట శంకర్ తెలిపారు. కార్యక్రమాలను ఆలయ ఈవో గుబ్బల రామ పెద్దింట్లరావు, బ్రహ్మోత్సవ కమిటీ సభ్యులు మాజేటి రాంబాబు, మామిడి బాబు, రేపాక ప్రవీణ్‌భాను, మాజేటి సూర్యభవానీ, మాచేపల్లి నాగఅన్నపూర్ణ, రేపాక సుబ్బారావు, దేవత భాస్కరరావు, నున్న కోటేశ్వరరావు, తదితరులు పర్యవేక్షిస్తున్నారు. -
నాటుసారా అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
ముసునూరు: నాటుసారా విక్రయిస్తున్నారనే సమాచారంతో స్పెషల్ స్క్వాడ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ వైవీఎన్ఎస్ ఫణికుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి ఒకరిని అరెస్టు చేశారు. మరో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నూజివీడు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ మస్తానయ్య తెలిపారు. మండలంలోని రమణక్కపేట–అక్కిరెడ్డిగూడెం సరిహద్దులో విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఆదివారం బృందం వాహన తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో నూజివీడు మండలం మిట్టగూడెంకు చెందిన పోలగంటి చంటిని అదుపులోకి తీసుకుని, 30 లీటర్ల నాటుసారా, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సారా సరఫరా చేస్తున్న రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట గ్రామానికి చెందిన భరోతు కుమార్‌పై కేసు నమోదు చేశామన్నారు. -
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో చిరుజల్లులు పడ్డాయి. వాతావరణంలో మార్పులతో భక్తులు త్వరగా దర్శనాలు చేసుకుని బయటకు వెళ్ళాలని కమిటీ వారు సూచించారు. సాయంత్రం 4 గంటలలోపే భక్తులందరూ తమ పూజా కార్యక్రమాలను ముగించుకుని బయటకు వచ్చారు. శ్రీవారి క్షేత్రంలో కొనసాగిన రద్దీ ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ ఆదివారం సైతం కొనసాగింది. వేసవి సెలవులు కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. దాంతో అన్ని విభాగాలు భక్తులతో పోటెత్తాయి. ముఖ్యంగా దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కేశఖండనశాల ఇతర విభాగాలు భక్తులతో కిక్కిరిసాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. వేంకటేశ్వర స్వామివారిని తూర్పుగోదావరి జిల్లా అడిషినల్ ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి గణపవరం: గణపవరం మండలం సరిపల్లె శివారు ఫ్యాక్టరీ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. గణపవరం ఎస్సై ఆకుల మణికుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఉండి మండలం కల్లిగొట్ల గ్రామానికి చెందిన బిరుదగడ్డ సాల్మన్, దాసరి మురళి ఆదివారం సాయంత్రం మోటార్‌సైకిల్‌పై గణపవరం వస్తుండగా సీపీ మేతల కంపెనీ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో సాల్మన్ అక్కడిక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన దాసరి మురళిని అంబులెన్స్‌లో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మణికుమార్ తెలిపారు. -
గూడెంలో భారీ వర్షం
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో అనేక పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రెయిన్లు పొంగి ప్రవహించాయి. చాలా రోడ్లు కాలువల్లా దర్శనమిచ్చాయి. దాదాపు గంటన్నరకు పైగా సాధారణ జన జీవనం స్తంభించింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పనులకు అంతరాయం ఏర్పడింది. మునిసిపల్ హెహికల్ డిపో ఎదురుగా సీసీ రహదారి కల్వర్టుకు అడ్డంకి ఏర్పడటంతో బురద నీరు రోడ్డుపైకి చేరింది. అనేక ప్రాంతాలు చెత్త చెదారాలతో నిండి దుర్వాసన వెదజల్లుతున్నాయి. బస్టాండ్‌లో నీరు నిలిచిపోయింది. కె.ఎన్.రోడ్డులో అనేక చోట్ల మార్జిన్లలో నీరు నిలిచిపోవడంతో వ్యాపారస్తులు ఇబ్బంది పడ్డారు. అయితే చల్లని గాలులతో పట్టణ ప్రజలు సేదదీరారు. భీమవరం మండలంలో.. భీమవరం అర్బన్: భీమవరం మండలంలోని యనమదుర్రు, దిరుసుమర్రు, గొల్లవానితిప్ప, అనాకోడేరు, కొమరాడ, తోకతిప్ప, కొత్తపూసలుమర్రు తదితర గ్రామాల్లో ఆదివారం భారీ వర్షం పడింది. దీంతో పలు గ్రామాలలోని శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఐదుగురు చిన్నారులు జలసమాధి
కుప్పం రూరల్/బుట్టాయగూడెం: వేసవి సెలవుల్లో చిన్నారుల సందడితో కళకళలాడాల్సిన ఇళ్లల్లో విషాదం అలముకుంది. అప్పటివరకు కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపిన ఐదుగురు చిన్నారులు జల సమాధి అయ్యారు. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు. చిత్తూరు జిల్లా దేవరాజపురంలో ఆడుకోవడానికి వెళ్లి నీటి కుంటలో పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని జల్లేరు జలాశయంలో నీటమునిగి ఓ అన్న, తమ్ముడు మృతి చెందారు. ప్రమాదవశాత్తూ జారి పడి..చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురానికి చెందిన యశోద, వరలక్ష్మి, రాజా ఒకే తల్లి బిడ్డలు. యశోద తమిళనాడులో నివసిస్తుండగా.. వరలక్ష్మి, రాజా దేవరాజపురంలోనే ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో యశోద తన కుమారుడు అశ్విన్‌తో కలిసి ఇటీవల దేవరాజపురం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం యశోద కుమారుడు అశ్విన్(7), వరలక్ష్మి కుమార్తె గౌతమి(6), రాజా కుమార్తె శాలిని(7) ఆడుకుంటూ.. సమీపంలోని నీటి కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ ముగ్గురూ అందులోకి జారిపడ్డారు. ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు ఎంతసేపటికీ రాకపోవడంతో.. తల్లిదండ్రులు వారిని వెదుకుతూ నీటి కుంట వద్దకు వెళ్లగా.. ముగ్గురూ విగతజీవులుగా కనిపించారు. వారిని అలా చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేయనున్నట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు.బిడ్డల కోసం తల్లి పోరాడినా..తాడేపల్లిగూడేనికి చెందిన షేక్ అన్వర్, పర్విన్ దంపతులకు ఇద్దరు కుమారులు సిద్దిక్(10), అబ్దుల్(7). వేసవి సెలవులు కావడంతో పర్విన్ తన ఇద్దరు కుమారులను తీసుకుని జంగారెడ్డిగూడెంలోని బంధువుల ఇంటికి వచ్చింది. ఆదివారం బంధువులతో కలిసి బుట్టాయగూడెం మండలం అలివేరు సమీపంలోని జల్లేరు జలాశయాన్ని చూసేందుకు వెళ్లారు. నీళ్లు తక్కువగా ఉండడంతో స్నానం చేసేందుకని జలాశయంలోకి దిగారు. సిద్దిక్, అబ్దుల్ లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశానికి వెళ్లడంతో.. నీట మునిగారు. వారిని కాపాడేందుకు తల్లి పర్విన్తో పాటు మరో మహిళ ప్రయత్నించారు.ఈ క్రమంలో వారిద్దరూ కూడా నీటిలో మునిగిపోతుండగా.. స్థానికులు చున్నీల సాయంతో వారిద్దరినీ బయటకు లాగారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ దుర్గామహేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకొని పిల్లల కోసం జలాశయంలో గాలించారు. గంట సేపటి తర్వాత స్థానికుల సాయంతో వలలు వేసి.. పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్లలూ.. ఒకేసారి మరణించడంతో తల్లిదండ్రులు ‘ఇక మాకు దిక్కెవరు?’ అంటూ రోదించారు. చిన్నారుల మృతిపై సీఎం విచారం సాక్షి, అమరావతి: విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడటంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పిల్లల మృతితో తీవ్ర శోకంలో ఉన్న తల్లిదండ్రులకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. -
ప్రభుత్వాస్పత్రులపై ప్రత్యేక పర్యవేక్షణ
ఏలూరు(మెట్రో) : జిల్లాలో ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన సేవలందించేలా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో ఎల్లవేళలా వైద్యులు అందుబాటులో ఉండేలా అధికార యంత్రాంగం తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల సమయంలో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో లేన్నట్టు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించాలని, చిన్నపాటి రోగాలకూ జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేయకుండా చికిత్స అందించాలన్నారు.పీజీఆర్ఎస్ వికేంద్రీకరణప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జిల్లాస్థాయితో పాటు మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ వెట్రిసెల్వి ప్రకటనలో తెలిపారు. ప్రజలు సమీపంలోని కార్యాలయాలకు వెళ్లి అర్జీలు అందించవచ్చని సూచించారు.జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 629 మంది హాజరుఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులోని రెండు కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు 629 మంది విద్యార్థులు హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 180 మందికి 175 మంది, మధ్యాహ్నం 180 మందికి 174 మంది హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 144 మందికి 140 మంది, మధ్యాహ్నం 144 మందికి 140 మంది హాజరయ్యారు.నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించాలిఏలూరు (టూటౌన్): నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక అన్నే భవనంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ నిమ్మకాయల ధర పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి నుంచి మే వరకు నిమ్మకు అధిక ధర ఉండే సమయమని, అయినా ప్రస్తుతం ధర తగ్గిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరోవైపు ఈదురుగాలులు, అకాల వర్షాలతో నిమ్మ రైతులు నష్టపోతున్నారన్నారు. నిమ్మ ఎగుమతులు సక్రమంగా లేకపోవడం కూడా నష్టాలకు కారణంగా ఉందని, ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. కిలో నిమ్మకాయలకు రూ.100 ధర రావాల్సి ఉండగా రూ.30లోపు మాత్రమే ఉందన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా కమిటీ సభ్యుడు జి.సురేష్ పాల్గొన్నారు.భారీ వర్షాలపై అప్రమత్తం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ఏలూరు(మెట్రో): కోస్తా జిల్లాల్లో రా నున్న మూడు రో జులపాటు భారీ వ ర్షాలు కురుస్తా యన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను అప్రమత్తం చేశారు. ఏలూరు కలెక్టరేట్లో టోల్‌ఫ్రీ నంబర్ 1800 233 1077తో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా రెవెన్యూ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మండల, డివిజన్ కేంద్రాల్లో రెవెన్యూ సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. కంట్రోల్ రూమ్‌ను ప్రజలు వినియోగించు కోవాలని కోరారు. -
సందేశాత్మకంగా నాటికలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం, హేలాపురి కళాపరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి నాటిక పోటీలు రెండోరోజు ఆదివారం కొనసాగాయి. అంబికా సంస్థల వ్యవస్థాపకులు ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. అంబికా కృష్ణ అధ్యక్షతన జరిగిన సభ లో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ అంబికా కుటుంబ సేవలు అభినందనీయమన్నారు. ప్రముఖ సాహితీవేత్త, భాషావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ గౌరవ ఫెల్లో ప్రొఫెసర్ డాక్టర్ వేల్చేరు నారాయణరావుకు 11వ తానా–గిడుగు రామమూర్తి తెలుగు భాషా పురస్కారాన్ని తానా నాయకులు గొర్రిపాటి చందు, వీఎల్ఎంఆర్ వెంకటరావు అందించి సత్కరించారు. నాటిక పోటీల్లో భాగంగా గోవాడ క్రియేషన్ (హైదరాబాద్) వారి అమ్మ చెక్కిన బొమ్మ, కృష్ణా ఆర్ట్స్–కల్చరల్ అసోసియేషన్ (గుడివాడ) వారి ద్వారబంధాల చంద్రయ్య నాయుడు నాటికలు అలరించాయి. ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, మాజీ మంత్రి మరడాని రంగారావు, సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, హిందూ యువజన సంఘం మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు యర్రా సోమలింగేశ్వరరావు, సెక్రటరీ కేవీ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు ఇరదల ముద్దుకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాటికలో ఓ సన్నివేశం -
చటాకాయిలో ఉద్రిక్తత
కై కలూరు: చేపల చెరువుల వాటా డబ్బుల పంపిణీ వివాదం చటాకాయి గ్రామంలో ముదిరిపాకాన ప డింది. గ్రామంలో ఉమ్మడిగా సాగు చేస్తున్న 9 చెరువుల్లో వచ్చే ఆదాయం సమానంగా పంచడం లేదంటూ గ్రామస్తుల్లో కొందరు శనివారం ఏలూరు అటవీ శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆదివారం గ్రామంలో రెండు వర్గాల మధ్య వివాదానికి దారి తీసింది. గ్రామానికి ఆదాయాన్ని అందించే చెరువులను ఫారెస్టు అధికారులకు ఫిర్యాదు చేసి పొక్లెయిన్లతో కొట్టేయడానికి ఓ వర్గం ప్రయత్నిస్తున్నారని మైక్‌లలో ప్రచారం చేయడంతో వివాదం మొదలైంది. సర్పంచ్ ఘంటసాల శేషారావును గ్రామ కమ్యూనిటీ హాలు వద్ద వాటాల విషయంపై చర్చించుకోవడానికి పిలిచి ఓ వర్గం దాడి చేశారనే వార్త తెలియడంతో ఆయన కుమారుడు మరికొందరు అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో గ్రామంలో జయమంగళ లెవెన్రాజు, ఘంటసాల లక్ష్మయ్య, ఆయన కుమారుడు నాగరాజు, మోరు నాగేశ్వరరావులపై దాడి చేశారు. జయమంగళ సీతాలక్ష్మిపై దాడి చేయడంతో ఆమె మనస్తాపంతో ఇంట్లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. జరిగిన ఘటనలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై సైతం ఓ వర్గం వాదనకు దిగింది. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ, దాడికి గురైన వ్యక్తులను కై కలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకుని రూరల్ ఎస్సై రాంబాబు సిబ్బందితో చటాకాయి గ్రామానికి వెళ్లి పరిస్థితిని అదుపుచేశారు. ఇరువర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎస్సై చెప్పారు. చెరువుల డబ్బుల పంపిణీలో వివాదం సర్పంచ్ శేషారావుపై దాడి పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం -
కొనసాగుతున్న గిరిజనుల దీక్షలు
బుట్టాయగూడెం: షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ కోసం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం కొండరెడ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పట్ల రమేష్‌కుమార్ రెడ్డి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్, ఏటీఏ రాష్ట్ర గౌరవ సలహాదారు తెల్లం రాములు, జేఏసీ నాయ కులు కుంజా వెంకటేశ్వరరావు, సోదెం ముక్క య్య, రవ్వా బసవరాజు, తదితరులు నిరాహార దీక్షలో కుర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ డిమాండ్లు నెరవేరే వరకూ దీక్షలు కొనసాగుతాయని చెప్పారు. జేఏసీ నాయకులు పాల్గొన్నారు. నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 40 కేంద్రాల్లో పరీక్షలకు 7,707 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెన్త్, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయని, వీటి కోసం 11 కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు. డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. -
మూల్యాంకనం.. సర్వం సిద్ధం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఇంటర్మీడియెడ్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. గతంలో ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వేర్వేరుగా మూల్యాంకనం జరగ్గా ప్రస్తుతం పేపర్లు తక్కువగా ఉండటంతో ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఏలూరు కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూల్యాంకనానికి ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి తొలి విడత మూల్యాంకనం ప్రారంభం కానుండగా ఈనెల 21 నుంచి రెండో విడత ప్రారంభం అవుతుంది. ఈనెల 31న మూల్యాంకనం ముగియనుంది. 81,469 పేపర్లు ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు అన్ని సబ్జెక్టులు కలిపి జిల్లాకు 81,469 పేపర్లు వచ్చాయి. వీటిలో సంస్కృతం 5,249, తెలుగు 1,821, హిందీ 39, ఇంగ్లిష్ 12,830, గణితం–ఏ 13,424, గణితం–బీ 12,727 పేపర్లు ఉన్నాయి. అలాగే సివిక్స్ 3,152, బోటనీ 2,276, జువాలజీ 3,185, హిస్టరీ 335, ఫిజిక్స్ 9,797, ఎకనామిక్స్ 3,668, కెమిస్ట్రీ 10,683, కామర్స్ 2,283 పేపర్లు వచ్చాయి. మొత్తం 81,469 పేపర్లలో ప్రథమ సంవత్సరం జవాబుపత్రాలు 71,423, ద్వితీయ సంవత్సరం జవాబుపత్రాలు 10,046 ఉన్నాయి. ఈ మేరకు ఎగ్జామినర్లకు విధులు కేటాయించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి మొత్తం 1,348 మంది ఎగ్జామినర్లను విధులకు నియమించారు. ఎగ్జామినర్ల నియామకం సబ్జెక్టు ఎగ్జామినర్లు ఇంగ్లిష్ 124 గణితం 205 సివిక్స్ 57 తెలుగు 79 హిందీ 11 సంస్కృతం 66 ఫిజిక్స్ 203 ఎకనామిక్స్ 87 కెమిస్ట్రీ 211 హిస్టరీ 31 బోటనీ 88 జువాలజీకి 96 కామర్స్ 90 నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ వాల్యూయేషన్ జిల్లాకు వచ్చిన 81,469 జవాబుపత్రాలు 13,48 మంది ఎగ్జామినర్ల నియామకం -
సీహెచ్‌ఓల గోడు పట్టని సర్కారు
ఏలూరు (టూటౌన్) : గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ క్లినిక్‌ల ద్వారా ప్రజలకు వైద్యసేవలందించే సీహెచ్‌ఓలు (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్) గోడు కూ టమి ప్రభుత్వానికి పట్టడం లేదు. ఉద్యోగ, ఆర్థిక భద్రత కల్పించాలని కోరుతూ సీహెచ్‌ఓలు 22 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తమ గోడు అరణ్య రోదనగా మారిందని, ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించే వరకూ సమ్మె విరమించేది లేదని సీహెచ్‌ఓలు చెబుతున్నారు. 460 విలేజ్ క్లినిక్‌లు మూత ఎంఎల్‌హెచ్‌సీ/సీహెచ్ఓలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలను నిలిపివేయడంతో పాటు వారిపై అదనపు పనిభారం మోపుతుండటంతో గత నెల 15 నుంచి వీరు ఉద్యమ బాట పట్టా రు. గత నెల 27 వరకు పలు రకాలుగా నిరసనలు తెలిపినా పాలకుల్లో చలనం లేకపోవడంతో 28 నుంచి నిరవధిక సమ్మె బాట పట్టారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 460 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు మూతపడ్డాయి. జగన్ హయాంలో హెల్త్ క్లినిక్‌లు గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామాల్లోని సబ్ సెంటర్ల స్థానంలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో సీహెచ్‌ఓతో పాటు ఒక ఏఎన్ఎం, ఆశ కార్యకర్త కొన్ని చోట్ల మేల్ హెల్త్ అసిస్టెంట్లు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించేవారు. 14 రకాల వైద్య పరీక్షలు, 105 రకాల మందులు, 67 రకాల వైద్య పరికరాలను అప్పటి ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఇందులో ప్రత్యేక శిక్షణ పొదిన బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేసిన వారు మిడ్ లెవిల్ హెల్త్ ప్రొవైడర్లు/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం విలేజ్ క్లినిక్‌లపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందనే విమర్శలు ఉన్నాయి. సీహెచ్ఓలకు జీతభత్యాల చెల్లింపులో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఆరేళ్ల సర్వీసు పూర్తయిన సీహెచ్‌ఓల సర్వీసులను క్రమబద్ధీకరించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. జీఓ.64 ప్రకారం ఎన్హెచ్ఎంలో అన్ని కేడర్ల ఉద్యోగులకు 23 శాతం పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. అయితే 189 కేడర్లకు ఇచ్చి సీహెచ్ఓలకు మాత్రం ఇవ్వలేదు. అందరికీ పీఎఫ్ ఇస్తున్నా వీరికి మాత్రం ఇవ్వడం లేదు. ఏడాదిగా ఇన్సెంటివ్‌లు ఇవ్వడం లేదు. అలాగే సీహెచ్‌ఓలపై అదనపు పని భారాలను మోపుతున్నారు. వీరికి హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయడం లేదు. కనీసం చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. అలుపెరుగని పోరాటం సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం 22 రోజులుగా సమ్మెలోనే.. మూతబడిన విలేజ్ క్లినిక్‌లు గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు దూరం పట్టించుకోని కూటమి సర్కారు జిల్లాలో 460 హెల్త్ క్లినిక్‌లు ఉద్యోగ భద్రత కల్పించాలి ఆరేళ్లుగా సీహెచ్‌ఓలుగా పనిచేస్తున్న మాకు ఉద్యోగ, ఆర్థిక భద్రత కల్పించాలి. ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్‌లను తక్షణం విడుదల చేయాలి. రాజకీయ కోణంలో కాకుండా ప్రజలకు సేవ చేసే కోణంలోనే పాలకులు చూడాలి. అప్పుడే గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. – కురెళ్ల సురేంద్ర, సీహెచ్‌ఓల అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్, హెచ్డబ్ల్యూసీ, జి.కొత్తపల్లి చర్చలకు పిలిచేంత వరకూ.. రాష్ట్రవ్యాప్తంగా సీహెచ్‌ఓలు గత నెల 15 నుంచి పలు రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో గత్యంతరం లేక గత నెల 28 నుంచి సమ్మెలోకి వెళ్లాం. మా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచేంత వరకు మేమంతా సమ్మెను కొనసాగిస్తాం. – సొంగా సిద్ధయ్య, అసోసియేషన్ అధ్యక్షుడు, హెచ్డబ్ల్యూసీ, తెడ్లం22 రోజులుగా సమ్మె చేస్తున్నా.. తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు, నిరసనలు చేసినా పాలకులు పట్టించుకోవడం లేదు. గత నెలలో విజయవాడలో జరిగిన మహాధర్నాలో సీహెచ్ఓలంతా పాల్గొన్నాం. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో శాంతియుతంగా సమ్మె చేపట్టాం. 22 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం బాధాకరం. – ఎస్కే రేష్మా, కొయిదా, హెచ్డబ్ల్యూసీ, వేలేరుపాడు మండలం సీహెచ్‌ఓలను క్రమబద్ధీకరించాలి ఆరేళ్లు దాటిన సీహెచ్‌ఓలను తక్షణం క్రమబద్ధీకరించాల్సి ఉన్నా చేయడం లేదు. ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాల్సి ఉంది. ఏటా 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు తీర్చేలాహామీ ఇవ్వాలి. మా సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. – గెడ్డం లావణ్య, గోపన్నపాలెం, హెచ్డబ్యూసీ, దెందులూరు మండలంగ్రామాల్లో స్తంభించిన వైద్యసేవలు విలేజ్ క్లినిక్‌లు మూతపడటంతో గ్రామాల్లో వైద్యసేవలు స్తంభించాయి. చిన్నపాటి వైద్యానికీ దూరంగా ఉన్న పీహెచ్‌సీలకు వెళ్లాలి వస్తోంది. -
నేడు మండల పరిషత్ ఉప ఎన్నికలు
అత్తిలి: అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు సోమవారం ఉప ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. వాస్తవంగా మార్చి 27న ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కూటమి నాయకులు అడ్డుకోవడంతో ప్రక్రియ నిలిచింది. మరుసటి రోజున ఎన్నికలకు అధికారులు ఏర్పాటుచేసినా మరలా కూటమి శ్రేణులు భారీగా చేరుకుని ఎంపీటీసీ సభ్యులను మండల పరిషత్ కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మరలా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడంతో సోమవారం ఉదయం 11 గంటలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నేపథ్యంలో గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అత్తిలి చేరుకున్నాయి. యలమంచిలిలో ఎంపీపీ ఎన్నిక యలమంచిలి: యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగనున్న మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని డ్వామా పీడీ, ప్రిసైడింగ్ అధికారి కేసీహెచ్ అప్పారావు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తామని, ఒకే నామినేషన్ వస్తే ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ప్రకటిస్తామని చెప్పారు. ఒకటికి మించి నామినేషన్లు దాఖలైతే సభ్యులు చేతుల ఎత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణ సమయంలో మండల పరిషత్ కార్యాలయానికి 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, మండల పరిషత్ సభ్యు లు, ప్రోటోకాల్ ఉన్నవారిని మాత్రమే లోపలకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. అత్తిలి, యలమంచిలిలో ఎన్నికలు -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు భీమవరం: దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. భీమవరం గునుపూడిలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ స భ్యులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర నాటక ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతి థిగా హాజరైన మోషన్‌రాజు ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించా రు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మోషేన్‌రాజు మాట్లాడుతూ దేశానికి రాజ్యాంగం దిక్సూచిగా ఉందన్నారు. భిన్నత్వంలో ఏక త్వంగా ప్రజలందరినీ సమానంగా చూసేదే రాజ్యాంగం అన్నారు. ప్రతి ఇంట్లో పవిత్ర గ్రంథాలతోపాటు రాజ్యాంగం కూడా ఉండాలన్నా రు. అంబేడ్కర్‌ను రాజ్యాంగానికి మాత్రమే పరిమితం చేయకూడదని, ఆయన జీవితంలో చేసిన ఎన్నో సాంఘిక, రాజకీయ పోరాటాలు ఉ న్నాయని గుర్తుచేశారు. అంబేడ్కర్ నాటక ప్రదర్శన అద్భుతంగా ఉందని, అకాడమీ సభ్యులు ఈ నాటకాన్ని గ్రామాల్లో కూడా ప్రదర్శించాలని కోరారు. ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాట్లాడు తూ దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని రాజ్యాంగ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో ఈ కళారూప నాటక ప్రదర్శనలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నరసాపురం ఆర్డీఓ దాసి రాజు రూ.50 వేల ప్రోత్సాహకాన్ని మోషేన్‌రాజు చేతులమీదుగా కళాకారులకు అందించారు. -
ఇలాగైతే విద్యారంగంనిర్వీర్యమే
భీమవరం : రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో విద్యా రంగం నిర్వీర్యమయ్యే ప్రమాదముందని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలల పునర్నిర్మాణ ప్రక్రియ పేరుతో గందరగోళానికి తెర తీశారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం కారణంగా ప్రాథమిక విద్యపై తీవ్ర ప్రభావం పడుతుందని, మిగులు ఉపాధ్యాయులు పెరిగి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్ విధానాన్ని తొలగించి మోడల్ స్కూల్ విధానం అమలు చేసేందుకు సిద్ధమైంది. పాఠశాలల పునర్మిర్మాణం పేరుతో కొత్త విధానానికి తెర తీసింది. తొమ్మిది రకాల పాఠశాలలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలతో మిగులు ఉపాధ్యాయ పోస్టులు పెరిగి, ప్రాథమిక విద్యకు విఘాతం ఏర్పడుతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రాథమికోన్నత(యూపీ) పాఠశాలలను ఎత్తివేయాలని భావించింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో జిల్లా స్థాయి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో వెనకంజ వేసింది. యూపీ స్కూల్స్ యథావిధిగా కొనసాగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో ఇప్పటికే సుమారు 1,156 వరకు ఉపాధ్యాయలు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. జిల్లాలో దాదాపు 1,423 స్కూల్స్ ఉండగా వీటిలో దాదాపు 3,800 మంది ఉపాధ్యాయుల్ని బదిలీ చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుల నియామకాలు ఇలా.. ● ఫౌండేషన్ స్కూల్స్ (1–2వ తరగతి, 1–30 మంది విద్యార్థులకు 1 ఎస్జీటీ, 31–60 మంది విద్యార్థులకు ఇద్దరు ఎస్జీటీలు) ● ప్రైమరీ స్కూల్ (1 నుంచి 5వ తరగతి వరకు 20 మందికి ఒక ఎస్జీటీ, 60 మందికి ఇద్దరు ఎస్జీటీలు) ● మోడల్ ప్రైమరీ స్కూల్స్(1 నుంచి 5వ తరగతి వరకు 59 మంది విద్యార్థులకు ముగ్గురిని, 150 మంది విద్యార్థులకు 4 ఉపాధ్యాయులను నియమిస్తారు. ● అప్పర్ ప్రైమరీ స్కూల్స్‌లో 1–10 విద్యార్థుల వరకు స్కూల్ అసిస్టెంట్, 11 నుంచి 30 వరకు ఇద్దరు, 31 నుంచి 140 వరకు నలుగురు, 141 నుంచి 175 మంది విద్యార్థులకు ఐదుగురు స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తారు. పాఠశాలల పునర్నిర్మాణ ప్రక్రియపై ఉపాధ్యాయుల ఆగ్రహం ఉద్యమం తప్పదు రాష్ట్ర ప్రభుత్వం అనుచరిస్తున్న విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదముంది. ప్రతి గ్రామంలో ఫౌండేషన్ స్కూల్ స్థానంలో 1 నుంచి 5వ తరగతి వరకు స్కూల్ ఉండాలి. ప్రతి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యలో సంబంధం లేకుండా ఇద్దరు టీచర్స్ ఉండాలి. హైస్కూల్స్‌లో 45 మంది కంటే ఎక్కువ ఉంటే రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలి. మా డిమాండ్ల పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదు. – జి.ప్రకాశం, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, భీమవరం -
కొనసాగుతున్న కోకో రైతుల ధర్నా
దెందులూరు: కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని, కంపెనీల మోసాలు అరికట్టాలని, కోకో రైతులను ఆదుకోవాలంటూ రైతులు శనివారం దెందులూరు మండలం సోమవరప్పాడు మోండలీజ్ కంపెనీ వద్ద ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు వై. కేశవరావు, కౌలురైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు మాట్లాడుతూ గత రెండున్నర నెలలుగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నా.. కంపెనీలు స్పందించకపోగా కించపరుస్తూ మాట్లాడడం అభ్యంతకరమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదల చేయాలన్నారు. దేశీయంగా రైతుకు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కోకో రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి కే.శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. రైతుల ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. ఈ నెల 19, 20ల్లో జరిగే చర్చలను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, ఉపాధ్యక్షుడు పానుగంటి అచ్యుత రామయ్య, సహాయ కార్యదర్శి వీరారెడ్డి, మాజీ జెడ్పీటీసీ విద్యాసాగర్ మాట్లాడుతూ కోకో రైతులంతా సంఘటితంగా పోరాడాలన్నారు. ఎంతో కష్టపడి రైతు ఉత్పత్తి చేస్తున్న కోకో గింజలకు తగిన ధర ఇవ్వకుండా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ధర అమలు చేస్తూ రైతులను మోసం చేసి భయపెట్టి కోకో గింజలు కొనుగోలు చేయడం తగదన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్మాట్లాడుతూ కోకో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. రైతుల దీక్షలతో మోండలీజ్ వద్ద పోలీసుల్ని మోహరించారు. కంపెనీ మేనేజర్ రాజేష్ రామచంద్రన్, రైతుల సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. రెండు మూడ్రోజుల్లో ధర నిర్ణయంపై కంపెనీ యాజమాన్యం చర్చలకు వస్తుందని, ఆందోళన విరమించాలని కోరారు. అప్పటి వరకు కంపెనీ కార్యకలాపాలు నిలుపుదల చేయాలని రైతు సంఘాల నాయకులు కోరగా మేనేజర్ అంగీకరించారు. కంపెనీతో పాటు మిగిలిన కంపెనీలు కూడా తమ గోడౌన్లలో ఉన్న సరుకు బయటకు పంపకుండా కంపెనీల కార్యకలాపాలు నిలుపుదల చేయాలని అన్ని కంపెనీలకు సమాచారం ఇచ్చారు -
దిక్కుతోచని పుచ్చ రైతు
నూజివీడు: ఎంతో ఆశతో ఈ ఏడాది పుచ్చ కాయల సాగు చేపట్టిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిలా మార్కెట్లో పరిస్థితులు ఉండటం, వాతావరణం అనుకూలించకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. దిగుబడి వచ్చే సమయానికి ధర పతనమవ్వడంతో రైతులు నష్టాల పాలయ్యారు. నూజివీడు మండలంలోని తుక్కులూరు, ముసునూరు మండలంలోని కాట్రేనిపాడులలో దాదాపు 50 ఎకరాల్లో పుచ్చ సాగు చేపట్టగా సాగు చేసిన రైతులందరూ నష్టాల ఊబిలో కూరుకుపోయారు. అకాల వర్షాలతో కాయలు కొనేవారు లేక తోటలోనే కుళ్లిపోవడంతో రైతులు చేసేదేమీ లేక వదిలేస్తున్నారు. ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి ఎకరాకు రూ.25 వేల చొప్పున కౌలుకు తీసుకొని సాగు చేసిన పుచ్చ పంటకు ఎకరాకు రైతులు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. దిగుబడి బాగా వచ్చినా.. సాగు సమయానికి మార్కెట్లో టన్ను ధర రూ.11 వేల నుంచి రూ.12 వేల వరకు ఉండగా దిగుబడి సమయానికి రూ.6 వేలకు పడిపోయింది. దీంతో చేసేదేమీ లేక రైతులు అదే ధరకు విక్రయించేశారు. ఐదేళ్లుగా టన్ను రూ.18 వేల నుంచి రూ.20 వేలు పలికింది. దీంతో పుచ్చసాగు చేసిన రైతులు లాభాల బాటలో పయనించారు. ఈ ఏడాది మాత్రం అందుకు విరుద్ధంగా ధర పతనమైంది. కొంపముంచిన అకాల వర్షాలు పుచ్చ సాగు ప్రారంభంలో అనుకూలించిన వాతావరణం దిగుబడి రావడం ప్రారంభించాక ఒక్కసారిగా అకాల వర్షాలతో కొంప ముంచేశాయి. ఎకరాకు 15 నుంచి 18 టన్నుల దిగుబడి వచ్చినప్పటికీ అకాల వర్షాలు పడటంతో పుచ్చకాయలు కొనుగోలు చేసే వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో కోతకు సిద్ధంగా ఉన్న కాయలు కుళ్లిపోతుండటంతో రైతులు చేసేది లేక వదిలేశారు. కొందరు రైతులు కాయలను కోసి వారే నేరుగా ట్రాక్టర్లలో వేసుకొని గ్రామాల్లోకి, పట్టణాల్లోకి వెళ్లి అమ్మినా పెట్టుబడులు రాలేదు. కాలం కలిసి రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షాలతో తగ్గిన కొనుగోళ్లు ధర పతనమై నష్టాల ఊబిలో రైతులు రూ. 6 లక్షల నష్టం ఆరెకరాల్లో పుచ్చ సాగు చేశా. కౌలుతో సహా ఆరెకరాలకు రూ.7.50 లక్షలు పెట్టుబడి అయింది. రూ.6 వేల చొప్పున 25 టన్నులు విక్రయించా. అనంతరం అకాల వర్షాలు పడటంతో కాయ కుళ్లిపోయింది. దీంతో ఆరు లక్షల నష్టం వాటిల్లింది. గతేడాది టన్ను రూ.19 వేల నుంచి రూ.20 వేలు ఉంది. ఈ ఏడాది మాత్రం దారుణంగా పడిపోయింది. – తల్లిబోయిన రాజగోపాలస్వామి, మర్రికుంట, నూజివీడు మండలంపెట్టుబడి లక్ష.. వచ్చింది రూ.50 వేలే 15 ఎకరాల్లో పుచ్చ పంట సాగుచేశా. ఎకరాకు పెట్టుబడి రూ.1.10 లక్షలు పెట్టాం. దిగుబడి ప్రారంభమైన నాటి నుంచి టన్ను ధర రూ.6 వేలకు పడిపోయింది. దీంతో పుచ్ఛకాయలను విక్రయిస్తే ఎకరాకు రూ.50 వేలు మాత్రమే వచ్చాయి. దీంతో దాదాపు రూ.8 లక్షల నష్టం వాటిల్లింది. మార్కెట్లో ఈ ఏడాది పరిస్థితి దారుణంగా ఉంది. – పాలడుగు విజయ్‌కుమార్, తుక్కులూరు, నూజివీడు మండలం -
ఆటోను ఢీకొన్న లారీ
ఒకరి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు నూజివీడు: పుట్టినరోజు వేడుక జరుపుకుని తిరిగొస్తుండగా ఆటోను లారీ ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. నూజివీడు పట్టణానికి చెందిన దాయక శ్రీనివాసరావు పుట్టిన రోజు సందర్భంగా హనుమంతులగూడెంలో వేడుక జరుపుకున్నారు. సాయంత్రం ఆటోలో స్నేహితులందరూ నూజివీడు వస్తుండగా వెంకటాద్రిపురం దాటాక లారీ ఆటోను ఢీకొంది. ప్రమాదంలో హనుమంతులగూడెంకు చెందిన మంతెన అజయ్(27) అక్కడికక్కడే మృతిచెందాడు. నూజివీడుకు చెందిన షేక్ అబ్దుల్ ఇమ్మాన్, తాడిపర్తి సాయికిరణ్, పులపాక ప్రశాంత్, దాయక శ్రీనివాసరావు, చిట్టుమూరు పవన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు, సాయికిరణ్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. రూరల్ ఎస్సై జ్యోతిబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఏరియా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. క్షతగాత్రులందరికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ప్రమాదంలో మరణించిన అజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అజయ్ కుటుంబానికి వెంటనే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వ్యక్తి, తీవ్రంగా గాయపడ్డవారు.. పేద కుటుంబాలకు చెందిన వారేనని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వేధింపులపై వివాహిత పిర్యాదు ముదినేపల్లి రూరల్: వరకట్న వేధింపులపై వివాహిత స్థానిక పోలీసుస్టేషన్లో శనివారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని కాకరవాడకు చెందిన ఈడే నాగవిమలకు 12 ఏళ్ల క్రితం సమీప బంధువు బాలాజీతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వివాహ సమయంలో కొంతమేర భూమి, కట్నకానుకలు ఇచ్చారు. బాలాజీ కొంతకాలంగా ఉద్యోగం మానేసి ఇంటివద్ద ఉంటూ తరచూ గొడవలు పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్తతో పాటు అత్త అదనంగా డబ్బు తీసుకురావాలని వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
యథేచ్ఛగా గ్రావెల్ రవాణా
సాక్షి టాస్క్‌ఫోర్స్: యథేచ్చగా టిప్పర్లతో పోలవరం కాలువ నుంచి గ్రావెల్ రవాణా చేస్తున్నారు. దెందులూరు మండలం చల్ల చింతలపూడి గ్రామంలో బ్రిడ్జి పక్కన పోలవరం గట్టును తవ్వి టిప్పర్లతో గ్రావెల్ తరలిస్తున్న ప్రభుత్వ అధికారులు స్పందించకుండా మౌనంగా ఉన్నారు. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఈ తతంగం జరుగుతున్నా పట్టనట్లు వ్యవహరించడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదకరంగా ఇసుక తవ్వకాలు జంగారెడ్డిగూడెం: మండలంలోని ప్రధాన కాలువల్లో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి తవ్వకాలు చేస్తున్నారు. వంతెనలు, కల్వర్టులు, కట్టడాలు సమీపంలో ఇసుక తవ్వకూడదనే నిబంధన ఉన్నప్పటికీ అవి పట్టడం లేదు. జల్లేరు గ్రామంలోని జల్లేరు కాలువపై నిర్మించిన వంతెన సమీపంలో ఇసుక తవ్వేయడంతో వంతెనకు ప్రమాదం పొంచి ఉంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. డాబా పైనుంచి పడి వ్యక్తి మృతి ఆగిరిపల్లి: నిద్రలో డాబా పై నుంచి కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం అడవినెక్కలానికి చెందిన అద్దేపల్లి దుర్గారావు(45) కూలీ చేసుకుంటూ జీవిస్తున్నాడు. శుక్రవారం రాత్రి డాబాపై పడుకున్నాడు. నిద్రపోతూ ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుర్గారావు చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. దుర్గారావుకు కొడుకు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తండ్రిని చంపిన కొడుకు అరెస్టు దెందులూరు: తండ్రిని చంపిన కొడుకును దెందులూరు ఎస్సై శనివారం అరెస్ట్ చేశారు. ఉండ్రాజవరం గ్రామంలో అంబల్ల సింహాచలంపై పెద్ద కుమారుడు రోకలిబండతో శుక్రవారం దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సింహాచలం మరో కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై వివరించారు. రోడ్డు ప్రమాదంలో భర్త మృతి దెందులూరు : జాతీయ రహదారిపై సింగవరం వద్ద శనివారం ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో భర్త ముంగమూరి మహేష్ మృతి చెందగా.. భార్య సోమలమ్మ గాయపడింది. దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ కథనం ప్రకారం ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడుకు చెందిన భార్యాభర్తలు ఏలూరు వచ్చి పని చూసుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. వాహనం ముందు టైరు పేలడంతో అదుపుతప్పి పక్కన ఉన్న సూచిక బోర్డును ఢీకొట్టారు. -
కూటమి నాయకుల మధ్య మట్టి రగడ
కొయ్యలగూడెం: సాగునీటి చెరువుల నుంచి నిర్వహిస్తున్న మట్టి తోలకాలు కూటమి నాయకుల మధ్య రగడ సృష్టిస్తున్నాయి. శనివారం సరిపల్లి గ్రామంలో కూటమిలోని రెండు పార్టీల నాయకులు సమీపంలోని చెరువు నుంచి మట్టితోలకాలకు అనుకూలంగా ఒక వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం ఘర్షణకు దిగారు. మే 16న రాత్రి దిప్పకాయలపాడు దళితవాడలో రాత్రి వేళల్లో మట్టి రవాణా గురించి స్థానికులు అభ్యంతరం తెలిపి ఆందోళన చేపట్టారు. లారీలను ఆపి అడ్డుకున్నారు. చెరువుల నుంచి చేస్తున్న మట్టితోలకాలు నిబంధన ప్రకారం వ్యవసాయ భూముల అభివృద్ధికి వినియోగించాల్సి ఉన్నప్పటికీ కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లోని బేస్మెంట్లకు, ఇటుక బట్టీలకు, లేఅవుట్ల స్థలాలకు వినియోగిస్తున్నా కూడా అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. మట్టి రవాణా వాణిజ్య అవసరాలకు వాడుతున్నారని కూటమి నాయకులలోని ఒక వర్గం అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనిపై ఇరిగేషన్ అధికారులను వివరణ అడగ్గా వాణిజ్య అవసరాలకు మట్టి వెళ్తున్నట్లు ఏవిధమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. -
పారిజాతగిరిపై బ్రహ్మోత్సవ శోభ
19 నుంచి ఉత్సవాలకు ఏర్పాట్లు జంగారెడ్డిగూడెం : బ్రహ్మోత్సవాలకు పారిజాతగిరి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 19 నుంచి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న పారిజాత గిరి వెంకటేశ్వరస్వామి ఆలయం పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. క్షేత్ర పురాణం ప్రకారం.. చిట్టియ్య అనే భక్తుడికి వేంకటేశ్వరుడు కలలో కనిపించి జంగారెడ్డిగూడెం ఉత్తరాన కొండల్లో తన పాదాలు వెలుస్తాయని ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలని తెలిపారు. చిట్టియ్య అన్వేషించగా, ఉత్తర వైపున ఉన్న 7 కొండలలో 6వ కొండపై పారిజాతగిరి వక్షం కింద స్వామి వారి పాదాలుదున్న శిలను గుర్తించి చిన్న ఆలయాన్ని నిర్మించారు. నాటి నుంచి భక్తుల అభీష్టాలు తీర్చుతూ ఆలయం అభివృద్ధి చెందింది. పాడిపంటలు కలిగిన ప్రదేశం కాబట్టి గోకులం అనిని, పారిజాత గిరి వృక్షాలు ఉండడంతో పారిజాత గిరి అని, వేంకటేశుడు కొలువై ఉన్నందున తిరుపతి అంటాడు. అందుకు గోకుల తిరుమల పారిజాతగిరిగా ప్రసిద్ధిగాంచింది. పారిజాతగిరిలో.. కొండ వెనుక వరుసగా ఏడు కొండలు ఉండగా ఒక కొండపై పారిజాతగిరి వాసుడి పాదపద్మాలు అవతరించాయి. దీంతో అప్పటి నుంచి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. పారిజాతగిరి వాసుడికి ఎదురుగా గరుడకొండ ఉంది. గిరి ప్రదక్షిణ కోసం రోడ్డు నిర్మాణం దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే స్వామి నుంచి వెలువడే శక్తిని భక్తులు గ్రహించి పునీతులవుతారని నమ్మకం. దాత సహకారంతో గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. పారిజాతగిరి ఆరు కొండల చుట్టూ సుమారు 2.5 కిలోమీటర్ల మేర దాత గోకరాజు గంగరాజు అందజేసిన రూ.60 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. ఈ తరహా గిరి ప్రదక్షిణ అరుణాచలం, ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తిలో మాత్రమే ఉన్నాయి. ఆలయంలో ప్రతి శనివారం అన్నదానం, మే నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 19 నుంచి బ్రహ్మోత్సవాలు పారిజాతగిరిలో 19వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 19న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 20న శేష వాహన సేవ, 21న హనుమంత వాహన సేవ, 22న శ్రీనివాస కళ్యాణం, చంద్ర ప్రభ సేవ, 23న గరుడ వాహన సేవ, 24న వసంతోత్సవం, చక్రస్నానం, 25న శ్రీపుష్ఫయాగం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ బ్రహ్మోత్సవాల బ్రోచర్‌ను శనివారం ఆలయ అభివృద్ధి కమిటీ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ సోమవారం సాయంత్రం బ్రహ్మోత్సవాల ప్రారంభ పూజలు జరుగుతాయన్నారు. సాయంత్రం 6 గంటలకు విశ్వక్సేన పూజ, అంకురార్పణ, వైనతేయ ప్రతిష్ఠ జరుగుతాయన్నారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ పేరిచర్ల జగపతిరాజు, అబ్బిన దత్తాత్రేయ, రాజన పండు, గొట్టుముక్కల భాస్కరరాజు, అర్జుల మురళి, దండు ధనరాజు, రెడ్డి రంగప్రసాద్, వాసవీ సాయి నగేష్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. 22న స్వామి కల్యాణోత్సవం జరగనుంది. ఆలయ మాడవీధుల్లో అర్చకుల వేద మంత్రాల నడుమ స్వామికి వివిధ వాహన సేవలు నిర్వహించనున్నాం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలి. ఎం.రాంబాబు, ఈవో, పారిజాతగిరి -
అడ్మిషన్ల వేట.. ప్రైవేట్ టీచర్ల వ్యథ
ఏలూరులో ఓ ప్రైవేట్ స్కూల్లో 5వ తరగతి ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయుడు ఉద్యోగంలో చేరి రెండేళ్లు అయ్యింది. స్కూల్లో 1 నుంచి 5వ తరగతి వరకు 30 కొత్త అడ్మిషన్లు తేవాలని యాజమాన్యం టార్గెట్ పెట్టింది. నెల రోజుల వ్యవధిలో సదరు టీచర్ 16 అడ్మిషన్లు పూర్తి చేశారు. నూరు శాతం ప్రవేశాలు చేస్తేనే కొలువు ఉంటుందని అల్టిమేటం ఇవ్వగా తప్పనిసరి పరిస్థితుల్లో నగరంలో ఇంటింటా తిరుగుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: కార్పొరేట్ స్కూళ్లలో ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. మండు టెండల్లో అడ్మిషన్ల వేట సాగిస్తూ రోడ్ల బాట పట్టారు. ప్రతి టీచర్‌కు సమ్మర్ స్పెషల్ టార్గెట్‌ను నిర్దేశించడం, లక్ష్యాన్ని పూర్తి చేస్తేనే కొలువు కొనసాగిస్తామని యజమాన్యాలు అల్టిమేటం ఇవ్వడంతో డోర్ టూ డోర్ క్యాంపెయిన్లు చేస్తున్నారు. పిల్లలను స్కూళ్ల చేర్పించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలో సుమారు 10 వేల మంది.. జిల్లాలో 790 ప్రైవేట్ పాఠశాలలు, 82 ప్రైవేట్, కా ర్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. మొత్తంగా సుమారు 10 వేల మందికి పైగా టీచర్లు, లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరిలో 1 నుంచి 6వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు 3,200 మంది ఉన్నారు. ప్రధాన కార్పొరేట్ విద్యా సంస్థలతో పాటు స్థానిక స్కూళ్లు కూడా నర్సరీ, ప్రైమరీ టీచర్లకు ఎక్కువగా టార్గెట్లు ఇచ్చారు. తీవ్ర ఒత్తిళ్లు ప్రైవేట్ స్కూళ్లలో టీచర్‌కు సగటున రూ.8 వేల నుంచి రూ.17 వేల వరకు జీతాలు ఉంటాయి. 6 నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్టు టీచర్లకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఇస్తున్నారు. విద్యార్థుల రోజువారీ కార్యక్రమాలను చూసుకోవడంతో పాటు వేసవి సెలవుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీంతో పాటు అనివార్యంగా కొత్త అడ్మిషన్ల కోసం డోర్ టూ డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఈ సంస్కృతి మూడేళ్ల నుంచి జిల్లాలో ఎక్కువగా కనిపిస్తోంది. గతేడాది రెండు కార్పొరేట్ స్కూళ్లలో టార్గెట్ పూర్తి చేయని కారణంతో పదుల సంఖ్యలో టీచర్లను ఉద్యోగాల నుంచి తొలగించిన పరిస్థితి. మౌన ముద్రలో అధికారులు వేసవి సెలవుల్లో స్పెషల్ క్లాస్‌ల పేరుతో అదనపు దోపిడీ, టీచర్లను అడ్మిషన్ల పేరుతో వేధింపుల పర్వం, డోర్ టూ డోర్ క్యాంపెయినింగ్ విద్యాహ క్కు చట్టం ఉల్లంఘన కిందకే వస్తుంది. అన్నీ తెలిసినా, ఫిర్యాదులు అందినా జిల్లా విద్యాశాఖాధికారులు, ఇంటర్మీడియెడ్ అధికారులు చూసీచూడన ట్టు వ్యవహరిస్తున్నారు. వీరికి వార్షిక మామూళ్లు, మండల స్థాయిలో మూడు నెలలకోసారి మా మూళ్లు ముడుతున్నట్టు సమాచారం. కార్పొరేట్ ప్రవేశాలు సమ్మర్ స్పెషల్ టార్గెట్ల పేరుతో వేధింపులు ప్రతి టీచర్‌కు 30 మంది పిల్లలను చేర్చాలని లక్ష్యం మండుటెండల్లో డోర్ టూ డోర్ క్యాంపెయిన్ దయనీయంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థల దందా పట్టించుకోని విద్యాశాఖ అధికారులు -
ఈఏపీసెట్‌కు సర్వం సిద్ధం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ పూర్తిచేసి 2025–26 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీఈఏపీ సెట్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షలు ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లాలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా నుంచి 6,865 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు, 21 నుంచి 27 వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉద యం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకూ మరో సెషన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు జరుగుతాయి. 6,865 మంది విద్యార్థులు జిల్లా నుంచి 6,865 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో ఇంజనీరింగ్ కోర్సులకు 4,863 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు 1,991 మంది, ఈ రెండు కోర్సులకు 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలను కేటాయించారు. వీటిలో ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ పాఠశాల, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు ఈఏపీ సెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమ తించరు.సెల్ఫోన్లు, స్మార్ట్ వాచీలు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెల్లనూ అనుమతించరు. పరీక్షా కేంద్రానికి వచ్చే విద్యార్థులు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఫారం, అడ్మిట్ కార్డులు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. విద్యార్థులు ఒక గంట ముందుగానే వారికి కేటాయిం చిన కేంద్రాల్లో రిపోర్ట్ చేయడం ఉత్తమం. – పి.బాలకృష్ణ ప్రసాద్, ఈఏపీసెట్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలలు, సీట్లు కళాశాల సీట్లు ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ 1,200 ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ 900 ఏలూరు ఇంజనీరింగ్ కళాశాల 600 హేలాపురి కళాశాల, ఏలూరు 360 ఎన్ఆర్ఐ కళాశాల, ఆగిరిపల్లి 1,360 సారథి ఇంజనీరింగ్ కళాశాల, నూజివీడు 420 19 నుంచి అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో.. 21 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు జిల్లాలో మూడు కేంద్రాల ఏర్పాటు 6,865 మంది విద్యార్థుల హాజరు -
ఆలయాల్లో హైకోర్టు న్యాయమూర్తి పూజలు
జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరిలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ సత్తి సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన ఆయనకు ఈఓ మానికల రాంబాబు, ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, కుమారాచార్యులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. జస్టీస్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆయనకు అర్చకులు వేదాశీర్వాదం అందజేసి స్వామి వారి చిత్రపటం, శేషవస్త్రాలు అందించారు. జంగారెడ్డిగూడెం సివిల్ జడ్జి సీహెచ్ కిషోర్‌కుమార్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ రాజేశ్వరి తేజస్వి, భీమడోలు మెజిస్ట్రేట్ ఎస్.ప్రియదర్శిని ఉన్నారు. మద్దిలో.. గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈఓ ఆర్వీ చందన మర్యాదపూర్వక స్వాగతం పలికి ప్రత్యేక పూజకు ఏర్పాట్లు చేశారు. న్యాయమూర్తి దంపతులకు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. నారసింహుని సేవలో.. ద్వారకాతిరుమల: ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన లక్ష్మీనరసింహస్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ సత్తి సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. -
అధికారుల నుంచి స్పందన లేదు
నిబంధనల ప్రకారం ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో టీచర్లకు ఏడాదికి 12 నెలల జీతం ఇవ్వాల్సి ఉండగా చాలా విద్యాసంస్థలు 10 నెలలు మాత్రమే వేతనాలు ఇస్తున్నాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందన లేదు. చాలా స్కూళ్లలో విద్యార్థుల నుంచి వేలల్లో ఫీజులు వసూళ్లు చేస్తున్నా దానికి తగినట్టుగా టీచర్లకు వేతనాలు చెల్లించడం లేదు. విద్యాహక్కు చట్టప్రకారం ఏ విద్యాసంస్థా క్యాంపెయినింగ్ రూపంలో, ప్రకటనల రూపంలో, ప్రచారాల రూపంలో పబ్లిసిటీ చేయకూడదు. అయితే వీటిని విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదు. విచ్చలవిడిగా పబ్లిసిటీ చేస్తూ నిబంధనలు ఉల్లంఘిన్నా అధికారులకు పట్టడం లేదు. – దిద్దే అంబేడ్కర్, ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు జిల్లాలోని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు టీచర్లు, లెక్చరర్లను వేసవి సెలవుల్లో వీధులు వెంట తిప్పుతూ అడ్మిషన్ల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. అడ్మిషన్లు చేయని ఉపాధ్యాయులను ఉద్యోగాల నుంచి తొలగించడం, లేదా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు టీచర్లే తమ సొంత డబ్బులను ఫీజుగా చెల్లించి అడ్మిషన్లు చేయించాల్సిన దుస్థితి. ఇన్ని దారుణాలు జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అడ్మిషన్లతో సంబంధం లేకుండా సిబ్బందికి ఏడాదికి 12 నెలల జీతం యాజమాన్యాలు చెల్లించాల్సిందిగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. – టి.ప్రేమ్‌కుమార్, పీటీఎల్యూ ఏలూరు జిల్లా అధ్యక్షుడు ● -
శ్రీవారి సన్నిధిలో కలెక్టర్
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి వనివారం సందర్శించారు. ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. అర్చకులు, పండితుల నుంచి వేద ఆశీర్వచనం పొందారు. ఈఓ ఎన్వీ సత్యనారాయ ణమూర్తి ఆమెకు శ్రీవారి జ్ఞాపిక అందజేశారు. అనంతరం కలెక్టర్ ఆలయ తూర్పు ప్రాంతంలో గజలక్ష్మి నుంచి ఆశీర్వచనం పొందారు. సప్తగోకులాన్ని సందర్శించారు.కానిస్టేబుళ్ల బదిలీలు ఏలూరు టౌన్: జిల్లాలో పారదర్శకంగా పోలీస్ బదిలీలు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. చెప్పారు. ఏలూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివా రం కానిస్టేబుళ్ల బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. ఐదేళ్ల పాటు ఒకే చోట సర్వీస్ చేసుకున్న సిబ్బంది 286 మందికి బదిలీ ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. అనంతరం కౌన్సెలింగ్‌కు హాజరైన సిబ్బందికి జిల్లా ఎస్పీ స్వయంగా భోజనాన్ని వడ్డించారు. జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, ఎస్బీ ఎస్సై గంగాధర్‌రావు, డీసీఆర్బీ ఎస్సై రాజారెడ్డి, కార్యాలయ ఏ1 వైఎస్వీ ప్ర సాద్, హెచ్‌సీ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల్లో 4,009 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ జనరల్ పరీక్షలకు 3,413 మందికి 3,184 మంది, ఒకేషనల్ పరీక్షలకు 443 మందికి 151 మంది హాజరయ్యారు. సెకండియర్ జనరల్ పరీక్షలకు 656 మందికి 590 మంది, ఒకేషనల్ పరీక్షలకు 103 మందికి 84 మంది హాజరయ్యారు. సబ్జెక్టు పరీక్షలు పూర్తయ్యాయని, బ్రిడ్జి కోర్సు పరీక్షలు జరగాల్సి ఉందని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ అన్నారు. రేపటి నుంచి ఇంటర్ మూల్యాంకనం ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 19 నుంచి ప్రారంభించనున్నట్టు ఏలూరు జిల్లా ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీ య పర్యవేక్షణాధికారి కె.యోహాన్ ప్రకటనలో తెలిపారు. స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూని యర్ కళాశాల ప్రాంగణంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి మూల్యాంకన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. సంస్కృతం, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, గణితం, సివిక్స్ సబ్జెక్టుల జవాబుపత్రాలను మూల్యాంకనం చేస్తారన్నారు. ఆయా సబ్జెక్టులకు నియమించింన చీఫ్ ఎగ్జామినర్లు, ఎగ్జామినర్లు సోమవారం ఉదయం 10 గంటలకు, స్కూృటినైజర్లు ఈ నెల 20న ఉదయం 10 గంటలకు శిబిరం వద్ద రిపోర్ట్ చేయాలని సూచించారు. 19న డీఆర్సీ సమావేశం ఏలూరు(మెట్రో): జిల్లా అభివృద్ధి సమీక్ష కమి టీ సమావేశాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి, పౌరసర ఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పా ల్గొంటారన్నారు. సచివాలయ కార్యదర్శి సస్పెన్షన్ చింతలపూడి: విధుల్లో నిర్లక్ష్యం వహించిన చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని పాత చింతలపూడి సచివాలయ కార్యదర్శి కె.గంగా భవానీని అధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు జీఎస్‌డబ్ల్యూఎస్ రాష్ట్ర డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌస్ హోల్డ్స్ జియో ట్యాగింగ్ విషయంలో అల సత్వం వహించడంతో పాటు, జీఎస్‌డబ్ల్యూఎస్ డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌కు గైర్హాజరవడం తదితర అంశాలపై సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇద్దరు గ్రామ కార్యదర్శులపై.. సాక్షి టాస్క్‌ఫోర్స్: హౌస్‌హోల్డ్ సర్వేపై నిర్లక్ష్యం వహించిన కారణంగా జిల్లాలో ఇద్దరు గ్రామ కార్యదర్శులను సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్‌కు గ్రామ, వార్డు సచివాలయ శాఖ రాష్ట్ర డైరెక్టర్ సిఫార్సు చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో జిల్లాలోని భీమడోలు గ్రామ కార్యదర్శి కేవీ లక్ష్మీ తనూజ, టి.నరసాపురం గ్రామ కార్యదర్శి ఉన్నట్టు సమాచారం. దీనిపై భీమడోలు ఎంపీడీఓ సీహెచ్ పద్మావతిదేవిని వివరణ కోరగా తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదన్నారు. -
ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి
బుట్టాయగూడెం: జీఓ 3కు బదులుగా ప్రత్యేక చట్టం తెస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. బుట్టాయగూడెంలో షెడ్యూల్ ప్రాంత ఉద్యోగుల నియామక చట్టం కోసం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం మూడో రోజుకు చేరాయి. మాజీ ఎమ్మెల్యే బాలరాజు దీక్షకు మద్దతు తెలియజేసి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగాలపై సుప్రీంకోర్టు జీఓ 3ను కొట్టివేసినా సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఏఎన్ఎంల నుంచి అన్ని పోస్టులను నూరు శాతం గిరిజనులతోనే భర్తీ చేశామని గుర్తుచేశారు. జీఓ 3కి అనుగుణంగా ప్రత్యేక చట్టం చేసేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా తీర్మానం చేసి గవర్నర్‌కు కూడా పంపించామన్నారు. అయితే అది చట్టరూపం దాల్చే సమయానికి ఎన్నికలు వచ్చాయన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో జీఓ 3కు బదులు ప్రత్యేక చట్టం తెస్తామని హామీ ఇచ్చారని, గద్దెనెక్కి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ హామీ నెరవేర్చలేదన్నా రు. డీఎస్సీ నోటిఫికేషన్లో గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక చట్టం చేయాలని లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సాయంత్రం దీక్షా శిబిరం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. జేఏసీ నాయకులు మొడియం శ్రీనివాసరావు, జలగం రాంబాబు, తెల్లం లక్ష్మణరావు, తెల్లం గంగరాజు, కారం రాఘవ, ఎస్.రామ్మోహన్రావు, మండలంలోని సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
ఏలూరులో దంచికొట్టిన వాన
ఏలూరు (టూటౌన్): ఏలూరులో శనివారం సాయంత్రం వర్షం దంచి కొట్టింది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. ప్రధానంగా ప్రభుత్వాస్పత్రి మెయిన్ రోడ్డు, ఎన్ఆర్పేట రైల్వే ట్రాక్ రోడ్డు, పవర్‌పేట ట్రాక్ రోడ్డు, జిల్లా పరిషత్ రోడ్లలో వర్షం నీరు భారీగా చేరడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. పవర్‌పేటలోని స్నేహా వారధిలోకి వర్షం నీరు చేరడంతో ఇటుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఫుట్‌పాత్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంతో ఎన్ఆర్పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి స్నేహా వారధి వరకు సుమారు అర కిలోమీటరు వరకు మామిడి వ్యాపారులు పండ్లు తడవకుండా, కొట్టుకుపోకుండా కాపాడుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వాస్పత్రి ఆవరణ, జిల్లాపరిషత్ కార్యాలయ ఆవరణ, ఇండోర్ స్టేడియం లోపల వర్షం నీరు చేరింది. పలు ప్రాంతాల్లో మురుగునీరు పొంగి పొర్లి రోడ్లపైకి చేరింది. -
వేసవిలో వాహనాలు జాగ్రత్త
బైక్‌లు, కార్ల నిర్వహణలో మెకానిక్‌ల సూచనలు పాలకొల్లు సెంట్రల్ : వేసవిలో వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధిక ఉష్ణోగ్రతల వల్ల వాహనాల రంగు మారిపోవడం, టైర్లలో గాలి తగ్గిపోవడం, పెట్రోలు ఆవిరయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల బైక్ మెకానిక్‌లు వేసవిలో బైక్‌ల రక్షణకు పలు సూచనలు చేస్తున్నారు. నీడలో పార్కింగ్ మేలు ● వాహనాలను ఎక్కువ సమయం పార్కింగ్ చేయాల్సి వస్తే నీడ ఉన్న చోట చేయడం మేలు. ఎండ వేడికి వాహనాలు రంగు మారిపోయే అవకాశాలు ఎక్కువ. ● అధిక వేడి వల్ల టైర్లలో గాలి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తప్పని సరిగా వారానికోసారి టైర్లలో గాలిని తనిఖీ చేయించుకోవాలి. టైర్లలో గాలి తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ● గాలి తక్కువగా ఉండడం వల్ల టైర్లు దెబ్బతింటాయి. ఎక్కువ గాలి ఉన్నా.. ఎండ వేడికి రన్నింగ్‌లో టైరు పేలిపోయే ప్రమాదాలు ఉంటాయి. ● ఎక్కువ సమయం వాహనం ఎండలో ఉండడం వల్ల పెట్రోల్ ఆవిరయ్యే పరిస్థితి ఉంటుంది. వాహనాల్లో పగలంతా తిరిగి ఇంటికి చేరుకుంటాం. ఆ సమయాల్లో పెట్రోల్ ట్యాంక్ మూతను ఓ పది నిమిషాలు తీసి ఉంచితే మేలు. ట్యాంకులో కొంతవరకూ గ్యాస్ స్టోరయ్యే పరిస్థితి ఉంటుంది. మూత తీసి ఉంచితే గ్యాస్ బయటకు పోతుంది. వేసవిలో ఆయిల్‌ను సాయంత్రం కొట్టించడం మేలు. ● దూర ప్రయాణం చేసేటప్పుడు.. వాహనాలు ఎక్కువ వేడెక్కుతాయి. కొంతదూరం ప్రయాణం చేశాక ఇంజన్ ఆపి కొద్దిసేపు సేద తీరడం మంచిది. వేసవిలో ఫుల్ ట్యాంక్ వద్దు బైక్‌లు కొందరు ఫుల్ ట్యాంక్ చేయించుకునే అలవాటు ఉంటుంది. వేసవిలో ఫుల్ ట్యాంక్ చేయించకుండా ఉంటే మేలు. వాహనాన్ని పార్కింగ్ చేసే సమయంలో తప్పనిసరిగా నీడ ప్రాంతాన్ని చూసుకోవాలి. వేడికి పెట్రోల్ ఆవిరవ్వడమే కాకుండా రంగు మారే అవకాశాలు, గాలి తగ్గడం వంటివి జరుగుతాయి. వర్ధినీడి ఉమా, బైక్ మెకానిక్, పాలకొల్లు ఆగి ప్రయాణం చేయడం ఉత్తమం రేడియేటర్లలో నీళ్లు లేకపోవడం వల్ల ఇంజిన్ వేడెక్కి వైరింగ్ షార్టయ్యే ప్రమాదం ఉంటుంది. వేసవిలో సుమారు 200 కి.మీ దూరం ప్రయాణం చేసిన అనంతరం ఎక్కడైనా వాహనాన్ని పార్కింగ్ చేసుకుని ఇంజిన్ కూల్ అయ్యాక మళ్లీ ప్రయాణం చేయడం ఉత్తమం. వాహనం హీట్ ఉన్నప్పుడు టైర్లు వెడెక్కుతాయి. వాటిపై నీళ్లు వేస్తే టైర్‌పై ఎయిర్ బబుల్స్ వచ్చి టైర్లు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. – పడమటి సూరిబాబు, లారీ యజమాని, పాలకొల్లు కార్లు, భారీ వాహనాల విషయంలో జాగ్రత్తలు కార్లు, లారీలు, ఇతర భారీ వాహనాల విషయంలో రేడియేటర్లలో నీటి శాతం తరచూ చూసుకోవాలి. రేడియేటర్లలో నీళ్ల కంటే కూలెంట్ ఆయిల్ వాడడం మంచిది. వాహనాల్లో ఇంజన్ ఆయిల్ శాతం తరచూ చూసుకోవాలి. వేసవిలో సాధ్యమైనంత వరకూ సీఎన్జీ వాహనాల్లో ప్రయాణం తగ్గించుకుంటే మంచిది. ఏసీ నిలబడాలంటే కారు అద్దాలకు క్లాత్ మ్యాట్స్ ఏర్పాటు చేసుకోవాలి. భారీ వాహనాలకు కొత్త టైర్లు వాడితే ఉత్తమం. దూర ప్రాంతాలకు ప్రయాణం సమయంలో పాత టైర్లు వేడెక్కి గాలి తగ్గిపోతుంది. పేలిపోవడం వంటి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. -
డ్వారకా మహిళలకు తెలియకుండా రుణాలు
బుట్టాయగూడెం: తమకు తెలియకుండా తమ ఖాతాల్లో డ్వాక్రా రుణాల సొమ్ములు జమచేశారని, ఐదు నెలల తర్వాత తెలిసి ప్రశ్నిస్తే ఆ సొమ్ములకు వడ్డీ కట్టాలని బ్యాంకు అధికారులు అంటున్నారని మండలంలోని గాడిదబోరుకు చెందిన గిరిజన మహిళలు లబోదిబోమంటున్నారు. తమ ఖాతాల్లో సుమారు రూ.75 లక్షల వరకు సొమ్ములు జమయ్యా యని చెబుతున్నారు. డ్వాకా సంఘాల మహిళ టి. గంగాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. గాడిదబోరుకు చెందిన ధనలక్ష్మి, మహాలక్ష్మి, ప్రియదర్శిని, ముత్యాలమ్మ, స్నేహలత, ప్రభ అనే ఆరు గ్రూపులకు రెడ్డిగణపవరంలోని ఓ బ్యాంకు 2021లో రూ.19 లక్షల చొప్పున డ్వాక్రా రుణాలు మంజూరు చేసింది. అప్పటినుంచి గ్రూపు సభ్యులు నెలవారీ వాయిదాలు చెల్లిస్తున్నారు. ఇంకా రూ.5 లక్షల వరకు బకాయిలు ఉండగా తాజాగా డ్వాక్రా మహిళలు బ్యాంకుకు వెళ్లి రుణాల లావాదేవీల స్టేట్మెంట్ తీయించారు. అయితే ఒక్కో ఖాతాలో రూ.19 లక్షల వరకు బకాయి ఉన్నట్టు తెలిసి మహిళలు కంగుతిన్నారు. దీనిపై బ్యాంకు అధికారులను ఆరా తీయగా ఐదు నెలల క్రితం ఒక్కో ఖాతాలో రూ.12.20 లక్షల రుణం జమైందని, వడ్డీతో కలిపి రూ.19 లక్షల వరకు అయ్యిందని చెప్పారు. కొత్త రుణం కోసం తామేమీ దరఖాస్తు చేయలేదని, దీనిపై తమకు బ్యాంకు నుంచి లేదా వెలుగు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదని మహిళలు అంటున్నారు. ఒక్కో సంఘం రూ.78 వేలు వడ్డీ కింద కట్టాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారని మహిళలు ఆవేదన చెందుతున్నారు. డ్వాక్రా మహిళలు శుక్ర వారం ఎంపీడీఓ కె.జ్యోతిని కలిసి సమస్యను తెలి యజేశారు. బ్యాంక్ మేనేజర్‌తో ఎంపీడీఓ జ్యోతి ఫోన్లో మాట్లాడగా తాను సెలవులో ఉన్నానని సోమవారం అన్ని విషయాలు చెప్తానని మేనేజర్ సమాధానమిచ్చారు. వడ్డీ రూపంలో బ్యాంక్ అధికారులు తమ కష్టాన్ని దోచుకుంటున్నారని విషయాన్ని సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతా మని మహిళా సంఘాల సభ్యులు అన్నారు. ఖాతాల్లోకి రూ.75 లక్షల జమ! 5 నెలల తర్వాత తెలిసి కంగుతిన్న మహిళా సంఘాల సభ్యులు వడ్డీ కట్టాలంటున్న అధికారులు -
సమస్యలపై ప్రజాపోరు
వేసవిలో వాహనాలు జాగ్రత్త వేసవిలో వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధిక ఉష్ణోగ్రతలతో వాహనాలు దెబ్బతింటాయని మెకానిక్‌లు చెబుతున్నారు. IIలో uఅంతర్రాష్ట్ర దొంగ అరెస్టు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను ఏలూరు పోలీసులు అరెస్టు చేసి బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. IIలో uశనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025సాక్షి ప్రతినిధి, కాకినాడ: సమస్యలపై ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని మేలుకొల్పేలా పోరుబాటకు వైఎస్సార్ సీపీ సిద్ధమవుతోంది. ఇందుకు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా రానున్న రెండు నెలల్లో మండల, గ్రామ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే జూన్‌లోపు ఇంకా మిగిలిన మండలాలు, జూలైకల్లా గ్రామస్థాయి కమిటీల నియామకాలు పూర్తి చేయా లని సూచించారు. కాకినాడ డి–కన్వెన్షన్‌లో శుక్రవారం జరిగిన పార్టీ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవ్వాలనేది ప్రధాన అజెండాగా నిర్ణయించారు. ఇందుకోసం ప్రజల సమస్యలపై పార్టీ స్థానిక నాయకత్వాలు శాంతియుత పంథాలో నిరసన కార్యక్రమాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జి ల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి నాయకత్వాన ని ర్వహించిన ఆందోళనలపై సమీక్షలో చర్చించారు. ఇదే తరహాలో సమస్యలపై పోరుబాటకు సన్నద్ధం కావాలని నేతలకు బొత్స సూచించారు. జిల్లాస్థాయిలో సైతం పార్టీ కార్యకలాపాలను మరింత వి స్తృతంగా నిర్వహించాలని తీర్మానించారు. దీని కో సం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 50 రోజుల కార్యక్రమాన్ని ఖరారు చేశారు. వచ్చే జూన్ 1 నుంచి ప్రతి 10 రోజులకు ఒక జిల్లాలో పార్టీ జిల్లాస్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాలను ఐదు జిల్లాల్లో 50 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. సమావేశంలో పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు వంకా రవీంద్ర, కవురు శ్రీనివాస్, మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, పార్లమెంటరీ కో–ఆర్డినేటర్లు కారుమూరి సునీల్‌కుమార్, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్ గుడాల గోపి తదితరులు పాల్గొన్నారు. న్యూస్‌రీల్ ప్రజలతో నేతలు మమేకమవ్వాలి ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అండ ఆక్వా రైతులకు వెన్నుదన్ను క్షేత్రస్థాయి పర్యటనలకు అధినేత జగన్ ప్రతి 10 రోజులకూ జిల్లా సమావేశం త్వరలో మండల, గ్రామ కమిటీల నియామకం పార్టీ నేతలకు రీజినల్ కో–ఆర్డినేటర్ బొత్స దిశానిర్దేశం కాకినాడలో ఉభయ గోదావరి జిల్లాల వైఎస్సార్సీపీ సమావేశం -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
ఏలూరు టౌన్ : దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేసి అతని నుంచి బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. త్రీటౌన్ స్టేషన్లో సీఐ కోటేశ్వరరావు వివరాల ప్రకారం.. త్రీటౌన్ పరిధిలోని సౌభాగ్యలక్ష్మి అమ్మవారి గుడి, వన్‌టౌన్ పరిధిలోని రెండు దేవాలయాల్లో దొంగతనాలపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సీసీఎస్ సీఐ సీహెచ్ రాజశేఖర్, త్రీటౌన్ ఎస్ఐ పీ.రాంబాబుతో పాటు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు జరిగిన తీరును పరిశీలిస్తూ... సీసీటీవీ పుటేజ్ ఆధారంగా శుక్రవారం ఏలూరు మినీబైపాస్ రోడ్డులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చోరీలకు పాల్పడుతున్న కొత్తపేట ఈమని రాంబాబును అరెస్ట్ చేసి అతని నుంచి 30 గ్రాముల బంగారు అభరణాలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేయాలనుకునే గుడిని ఎంచుకుని, భక్తుడిలా గుడిలోకి వెళ్తాడు. పూజారితో మాటలు కలిపి భక్తుడిలా కలరింగ్ ఇస్తాడు. పూజారి పరధ్యానంగా ఉన్న సమయంలో దేవుడికి, అమ్మవారికి అలంకరించిన బంగారు వస్తువులు చోరీ చేస్తూ పరారవుతాడని త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. రాంబాబుపై కృష్ణా, గుంటూరు జిల్లాలోను కేసులున్నాయని తెలిపారు. రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా 50కిపైగా చోరీ కేసులు నమోదయినట్లు చెప్పారు. -
ఆవకాయ పెట్టలేం.. కొంటాం!
ప్రస్తుతం మార్కెట్లో పచ్చడికి అవసరమైన సరకులు దొరుకుతున్నాయి. వీటి ధరలు పరిశీలిస్తే.. లావు మిరపకాయల కారం కిలో రూ.560 వేరుశనగ నూనె కిలో రూ.155 పప్పు నూనె కిలో రూ.450 ఆవాలు కిలో రూ.120 మెంతులు కిలో రూ.120, వెల్లుల్లి కిలో రూ.140 క్వాలిటీని బట్టి ధరలు మారుతున్నాయి. మామిడి కాయల ధరల విషయానికొస్తే.. ఆవకాయకు వాడే చిన్న రసాలు వంద రూ.1000 దేశవాళీ కాయలు రూ.1000 సువర్ణరేఖ రూ.1500 ఐజర్లు రూ.1500 కొత్తపల్లి కొబ్బరి రూ.1800 మాగాయి పచ్చడికి వాడే పెద్ద రసాలు వంద కాయలు రూ.1200 వరకూ విక్రయిస్తున్నారు. పాలకొల్లు సెంట్రల్: వేసవి వస్తే ఇళ్లలో ఆవకాయ సందడి మొదలవుతుంది. ఆవకాయ పచ్చడి ఉంటే చాలు ఆ రోజుకు కూర అవసరం లేదనేది ఆంధ్రుల నమ్మకం. ముద్దపప్పుతో ఆవకాయ కలుపుకుని తింటే ఆ రుచే వేరు. సంవత్సరం మొత్తానికి సరిపడేలా మామిడితో రకరకాల పచ్చళ్లు తయారు చేసి జాగ్రత్త చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఇళ్లలో ఆవకాయ పెట్టుకునే వారి సంఖ్య తగ్గింది. మార్కెట్లో రెడీమేడ్‌గా దొరుకుతుండడంతో వాటితోనే సరిపెట్టుకుంటున్నారు. వేసవి సీజన్ వస్తుందంటే మహిళలు పచ్చడి తయారీలో బిజీగా గడిపేవారు. అయితే ఇప్పటి బిజీ లైఫ్‌లో ఆవకాయ పెట్టలేం.. కొంటాం అంటున్నారు మహిళలు.. ఇప్పుడు అన్ని మార్కెట్లోనే కొనేస్తున్నారు. మామిడి కాయల ముక్కలు కూడా మార్కెట్లో అమ్ముతున్నారు. కారం, శుభ్రం చేసిన మెంతులు, ఆవాలు, వెల్లుల్లి పాయలు ఇలా పచ్చడి తయారీకి కావలసిన అన్ని రకాల సరుకులు దొరుకుతున్నాయి. ఇప్పటికీ కొందరు అన్నీ ఇంట్లోనే తయారుచేసుకుని పచ్చడి పెడుతుంటే.. కొందరు మాత్రం అవసరమైన దినుసులు మార్కెట్లో కొనుగోలు చేసి పచ్చళ్లు పెడుతున్నారు. మరికొందరు ఈ గొడవ అంతా ఎందుకని.. రెడీమేడ్ పచ్చళ్లు కొనేస్తున్నారు. జనంలో నేడు పచ్చడిపై మక్కువ తగ్గడానికి కారణం రెడీమేడ్‌గా నాణ్యమైన పచ్చళ్లు మార్కెట్లో దొరకడం. అలాగే పచ్చడికి అవసరమైన సరకుల ధరలు పెరగడం. పిల్లల చదువులు, ఫోన్లతో బిజీగా ఉండడం వంటివి.. ఇదివరకటిలా పెట్టేంత తీరిక లేదంటున్న మహిళలు అవసరమైన సరకులు మార్కెట్లో కొంటున్న వైనం రెడీమేడ్ పచ్చడి కొనేందుకు మరికొందరు మొగ్గు సొంతంగా పెట్టుకుంటేనే రుచి పచ్చడి నిల్వ ఉండాలంటే సొంతంగా తయారు చేసుకుంటేనే మేలు. గానుగ నూనె వాడుకోవడం మంచిది. పూర్వం రెండు మూడు కుటుంబాల మహిళలు కలిపి పచ్చడి పెట్టేవారు. నేడు ఎవరి పని వారిదే అన్నట్లు ఉంది. మార్కెట్ రెడీమేడ్ పచ్చళ్లు దొరుకుతుండడంతో పచ్చళ్లు పెట్టడానికి కొంతమంది మొగ్గు చూపడంలేదు. ఎంత కష్టమైనా కనీసం పాతిక కాయలతోనైనా తయారు చేసుకుని రుచిచూడాల్సిందే. దూడే వరలక్ష్మి, గృహిణి, పాలకొల్లు మామిడి ధరలు తగ్గాయి తూర్పుగోదావరి జిల్లాలో గూడపల్లి, లక్కవరం, బట్టేలంక, పశ్చిమగోదావరి జిల్లాలో సీతారామపురం, మొగల్తూరు ప్రాంతాల నుంచి మామిడి కాయలు ఖరీదు చేస్తుంటాం. గత సంవత్సరంతో పోలిస్తే.. కాపు ఎక్కువగా ఉండడం వల్ల ధరలు బాగా తగ్గాయి. ఐజర్లు, కొత్తపల్లి కొబ్బరి గత సంవత్సరం కాయ రూ. 35 నుంచి 50 వరకూ విక్రయించాం. ఈ సంవత్సరం రూ.15 నుంచి రూ.20కి విక్రయిస్తున్నాం. – కటకంశెట్టి మల్లి, వ్యాపారి, పాలకొల్లు -
డెంగీపై అవగాహన తప్పనిసరి
ఏలూరు(మెట్రో): డెంగీ జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ ముద్రించిన బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి శుక్రవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తీవ్ర జ్వరం, కండరాల నొప్పులు, కనుగుడ్లు నొప్పులు డెంగీ లక్షణాలన్నారు. వ్యాధి లక్షణాలపై జిల్లాలోని పీహెచ్‌సీల పరిధిలో అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యారోగ్య సిబ్బంది విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ప్రతిఒక్కరూ డెంగీ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. డీఎంహెచ్ఓ ఆర్.మాలిని, డీఎంఓ పిఎస్ఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర విజయవంతానికి.. ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్ నుంచి అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ వెట్రిసెల్వి -
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి సందర్శించారు. సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. న్యాయమూర్తి సుబ్బారెడ్డి దంపతులు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలకగా, ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి స్వామివారి మెమెంటో, ప్రసాదాలను అందజేశారు. న్యాయమూర్తి వెంట భీమడోలు కోర్టు జడ్జి ఎస్.ప్రియదర్శిని నూతక్కి ఉన్నారు.లభ్యం కాని బాలుడి వివరాలుద్వారకాతిరుమల: స్థానిక యూనియన్ బ్యాంకు సమీపంలో ఈనెల 9న ఒంటరిగా తిరుగుతూ కనిపించిన ఐదేళ్ల బాలుడిని స్థాని కులు పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. బాలుడు తన పేరు గోపాల్ అని, తండ్రి పేరు నాయక్ అని మాత్రమే చెబుతు న్నాడు. అంతకు మించి వివరాలు చెప్పలేకపోవడంతో బాలుడిని ఏలూరులో జిల్లా శిశు గృహానికి తరలించి, తాత్కాలిక వసతి కల్పిస్తున్నట్టు డీసీపీఓ సీహెచ్ సూర్య చక్రవేణి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. బాలుడి వివరా లు తెలియలేదని, ఎవరికైనా తెలిస్తే సెల్ 94910 63810, లేదా ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ 94407 96653, చైల్డ్ హెల్ప్‌లైన్ కో–ఆర్డినేటర్ వైవీ రాజు 77027 48404 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు.సప్లిమెంటరీ పరీక్షలకు 4,445 మంది హాజరుఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు 4,445 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ జనరల్ కేటగిరీలో 3,472 మందికి 3,227 మంది, ఒకేషనల్ కేటగిరీలో 478 మందికి 425 మంది హాజరయ్యారు. సెకండియర్ జనరల్ కేటగిరీలో 692 మందికి 637 మంది, ఒకేషనల్ కేటగిరీలో 174 మందికి 156 మంది హాజరయ్యారని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు.పశ్చిమలో ప్రశాంతంగా..భీమవరం: జిల్లాలోని 40 కేంద్రాల్లో జరిగిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 91 శాతం వి ద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియె ట్ విద్యాశాఖాధికారి ఎ.నాగేశ్వరరావు తెలిపా రు. ఫస్టియర్ జనరల్ కేటగిరీలో 4,844 మందికి 4,477 మంది, ఒకేషనల్ కేటగిరీలో 645 మందికి 569 మంది హాజరయ్యారన్నారు. -
నష్టాల్లో మగ్గుతున్న మామిడి రైతు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: నూజివీడు మామిడికి కళ తప్పింది. సాధారణంగా దిగుబడి తగ్గితే పంట ధర పెరుగుతుంది. కానీ మామిడి విషయంలో దిగుబడితో పాటు ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. తెగుళ్లతో నాణ్యత పడిపోవడం దీనికి ఒక కారణంకాగా, ఈ పరిస్థితిని లాభంగా మార్చుకుంటున్న సిండికేట్ వైఖరి మరో కారణం. ‘సాగు’ క్షీణత : ఏలూరు జిల్లాలో నూజివీడు, చింతలపూడి నియోజకవర్గాల్లో మామిడి సాగు గణనీ యంగా ఉంది. నూజివీడు మామిడికి దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయంగాను మంచి డిమాండ్ ఉంటుంది. మూడేళ్ల క్రితం అమెరికాకు కూడా మామిడి ఎగుమతి చేసిన పరిస్థితి. జిల్లాలో 15 ఏళ్ల క్రితం వరకు 80 నుంచి లక్ష ఎకరాల్లో విస్తరించి ఉన్న మామిడి సాగు వరుస నష్టాలు, తుపానుల ధాటికి క్రమంగా తగ్గుతూ, ప్రస్తుతం 52 వేల ఎకరాలకు పడిపోయింది. ఈ సీజన్‌కు సంబంధించి గత డిసెంబర్లో మంచి పూత వచ్చినా నల్లతామర తెగులుతో సుమారు 60 నుంచి 70 శాతం మేర దిగుబడి తగ్గిపోయింది. జిల్లాలో ప్రధానంగా బంగినపల్లి, తోతాపురి (కలెక్టర్ కాయలు), చిన్నరసాలు, పెద్దరసాల సాగు అధికంగా ఉంటుంది. దేశీయ మార్కెట్‌కే పరిమితం ఈ ఏడాది జిల్లాలో 1.35 లక్షల టన్నుల దిగుబడి అంచనా కాగా, తెగుళ్ల ధాటికి 50 వేల టన్నులకే పరిమితమైంది. ప్రధానంగా బంగినపల్లి, తోతాపురిలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు అవుతుండగా చిన్నరసాలు, పెద్దరసాలు రాష్ట్రంలో విక్రయాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో గతేడాది బంగినపల్లి రకం టన్ను రూ.25 వేల నుంచి రూ.30 వేలు, తోతాపురి టన్ను రూ.13 వేల నుంచి రూ.15 వేల ధరకు విక్రయించారు. అయితే ఈ ఏడాది సీజన్ ప్రారంభమైన మార్చిలో పంట దిగుబడి లేకపోవడంతో బంగినపల్లి రకం టన్ను ధర రూ.80 నుంచి రూ.లక్ష వరకు పలికి, క్రమక్రమంగా తగ్గుతూ ప్రస్తుతం రూ.15 వేలకు చేరింది. అలాగే తోతాపురి కూడా ప్రారంభంలో అత్యధికంగా రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పలికిన ధర ప్రస్తుతం రూ.8 వేలకు వేలకే పరిమితమైంది. మార్కెట్లో తగ్గిన హవా ఏటా మార్చి నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకు నూజివీడు మామిడి విజయవాడ మ్యాంగో మార్కె ట్ ద్వారా ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రధానంగా నూజివీడు వైరెటీకి మహారాష్ట్ర, గుజరాత్లో మంచి డిమాండ్ ఉండటంతో అక్కడ వ్యాపారులు ప్రత్యేకంగా స్థానిక మార్కెట్లో కొనుగోలు చేసే పరిస్థితి. అయితే ప్రస్తుత పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండటంతో దేశీయ మార్కెట్లో నూజివీడు హవా పూర్తిగా తగ్గి తెలంగాణ, ఉలవపాడు మామిడికి కొంత డిమాండ్ పెరిగింది. 50 శాతం పతనమైన ధర బంగినపల్లి, తోతాపురి ధరల క్షీణత దిగుబడి తగ్గినా.. ధర పెరగని పరిస్థితి అకాల వర్షాలు, తెగుళ్లతో నాణ్యతలేమి తీవ్ర నష్టాల్లో మామిడి రైతులు -
కాలువ గట్టు.. పూడిక తీసికట్టు
ఉండి: అనుకున్నంత అయ్యింది.. చెప్పినట్టే జరిగింది.. ఉండి కాలువ పూడికతీత పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుందని, చినుకుపడితే పూడిక తీసిన మట్టి మళ్లీ కాలువలోకి వెళ్లిపోతుందని ఈనెల 13న ‘సాక్షి’లో ‘మట్టి తీసి గట్టు మీద పెట్టు’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈనెల 15న సాయంత్రం ఉండి మండలంలో కురిసిన కొద్దిపాటి వర్షానికే కలిసిపూడి గ్రామంలో ఉండి కాలువలో చేపట్టిన పూడిక తీత మట్టి మళ్లీ కాలువలోకే జారిపోయింది. నామమాత్రంగా పనులు చేపట్టడం, పూడిక తీసిన మట్టి మరలా కాలువలోకే జారిపోవడంపై రైతులు మండిపడుతున్నారు. కలిసిపూడి రెగ్యులేటర్ నుంచి కాలువ శివారు అజ్జమూరు వరకు రూ.33 లక్షలు అంచనా కాగా అగ్రిమెంట్‌గా రూ.22 లక్షలతో పనులు చేపట్టారు. కాలువలో నీరు ఉండగానే పూడికతీత పనులు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఇవేమీ పట్టించుకోకుండా కాంట్రాక్టర్, అధికారులు తూతూమంత్రంగా రాత్రిళ్లు పనులు చేపట్టారు. కాలువలో తీసిన మట్టి గట్లపై వేస్తుండటంపై ప్రజల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. కాలువ నుంచి తీసిన పూడికతీత మట్టి గట్ల అంచుల్లో పూసేస్తున్నారు. దీంతో కొద్దిపాటి వర్షానికే అంచుల్లోని మట్టి కాలువలోకి జారిపోయింది. నీళ్లు నములుతున్న అధికారులు ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా నాయకులు, అధికారులు ఈనెల 14న ఉండి ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాలువలో తీసిన మట్టి గట్లపై కాకుండా ఎక్కడ వేస్తారు అంటూ ఛలోక్తులు విసురుకున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు కాలువలోకి జారిన మట్టిపై ఎవ రు సమాధానం చెబుతారనేది ప్రశ్నార్థకం. దీనిపై అధికారులను వివరణ కోరగా నీళ్లు నములుతున్నారు. కాలువలోకి జారిన మట్టిని తొలగిస్తారా అని ఏఈ ఫణిశంకర్‌ను ప్రశ్నించగా కాలువలోకి జారితే తీసేస్తామంటూ సమాధానమిచ్చారు. దీనిని బట్టి పూడికతీత పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదని అర్థమవుతోంది. కాలువలోకి జారిపోయిన మట్టిన మరలా ఎప్పుడు తొలగిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పూడిక తీసిన మట్టి మళ్లీ కాలువలోకే.. కొద్దిపాటి వర్షానికే జారిపోయిన గట్లు ‘సాక్షి’ చెప్పినట్టే జరిగింది -
రోడ్డు ప్రమాదంలో వ్యాపారి మృతి
బుట్టాయగూడెం : జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక పొగాకు వ్యాపారి మృతి చెందాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెంకు చెందిన ముప్పిడి వరప్రసాద్, గోపాలపురానికి చెందిన పి. కృష్ణ, గుంటూరుకు చెందిన ఏ.రాంబాబు, మెదడుమెట్లకు చెందిన టి.వీరాంజనేయులు అనేజంగారెడ్డిగూడెం నుంచి జీలుగుమిల్లి పొగాకు బేళ్లు కొనేందుకు వెళ్తుండగా లక్ష్మీపురం సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి తుప్పల్లోకి దూసుకుపోయింది. గాయపడిన క్షతగాత్రులను 108లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముప్పిడి వరప్రసాద్ అప్పటికే మృతి చెందాడు. పదేళ్లుగా మృతుడు వరప్రసాద్ పొగాకు వ్యాపారం చేస్తున్నారు. -
ఆర్టీఏ లైసెన్స్ తప్పనిసరి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్ర ప్రభుత్వం రూపొందించిన క్యారేజ్ బై రోడ్ యాక్ట్ – 2007, క్యారేజ్ బై రోడ్ రూల్స్ – 2011 ప్రకారం వినియోదారుల నుంచి స్వీకరించిన పార్సిళ్లను స్టోర్ చేసి, వాటిని గమ్యస్థానాలకు చేరవేసే రవాణా సంస్థలు తప్పనిసరిగా ఆర్టీఏ కార్యాలయం నుంచి లైసెన్స్ పొందాలని ఉప రవాణా కమిషనరు షేక్ కరీం తెలిపారు. శుక్రవారం స్థానిక డీటీసీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని పార్సిల్ రవాణా సంస్థల యాజమాన్య ప్రతినిధులతో డీటీసీ కరీం సమావేశం నిర్వహించి, వారికి చట్టంపై అవగాహన కల్పించారు. సోమవారం నాటికి జిల్లాలోని అన్ని పార్సిల్ రవాణా సంస్థలు ఆర్టీఏ లైసెన్స్ పొందాలని, లేనిపక్షంలో వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామన్నారు. సమావేశంలో వాహన తనిఖీ అధికారులు ఎన్డీ విఠల్, ఎస్బీ శేఖర్, పీ. రమేష్ బాబు, పార్సిల్స్ రవాణా సంస్థల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు బస్సులపై 85 కేసులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గత గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కలపర్రు టోల్గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించి కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై 85 కేసులు నమోదు చేసినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ ఒక ప్రకటనలో తెలిపారు. రవాణా కమిషనరు ఆదేశాల మేరకు కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏలూరు జిల్లాలోని వాహన తనిఖీ అధికారులు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. విశాఖపట్నం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య తిరిగే కాంట్రాక్టు క్యారేజ్ బస్సులను తనిఖీలు చేసి.. పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించిన 85 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.3.70 లక్షలు వసూలు చేసినట్లు చెప్పారు. తనిఖీల్లో ఆర్టీవో ఎండీ. మదని తదితరులు తెలిపారు. -
కార్టూనిస్టుకు విశిష్ట బహుమతి
పెనుగొండ : కార్టూనిస్టుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్టూన్ల పోటీలో పెనుగొండకు చెందిన కార్టూనిస్టు వేండ్ర గోపాలకృష్ణ కార్టూన్‌కి విశిష్ట బహుమతి లభించింది. గోపాలకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ తొలి తెలుగు వ్యంగ్య చిత్రకారుడు తలిశెట్టి రామారావు జయంతి పురస్కరించుకొని నిర్వహించిన పోటీలో ఈ బహుమతి గెలుచుకున్నట్లు చెప్పారు. ఈ నెల 20న రవీంద్రభారతీలో పురస్కారాన్ని అందుకోనున్నట్లు తెలిపారు. రైలు నుంచి జారి యువకుడి మృతి భీమడోలు: ఓ యువకుడు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. భీమడోలు రైల్వే ఎస్సై సైమన్ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం సహస్ర జిల్లా శౌర్య గ్రామానికి చెందిన రాహుల్‌కుమార్(23) బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పని పనిచేస్తున్నాడు. ఈ నెల 14న స్వగ్రామానికి వెళ్లే క్రమంలో బెంగళూరులో రైలెక్కాడు. జనరల్ బోగిలో ప్రయాణిస్తున్న సమయంలో శుక్రవారం రైలు భీమడోలు రైల్వే స్టేషన్‌కు వచ్చే సరికి ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి అక్కడిక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
రైతులకు అభయం.. సమస్యలపై సమరం
● ప్రధానంగా వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు అండగా నిలవాలని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారని బొత్స తెలిపారు. ధాన్యం కల్లాల్లో ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయంపై ఈ సందర్భంగా చర్చించారు. ధాన్యం కొనుగోళ్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి పొంతనే లేదని నేతలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో రైతుల ఇబ్బందులు తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించి, వారితో మాట్లాడి, అండగా నిలవాలని నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ● ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని నిర్ధారించారు. రొయ్యల ధరలు పడిపోవడం, మేత ధరలు అడ్డగోలుగా పెరిగిపోయి రైతులు నష్టపోతున్నా సర్కార్‌కు చీమ కుట్టినట్టయినా లేదని, ఆక్వా రైతులకు వెన్నంటి నిలవాలని తీర్మానించారు. ● గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మాదిరిగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పొగాకు రైతులకు అండగా నిలిచి, పోరాడటానికి సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. ● ప్రధానమైన ప్రజాసమస్యలపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు సైతం సిద్ధంగా ఉన్నారని బొత్స సత్యనారాయణ వివరించారు. ● సూపర్ సిక్స్ సహా కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలయ్యే వరకూ ప్రభుత్వంపై ప్రజాపోరులో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యే లా బాధ్యత తీసుకోవడానికి నాయకులు ముందుకు వచ్చారు. ● క్షేత్రస్థాయిలో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజలకు అండగా నిలిచి, మనోధైర్యం కల్పించాలని సమావేశంలో తీర్మానించారు. -
గుక్కెడు నీళ్లు.. గుప్పెడు గింజలు
ఏలూరు(మెట్రో) : వేసవి తాపానికి పక్షులు నీరు దొరక్క అల్లల్లాడిపోతాయి. సమయానికి నీరు, ఆహారం లేకపోవడంతో బిల్డింగుల మధ్య, కరెంటు తీగలపై చాలా వరకూ చనిపోయి కనిపిస్తుంటాయి. అలాంటి చిన్న ప్రాణాలను కాపాడాలని ఏలూరు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ప్రజలకు పలు సూచనలు చేశారు. వేసవిలో నగరాల్లో తిరిగే పక్షులు నీరు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అలాంటి పక్షులకు సాయం చేయాలనుకుంటే, పరిశుభ్రమైన నీరు, ఆహారం, సురక్షితమైన ఆశ్రయం కల్పించాలి. గిన్నెలో మంచినీరు ఉంచి నీడ ఉన్న ప్రదేశంలో పెట్టాలి. ప్రతిరోజూ నీటిని మార్చాలి. పక్షులు తాగేటప్పుడు, సురక్షితంగా కూర్చోవడానికి చిన్న రాళ్ళు లేదా గులకరాళ్లను ఉంచాలి. ఆకలి తీరుద్దాం అలాగే వేసవిలో తినేందుకు ఏమీ దొరక్క పక్షులు ఆకలితో అలమటిస్తాయి. అందువల్ల వేసవి వాతావరణానికి అనుకూలంగా ఉండే విత్తనాలు, తృణధాన్యాలు కూడా అందుబాటులో ఉంచాలి. రాగులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, వరి ధాన్యం మంచివి. ఏ పక్షులకు ఎలాంటి ఆహారం ఇవ్వొచ్చు ● పిచ్చుకలు : రాగులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, చిరుధాన్యాలు ● చిలుకలు: అరటి, జామ, బొప్పాయి వంటి పండ్లు ● కాకులు, కోకిలలు : వండిన అన్నం, చపాతీలు, మృదువైన పండ్లు -
అక్రమ కలప స్వాధీనం
కొయ్యలగూడెం : అక్రమంగా కలప రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు కన్నాపురం అటవీశాఖ అధికారి రేంజర్ శివరామకృష్ణ శుక్రవారం పేర్కొన్నారు. యర్రంపేట, ఆరిపాటి గ్రామాల మధ్య బండారు జాతికి చెందిన భారీ వృక్షాలను ట్రాక్టర్లో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు. కలప విలువను లెక్కించాల్సి ఉందని పేర్కొన్నారు. చాట్రాయిలో భారీ వర్షం చాట్రాయి : చాట్రాయిలో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. కొటపాడులో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగగా చెట్లు కూలిపోయాయి. ఈ వర్షం మెట్ట దుక్కులకు అనువుగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. చనుబండ పాత దళితవాడ రోడ్డు జలమయవ్వడంతో కాలనీ వాసులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు కొయ్యలగూడెం : లారీతో ఢీకొట్టి వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్‌కు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించినట్లు ఎస్సై వి.చంద్రశేఖర్ శుక్రవారం పేర్కొన్నారు. 2018లో చెరుకూరి నరసింహ కొయ్యలగూడెం చేపల మార్కెట్ వద్ద పులిరామన్నగూడెంకు చెందిన నడపాల మంగిరెడ్డిని ఢీకొట్టాడు. దీనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా కొవ్వూరు ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్ కోర్టు జడ్జి జీవీఎల్ సరస్వతి శిక్ష విధించారన్నారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతిపై అసంతృప్తి ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ఒక ఉపాధ్యాయురాలికి నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతి కల్పించడంపై పలు ఉపాధ్యాయ సంఘాలు జిల్లా విద్యాశాఖాధికారిని ప్రశ్నించాయి. 2022లో పదో తరగతి పరీక్షల్లో చూచిరాతకు సహకరించారని అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారులు దాదాపు పదిమంది ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. తిరిగి వారికి పోస్టింగ్ ఇచ్చినప్పుడు కేటగిరి ఫోర్‌గా పరిగణించి దూర ప్రాంతాల్లో నియమించారు. సదరు సంఘటనకు సంబంధించి ఇప్పటికీ వారిపై క్రిమినల్ కేసులు, శాఖాపరమైన విచారణ జరుగుతూనే ఉంది. ఆ విచారణ జరుగుతుండగానే వారిలో ఒక ఉపాధ్యాయురాలికి పెదవేగి మండలం కొప్పాక జెడ్పీ పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల తరపున శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారిణి వివరణ కోరగా సదరు ఉపాధ్యాయురాలు రిక్వెస్ట్ పెట్టుకున్నారని పైఅధికారుల సూచనల మేరకే పదోన్నతి కల్పించామని ఆమె తెలిపారు. దొడ్డి దారిన పదోన్నతులు కల్పించటం అనేక అనుమానాలకు తావిస్తోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పదోన్నతిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. టీడీపీ ఆఫీస్‌పై దాడి చేశారన్న ఆరోపణల కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్న వల్లభనేని వంశీ ఉన్నారు. రెండు రోజుల వ్యవధిలో రెండు కీలక కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరైంది. రెండు రోజుల క్రితం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరవ్వగా, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇవాళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వంశీపై ఇప్పటి వరకూ నమోదైన 6 కేసుల్లో బెయిల్ మంజూరైంది.90 రోజులుగా రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు. వరుసగా ఒక్కొక్క కేసులో బెయిల్ వస్తున్న తరుణంలో వంశీపై కక్ష పూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వంశీపై నిన్న నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు.. ఇవాళ నూజివీడు కోర్టులో వంశీని హాజరు పరిచారు.ఈ నెల 29 వరకూ నూజివీడు కోర్టు రిమాండ్ విధించగా.. ఇవాళ తాజాగా వల్లభనేని వంశీపై మరో కేసును గన్నవరం పోలీసులు నమోదు చేశారు. గన్నవరంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై 58 పేజీలతో పోలీసులకు గనుల శాఖ ఏడీ ఫిర్యాదు చేశారు. క్రైమ్ నెం.142/2025తో గన్నవరం పీఎస్‌లో కేసు నమోదైంది. కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయాలని గన్నవరం పోలీసుల నిర్ణయించారు. వంశీపై కూటమి కక్షసాధింపు చర్యలపై ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ మండిపడుతోంది. జైల్లో వంశీ శ్వాసకోస సమస్య, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. వంశీ ఆరోగ్యంపై ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వంశీ ఆరోగ్యం అసలు బాగోలేదు: భార్య పంకజశ్రీ
సాక్షి, ఏలూరు జిల్లా: తన భర్త ఆరోగ్యం అసలు బాగోలేదని వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ అన్నారు. కిటోన్ శాంపిల్స్ పాజిటివ్‌గా వచ్చాయని తెలిపారు. బరువు కూడా తగ్గిపోయారని.. వంశీ ఆరోగ్యంపై తమకు తీవ్ర ఆందోళనగా ఉందని తెలిపారు. లాయర్ చిరంజీవి మాట్లాడుతూ.. వంశీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. పాత కేసులను తిరగదోడి కావాలనే ఇబ్బందిపెడుతున్నారన్నారు. పిటీ వారెంట్ దాఖలులో నిబంధనలు ఫాలో కాలేదని చిరంజీవి అన్నారువల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు.. 14 రోజుల రిమాండ్‌ను విధించింది. హనుమాన్ జంక్షన్ పోలీసుల పీటీ వారెంట్‌తో వంశీకి రిమాండ్ విధించింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అక్రమ కేసులతో అధికార కూటమి ప్రభుత్వం వేధింపుల పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆయనపై పలు అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయటంతో గత 90 రోజులకుపైగా వంశీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.ఇప్పటి వరకు ఆయనను అరెస్ట్ చేసిన కేసుల్లో న్యాయస్థానం వరుసగా బెయిల్ మంజూరు చేయటంతో తాజాగా హనుమాన్‌జంక్షన్ పోలీసులు నూజివీడు కోర్టులో గురువారం పీటీ వారంట్ దాఖలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వంశీపై నమోదైన పాత కేసును ఇప్పుడు తెర మీదకు తీసుకువచ్చారు. ఇదిలా ఉంటే వల్లభనేని వంశీ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. -
వేప ఉత్పత్తులు.. కీటక నాశకాలు
బుట్టాయగూడెం : తరతరాల నుంచి వేప చెట్లుకు ఒక ప్రత్యేకత ఉంది. వేప చెట్టులో ప్రతి భాగం ఒక్కో విశిష్టత కలిగి ఉంటుంది. వేప చెట్టులోని భాగాలు వైద్యంతోపాటు వ్యవసాయ సాగులో, పంటల్లో చీడ పీడల నివారణలో ఎంతగాలో ఉపయోగపడతాయని వ్యవసాయాధికారులు చెబున్నారు. ప్రకృతిపరంగా లభించే వేపపిండి, వేప నూనె, కొమ్మలను సేంద్రీయ ఎరువుల పద్ధతిలో రైతులు వాడుతుంటారు. వేప పిండి, కొమ్మలు భూమిని సారవంతం చేయడంతో పాటు పంట దిగుబడి పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి పలు రకాల వేప ఉత్పత్తులను వాటి ఉపయోగాలను వ్యవసాయాధికారులు రైతులకు ముందుగానే వివరిస్తున్నారు. ప్రయోజనాలివీ ● వేప ఆకులు లేదా ఆకు కొనలు పొడి చేసి నిల్వ చేసి ధాన్యంలో కలిపితే పురుగులు పట్టవు. ● వేప ఆకుల కషాయంలో ముంచి ఆరబెట్టిన గోనుసంచులకు పురుగులు దరిచేరవు. ● ఎరువుగా వేపాకులు పొలంలో వేస్తే సేంద్రియ పదార్థం, పోషకాలతోపాటు నిరోధక శక్తి కలిసి వస్తాయి. ● వేప నూనె పంటలపై పిచికారీ చేస్తే కాయ తొలుచు పురుగు, రసం పీల్చు పురుగు, ఆకు తినే పురుగులను అదుపు చేయవచ్చు. ● ఒక లీటర్ వేప నూనెకు 200 లీటర్ల నీరు, 200 గ్రాముల సబ్బుపొడి(సర్ఫ్)ను కలిపి ద్రవణం తయారు చేసుకోవాలి. ఇది ఒక ఎకరంలో స్ప్రేయింగ్ చెయ్యడానికి సరిపోతుంది. నూనె, నీరు కలువదు కనుక ముందుగా సబ్బుపొడి బాగా కలిపి నురగ వచ్చిన తర్వాత నీటిలో కలపాలి. ● వేప పిండి మేలైన చిక్కటి సేంద్రీయ ఎరువు. గింజ నుంచి తీసి వేసిన వేప పిండిలో 5.2 శాతం నత్రజని, 11 శాతం భాస్వరం, 1.5 శాతం పొటాషియం ఉంటుంది. ఇది ఎరువుగానే కాకుండా సస్య రక్షణకు ఉపయోగపడుతుంది. పాడి–పంట వేప నూనె, పిండితో పంటలకు రక్షణ సేంద్రియ పద్ధతుల్లో వాడుతున్న రైతులు వేప ఉత్పత్తులతో పర్యావరణ ప్రయోజనాలు వ్యవసాయంలో వేప ఆధారిత ఉత్పత్తులను వినియోగించడం వల్ల అనేక పర్యావరణ ప్రయోజనాలు లభిస్తాయి. వేప జీవనాధారణ పొందుతుంది. పర్యావరణ వ్యవస్థలో పేరుకుపోదు. కాలుష్య ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వేప నేల నాణ్యతను పెంచుతుంది. ఆరోగ్యకరమైన, స్థితి స్థూపక వ్యవసాయ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. – డి.ముత్యాలరావు, ఏఓ, బుట్టాయగూడెం -
డీఎస్సీలో క్రీడా కోటాపై తలోమాట
ఏలూరు రూరల్ : కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో క్రీడా కోటా విఽధి, విధానాలపై క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్లో మార్గదర్శకాలు అయోమయానికి గురి చేస్తున్నాయంటున్నారు. ప్రభుత్వ పెద్దలు క్రీడా కోటాలో ఉద్యోగాలను అమ్ముకునేందుకు తప్పుడు విధానాలు రూపొందించారని అనుమానిస్తున్నారు. ఇందుకోసం తమకు అనుకూలంగా క్రీడల విభజన, అర్హతలతో ఆన్లైన్ దరఖాస్తు విధానం రూపొందించారని ఆరోపిస్తున్నారు. స్పోర్ట్స్ డీఎస్సీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 421 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రైనింగ్ లేకుండా ఉద్యోగాలు ఎలా? ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ (బీపీఈడీ) పూర్తి చేయని క్రీడాకారులను సైతం స్పోర్ట్స్ కోటాలో వ్యాయామ ఉపాధ్యాయులుగా నియమిస్తామని కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్లో వెల్లడించడంపై క్రీడా పండితులు, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం ఇతర శాఖలకు మాత్రమే సరిపోతుందని, ఉపాధ్యాయ వృత్తికి మాత్రం సరికాదంటున్నారు. ట్రైనింగ్ పూర్తి చేయకుండా క్రీడాకారుడు పిల్లలకు వ్యాయామ విద్య ఎలా బోధిస్తాడు? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఉపాధ్యాయ కోటాలో ఇలాంటి నియమాలు పెట్టలేదని గుర్తు చేస్తున్నారు. దీని వల్ల ట్రైనింగ్ పూర్తి చేసిన క్రీడాకారులకు అన్యాయం జరుగుతుందని మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో పక్కాగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకంలో స్పోర్ట్స్ కోటా అమలు చేశారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల మందికి పైగా క్రీడాకారులు సచివాలయ ఉద్యోగాలు సాధించారు. నాడు ఒక్క క్రీడాకారుడు కూడా విధి, విధానాలపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే నేడు కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జూనియర్ ఇండియా, ఎస్‌జీఎఫ్‌కు ప్రాధాన్యత లేదా? స్పోర్ట్స్ కోటాలో జూనియర్ ఇండియా చాంపియన్‌షిప్, నేషనల్ స్కూల్‌గేమ్స్ సర్టిఫికెట్స్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులతో నిర్వహించే ఈ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాల కల్పనలో ప్రాధాన్యత కల్పించకపోవడంపై క్రీడా విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి పక్కా విధి విధానాలతో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పాయింట్ల విధానంపై గందరగోళం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా చేపట్టేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాప్) ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా క్రీడల ప్రాధాన్యత, క్రీడాకారుడు సాధించిన సర్టిఫికెట్ల స్థాయిని బట్టి పాయింట్లు కేటాయించి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పూరిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం శాప్ విధానాలకు విరుద్ధంగా క్రీడలను ఏ,బీ అనే రెండు కేటగిరీలుగా విభజించింది. ఎటువంటి క్రీడల సర్టిఫికెట్లు ఉంటే ఎన్ని పాయింట్లు కేటాయిస్తారో? వెల్లడించలేదు. ఒలింపిక్స్, ఏషియా గేమ్స్, కామన్వెల్త్, నేషనల్ గేమ్స్, యూనివర్సిటీ స్థాయిలో ప్రతిభ చాటిన వారితో పోస్టులు పూరిస్తామని చెబుతున్నారు. అయితే ఇందులో ప్రాధాన్యత లేని పలు క్రీడలను సైతం ఏ–కేటగిరీలో చేర్చడం వల్ల అత్యంత పోటీ ఉన్న క్రీడల్లో ప్రతిభ చాటిన వారికి అన్యాయం జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రీడాకారుల్లో అసంతృప్తి నియామక ప్రక్రియపై అనుమానాలు క్రీడల వర్గీకరణతో నిరాశ పారదర్శకత లేదు ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ ఉద్యోగాల స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ పారదర్శకంగా లేదు. ఇందులో పక్కా విధి, విధానాలు వెల్లడించాలి. ఇతర ప్రభుత్వ శాఖల్లో సైతం స్పోర్ట్స్ కోటాతో ఉద్యోగాలు పూరించాలి. అప్పుడే ప్రతిభ ఉన్న క్రీడాకారులకు న్యాయం చేసినట్టు అవుతుంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. లేదంటే డీఎస్సీ మొత్తం ప్రక్రియ కోర్టు మెట్లు ఎక్కుతుంది. – టి.కొండలరావు, శాయ్ సెంటర్ రిటైర్డ్ ఇన్చార్జితప్పుల తడక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పోర్ట్స్ కోటా విధానం తప్పుల తడకగా ఉంది. బీపీఈడీ ట్రైనింగ్ చేయకుండా వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగం ఎలా కేటాయిస్తారు? దీనివల్ల పాఠశాల స్థాయిలో ఫిజికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ దెబ్బ తింటుంది. క్రీడల వర్గీకరణ సైతం సరిగా లేదు. అంతర్జాతీయ, జాతీయస్థాయిలో అత్యధిక పోటీ కల్గిన క్రీడాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో ప్రతిభ చాటిన వారికి పాయింట్లు విధానం అమలు చేయాలి. –కేటీఎస్ఆర్ ఆంజనేయులు, రిటైర్డ్ డీఎస్డీఓ -
‘ధాన్యంలో తేమ 17 శాతం ఉండాల్సిందే’
అత్తిలి: రైతులు పంట కోసిన వెంటనే తేమ తనిఖీ చేసి 17 శాతం ఉన్నప్పుడే మిల్లులకు తరలించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి డి శివరాంప్రసాద్ చెప్పారు. గురువారం అత్తిలి మండలంలో ఆయన పర్యటించి ధాన్యం రాశులను పరిశీలించి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ధాన్యం ఎక్కువగా ఎండబెడితే నూక శాతం పెరుగుతుందని, 17 శాతం ఉన్నప్పుడే మిల్లులకు పంపే ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయశాఖ అధికారి టీకే రాజేష్ ఉన్నారు. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి తాడేపల్లిగూడెం అర్బన్ : విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలో కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సరవ సూరిబాబు (38) అనే వ్యక్తి పట్టణంలోని స్వీట్స్ దుకాణానికి సంబంధించిన స్వీట్స్ తయారు చేసే యూనిట్లో రోజు కూలీగా పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఆ ప్రాంతంలో గ్రైండర్ స్విచ్ వేస్తుండగా విద్యుత్ షాక్‌తో పడిపోయాడు. ఇది గమనించిన తోటి పనివారు బాధితుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి సూరిబాబు మృతి చెందినట్లు నిర్దారించారు. సూరిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారి సేవలో సినీ నటి రాశి
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ప్రముఖ సినీ నటి రాశి గురువారం రాత్రి సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆమె ముందుగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో పండితులు ఆమె కుటుంబానికి వేద ఆశీర్వచనాన్ని పలికి, స్వామి వారి జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు. పలువురు భక్తులు రాశితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. రేపు ఏలూరులో ప్రత్యేక ఉద్యోగ మేళా ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లాలోని ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) సంయుక్త భాగస్వామ్యంతో శనివారం ఉదయం 10:30 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయం, ఏలూరులో ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి. మధుభూషణ్ రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఫార్మల్ డ్రెస్ కోడ్‌లో, రెజ్యూమ్, సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను కోసం 88868 82032 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. చికిత్స పొందుతూ యువతి మృతి దెందులూరు: పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధం చేసుకోవడం ఇష్టం లేక ఆత్మహత్యాయత్నం చేసిన మౌనిక అనే యువతి చికిత్స పొందుతూ మృతి చెందిందని దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపారు. వీరభద్రపురం గ్రామానికి చెందిన గొట్టికల మౌనిక అదే గ్రామానికి చెందిన యువకుడితో కుటుంబ సభ్యులు పెళ్లి కుదిర్చారు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఈ నెల 12న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న యువతి గురువారం మృతి చెందింది. ఈ మేరకు ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
జలాశయంలోనూ అక్రమ తవ్వకాలు
జంగారెడ్డిగూడెం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా పార్టీల నేతలు మట్టి, ఇసుక అక్రమ రవాణాకు తెరతీశారు. చెరువుల్లో మట్టిని అక్రమంగా తరలించుకుపోతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా జలాశయంలో అక్రమ తవ్వకాలు చేయడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలో అక్రమంగా తవ్వకాలు చేయడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. చక్రదేవరపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఈ గ్రావెల్‌ను తవ్వేసి, అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం నుంచి వయా చక్రదేవరపల్లి మీదుగా వేగవరానికి ఇటీవల రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డుకు ఇరువైపులా బెర్ములను నిర్మించేందుకు ఈ మట్టినే ఉపయోగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలపై ఎర్రకాలువ జలాశయం ఏఈ ఆర్.శ్రీనివాస్‌ను వివరణ కోరగా జలాశయం సమీపంలో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. తవ్వకాల విషయం తమ దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఈదురు గాలుల బీభత్సం
ఎండలు మండుతున్న వేళ పెనుగొండ, పెనుమంట్ర మండలాల్లో గురువారం భారీ వర్షం కురవడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. పెనుగొండలో ఈదురుగాలులు, భారీ వర్షం భీభత్సం సృష్టించింది. పెనుగొండ, వడలి, వెంకట్రామపురం గ్రామాల్లో ఈదురుగాలులకు భారీ వృక్షాలు నెలకొరిగాయి. మార్టేరు– పెనుమంట్ర స్టేట్‌హైవే రోడ్డుపై కొన్ని చోట్ల చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అయితే భారీ వర్షం నేపథ్యంలో రైతులు కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని రక్షించుకోవడానికి అవస్థలు పడ్డారు. – పెనుగొండ/పెనుమంట్ర -
నూతన ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు చర్యలు
పాలకోడేరు : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా నూతన ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలో రూ.10.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఫ్లాటెడ్ కాంప్లెక్స్ (ఇండస్ట్రియల్ పార్క్) నిర్మాణానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ చర్యలతో దూదేకుల ముస్లింలకు అన్యాయం తాడేపల్లిగూడెం (టీఓసీ): కూటమి ప్రభుత్వ అసమర్థత వల్ల దూదేకుల ముస్లిం మైనార్టీలు నష్టపోతున్నారని నూర్ భాషా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు షేక్ హుస్సేన్ బీబీ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో గురువారం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల పైబడి జనాభా ఉన్నటువంటి నూర్ భాషా ముస్లిం మైనారిటీల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలిపారు. మైనార్టీ కార్పొరేషన్లో బీసీ–బి దూదేకుల ఆప్షన్ లేని కారణంగా మైనార్టీ సబ్సిడీ రుణాలు, మైనార్టీ కోటాలో వచ్చే ఇతర ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నూర్ బాషా ముస్లింలపై కేవలం ఓట్లు కోసమే ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందని మండిపడ్డారు. కొల్లేరు సరస్సు పరిరక్షణపై సమీక్ష ఏలూరు(మెట్రో): సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చేపట్టిన లిడార్ సర్వే ఆధారంగా అక్రమ నిర్మాణాల తొలగింపునకు చర్యలు వేగవంతం చేయాలని జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధికారులకు సూచించారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో కొల్లేరు సరస్సు పరిసరాలలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు, డ్రెయిన్స్ డిపార్ట్మెంట్ అధికారులు వారి శాఖల ద్వారా చేపట్టిన ముందస్తు చర్యల గురించి వివరించారు. కొల్లేరులో 67 మినీ డ్రెయిన్ చానల్స్ ఉన్నాయని, అందువల్ల ముంపు బారిన పడకుండా వాటి పూడికతీత పనుల ప్రతిపాదనలు తయారు చేసి అటవీశాఖ ద్వారా ప్రభుత్వ అనుమతి కోసం పంపాలని కోరారు. సమావేశంలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్ బి.విజయ, డ్రెయిన్స్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. -
వేసవిలో చిన్నారులకు ఆటవిడుపు
బాస్కెట్ బాల్లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులువేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో బాస్కెట్‌బాల్‌లో శిక్షణ ఇస్తున్నారు. చిన్నారులకు బాస్కెట్‌బాల్‌లో మెలకువలు, పోటీపడేతత్వాన్ని నేర్పిస్తున్నారు. 12 ఏళ్ల నుంచి పెద్ద వయస్సు ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఉచితంగా ఈ శిక్షణ ఉంటుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోచ్ ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, ఏలూరు -
తనిఖీలు నామమాత్రం.. తవ్వకాలు నిత్యకృత్యం
ద్వారకాతిరుమల: పోలవరం కుడి కాలువ గట్టుపై జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై ‘సాక్షి’లో ప్రచురించిన వరుస కథనాలకు ఎట్టకేలకు మైనింగ్ విజిలెన్స్ అధికారుల్లో చలనం కలిగింది. అయితే గురువారం అధికారులు చేపట్టిన తనిఖీలు విమర్శలకు తావిచ్చాయి. ద్వారకాతిరుమల మండలంలోని పంగిడిగూడెం, ఎం.నాగులపల్లి వద్ద పోలవరం కుడి కాలువ గట్టుపై గ్రావెల్‌ను అక్రమంగా తవ్వుతూ కూటమి నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై వరుస కథనాలు ప్రచురించగా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉదయం కాలువ గట్టుపైకి వచ్చిన విజిలెన్స్ అధికారులు ఒక్కచోట మాత్రమే కారు దిగి పరిశీలించారు. అది కూడా అనుమతులు ఇచ్చిన ప్రాంతంలోనే పరిశీలించి.. మిగిలిన రెండు పాయింట్లను పట్టించుకోలేదు. అధికారులు వెళ్లిన కొద్దిసేపటికే అక్రమార్కులు పొక్లెయిన్లు తీసుకువచ్చి యథేచ్ఛగా గ్రావెల్ తవ్వి తరలించారు. గ్రావెల్‌ను కై కలూరు–పామర్రు హైవే రహదారి నిర్మాణం, నారాయణపురంలో చేపల చెరువుల గట్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. అధికారుల తనిఖీల సంగతి కూటమి నేతలకు ముందే తెలిసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా కాలువ గట్టును తవ్విన ప్రాంతాల్లో భారీ గోతులు కనిపిస్తున్నా అధికారులు ఏమీ లేనట్టు వెళ్లిపోవడం రైతులను విస్మయానికి గురిచేసింది. ఇక పచ్చ నేతలు ఇచ్చే రిపోర్టే.. అధికారుల తుది నివేదిక అవుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చక్రం తిప్పుతున్న ముగ్గురు పచ్చ నేతలు ప్రధానంగా గ్రావెల్ దందాలో ముగ్గురు పచ్చ నేతలు చక్రం తిప్పుతున్నారు. అన్ని వ్యవహారాలను వారు మేనేజ్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే ఓ జనసేన నేత గ్రావెల్ తవ్వుతున్నందుకు ఒక్కో టిప్పర్‌కు రూ.500 వసూలు చేస్తున్నారట. ఇలా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. దీనిపై పీఐపీఆర్‌ఎంసీ ఏఈ బాపూజీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. పోలవరం కుడి కాలువ గట్టుకు తూట్లు నామమాత్రంగా అధికారుల పరిశీలన పచ్చల నేతల రిపోర్టే తుది నివేదిక! -
పారదర్శకంగా పోలీస్ బదిలీలు
91 మంది ఏఎస్సై, హెచ్‌సీలకు స్థానచలనంఏలూరు టౌన్: జిల్లా పోలీస్ శాఖలోని ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లకు గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. బదిలీల కౌన్సెలింగ్ పారదర్శకంగా చేపట్టారు. ఒకే పోలీస్‌స్టేషన్‌లో ఐదేళ్లకుపైగా సేవలందిస్తున్న 91 మందికి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. 30 మంది ఏఎస్సైల్లో 29 మందికి, 65 మంది హెడ్ కానిస్టేబుళ్లలో 62 మందికి బదిలీలు అయ్యాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బదిలీ అయిన సిబ్బంది కొత్త స్టేషన్ల పరిధిలో కుటుంబంతో నివాసం ఉండాలని, ఇది వారి కుటుంబ జీవితం, విధి నిర్వహణకు సమతుల్యత ఇచ్చే అవకాశం కల్పిస్తుందన్నారు. ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఐటీ కోర్ ఇన్చార్జి నరేంద్ర, శ్రీరామ్, ఆంజనేయ రాజు పాల్గొన్నారు. -
రూ.75 కోట్ల పనులు రద్దు!
అటకెక్కిన పనులు ● గత ప్రభుత్వంలో ఉండి నియోజకవర్గంలోని చినమిల్లిపాడు, సిద్ధాపురం, రాజులపేట, రాజుల కొట్టాడ, ధర్మాపుర అగ్రహారం, నల్లమిల్లిపాడు గ్రామాలు, కొల్లేరు తీర ప్రాంత ప్రజలు, రైతులు చినమిల్లిపాడు–ఆకివీడు మెయిన్‌రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదభరితంగా ఉన్న ఈ రోడ్డును 11.6 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టి అభివృద్ధి చేసేందుకు రూ.25 కోట్లు మంజూరయ్యాయి. ● భీమవరం నుంచి కలిదిండి మీదుగా గుడివాడ వెళ్లే రోడ్డులోని బొండాడ డ్రెయిన్లపై వంతెన నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరు చేశారు. ● ఆచంట నియోజకవర్గంలో నెగ్గిపూడి, తాడేపల్లిగూడెంలో ఆర్అండ్బీ ఇన్స్పెక్షన్ బంగ్లాల ఆ ధునికీకరణ నిమిత్తం రూ.1.57 కోట్లు మంజూ రు చేశారు. పనులు దాదాపు టెండర్ల దశకు చేరుకోగా కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. సాక్షి, భీమవరం: ఏళ్ల తరబడి పట్టి పీడిస్తున్న సమస్యలకు త్వరలో పరిష్కారం లభిస్తుందన్న ప్రజల ఆశలపై కూటమి నీళ్లు చల్లింది. టెండర్ల దశకు చేరిన రూ.75.28 కోట్ల విలువైన ఏడు పనులకు బ్రేక్ వేసింది. ఆ పనులు మొదలు పెట్టాలని కూటమి నేతలు కోరినా ఫలితం లేదు. సమస్యను ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పనులు జరిగేట్టు చూడాలని కోరినట్టు సమాచారం. అప్రోచ్‌లకు మోక్షం కలిగేనా? డెల్టా ఆధునికీకరణలో భాగంగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలో భీమవరం నియోజకవర్గంలోని యనమదుర్రు డ్రెయిన్‌పై వంతెనల నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు చేశారు. గొల్లవానితిప్ప, దొంగపిండి, పట్టణంలో రెస్ట్‌హౌస్ రోడ్డు వద్ద వంతెనలు నిర్మించారు. నిధులు చాలక అప్పట్లో అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో రాకపోకలకు ఆయా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు అదుపుతప్పి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో స్థానిక నాయకులు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా ఆయన స్పందించి అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి రూ.36.71 కోట్లు మంజూరు చేశారు. వీటిలో కాళీపట్నం–భీమవరం వంతెన వద్ద రూ.9.22 కోట్లు, భీమవరం–దొంగపిండి వంతెన వద్ద రూ.16.58 కోట్లు, దెయ్యాలతిప్ప–నాగిడిపాలెం వంతెన వద్ద రూ.10.91 కోట్లు మంజూరై టెండర్ ప్రక్రియ ప్రారంభం కాగా ఈలోపు ఎన్నికలు రావడంతో పనులకు బ్రేక్ పడింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టేసింది. అవసరమని చెప్పినా.. ఆయా పనుల ఆవశ్యకత దృష్ట్యా పనులు రద్దు కాకుండా కొనసాగించాలని కూటమి నేతలు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఇటీవల జిల్లాకు వచ్చిన ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి ప్రజాప్రతినిధులు ఈ విషయం తీసుకువెళ్లారు. రద్దు చేయకుండా వాటిని కొనసాగించాలని కోరగా ప్రభుత్వంతో మాట్లాడతానని ఆయన చెప్పినట్టు సమాచారం. కాగా ఆ పనులకు మరలా అంచనాలు రూపొందించి, ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపితే సాంకేతిక, పాలన అనుమతులు వచ్చి, టెండర్ ప్రక్రియ మొదలయ్యేసరికి చాలా సమయం పడుతుందని పలువురు అంటున్నారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఆశలు ఆవిరి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్రోచ్‌లు, రోడ్లకు నిధులు టెండర్ల దశకు చేరిన పనులకుబ్రేక్ వేసిన కూటమి సర్కారు ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యేలు -
కొల్లేరులో తుపాకుల మోత
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పక్షులను తోలే సంప్రదాయ వలస కూలీలు నాటు తుపాకులను వినియోగించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దశాబ్దాలుగా కొల్లేరులో నాటు తుపాకుల సంస్కృతి కొనసాగుతుండగా ఏటా పలువురు మృత్యువాతపడటం, గాయాల పాలవడం షరా మాములుగా తయారైంది. పెద్ద పక్షులు చెరువుల్లోని చేపలను ఆహారంగా తీసుకోవడానికి వచ్చినప్పుడు నల్లమందు వినియోగించి తుపాకీ పేలుళ్ల శబ్ధం చేస్తే కొన్ని గంటల పాటు చెరువు దరిదాపుల్లోకి రావు. దీంతో ఎక్కువ చెరువుల వద్ద గన్‌కల్చర్‌ను కొనసాగిస్తున్నారు. తాజాగా గత నెలలో మందుగుండు పేలి పది మంది గాయాలపాలై నలుగురు మరణించడం, అలాగే రెండు రోజుల క్రితం మిస్‌ఫైర్‌తో ముగ్గురు గాయాలైన ఘటన కొల్లేరులో చోటు చేసుకుంది.చెరువుల కాపలా పనులు చేస్తూ..ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో 901 చదరపు కిలోమీటర్ల పరిధిలో 2,22,300 ఎకరాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. 12 మండలాల్లో 3.50 లక్షల మంది ప్రజలు కొల్లేరుపై ఆధారపడి జీవిస్తున్నారు. మంచినీటి సరస్సుగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. విదేశాల నుంచి శీతాకాలంలో లక్షల సంఖ్యలో పక్షులు వలస వచ్చి కొల్లేరులో గుడ్లు పొదిగి తిరిగి వెళ్తుంటాయి. ఏటా కొల్లేరుకు విదేశాల నుంచి లక్షన్నరకు పైగా వివిధ జాతుల పక్షులు వీటిలో అత్యధికంగా పెలికాన్ పక్షులు వస్తుంటాయి. కొల్లేరులో ఆక్రమణల పర్వం దశాబ్దాలుగా యథేచ్ఛగా సాగుతోంది. ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమ సాగు అనేది ఇక్కడ నిత్యకృత్యం. ఈ క్రమంలో కొల్లేరులో చేపల చెరువుల కాపలా పనులకు నెల్లూరు, తమిళనాడుకు చెందిన వలస కూలీల కుటుంబాలు నిర్వహిస్తుంటాయి. ప్రధానంగా పులికాట్ సరస్సు ప్రాంతం వద్ద ఉండే వీరు సీజన్లో ఇక్కడకు వచ్చి పనులు చూసుకుని వెళ్తుంటారు.ప్రమాదం అంచున పనిస్థానికంగా కొల్లేరు ప్రాంతంలో నాటు తుపాకులు అద్దెకు ఇస్తుంటారు. కేవలం చెరువుల వద్దకు కాపలాకు మాత్రమే వీటిని వినియోగిస్తుంటారు. కొందరు వలస కూలీలు రోజూ కూలి కోసం ప్రమాద అంచున నిత్యం పనిచేస్తున్నారు. తుపాకుల పేలుళ్లు ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేక ఇదే పని చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక కులానికి చెందిన వారే నాటు తుపాకులతో పక్షులను వేటాడుతుంటారు. గత నెలలో కై కలూరు నియోజకవర్గం భైరవపట్నంలో ఇవే కుటుంబాలకు చెందిన ఒక ఇంట్లో మందుగుండు పేలి పది ఇళ్లు తగలబడి నలుగురు మృత్యువాతపడగా ముగ్గురికి గాయాలయ్యాయి. అలాగే రెండు రోజుల క్రితం కై కలూరు మండలం రామవరంలో మందుగుండు పేలి చరణ్, మణి సతీష్, కందాపుల మణికి తీవ్ర గాయాలయ్యాయి.నల్లమందుతో నాటు తుపాకులుభాస్వరం, పొటాషియం వంటి పేలుడు పదార్థాలను నూరి నల్లమందును తయారు చేస్తారు. చిన్నపాటి రాపిడి జరిగితేనే పేలే స్వభావం ఉంటుంది. వీటిని నాటు తుపాకుల్లో నింపి గాల్లో పక్షులు వచ్చినప్పుడు కాల్పులు చేస్తుంటారు. ప్రధానంగా తమిళనాడు, రాష్ట్రంలోని సూళ్ల్లూరుపేటకు చెందిన 150 కుటుంబాలు కై కలూరు, ఉండి నియోజకవర్గాల్లో నివాసం ఉన్నాయి. ఆక్వా చెరువుల యజమానులు రోజు కూలికి వీరిని తీసుకు వెళ్తుంటారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు చెరువు వద్ద నాటు తుపాకీతో కాపలా ఉంటే పెద్ద పక్షిని తోలితే రూ.200 నుంచి రూ.300 వరకు ఇస్తుంటారు. అలా కొందరు రూ.1,000 నుంచి రూ.3 వేల వరకు సంపాదించే పరిస్థితి. వీరు చెరువుల వద్దే తాత్కాలిక పాకలు వేసుకుని నివాసం ఉంటారు. -
ఘనంగా కాటన్ జయంతి
ఏలూరు(మెట్రో): ఏలూరు ఇరిగేషన్ డేటాకాంప్లెక్స్లో సర్ ఆర్థర్ కాటన్ 222వ జయంతిని ఇరిగేషన్ శాఖ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు చోడ గిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏలూరు ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చిలకపాటి దేవప్రకాష్, ఇంజనీర్స్ ఫెడరేషన్ కన్వీనర్ దేవరకొండ వెంకటేశ్వర్లు, ఎన్జీఓ సంఘ కార్యదర్శి ఎన్. రామారావు, నోరి శ్రీనివాస్, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే శర్వాణీ పబ్లిక్ స్కూల్ వద్ద ఏపీజేఏసీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ హరనాథ్ ఆధ్వర్యంలో కాటన్ జయంతి నిర్వహించారు. శ్రీపూడి శ్రీనివాసరావు, తెర్లి జయరాజు, భోగేశ్వరరావు పాల్గొన్నారు. 6,067 మంది విద్యార్థుల హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు 6,067 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ మ్యాథ్స్ బీ/ జువాలజీ/ హిస్టరీ పరీక్షలకు 5,059 మందికి 4,830 మంది, ఒకేషనల్ పరీక్షలకు 390 మంది హాజరయ్యారు. సెకండియర్ జనరల్ పరీక్షలకు 650 మందికి 601 మంది, ఒకేషనల్ పరీక్షలకు 269 మందికి 246 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు. ఏపీఆర్జేసీలో 2వ ర్యాంకు ద్వారకాతిరుమల: ఏపీఆర్జేసీ–2025 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ద్వారకాతిరుమలకు చెందిన పొడుదోలు సాయి పర్ణిక రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. అలాగే పాలిసెట్‌లో 37వ ర్యాంక్ సాధించినట్టు తల్లిదండ్రులు రాంబాబు, శ్యామలాదేవి తెలిపారు. సాయి పర్ణిక కామవరపుకోట మండలం తాడిచర్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతుండగా, టెన్త్ పరీక్షల్లో 593 మార్కులు సాధించింది. చదువులో రాణిస్తున్న సాయి పర్ణికను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. సమీకృత సాగుతో లాభాలు ఉంగుటూరు: స్థిరమైన, లాభదాయకమైన వ్యవసాయం కోసం సమీకృత సాగు మేలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. గురువారం మండలంలోని నాచుకుంట, వెల్లమిల్లిలో సమీకృత వ్యవసాయ విధానాన్ని ఆమె పరిశీలించారు. రైతులు గద్దె రత్నాజీ, పరిమి సత్యనారాయణతో మాట్లాడి సమీకృత సాగు, ప్రకృతి వ్యవసాయ విధానాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా సమీకృత వ్యవసాయ విధానాన్ని కలెక్టర్‌కు వివరించారు. ప్రకృతి వ్యవసాయాన్ని జిల్లా అంతటా అమలు చేయాలని యోచిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. రైతులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ వెంకటేష్, మండల వ్యవసాయ అధికారి ఎన్ఎస్ ప్రవీణ్‌కుమార్, తహసీల్దార్ పి.రవికుమార్ కలెక్టర్ వెంట ఉన్నారు. ఈ సెట్లో 601 మంది అర్హత ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ కోర్సుల్లో నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తూ ఈనెల 6న నిర్వహించిన ఏపీ ఈ సెట్ పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో పరీక్షలకు 657 మంది హాజరు కాగా 601 మంది అర్హత సాధించారు. వీరిలో 432 మంది బాలురు, 169 మంది బాలికలు ఉన్నారు. 91.48 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. పెదపాడు మండలం వసంతవాడకు చెందిన పరసా ఆదిత్యబాబు సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో 131 మార్కులతో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంక్ సాధించాడు. ఆకివీడు విద్యార్థినికి ఫస్ట్ ర్యాంక్ ఆకివీడు: జేఎన్టీయూ అనంతపురం నిర్వహిం చిన ఏపీఈసెట్– 20 25 పరీక్షలో బీఎస్సీ స్ట్రీమ్‌లో ఆకివీడు మండలం తరటావకు చెందిన కొట్టి గంగా భవానీ రాష్ట్రస్థాయిలో 95 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించింది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే దళిత కుటుంబానికి చెందిన కాశీ విశ్వనాథం కుమార్తె గంగాభవానీ డిగ్రీ ఏలూరు సీహెచ్‌ఎస్‌డీ థెరిస్సా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదివింది. -
నూరు శాతం లక్ష్యాలు సాధించాలి
జంగారెడ్డిగూడెం: ప్రభుత్వ రెవెన్యూ లక్ష్యాలను సాధించడంలో అలసత్వం వహించినా, చర్యలు తప్పవని జిల్లా ఉప రవాణా కమిషనరు షేక్ కరీం, జిల్లా రవాణా జిల్లా వాహన తనిఖీ అధికారులను హెచ్చరించారు. బుధవారం జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. కేసులున్న వాహన యజమానుల నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో ఆర్టీవోలు పాల్గొన్నారు. ఆస్థాన విద్వాంసుడిగా కేవీ సత్యనారాయణ ద్వారకాతిరుమల : శ్రీవారి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా తనను ప్రకటించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు ఏలూరుకు చెందిన ప్రముఖ కూచిపూడి నాట్య గురువు, సినీ నృత్య దర్శకుడు, నాట్య కళా విశారద కేవీ సత్యనారాయణ అన్నారు. ఎన్నో ఏళ్లుగా తన నాట్యం ద్వారా శ్రీవారిని సేవిస్తున్నట్టు చెప్పారు. నేడు కోకో రైతుల మహాధర్నా దెందులూరు : కోకో రైతులను అవమానపర్చడాన్ని నిరసిస్తూ గురువారం సోమవరప్పాడు జాతీయ రహదారి వద్ద కోకో రైతుల మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు కే.శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఉదయం కోకో రైతులకు మద్దతుగా అన్ని విభాగాల రైతులు మహాధర్నాలో పాల్గొని రైతులకు సంఘీభావాన్ని తెలియజేయాలని కోరారు. గింజలు కొనుగోలు చేయకుండా కంపెనీ ప్రతినిధులు రైతులను అవమానపరచడం క్షమించరాని విషయమన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 7,373 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా బుధవారం జరిగిన పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి మొత్తం 7373 మంది హాజరయ్యారు. ఉదయం ప్రథమ సంవత్సరం మ్యాథ్స్/బోటనీ/సివిక్స్ పరీక్షలకు జనరల్ విద్యార్థులు 6275 మందికి గాను 5983 మంది హాజరు కాగా, 408 మంది ఒకేషనల్ విద్యార్థులకు 367 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం 895 మంది జనరల్ విద్యార్థులకు 834 మంది హాజరు కాగా 211 మంది ఒకేషనల్ విద్యార్థులకు 189 మంది హాజరయ్యారు. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు ఆహ్వానం దెందులూరు: గోపన్నపాలెంలోని కేంద్రీయ విద్యాలయంలో 11వ తరగతి సైన్స్ గ్రూపులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ బూర్ సింగ్ మీనా అన్నారు. బుధవారం కేంద్రీయ విద్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 16 నుంచి 24 లోగా విద్యార్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలు కార్యాలయంలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు. రామశింగవరంలో భూకేటాయింపు నిలిపివేత సాక్షి, అమరావతి: ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలం రామశింగవరంలో ఏపీఐఐసీకి 173.60 ఎకరాల భూమిని కేటాయిస్తూ 2017లో జారీ చేసిన జీఓను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ భూమి అటవీ శాఖ నియంత్రణలోని పంచాయతీ అటవీ భూమిగా గుర్తించిన నేపథ్యంలో అటవీ (సంరక్షణ) చట్టం, 1980 ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతి వచ్చే వరకు కేటాయింపును నిలిపివేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులిచ్చారు. జిల్లా కలెక్టర్ నివేదిక ప్రకారం 2017లోనే ఏపీఐఐసీకి భూమి అప్పగించినా అటవీ శాఖ దాన్ని తమ ఆధీనంలో ఉన్నట్లు తెలిపి అభ్యంతరం వ్యక్తం చేసింది. రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి ‘గయాలు’గా నమోదై ఉండగా, అటవీ శాఖ దీన్ని 1993లో తమకు రిజర్వ్ భూములుగా ఇచ్చినట్లు తెలిపింది. దీంతో ఈ భూమిలో ఏపీఐఐసీ ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండా, అటవీ చట్టం కింద అనుమతులు పొందేవరకూ ఆగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
పోలవరంలో భారీ చోరీ
పోలవరం రూరల్: పోలవరంలో తాళాలు వేసి ఉన్న ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలవరం గ్రామానికి చెందిన పద్మనాభుని శ్రీనివాసు గుప్త ఐరన్ వ్యాపారి. మంగళవారం ఉదయం ఆయన భార్యతో కలిసి రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లారు. తిరిగి రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వచ్చి తాళాలు తీసి చూడగా, బీరువా తాళాలు బద్ధలు కొట్టి ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీఐ బాల సురేష్‌బాబు పరిశీలించారు. అలాగే చుట్టుపక్కల వారిని విచారించారు. డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీమ్‌తో పరిశీలించారు. గుర్తు తెలియని దుండగుడు ఇంటి వెనుక వైపు ఉన్న తలుపు గుండా ప్రవేశించి బీరువాలోని లాకర్ తాళాలు బద్ధలు కొట్టి 25 కాసుల బంగారం, నాలుగు కేజీల వెండి, రూ.8.60 లక్షల నగదును అపహరించినట్లు పోలవరం ఎస్సై ఎస్ఎస్ పవన్‌కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 25 కాసుల బంగారం, నాలుగు కేజీల వెండి, రూ. 8.60 లక్షల నగదు అపహరణ -
దంచికొట్టిన అకాల వర్షం
జిల్లావ్యాప్తంగా బుధవారం ఉదయం కురిసిన అకాల వర్షం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. గత కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. వేకువజాము నుంచే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో మామిడి రైతులకు నష్టం వాటిల్లింది. అలాగే పలు చోట్ల ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా సాయంత్రానికి 4.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు. – ఏలూరు (మెట్రో) -
వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణీ మృతి
పోలవరం రూరల్: పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో సకాలంలో వైద్యం అందక ఒక నిండు గర్భిణీ మృత్యువాత పడింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే గర్భిణీ మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలవరం మండలం కొత్తకుంకాల గ్రామానికి చెందిన తామ శిరీష (25) గర్భిణి. మంగళవారం రాత్రి నొప్పులు రావడంతో ఆటోలో ఆమెను భర్త పోలవరం వైద్యశాలకు తీసుకువచ్చారు. ఆ సమయంలో వైద్యాధికారి లేకపోవడంతో సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, రాజమంత్రి ఆసుపత్రికి తరలించాలని అంబులెన్స్ ఎక్కించగా, పరిస్థితి విషమించి ఆమె అంబులెన్స్‌లో మృతిచెందింది. షుగర్ లెవల్స్ పెరగడంతో మృతిచెందిందని వైద్యాధికారులు పేర్కొన్నారు. వైద్యాధికారి నిర్లక్ష్యానికి ఒక గిరిజన గర్భిణీ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యాధికారులు వైద్యం అందించక పోవడంతేనే ఈ ఘటన జరిగిందనే విషయం ప్రాథమిక దర్యాప్తులో తేలిందని జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ అధికారి డాక్టర్ పాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మృతురాలు శిరీషకు రెండేళ్ల పాప ఉంది. ఐటీడీఏ పీవో నాయక్ కూడా వైద్యశాలను పరిశీలించి ఘటనపై విచారణ నిర్వహించారు. మృతురాలి బంధువుల ఆరోపణ -
సారా నిర్మూలనకు ప్రత్యేక చర్యలు
నూజివీడు: జిల్లాలో నూజివీడు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, పోలవరం నియోజకవర్గాల్లో సారా తయారీ అధికంగా ఉందని ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కేవీ నాగప్రభు కుమార్ తెలిపారు. సారా నిర్మూలనకు నవోదయం–2 కింద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. స్థానిక ఎకై ్సజ్ స్టేషన్లో బుధవారం ఆయన మాట్లాడుతూ నిరంతరం సారా బట్టీలపై దాడులు, ఎకై ్సజ్ పాత నేరస్తులను బైండోవర్ చేయడం, సారా తయారీ గ్రామాల్లో కమిటీలు వేసి సారా నిర్మూలనకు చర్యలు తీసుకున్నామన్నారు. నూజివీడు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 47 సారా తయారీ గ్రామాలను గుర్తించామన్నారు. ఆయా గ్రామాల్లో సారా వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ మార్పు తీసుకువస్తున్నామన్నారు. ఇప్పటివరకు ఎకై ్సజ్ పాత నేరస్తులు 317 మందిని బైండోవర్ చేశామన్నారు. ఎకై ్సజ్ సీఐ ఏ మస్తానయ్య ఉన్నారు. కొబ్బరి చెట్టుపై పిడుగు దెందులూరు: కొవ్వలి గ్రామంలోని రాజుల పేటలో ఉన్న కనకమ్మ ఇంటి ఆవరణలో కొబ్బరి చెట్టుపై బుధవారం ఉదయం పిడుగు పడింది. ప్రశాంతంగా ఉండే పల్లెటూరులో ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో సమీప ఇళ్లలోని ప్రజలు బెంబేలెత్తి పరుగులు తీశారు. కొబ్బరి చెట్టు కాయలు కాలిపోవడం తప్ప ఎటువంటి నష్టం జరగకపోవడంతో ఇంటి యజమాని, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. భూసార పరీక్షలతో చేనుకు చేవ ముసునూరు: భూసార పరీక్షలతో చేనుకు చేవ, రైతులు లాభం పొందవచ్చని జిల్లా వ్యవసాయశాఖాధికారి హబీబ్ బాషా సూచించారు. మండలంలోని సూరేపల్లిలో ఆర్ఎస్కే వద్ద బుధవారం మట్టి నమూనా సేకరించు విధానంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి నమూనా సేకరణ, భూసార పరీక్షల వల్ల లాభాలను రైతులకు వివరించారు. మండలంలో 1200 మట్టి నమూనాల సేకరణ లక్ష్యం కాగా ఇప్పటికి 600 నమూనా సేకరణలు పూర్తి చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కె.చిన సూరిబాబు, ఏఈఓ రామకృష్ణ, వీహెచ్‌ఏలు, రైతులు పాల్గొన్నారు. -
సీట్లు పాయె.. నిధులు రావాయె
తాడేపల్లిగూడెం: ఇన్చార్జిల పాలన, బోర్డు ఆఫ్ గవర్నెన్స్ ఇష్టారాజ్యం కారణంగా ప్రతిష్టాత్మకమైన తాడేపల్లిగూడెం ఏపీ నిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో విద్యార్థుల భవితవ్యం మసకబారుతోంది. ప్రారంభంలో నిట్‌లో ఉన్న సీట్లు సంఖ్య భారీగా తగ్గించేయడంతో ఇక్కడి విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరంగల్ నిట్ మెంటార్‌గా ఉన్న సమయంలో నిధులు వచ్చాయి. ఇన్చార్జి డైరెక్టర్లు ఆరంభ సమయంలో తాత్కాలిక భవనంలో పనిచేసినప్పుడు నిధులు వచ్చాయి. తొలి రెగ్యులర్ డైరెక్టర్ వచ్చాక రూ.400 కోట్లకు పైగా వెచ్చించి పక్కా భవనాలు నిర్మించారు. సీట్ల సంఖ్య కూడా 480 నుంచి 750కు పెరిగింది. అనంతరం నిట్‌పై అవినీతి మరకలు పడ్డాయి. తొలి డైరెక్టర్ సస్పెండయ్యారు. ఇక ఇన్చార్జిల పాలన, బోర్డు ఆఫ్ గవర్నెన్సు ఇష్టారాజ్యంగా సాగింది. సీట్లు పోయినా అడిగే వారు లేరు. కేంద్ర ఉన్నత విద్యాశాఖను ప్రశ్నించేవారు కరువయ్యారు. కొంత కాలం ఇన్చార్జి డైరెక్టర్ పాలనలో ఇక్కడ తిష్టవేసిన ఆ నలుగురిదే రాజ్యం అన్నట్టుగా సాగింది. గతంలో ఇక్కడ మెంటార్‌గా వ్యవహరించిన డాక్టర్ ఎన్వీ రమణరావు ఇన్చార్జి డైరెక్టర్‌గా వచ్చారు. దీంతో నిట్ కాస్త గాడిలో పడ్డట్టు కనిపించినా, వెనక్కి పోయినా సీట్లు ఇంకా రాలేదు. నిధుల కోసం ప్రతిపాదనలు పంపినా ప్రస్తుతం ఏపీ నిట్ పరిస్థితి ఉన్న సీట్లు పాయె. నిధులు రావాయె అన్నట్టుగా తయారయ్యింది. సీట్ల కుదింపు శాశ్వత ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది లేని సమయంలో ఏపీ నిట్‌లో సీట్ల సంఖ్య 750 ఉంది. సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయింపు జరిగినా, అవి ఏపీ నిట్‌కు వచ్చేవి. ఏపీ నిట్‌లో తొలి డైరెక్టర్ సస్పెండ్ కావడాన్ని కేంద్ర ఉన్నత విద్యాశాఖలో బూచిగా చూపించడంలో అక్కడ అప్పట్లో ఏలిన ఆ నలుగురు కృతకృత్యులయ్యారు. బోర్డు ఆఫ్ గవర్నెన్స్‌కు ఇది వరంగా మారింది. సీట్లను తగ్గిస్తామన్నా.. ఇన్చార్జి డైరెక్టర్‌గా ఆ సమయంలో ఉన్న వారు అభ్యంతరం చెప్పలేదు. దీంతో బోర్డు ఆఫ్ గవర్నెన్సు ఏపీ నిట్‌లోని సంఖ్యను 750 నుంచి 480 కు తగ్గించారు. ఏడాదిన్నర దాటుతున్నా, ఇంకా సీట్లు 480 వద్దే ఉండిపోయాయి. ఫ్యాకల్టీలు వచ్చినా పెరగని సీట్లు శాశ్వత ఫ్యాకల్టీల నియామకం కోసం గత ఆగస్టులో నోటిఫికేషన్ ఇచ్చారు. 25 మందికి గాను 16 మంది ఫ్యాకల్టీలు వచ్చారు. అదే సమయంలో బోధనా సిబ్బంది 125 మందిని రిక్రూట్మెంటు చేసుకోవడం కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. పూర్తిస్థాయి డైరెక్టర్ లేరన్న ఒకే ఒక్క కారణంతో భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టలేదు. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కూడా ఇదే దారిలో నడిచింది. అంతిమంగా ఈ విద్యాసంవత్సరంలో అదనంగా రావాల్సిన, కోల్పోయిన 270 సీట్లు రాకుండా పోయాయి. పనులకు మోక్షం ఎప్పుడో.. నిట్ శాశ్వత భవనాల నిర్మాణంలో భాగంగా తొలిదశ పనులను ఏ, బీ కింద విభజించి రూ.400 కోట్ల పైబడి నిధులు వెచ్చించి పనులు పూర్తి చేశారు. కెనరా బ్యాంకు ద్వారా హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్ అసిస్టెన్సు(హెఫా) ద్వారా రూ.428 కోట్లకు ప్రతిపాదనలు పంపించారు. వీటిలో రూ.70 లక్షలతో పరిశోధనా పరికరాలకోసం ప్రతిపాదించారు. బాలురు వసతి గృహం, బాలికల హాస్టల్, ట్ల్రెనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్, ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్, రీసెర్చ్ పార్కు, డిపార్టుమెంటు బిల్డింగ్, ఇంటర్నేషనల్ విద్యార్థుల వసతి గృహం, ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ క్వార్టర్స్ నిర్మాణాల కోసం ప్రతిపాదనలు పంపించారు. ఆ పనులకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో వేచి చూడాల్సిందే. ఇన్చార్జిల పాలనతో అస్తవ్యస్తంగా నిట్ తగ్గిన సీట్లు.. ఆగిన నియామకాలు వెనక్కి వెళుతున్న ప్రగతి సీట్లు, నిధులు వస్తాయి ఏపీ నిట్‌లో ప్రస్తుతానికి సీట్ల సంఖ్య 480కి తగ్గినా త్వరలోనే మిగిలిన 270 సీట్లు తిరిగివస్తాయి. నిర్మాణాల కోసం పంపించిన ప్రతిపాదనల సొమ్ములు ఆరు నెలల్లో వస్తాయని భావిస్తున్నాం. –దినేష్ రెడ్డి, ఏపీ నిట్ రిజిస్ట్రార్ -
ప్రభుత్వ జీవోలను వ్యతిరేకించిన ఉపాధ్యాయ సంఘాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీఓ 19 ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల పాఠశాలలను ఏర్పాటు చేస్తారు. జీఓ 20 ప్రకారం ఉపాధ్యాయుల, విద్యార్థుల నిష్పతిని నిర్ణయిస్తారు. ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీఓలపై ధన్యవాదాలు తెలపాలంటూ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారం బుధవారం ఏలూరు డీఈఓ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ జీవోలను అన్ని ఉపాధ్యాయ సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని.. వీటిపై ఇప్పటికే కొన్ని సంఘాలు ఆందోళనబాట పట్టాయని, త్వరలోనే రాష్ట్ర స్థాయిలో కూడా ధర్నాలు చేయడానికి తేదీలు కూడా ప్రకటించామని జిల్లా విద్యాశాఖాధికారికి వివరించినట్టు తెలిసింది. తాము వ్యతిరేకించిన జీఓలను సమర్ధించినట్లు ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడంలో ఆంతర్యమేమిటని డీఈఓను గట్టిగానే నిలదీసినట్టు తెలిసింది. ఆయా జీవోలపై తమ వ్యతిరేకతను ప్రభుత్వంతో పాటు విద్యాశాఖ కమిషనర్ దృష్టికి కూడా తీసుకువెళ్ళాలని సమావేశంలో డీఈఓను కోరారు. -
ఎర్రకాలువ తవ్వేశారు
జంగారెడ్డిగూడెం: మట్టి మాఫియా ఎర్రకాలువ జలాశయం గర్భంలో భారీగా తవ్వేసి మట్టిని తరలించేశారు. జలాశయం గర్భాన్ని తెగ తవ్వేశారు. దీంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. ఈ మట్టి మాఫియా ప్రధాన సూత్రదారి జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన టీడీపీ నాయకుడు. అంతా తానై ఎర్రకాలువ జలాశయం గర్భాన్ని తవ్వేసి మట్టిని అమ్మేసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా రాత్రి సమయాల్లో జేసీబీ పెట్టి తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. పగలు జేసీబీని సమీపంలోని పొలాల్లో పెట్టి.. రాత్రి మట్టి తవ్వేసి యథేచ్ఛగా తరలించేస్తున్నారు. ఎర్రకాలువ జలాశయం గర్భంలో మట్టిని తవ్వేసి తరలించేస్తున్నారని సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా అధికారులు స్పందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కొంతమంది దీనిపై ఆయా శాఖల అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు. ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా దీనిపై స్పందించడం లేదు. మట్టి తరలిస్తున్నారని ఇరిగేషన్ కింది స్థాయి అధికారికి చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. క్షేత్రస్థాయిలో నిత్యం జలాశయాన్ని పరిశీలించాల్సిన అధికారి జలాశయం పరిధిలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. చేపలు పట్టేందుకు మత్స్యకారులు, పశువుల్ని కడిగేందుకు పశువుల కాపరులు ఈ జలాశయంలోకి దిగుతుంటారు. భారీ గోతులు వీరి ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి. -
వైభవంగా వసంతోత్సవం
ముగిసిన వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు బుధవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఉదయం కల్యాణ మండపంలో అర్చకులు శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చనాది కార్యక్రమాలు జరిపి, హారతులిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు వసంతాలు సమర్పించి, చూర్ణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగా స్వామిని కీర్తిస్తూ అర్చకులు, మహిళా భక్తులు వడ్లు దంచారు. ఆ తరువాత రాజాదిరాజ వాహనంపై శ్రీవారికి తిరువీధి సేవను నిర్వహించి, భక్తులకు వసంతాలు అందజేశారు. అలాగే రాత్రి ఆలయంలో స్వామి వారికి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవాన్ని అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు. ఉభయ దేవేరులతో శ్రీవారికి రాత్రి ఆలయంలో 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదనలు జరిపారు. శ్రీపుష్ప యాగోత్సవాన్ని వైభవోపేతంగా జరిపారు. ఆలయ ముఖ మండపంలో శయన మహావిష్ణువు అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. ఈ వేడుకలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. నేటి నుంచి ఆర్జిత సేవలు శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో రద్దు చేసిన నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను గురువారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. -
ముగిసిన జిల్లాస్థాయి చదరంగం పోటీలు
జంగారెడ్డిగూడెం: పట్టణంలోని ప్రతిభ స్కూల్ నందు శ్రీ హంస చెస్ అకాడమీ, ఏలూరు జిల్లా అడ్‌హక్ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్ 11 బాల బాలికల చదరంగ పోటీలు బుధవారం ముగిశాయి. ఈ పోటీల్లో బాలుర విభాగంలో యడ్ల జ్యోతి స్వరూప్, కుకునూరి తశ్విన్, బాలికల విభాగంలో యడ్ల ప్రేమ్ రక్షిత, వేగేశ్న ఇషిత సాయిశ్రీ విజేతలుగా నిలిచినట్లు టోర్నమెంట్ డైరెక్టర్ కన్నా సూర్య నాగేశ్వరరావు తెలిపారు. విజేతలు ఈ నెల 24, 25 తేదీల్లో గుంటూరులో జరిగే అండర్ 11 స్టేట్ చెస్ చాంపియన్ షిప్కి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ప్రతిభ స్కూల్ ప్రిన్సిపాల్ సరోజ రెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అయినపర్తి చంద్రశేఖర్, టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీబీఎస్ఈ ఫలితాల్లో భారతీయ విద్యాభవన్స్ ప్రతిభ భీమవరం: సీబీఎస్ఈ పరీక్షా ఫలితాల్లో భారతీయ విద్యా భవన్స్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని భవన్స్ చైర్మన్ ఉద్ధరాజు కాశీ విశ్వనాధరాజు, సెక్రటరీ ఎస్ శ్రీరామరాజు చెప్పారు. టెన్త్ పరీక్షల్లో సీహెచ్ఎంవీ శ్రీకార్తిక్ 488 మార్కులు, ఆర్ సాయిశ్రీరామ్ 482, ఎస్ కీర్తన 482, సాయి పి పాండ 471 మార్కులు సాధించారన్నారు. సీబీఎస్ఈ +2 (ఇంటర్)లో కె హంసిక 477 మార్కులతో జిల్లాలో ప్రథమస్థానంలో నిలవగా వీఎల్ చెక్రిష్ 459, ఎ ఆదర్శ్ 456, జి ప్రణీత్ వర్మ 410, చిరాగ్ అగర్వాల్ 407, కె ధర్మతేజ 394 మార్కులు సాధించినట్లు చెప్పారు. రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్వంలో నడుస్తున్న భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం స్కూల్స్‌లో విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. బుధవారం భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన సభలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను భవన్స్ యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో కొత్త శ్రీనివాస్, ఎం.సత్యనారాయణమూర్తి, రఘుపతిరాజు, ప్రిన్సిపాల్ సురేష్ బాలకృష్ణన్, వైస్ ప్రిన్సిపాల్ పద్మ, పవన్, కంతేటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఏలూరు జిల్లా భీమడోలులో విషాదం
ఏలూరు, సాక్షి: ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోమటి గుంట చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి పెదవేగి మండలం వేగివాడకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానికులు గల్లంతైన ఇద్దరు యువకులను సురక్షితంగా బయటకు తీశారు.ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. యువకుల మరణంపై వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కోకో రైతుకు సిండికేట్ దెబ్బ
బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు : జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లతో మాకు సంబంధం లేదు. మేం చెప్పిందే రేటు.. లేకపోతే ఏ కంపెనీ కోకో గింజలు కొనదు. ఇది కోకో వ్యాపారులు సిండికేట్ అయ్యి ఇస్తున్న అల్టిమేటం. అంతర్జాతీయ మార్కెట్లో కిలో గింజలు రూ.700 నుంచి రూ.800 పలుకుతుంటే ఏలూరు జిల్లాలో మాత్రం సిండికేట్ వ్యాపారుల వల్ల కేవలం రూ.450కే కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక కోకో సాగు ఏలూరు జిల్లాలోనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ధరను ప్రామాణికంగా తీసుకుని గతేడాది వరకు అదే ధరలు చెల్లించిన వ్యాపారులు పూర్తిగా సిండికేట్ అయ్యి స్థానికంగా ధరలు నిర్ణయించడంతో కోకో రైతులు తీవ్ర సంక్షోభంలో పడ్డారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 50 వేల ఎకరాల విస్తీర్ణంలో కోకో విస్తరించింది. కొబ్బరి, పామాయిల్లో అంతర్ పంటగా సాగుచేస్తున్నారు. 2018 నుంచి కోకో సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. ఏలూరు జిల్లాలో 2020లో 18,483 ఎకరాలు, 2021లో 20,350 ఎకరాలు ఉన్న కోకో సాగు, 2025 నాటికి 36,290 ఎకరాలకు చేరింది. గతేడాది పోటీపడి కొనుగోలు గతేడాది ఏప్రిల్, మే నెలలో కిలో కోకో గింజలు అత్యధికంగా రూ.1000కి పైగా పోటీ పడి మరీ కొనుగోలు చేశారు. గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం ఇక్కడ కోకో సాగుకు భాగా కలిసివచ్చే అంశం. ఒక్క ఏలూరు జిల్లా నుంచే ఏటా 12 వేల మెట్రిక్ టన్నుల కోకో దిగుబడి ఉంది. గత మూడేళ్లుగా సగటున రూ.350 ధరతో ప్రారంభమై, 2024 ఏప్రిల్ నాటికి రూ.1040కి చేరింది. మరో 30 ఏళ్ల పాటు కోకోకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. దేశీయ అవసరాలకు ఏటా 1.10 లక్షల టన్నుల డిమాండ్ ఉన్నప్పటికీ దేశంలో 30 వేల మెట్రిల్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగిలింది విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు రూ.40 వేల నుంచి రూ.50 వేల ఉన్న ఎకరం పొలం కౌలు ధర రూ.లక్ష నుంచి అత్యధికంగా రూ.1.20 లక్షలకు చేరింది. గతంలో నాణ్యతతో సంబంధం లేకుండా ఎలాంటి కోకో గింజలనైనా ఒకే ధరకు కొనుగోలు చేశారు. ఇప్పుడు వ్యాపారులు పూర్తిగా సిండికేట్‌గా మారి ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారు. 70 శాతం మండలీజ్ కంపెనీ కొనుగోలు కోకో గింజలను స్థానంగా మండలీజ్, జిందాల్, హెరిటేజ్, డీపీ చాక్లెట్, సూర్య ట్రేడర్స్‌తో పాటు కొందరు వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. వీటిలో 70 శాతానికి పైగా కొనుగోళ్లు మండలీజ్ కంపెనీ చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వారం రూ.750 నుంచి రూ.800 ధరకు కోకోను కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా 5 నుంచి 10 శాతం వ్యత్యాసంలో అదే ధర చెల్లించాలి. వ్యాపారులు సిండికేట్‌గా మారి రూ. 450 ధరకు కొనుగోలు చేస్తున్నారు. అది కూడా ఈ ఏడాది జనవరిలో రూ.650తో ప్రారంభమైన లోకల్ మార్కెట్ ధర మే నాటికి రూ.450కు చేరింది. దీనిపై కోకో రైతు సంఘం పోరు బాట పట్టి కమిషనరేట్ ముట్టడి మొదలుకుని అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. కోకో రైతుల మొర పట్టని సర్కారు గత నెలలో వ్యవసాయ శాఖ మంత్రి వద్ద సమావేశం నిర్వహించి, వ్యవసాయశాఖ మంత్రి అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాలని కోరింది. చివరకు కంపెనీలు రూ.550కు కొనుగోలు చేస్తాయని చెప్పి మాట తప్పారు. దీంతో పాటు ఎంపిక చేసిన రైతుల వద్ద మాత్రమే కొనుగోలు చేయడం, పూర్తి ప్రాసెసింగ్ రైతే చేయాలని షరతులు విధించడం, అంతర్జాతీయ మార్కెట్ వర్తించదు, మేం ఇచ్చిన రేటే తీసుకోవాలని నిర్ణయించి మరీ మార్కెట్‌ను శాసిస్తున్నారు. దీంతో ఈ ఏడాది కోకో సాగుదారులు పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయారు. న్యూస్‌రీల్ రోజురోజుకూ ధరల తగ్గింపు అంతర్జాతీయ మార్కెట్లో కిలోకు రూ.750కి పైగానే ధర స్థానికంగా రూ.450 మాత్రమే ఇస్తున్న వైనం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నెలకు రూ.100 చొప్పున తగ్గుదల ఉమ్మడి జిల్లాలో 50 వేల ఎకరాల్లో కోకో సాగు మాపై ఉదాసీనత ఎందుకు? విజయరాయిలో 20 ఎకరాల్లో కోకో సాగు చేస్తున్నాను. సీజన్లో 100 గ్రాములకు 80 నుంచి 100 గింజలు వస్తాయి. అన్ సీజన్లో 100 గ్రాములకు 120 నుంచి 140 గింజలు వస్తాయి. రెండూ కలిపి సంక్రాంతి తరువాత అమ్ముకునే వాళ్ళం. హఠాత్తుగా ధర తగ్గించేశారు. ప్రస్తుతం రూ 350 నుంచి రూ.450 మధ్య కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రూ.750 నుంచి రూ.800 వరకు కొనుగోలు చేస్తున్నారు. – కొనేరు సతీష్‌బాబు, విజయరాయి నష్టాల్లో మునిగిపోయాం చిన్న సన్నకారు కోకో రైతులు నష్టాల్లో మునిగిపోయారు. గతేడాది రూ.1040 వరకు కోకోకు గిట్టుబాటు ధర ఇచ్చారు. నేడు రూ.400 మాత్రమే ఇస్తున్నారు. రైతులు చాలా పెట్టుబడి పెట్టారు. మండలీజ్ వ్యాపారస్తులందరూ సిండికేట్‌గా మారి రైతులను ముంచేశారు. మండలీజ్ కంపెనీ బయట వ్యాపారస్తులని రానివ్వకుండా చేసి, చిన్న రైతులకు నష్టం చేస్తున్నారు. – వంకినేని లక్ష్మీనారాయణ, వంగూరు, లక్ష్మీపురం గ్రామం -
భారీగా సెల్‌ఫోన్స్ రికవరీ
‘సింగిల్’ బృందం సందడి సింగిల్ చిత్ర బృంద సభ్యులు మంగళవారం ఏలూరులో సందడి చేశారు. నగరంలోని ఎస్వీసీ థియేటర్లో ప్రేక్షకులను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. 8లో u15వ విడతలో 594 సెల్ఫోన్లు బాధితులకు అందజేత ఏలూరు టౌన్: జిల్లా పోలీసులు శ్రమించి వందలాది సెల్ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద రికవరీ చేసిన సెల్ఫోన్లు మంగళవారం ఎస్పీ చేతులమీదుగా బాధితులకు అందజేశారు. 15వ విడతలో 594 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. వాటి విలువ మార్కెట్లో సుమారు రూ.71.28 లక్షలు ఉంటుందని అంచనా. ఏలూరు జిల్లాలో మొత్తంగా 15 విడతల్లో 2,976 మొబైల్ ఫోన్లు పోలీస్ అధికారులు రికవరీ చేశారు. ఈ సెల్ఫోన్ల విలువ ఏకంగా రూ.4.75 కోట్లు ఉంటుందని అంచనా.. ఈ సందర్భంగా ఎస్పీ కేపీ శివకిషోర్ మాట్లాడుతూ... చోరీ వస్తువులు కొనడం, విక్రయించటం రెండూ నేరమేనని స్పష్టం చేశారు. సైబర్ నేరాలు, చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ ఇళ్లు, షాపులు, ఇతర రద్దీ ప్రాంతాల్లోని దుకాణ సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఏదైనా నేరం జరిగితే నిందితులను పట్టుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. సెల్‌ఫోన్ పోయిన వెంటనే ఫిర్యాదు చేయటంతోపాటు సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. సైబర్ నేరాల నిరోధానికి 1930కి కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్.జీవోవీ.ఇన్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, బీ.ఆదిప్రసాద్, సైబర్ క్రైమ్ ఎస్ఐ రాజా, తదితరులు పాల్గొన్నారు. -
మురళీ నాయక్‌కు నివాళి
కై కలూరు: పాకిస్థాన్ ముష్కరుల దాడిలో అసువులు బాసిన అమరవీరుడు మురళీనాయక్ త్యాగం ఎంతో గొప్పదని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) చెప్పారు. కై కలూరు పార్టీ కార్యాలయం వద్ద అమరవీరుడు చిత్రపటానికి మంగళవారం ఘన నివాళి అర్పించారు. డీఎన్నార్ మాట్లాడుతూ దేశం కోసం పోరాడుతూ జమ్మూ కశ్మీర్లో అమరులైన అగ్ని వీర్ జవాన్ మురళి నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ బలే నాగరాజు, మండల పార్టీ అధ్యక్షుడు సింగంశెట్టి రాము, మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ గాలిబ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
జాబ్ కార్డులు ఉన్న అందరికీ పని కల్పించాలి
దెందులూరు: జాబ్ కార్డులు పొందిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. దెందులూరు మండలం సానిగూడెంలో రూ.25 లక్షలతో సాగునీటి అవసరాలకు ఉపయోగపడే 68 ఎకరాలు కొత్త చెరువు నిర్మాణ పనులను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. పని ప్రదేశంలో కూలీలకు తాగునీరు, మజ్జిగ వంటివి అందించాలని, ఎండదెబ్బ తగలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 6 గంటల నుంచే పనులు ప్రారంభించి 10 లోపు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఎంత మంది పనికి వచ్చారని మస్తరు షీటు పరిశీలించి నలుగురు ఎందుకు రాలేదని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి ఏలూరు(మెట్రో): జిల్లాను నాటు సారా రహితంగా తీర్చిదిద్దేందుకు ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఎకై ్సజ్ డీసీ బి.శ్రీలతతో కలెక్టర్ కె.వెట్రిసెల్వి నవోదయం (నాటుసారా నిర్మూలన) కార్యక్రమం ప్రగతి, నాటుసారా వల్ల కలిగే అనర్ధాలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ సారా తయారీ, రవాణా విక్రయాలు కొన సాగించే వారిపై ఇకపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. మద్యపాన అనర్ధాలపై అవగాహన కలిగించేందుకు ర్యాలీలు నిర్వహించాలన్నారు. -
వైభవంగా శ్రీచక్ర స్నానం
● నేత్రపర్వంగా తొళక్కం, అశ్వ వాహన సేవలు ● నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం శ్రీచక్ర స్నానాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లు తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. అనంతరం అర్చకులు ఆలయ యాగశాలలో శ్రీవారు, అమ్మవార్లు, శ్రీచక్ర పెరుమాళ్ల ఉత్సవ మూర్తులను ఒక వేదికపై వేంచేపు చేశారు. పూజాధికాల అనంతరం సుగంధ ద్రవ్యాలు, పంచపల్లవులు, శ్రీచందనం, పసుపు, మంత్ర పూత అభిషేక తీర్ధంతో శ్రీచక్ర స్వామిని అభిషేకించారు. సాయంత్రం నిత్యహోమ బలిహరణలు, పూర్ణాహుతి, అనంతరం ధ్వజ అవరోహణ వేడుకలను అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో శ్రీవారి కాళీయమర్ధనం అలంకారం భక్తులకు కనువిందు చేసింది. రాత్రి అశ్వవాహనంపై తిరువీధి సేవను నిర్వహించారు. బుధవారం రాత్రి జరిగే శ్రీపుష్ప యాగోత్సవంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో నేడు : ● ఉదయం 9 గంటల నుంచి – చూర్ణోత్సవం, వసంతోత్సవం ● సాయంత్రం 6 గంటల నుంచి – కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● రాత్రి 7 గంటల నుంచి – ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగం–పవళింపు సేవ ● రాత్రి 9 గంటల నుంచి – రామాంజనేయ యుద్ధం నాటకం ● ప్రత్యేక అలంకారం : శయన మహావిష్ణువు -
మీసం మెలేసేందుకు నీలకంఠ రెడీ
కై కలూరు: రాష్ట్రంలో ఒకప్పుడు స్కాంపీ(మంచినీటి నీలకంఠ) రొయ్యల సాగు సిరులు కురిపించింది. ఆక్వా రంగంలో నూతన అధ్యాయనాన్ని సృష్టించింది. వైట్ టెయిల్ వ్యాధి విత్తన దశ నుంచి రావడంతో నర్సరీల్లోనే స్కాంపీ విత్తనాల మరణాలకు దారితీసింది. వ్యాధులు, సాగు సమయం ఎక్కువగా ఉండటం, పెరుగుదలలో వివిధ సైజులు వంటి కారణాలతో సాగు కనుమరుగైంది. ఈ తరుణంలో 2009 నుంచి వనామీ రావడం, తక్కువ ఉప్పు సాంద్రతలో సైతం పెరగడంతో రైతులందరూ ఈ సాగుకు మారారు. నేడు వనామీ సాగులోనూ వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. ఇప్పుడు జన్యుపరంగా అభివృద్ధి చేసిన స్కాంపీ రొయ్యలు అందుబాటులోకి వచ్చాయి. అందుబాటులోకి స్కాంపీ విత్తనాలు ఆంధ్రప్రదేశ్‌లో 5.75 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. రొయ్యల సాగు చేసే రైతులు 1.5 లక్షల మంది ఉన్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా ఇందులో 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. ప్రధానంగా వనామీ రకం సాగు జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పూర్వం టైగర్ రొయ్యల సాగు తెల్లమచ్చల వైరస్ వ్యాధి బారిన పడడంతో చాలామంది రైతులు స్కాంపీ సాగును ప్రత్నామ్నాయంగా చేశారు. తర్వాత స్కాంపీని కూడా వ్యాధులు వదలలేదు. 2005 నుంచి స్కాంపీ సాగు తగ్గిపోయింది. తిరిగి జన్యుపరంగా అభివృద్ధి చేసిన స్కాంపీ విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. నాణ్యత కలిగిన స్కాంపీ విత్తనాల ఉత్పత్తి కేంద్రీయ మంచినీటి ఆక్వా సాగు కేంద్రం, భువనేశ్వర్, ఒడిశా (సీఐఎఫ్ఏ) అనేక పరిశోధనలు జరిపి, స్కాంపీ రొయ్యలలో జన్యు పరంగా మెరుగైన రకాన్ని ఉత్పత్తి చేశారు. 2020 సంవత్సరంలో దీనికి సీఫా జీఐ స్కాంపీ ట్రేడ్ మార్క్‌తో కొన్ని ఎంపిక చేసిన హేచరీలకు బ్రూడ్ స్టాక్‌ని సరఫరా చేస్తున్నారు. ఈ హేచరీలలో జన్యు పరంగా మెరుగైన విత్తనం తయారు చేసి, రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ఎంపెడా సంస్థ ఆర్జీసీఏ విభాగం కృష్ణాజిల్లా మంచినీటి రొయ్యలపై పరిశోధనలు జరిపి సెలక్టివ్ బ్రీడింగ్ ద్వారా మంచి నాణ్యత కలిగిన స్కాంపీ రకాలను ఉత్పత్తి చేసింది. నియో ఫీమేల్స్ ద్వారా ‘ఆల్ మేల్ స్కాంపీ’ విత్తనాన్ని ఉత్పత్తి చేస్తోంది. దీంతో ఒకే పరిమాణం, త్వరగా పెరుగుదల, వ్యాధి నిరోధక శక్తి కలిగిన రొయ్య విత్తనాన్ని రూపొందించారు. చేపలతో పాటు రొయ్యల సాగు ఆక్వా రంగంలో అనేక విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. కొంతమంది సన్న, చిన్నకారు రైతులు ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పాలీకల్చర్ ద్వారా చేపలతో పాటుగా రొయ్యలను పెంచి ఫలితాలు సాధిస్తున్నారు. జన్యుపరంగా అభివృద్ధి చేసిన స్కాంపీ రొయ్యలను చేపలతో పాటు సాగు చేసుకునే అవకాశం ఉంది. స్కాంపీతో పాటుగా గోదావరీ నది ఆనకట్టల వద్ద లభించే కాళ్ళ రొయ్య విత్తనాన్ని సేకరించి మంచినీటి పెద్దచెరువులలోను, రిజర్వాయర్లలోను చేప పిల్లలతోపాటుగా వదిలి ఉత్పత్తి పెంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్కాంపీ సాగును తిరిగి మెరుగైన రీతిలో అవలంభిస్తే విదేశీ వనామీ రొయ్యలపై ఎక్కువగా ఆధారపడనవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. స్కాంపీ ఉత్పత్తి మొదలైనప్పుడు, దానికున్న మార్కెట్‌ను బట్టి వనామీ మార్కెట్‌కు డిమాండ్ తగ్గకుండా ధరల స్థిరీకరణకు అవకాశముంటుందని సూచిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అవసరం రైతులకు, హేచరీలకు సరైన సాంకేతిక పరిజ్ఞానం, అవగాహన కలిగించాలి. జన్యుపరంగా మెరుగైన స్కాంపీ బ్రూడర్స్‌ను వీలైనన్ని ఎక్కువ హేచరీలకు సరఫరా చేయాలి. టెక్నీషియన్లు, ఫిషరీస్ అధికారులు, రైతులకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలి. ప్రభుత్వ, ప్రైవేట్ హేచరీలలో అనుకూల మౌలిక సదుపాయాలు, వసతులు, బయోసెక్యురిటీతో బ్రూడర్స్‌ను సరఫరా చేసి బ్రీడింగ్నకు తగిన సలహాలు అందించాలి. – డాక్టర్ పి.రామ్మోహనరావు, విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ ఆఫ్ ఫిషరీస్, కాకినాడ జన్యుపరంగా స్కాంపీ రొయ్య అభివృద్ధి వనామీకి ప్రత్యామ్నాయమంటున్న నిపుణులు కృషా ్ణజిల్లాలో ఆల్ మేల్ స్కాంపీ విత్తన అభివృద్ధి నెల్లూరు, తణుకు ప్రాంతాల్లో బ్రీడింగ్ విత్తనాలు -
నాటు తుపాకులతో వేటగాళ్లు హల్చల్
ఏలూరు: నాటుతుపాకులతో వేటగాళ్లు హల్చల్ చేస్తున్నారు. ప్రతిరోజు ఆక్వా చెరువులపై పిట్టలు కొట్టేందుకు తుపాకులను విచ్చలవిడిగా వాడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, అర్తమూరు తదితర గ్రామాలతోపాటు ఆకివీడు, కాళ్ళ, పాలకోడేరు, భీమవరం రూరల్ మండలాలు, ఏలూరు జిల్లాలోని గణపవరం, నిడమర్రు మండలాల్లోను ఇదే విధంగా నాటు తుపాకులు దర్శనమిస్తున్నాయి. పట్టపగలే వాహనాలపై తుపాకులను చేతపట్టుకుని తిరుగుతున్నా పోలీసులు గానీ, ఇతర అధికారులు గానీ ఎవరూ పట్టించుకోడం లేదంటూ సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. తుపాకీ గురితప్పితే తమ పరిస్థితి ఏంటని ఆయా మండలాల్లోని ప్రజలు, వ్యవసాయ కూలీలు ఆందోళన చెందుతున్నారు.ఇది నేరం కాదా?నాటు తుపాకీలతో కేవలం పిట్టలనే కాలుస్తున్నారా.. లేక మరేదైనా జరుగుతుందా.. తుపాకుల సరఫరా ఎక్కడ నుంచి జరుగుతుంది అంటూ పలువురు వీటిపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ నాటు తుపాకులతో ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వేటగాళ్లు ఇంత బహిరంగంగా ఎలా వస్తున్నారు? వారికి రూ.30 వేలు నుంచి రూ.40 వేలు జీతాలు ఎలా ఇస్తున్నారు?ఇదేమీ నేరం కాదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.గతంలో నాటుతుపాకీతో దారుణాలుగతంలో నాటుతుపాకీతో జరిగిన దారుణాలు గుర్తు తెచ్చుకుని ప్రజలు భయపడుతున్నారు. గతంలో సరిగ్గా పంచాయతీ ఎన్నికల సమయంలో మండలంలోని ఎన్నార్పీ అగ్రహారంలో నాటుతుపాకీతో ఓ హత్య జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పుడు కూడా ఆక్వా చెరువులపై పిట్టలు కొట్టేందుకు తెచ్చిన నాటుతుపాకీగా పోలీసులు గుర్తించినట్లు పలువురు చెబుతున్నారు. అలాగే చెరువుకువాడ గ్రామంలో నాటు తుపాకీతో ఓ వ్యక్తి కోతి(వానరం)ని కాల్చడం కూడా సంచలనానికి దారి తీసింది. ఇంతటి భయంకరమైన ఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టంచుకోకపోవడంపై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వెంటనే వీటిపై చర్యలు తీసుకుని ప్రజల ప్రశాంత జీవనానికి అండగా నిలవాలని వారు కోరుతున్నారు. -
కోకో రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలి
ఏలూరు (టూటౌన్): కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాలని, ఇప్పటివరకు కొనుగోలు చేసిన కోకో గింజలకు కూడా వ్యత్యాసపు ధర చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. మోండలీజ్ కంపెనీ ప్రతినిధులు రైతులను అవమానపరచడాన్ని నిరసిస్తూ, అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15వ తేదీన ఉదయం 10 గంటలకు సోమవరప్పాడు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న మోండలీజ్ కంపెనీ కార్యాలయం, గోడౌను వద్ద కోకో రైతుల ధర్నా నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఏలూరు అన్నే భవనంలో సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించకుండా కంపెనీలు కోకో రైతులను నిలువు దోపిడీ చేయడం దారుణమని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ సమావేశంలో విశ్రాంత డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోకో రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం, కంపెనీలు చర్యలు చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎస్. గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోళ్ల వెంకట సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర నాయకులు కోనేరు సతీష్ బాబు, ఏబీఎస్ ప్రకాశరావు, యలమాటి విశ్వేశ్వరరావు, ఏ.శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
వీర జవాన్లకు ఘన నివాళి
ఏలూరు టౌన్: దేశం కోసం వీర మరణం పొందడం పూర్వజన్మ సుక్రుతమని, దేశంలోని జవానుల త్యాగాలు మరువలేమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా వీర మరణం పొందిన అమరవీరులు జవాన్ మురళీ నాయక్, వాయుసేనలో మెడికల్ ఆఫీసర్ సురేంద్రకుమార్‌కు వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఏలూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో వారిద్దరి చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జవానుల త్యాగాలను డీఎన్నార్, ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుడిదేశి శ్రీనివాసరావు, మున్నల జాన్‌గురునాథ్, నెరుసు చిరంజీవి, కేసరి సరితా రెడ్డి, తేరా ఆనంద్, నూకపెయ్యి సుధీర్‌బాబు, షేక్‌బాజీ, బాస్కర్ల బాచి, జిజ్జువరపు విజయనిర్మల, కిలాడి దుర్గారావు, కంచుమర్తి తులసీ, బుద్దల రాము, పాతినవలస రాజేస్, స్టాలిన్, షమీమ్, వైస్ ఎంపీపీ టీ,గిరిజ తదితరులు ఉన్నారు. భూవివాదంలో జనసేన శ్రేణులు కొయ్యలగూడెం: భూవివాదంలో జనసేన పార్టీ శ్రేణుల వ్యవహారంపై స్థానికులు ఎమ్మెల్యేని చుట్టుముట్టి తమపై జరిగిన దౌర్జన్యాన్ని వివరించిన ఘటన కొయ్యలగూడెంలో సోమవారం జరిగింది. దీంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జనసేన శ్రేణులను మందలించడం కనిపించింది. తహసీల్దార్ కే చెల్లన్న దొరతో కలసి కొయ్యలగూడెంలోని వివాదాస్పద భూమి వద్దకు వచ్చిన ఆయన జాతీయ రహదారికి పక్కన ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆ భూమి వివరాలను పరిశీలించారు. స్థలం తమదంటూ బయటి వ్యక్తులు వచ్చారని, వారికి మద్దతుగా జనసేన, టీడీపీ నాయకులు ఉన్నారని స్థానికులు ఎమ్మెల్యేకి వివరించారు. తమ పార్టీలోని కొందరు తనకు తెలియకుండా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వివాదాస్పద ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఇబ్బంది కలిగించబోమని ఎమ్మెల్యే చెప్పారు. అదే సమయంలో వివాదానికి సంబంధించిన వ్యక్తుల్లో ఒకరు ఎమ్మెల్యే సమక్షంలో అక్కడే ఉండటం.. అతనిపై మహిళలు దాడికి యత్నించడం గమనార్హం. ఈ క్రమంలో ఎస్సై వి.చంద్రశేఖర్ సిబ్బందితో కలసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
విద్యాసంస్థల పేరుతో ఘరానా మోసం
లింగపాలెం: గంధం సాంబశివరావు అనే వ్యక్తి విద్యా సంస్థలను అప్పజెప్పినట్లుగా చూపి రూ.70 లక్షలు వసూలు చేసి తనను మోసం చేశారని సాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ కోసూరి సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం లింగపాలెం మండలం ధర్మాజీగూడెం శివారులో బాధితురాలు సుజాత విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే.. బాబా ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో గంధం సాంబశివరావు కాలేజీ నడిపే వారు. ఆ కళాశాలలో సరైన వసతులు లేకపోవడంతో ప్రభుత్వం అనుమతితో ధర్మాజీగూడెం శివారు వలసపల్లి అడ్డరోడ్డులో ఉన్న బిల్డింగ్‌లో ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉంటున్న తన కుమారుడి వద్దకు తాను వెళ్లిపోతున్నాని, కాలేజీ తీసుకోమని నన్ను అడిగారు. బాబా ఎడ్యుకేషన్ సొసైటీ అనుమతులను సాయి జూనియర్ కళాశాలగా ధర్మాజీగూడెం శివారులో కొత్తగా నిర్మించిన బిల్డింగ్, ఫర్నీచర్‌తో సహ ఐదేళ్లు వాడుకునే విధంగా పెద్దల సమక్షంలో సాంబశివరావుకు రూ.70 లక్షలకు లీజు అగ్రిమెంట్ చేసుకున్నాం. ఏడాదికి రూ.11 లక్షలు అద్దె చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నాం. అగ్రిమెంట్ సమయంలో రూ. 40 లక్షలు సాంబశివరావుకు ఇవ్వగా మిగిలిన రూ. 30 లక్షల నిమిత్తం డిగ్రీ కాలేజీ అనుమతులు వేరే వారికి ఇచ్చి ఆ వచ్చిన సొమ్మును సాంబశివరావుకు చెల్లించాను. కాగా సాంబశివరావు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి వేరే పేర్లతో బినామీగా వనిత జూనియర్ కళాశాల, క్రిసైల్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు అనుమతులు తీసకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తనను మోసం చేసిన గంధం సాంబశివరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసినట్లు సుజాత తెలిపారు. గూడెంలో మట్టి అక్రమ తవ్వకాలు తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని జగన్నాథపురం, మాధవరం, కొమ్ముగూడెం తదితర గ్రామాల్లోని చెరువులను జేసీబీల సాయంతో తవ్వి మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్ లారీల్లో తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. మట్టి అక్రమ తవ్వకాలు పెద్ద ఎత్తున సాగుతున్నా సంబంధిత శాఖ అధికారులు మిన్నకుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ● రూ.70 లక్షలు తీసుకుని నన్ను బురిడీ కొట్టించారు ● సాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ సుజాత ఆవేదన -
మద్యం మత్తులో యువకుడి హత్య
కాళ్ల: మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో యువకుడు హత్యకు గురైన ఘటన కాళ్ల మండలం ఎల్ఎన్ పురం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కాళ్ళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా కోమటిలంకకు చెందిన చెన్నకేశవ అరవింద్(22), ప్రత్తికోళ్లలంక కు చెందిన బండి జాన్ యేసు ఇద్దరూ బంధువులు. కొంతకాలం క్రితం కాళ్ళ మండలం ఎల్ఎన్ పురం గ్రామంలోని చెరువుల వద్దకు జీవనోపాధి నిమిత్తం వచ్చారు. వీరు పనిచేసే చెరువుల వద్ద కిరణ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి వీరు ముగ్గురు పనిచేస్తున్న చెరువుపై మద్యం సేవించారు. మద్యం మత్తులో బంధువులైన జాన్ యేసు, అరవింద్ ఘర్షణకు దిగారు. అనంతరం జరిగిన దాడిలో జాన్ యేసు మేతబస్తాలపై ఉన్న చాకుతో అరవింద్ ఛాతీపై పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన అరవింద్‌ని పక్కనే ఉన్న కిరణ్ వేరే వ్యక్తి సహాయంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆకివీడు రూరల్ సీఐ జగదీశ్వరరావు, ఎస్సై శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు అరవింద్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేయగా సీఐ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికుక్కునూరు : బైక్ అదుపు తప్పి ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. కుక్కునూరు ఎస్సై రామక్రిష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం, సుకుమకు చెందిన నందా(35), ఉంగా రామ్(29) సోమవారం మధ్యాహ్నం బైక్‌పై భద్రాచలం నుంచి కుక్కునూరులో బంధువుల ఇంటికి వస్తుండగా బంజరగూడెం మలుపు వద్ద బైక్ అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో నందా అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన ఉంగారామ్ను అమరవరం పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించినట్టు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.యథేచ్ఛగా కంకర తరలింపుఉంగుటూరు: ఉంగుటూరు మండలంలోని మెత్తప్రాంతంలో మట్టి, కంకర మాఫియా ముఠా పడగ విప్పింది. రెండు రోజులనుంచి వందలాది లారీలతో యథేచ్ఛగా కంకరను లంబాడీ గూడెం నుంచి పెంటపాడు మండలం అలంపురంనకు తరలిస్తున్నారు. అలాగే బాదంపూడికి చెందిన కూటమి నాయకుడు పోలవరం కాలవగట్టు కంసాలిగుంట నుంచి పోలవరం కాలవగట్టు తవ్వి కంకరను తరలిస్తున్నుట్ల ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గొల్లగూడెం ప్రాంతంలో కుడిగట్టు కంకర గుట్టలు, నాచుగుంట అయకట్టులో మట్టి తరలింపు పనులు జరుగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా ఇవన్నీ జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై తహసీల్దార్ రవికుమార్‌ను ప్రశ్నించగా కంకర తరలింపు పనులు నిలుపుదల చేసినట్లు తెలియజేశారు. -
వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి
నరసాపురం రూరల్: మొగల్తూరు మండల పరిధిలో దారితిప్ప 216 జాతీయ రహదారి మలుపు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై వై నాగలక్ష్మి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోనసీమ అంబేడ్కర్ జిల్లా అంతర్వేదిలో నివాసం ఉంటున్న రామాని దుర్గా ప్రసాద్ (32) తన అత్తవారి ఇంటికి కలవపూడి వద్ద మోడి గ్రామానికి వెళుతున్నాడు. జాతీయ రహదారి మలుపు వద్ద చేపలలోడు వ్యాన్ దుర్గాప్రసాద్ బైక్‌ను ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గాప్రసాద్‌కు భార్య జ్యోతి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నాగలక్ష్మి తెలిపారు. -
లక్ష్మీనారాయణుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పాలకొల్లు సెంట్రల్ : పట్టణంలోని చతుర్భుజ లక్ష్మీతాయార్లు సమేత శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణస్వామివారి (చినగోపురం) బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం సాయంత్రం 6 గంటలకు విశాఖ జిల్లా పెందుర్తి వాస్తవ్యులు, కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రధానార్చకులు ముప్పిరాల అనంతాచార్యస్వామి, వారి శిష్య బృందంచే విశ్వక్సేనారాథన, పుణ్యాహవాచనము, రక్షాబంధనం, బుత్విగరుణము, మృత్సంగ్రహణము, అంకురార్పణ, కుంబావాహన, నివేదన, మంగళాశాసనము, తీర్థప్రసాద వినియోగముతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి బిరుదుకోట శంకర్ తెలిపారు. దేశంలోనే రెండో క్షేత్రం స్వామివారు అష్టబాహువులతో దేశంలో మొత్తం రెండు ప్రాంతాల్లో మాత్రమే కొలువై ఉన్నారని.. ఒకటి కంచి, రెండవది పాలకొల్లులో మాత్రమేనని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఆలయంలో మూలవిరాట్ స్వామివారికి కుడివైపున లక్ష్మీతాయారు, ఎడమ భాగంలో ఆండాళ్లవారి ఉపాలయాలు, వెనుక భాగంలో ఆళ్వార్లు ఉపాలయాలు ఉన్నాయి. ఆలయంలో స్వామివారికి ఎడమ వైపు భాగంలో శ్రీరామక్రతువు స్తూపం, ఆగ్నేయంలో స్వామివారి హోమ మండపం, ఉత్తర భాగంలో స్వామివారి కళ్యాణోత్సవ మండపాలు ఉన్నాయి. అలాగే స్వామివారికి స్థానిక బంగారువారి చెరువుగట్టున తోటోత్సవం నిర్వహించే మండపం ఉంది. ఇక్కడ సుమారు 70 అడుగుల ఎత్తులో ఉన్న గాలిగోపురం నేడు చినగోపురంగా ప్రసిద్ధి చెందినది. శ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి (పెద్దజీయరుస్వామి) విశ్వకళ్యాణముకై ప్రతిష్టించిన 108 శ్రీరామ క్రతువు స్తంభాల్లో 85వ స్థంభం 1968లో ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించారు. ఉత్సవాలు ఇలా.. 13వ తేదీన ఉదయం అలంకార తిరుమంజనం, రాత్రి ఊంజల్ సేవ, చంద్రవాహనసేవ, తిరువీధి ఉత్సవం 14న రాత్రి శేషవాహనసేవ 15న హనుమంత వాహనసేవ 16న గరుడ వాహనసేవ, అనంతరం పటికబెల్లంతో శ్రీ కృష్ణ తులాభారాం 17న ఉదయం శ్రీవారికి పూలంగి సేవ, రాత్రి ఎదురు సన్నాహ మహోత్సవము, అనంతరం శ్రీవారి తిరు కల్యాణం 18న ఉదయం శ్రీవారికి చందనోత్సవం, రాత్రి రథోత్సవం 19న ఉదయం వసంతోత్సవం అనంతరం ధ్రువమూర్తుల తిరుమంజనం, మధ్యాహ్నం మహా పూర్ణాహుతి, రాత్రి ప్రణయ కలహం (ఏడు ముసుగుల ఉత్సవము), దివ్య మంగళ దర్శనం 20న ఉదయం సుదర్శన మహాయజ్ఞం, మధ్యాహ్నం తిరుప్పావడై ఉత్సవం, రాత్రి పండిత సత్కారం అనంతరం శ్రీ పుష్పయాగం నిర్వహించనున్నారు. -
మట్టి తీసి గట్టు మీద పెట్టు
ఉండి: ఉండి సబ్ డివిజన్ పరిధిలో కొత్తగా ఏడు కాలువల పూడికతీత పనులు, గత ప్రభుత్వంలో మంజూరైన రెండు పనులు చేపట్టేందుకు ఇటీవల హడావిడిగా అధికారులు సమాయత్తమయ్యారు. పనులు చేసే విధానం చూస్తుంటే రైతులకు మేలు జరగటం పొరపాటే అని అర్ధం అవుతుంది. కాలువల్లో పూడిక తీసి ఆ మట్టిని వేరే ప్రాంతానికి తరలిస్తే కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డులేకుండా ఉంటుంది. కానీ కాలువల్లో తీసే పూడిక మట్టిని పొక్లెయినర్ సహాయంతో గట్లపైనే వేసి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకుంటున్నారు. కాలువల్లో నీరు ఉన్నాగాని పొక్లెయినర్ల సహాయంతో వారికి నచ్చిన ప్రాంతంలో మట్టిని తీసి గట్లపై వేసి పూడిక తీసేసినట్లు మసిపూసి మారేడు కాయచేస్తున్నారు. అంతే కాకుండా చాలా పని చేసేసినట్లు గట్లపైనా, కాలువ అంచున ఉండే గడ్డిని పొక్లెయినర్ సహాయంతో తొలగించి ఆ ప్రాంతంలో పూడికను చాలా బాగా తొలగించినట్లు చెప్పడం విశేషం. అంతే కాకుండా ఆయా ప్రాంతాల్లో కాలువగట్ల వెంబడి ఉండే సీసీరోడ్లపైనా పూడిక తీసిన మట్టిన వేసి సీసీరోడ్లను మట్టిరోడ్లుగా మార్చేస్తున్న విధానంపై స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదేంటి అని అడిగితే దానికి సమాధానం చెప్పేవారు లేరంటే పనులు జరుగుతున్న తీరు అర్థం చేసుకోవచ్చు. కాలువల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించేందుకు అధికారులు కూడా కంటికి కనిపించడం లేదంటే.. పనులు ఎవరికి లాభం చేకూరుస్తున్నాయో తెలుస్తోంది. ఉండి సబ్ డివిజన్లో మొత్తం 9 పనులు మంజూరు ఉండి ఇరిగేషన్ సబ్ డివిజన్లో మొత్తం 9 పూడికతీత పనులు ఈ వేసవిలో ప్రారంభిస్తున్నారు. వీటిలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.94 లక్షలతో ఏడు పనులు, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరైన రెండు పనులు రూ.12.16 లక్షల అంచనాలతో పనులు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. వీటిలో మొదటిగా ఉండి మండలం కలిసిపూడి రెగ్యులేటర్ నుంచి శివారు ప్రాంతం అజ్జమూరు సరిహద్దు వరకు రూ.33 లక్షల అంచనాలు కాగా అగ్రిమెంట్ రూ.22 లక్షలు (వీటిలో లష్కర్ జీతాలు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు)గా పనిని ప్రారంభించారు. వాండ్రం కాలువ రూ.7.06 లక్షల విలువైన పనులు ప్రారంభమయ్యాయి. మిగిలినవి యండగండి సెక్షన్లో లోసరి మెయిన్ కాలువ, బాపనకోడు, యండగండి అప్పర్పేర్లల్ కాలువ, చిలకంపాడు సెక్షన్లో రావిపాడు కాలువ, వీఎండబ్ల్యూ కాలువ పరిమెళ్ళ లాకుల వద్ద లీడింగ్ కాలువ పూడిక తీత పనులు రూ.62 లక్షలతో చేపట్టాల్సిన ఐదు పనులు రెండు లేదా మూడు రోజుల్లో ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. అలాగే గత ప్రభుత్వంలో రూ.12.16 లక్షల అంచనాలతో మంజూరైన అర్తమూరు, పాములపర్రు కాలువ, జక్కరం బొర్రకోడుల పనులు చేపట్టాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రారంభించిన రెండు పనుల్లో ఇంతటి దారుణం జరుతుంటే చేపట్టాల్సిన మొత్తం ఏడు పనుల్లోను ఎంతటి దారుణాలు చోటుచేసుకుంటాయో అని రైతులు వాపోతున్నారు. తూతూమంత్రంగా కాలువల ఆధునికీకరణ? కాలువలో మట్టి తీసి వేరే ప్రాంతానికి తరలించకుండా గట్టుపైనే వేస్తున్న వైనం పనులు పారదర్శకంగా జరుగుతున్నాయి కలిసిపూడి, వాండ్రం కెనాల్ పూడిక తీత పనులు పారదర్శకంగా జరుతున్నాయి. అనుకున్న విధంగానే పనులు చేపట్టి పూర్తి చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో నీరు ఉండడం వల్ల రెండు లేదా మూడు రోజుల్లో మిగిలిన పనులు ప్రారంభిస్తాము. – డీఈ పీఎన్వీవీఎస్ మూర్తి, ఉండి -
నాటు తుపాకులతో హల్చల్
ఆక్వా చెరువులపై పిట్టలు కొట్టేందుకు వేటగాళ్లు నాటు తుపాకులు విచ్చలవిడిగా వాడుతున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. 8లో uఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీల చట్టంలో ఉన్న అడ్డంకులను తొలగించాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద సోమవారం నిరసన నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్య పరిరక్షణ కోసం యూటీఎఫ్ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని, జీవో 117ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు దాన్ని రద్దుకు ఎలాంటి ప్రత్యామ్నాయ జీవోను రిలీజ్ చేయకపోవడం మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట్ర కార్యదర్శి మనోహర్ కుమార్ మాట్లాడుతూ డిమాండ్లు నెరవేర్చాలని, లేని పక్షంలో ఈనెల 25వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ నెర్సు రామారావు పాల్గొని జేఏసి తరుపున మద్దతు ప్రకటించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రవికుమార్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి ప్రారంభ ఉపన్యాసం చేశారు. -
జనసేనకు టీడీపీ షాక్!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో జనసేనకు టీడీపీ షాకిచ్చింది. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పదవుల్లో కీలక ప్రాధాన్యం ఉంటుందని పదే పదే ప్రకటించి చివరికి జిల్లా స్థాయిలో కూడా చోటు కల్పించకపోవడంతో జనసేన కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదన్న బాధలో ఉన్న వారిని తాజా నియామకాలు మరింత నిరాశకు గురిచేస్తున్నాయి.జనసేన నుంచి నలుగురే..జనసేన పట్టున్నట్టు చెప్పుకునే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇంతవరకు రాష్ట్ర స్థాయిలో 12 మందికి నామినేటెడ్ పదవులు దక్కగా వారిలో జనసేన నుంచి కేవలం నలుగురే ఉన్నారు. జిల్లా నుంచి తొలి విడతలో ఇద్దరికి, రెండో విడతలో నలుగురుకి, తాజాగా ఏడుగురికి పదవులు దక్కాయి. మొదటి విడతలో ఏపీ వినియోగదారుల కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా నియమించిన టీడీపీ మాజీ మంత్రి పీతల సుజాతకు ఈ సారి రాష్ట్ర మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి వరించింది. మిగిలిన వారిలో ఆప్కాబ్ డీసీసీబీ చైర్మన్‌గా ఉంగుటూరు టీడీపీకి చెందిన గన్ని వీరాంజనేయులు, డీసీఎంఎస్ చైర్మన్‌గా జనసేనకు చెందిన చాంగటి మురళీకృష్ణ, భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్‌గా తాడేపల్లిగూడెం టీడీపీకి చెందిన వలవల బాబ్జీ, టైలర్స్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌గా తాడేపల్లిగూడెం టీడీపీకి చెందిన ఆకాశపు స్వామి, మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా నరసాపురం టీడీపీకి చెందిన కొల్లు పెద్దిరాజు, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా ఏలూరు టీడీపీ నగర అధ్యక్షుడు పెన్నుబోయిన వాణి వెంకట శివ ప్రసాద్ ఉన్నారు. మూడో విడతలోని ఏడుగురిలో ఆరుగురు టీడీపీకి చెందిన వారే ఉండటం జన సైనికులకు మింగుడు పడటం లేదు.చినబాబుకు భంగపాటుభీమవరం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయకపోవడంతో ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షుడు, భీమవరానికి చెందిన కొటికలపూడి గోవిందరావు(చినబాబు) బరిలో ఉంటారని భావించారు. అనూహ్యంగా టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు జనసేనలో చేరి సీటు తెచ్చుకున్నారు. కూటమి ధర్మానికి కట్టుబడి భీమవరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పార్టీ ఎమ్మెల్యేల గెలుపునకు పనిచేశారు. ఆయన సేవలకు ఎమ్మెల్సీ పదవి ఆశించారు. పదవి దక్కక ప్రభుత్వ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్న తరుణంలో డీసీసీబీ చైర్మన్‌గా నియమిస్తారంటూ అధినాయకత్వం నుంచి సమాచారం వచ్చిందని రెండు నెలల క్రితం హడావుడి చేశారు. అమరావతి వెళ్లి సీఎం చంద్రబాబును కలవడంతో డీసీసీబీ చైర్మన్‌గా చినబాబు ఖాయం అంటూ వార్తలు వచ్చాయి. అదే సమయంలో చినబాబు అనుచరులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఆదివారం ప్రకటించిన పదవుల్లో డీసీసీబీ చైర్మన్ రాకపోగా, ఎక్కడా ఆయనకు చోటు దక్కక అనుచరుల్లో అసంతృప్తి నెలకొంది. నియోజకవర్గంలో, ఉమ్మడి జిల్లాలో పార్టీని నెట్టుకుని వస్తే అధికారంలోకి వచ్చాక పదవులను వేరొకరు ఎంజాయ్ చేస్తున్నారని మథనపడుతున్నారు.తీవ్ర అసంతృప్తిలో జనసేన కేడర్గత ఎన్నికల్లో జనసేన నుంచి భీమవరం సీటు ఆశించిన వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్‌నాయుడు నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఇప్పటికే భీమవరంలో పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినా పెత్తనమంతా టీడీపీ నాయకుల చేతుల్లోనే ఉంది. ఆచంట, పాలకొల్లు, తణుకు, ఉండి నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తిలో జనసేన కేడర్ ఉంది. ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడుకు ఆర్టీసీ రీజనల్ చైర్మన్‌గా రెండో విడత నామినేటెడ్ పదవుల్లో చోటు కల్పించగా కై కలూరు, చింతలపూడి, పోలవరం తదితర నియోజకవర్గాల్లో కేడర్ తమను ద్వితీయ శ్రేణి నేతలుగానే చూస్తున్న పరిస్థితి ఉందని మండిపడుతున్నారు. -
దళితుల ఇళ్లకు కరెంటు తొలగింపు అన్యాయం
కాళ్ల: ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా దళితుల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ తొలగించడం అన్యాయమని, వెంటనే పునరుద్ధరించకపోతే ఉద్యమిస్తామని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి హెచ్చరించారు. సోమవారం కాళ్ల మండల కేంద్రంలో లంక రోడ్డులో ఉన్న దళితుల ఇళ్లను కేవీపీఎస్ బృందం పరిశీలించి, బాధితులను పరామర్శించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కెవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ కాళ్ల మండల కేంద్రం లంక రోడ్డులో ఉన్న పది దళిత కుటుంబాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దుర్మార్గంగా కరెంటు కట్ చేయడం అన్యాయమన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు చీకట్లో ఉంటూ కొవ్వొత్తుల వెలుగులో చదువుకుని పరీక్షలకు వెళ్లడం సిగ్గుచేటు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారమే దళితుల ఇళ్ళకు కరెంట్ కట్ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదేశాలను పాటించాల్సి వస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పంచాయతీ, ఆర్ అండ్ బీ అధికారులు ఎమ్మెల్యే ఆదేశాలతోనే కరెంట్ కట్ చేసినట్లు చెప్పారన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలక్ట్రికల్ ఏఈ, పంచాయతీ అధికారులు కుమ్మకై ్క కరెంటు కట్ చేశారని తక్షణం వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళితులు కాబట్టే ఆధిపత్యాన్ని చూపించి అన్యాయంగా కరెంటు కట్ చేశారన్నారు. తక్షణం కరెంటు ఇవ్వకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రత్యామ్నాయం చూపించే ఇళ్లు తొలగిస్తున్నామని చెపుతున్న ఎమ్మెల్యే అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో తొలగించాలనుకుంటున్న ఇళ్ళకు వచ్చి బాధితులతో మాట్లాడాలన్నారు. కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో తొలగిస్తున్న పేదల ఇళ్ళకు ప్రత్యామ్నాయం చూపుతున్నారని ఎమ్మెల్యే చెపుతున్నారని ప్రత్యామ్నాయం అంటే ఇళ్ల స్థలాలు చూపి పట్టాలు చేతికివ్వడం మాత్రమే కాదని పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూల్చిన ఇళ్లకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇల్లు కట్టుకొనే వరకు అద్దె కూడా ప్రభుత్వమే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో కేవిపీఎస్ జిల్లా అధ్యక్షులు బత్తుల విజయకుమార్, సీఐటీయు జిల్లా నాయకుడు గొర్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి -
విడదల రజినిపై దౌర్జన్యం సిగ్గుచేటు
ఏలూరు టౌన్: మాజీ మంత్రి, బీసీ మహిళా నేత విడదల రజినిపై పోలీసుల దౌర్జన్యం సిగ్గుచేటని.. కక్షసాధింపు రాజకీయాలతో కూటమి ప్రభుత్వం బిజీగా ఉందని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు విమర్శించారు. ఏలూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్, బీసీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు కక్ష సాఽధింపు చర్యలు వెర్రితలలు వేస్తున్నాయని, రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను అణచివేయాలనే కుట్రలకు తెరదీశారని విమర్శించారు. భారత ప్రభుత్వం, దేశంలోని ప్రజలంతా ఉగ్రవాదులను మట్టుబెట్టాలనే సంకల్పంతో రక్షణ బలగాలకు సంఘీభావం తెలుపుతూ ఉంటే.. కూటమి సర్కారు మాత్రం ప్రతిపక్ష నేతలపై ఎలా కక్ష సాధించాలనే అంశంపై దృష్టి పెట్టడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. లేని లిక్కర్ స్కాంను సృష్టించి అసత్యాలను ఆరోపణలుగా మార్చి దాని చుట్టూ కక్ష తీర్చుకునేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. కాలం ఒకేలా ఎప్పుడూ ఉండదనే విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని, పరిస్థితులు తిరగబడితే రేపు ఇదే పద్ధతులు అనుసరించాల్సి వస్తుందని గుర్తు చేశారు. ఏడాది గడుస్తున్నా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలం గడుపుతోందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో కేవలం రాక్షస పాలన సాగుతుందని, ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయటమే ధ్యేయంగా పాలన చేస్తూ ప్రజలను మాత్రం తీవ్ర ఆర్థిక కష్టాల్లోకి నెట్టారని విమర్శించారు. బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో బీసీలకు సముచిత గౌరవం లేదని.. బీసీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినిపై ఏకంగా పోలీసులు దౌర్జన్యం చేయటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనన్నారు. రాష్ట్ర వడ్డీలు విభాగం అధ్యక్షుడు ముంగర సంజీయ్కుమార్ మాట్లాడుతూ.. బీసీ మహిళా నేత విడదల రజినిని టార్గెట్ చేస్తూ ఆమె రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేక కక్షసాధిస్తూ కేసులు పెట్టటం దారుణమన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు కోమటి విష్ణువర్థన్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా లక్షల కోట్లు అప్పులు చేయడం సంపద సృష్టించటమా? అంటూ నిలదీశారు. వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి మాట్లాడుతూ.. మాజీ మహిళా మంత్రిపై పోలీస్ అధికారి దౌర్జన్యానికి పాల్పడడం మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్దిని చాటుతుందన్నారు. వైఎస్సార్సీపీ ఏలూరు నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు హామీ ఏమైందో చెప్పాలన్నారు. అమ్మకు వందనం అంటూ.. కేవలం నాన్నకు ఇంధనం మాత్రమే అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు తేరా ఆనంద్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్‌బాజీ, వాణిజ్య సెల్ కార్యదర్శి భాస్కర్ల బాచి, నగర బీసీ సెల్ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. హామీలు గాలికొదిలేసి కక్షసాధింపు చర్యలు తీవ్రంగా తప్పుపట్టిన వైఎస్సార్సీపీ నేతలు -
ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు గడువు పెంచాలి
ఏలూరు (టూటౌన్): ఎస్సీ కార్పొరేషన్ రుణాలు పొందడానికి ఆన్లైన్లో దరఖాస్తుకు గడువు పొడిగించాలంటూ కలెక్టర్‌కు ఎస్సీ నాయకులు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ని కలిసి రుణాలు పొందటానికి దరఖాస్తు గడువు పొడిగించాలని.. సర్వర్ పనిచేయని కారణంగా చాలామంది దరఖాస్తు చేసుకోలేక పోయారన్నారు. విషయాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని.. తక్షణం స్పందించి ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందకు మరో పది రోజులు గడువు పొడిగించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ నాయకులు నేతల రమేష్ బాబు, డాక్టర్ మెండెం సంతోష్ కుమార్, దాసరి నాగేంద్ర కుమార్, నూకపెయ్యి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 2138 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం ప్రథమ సంవత్సరం తెలుగు/సంస్కృతం/హిందీ/ఉర్దూ పరీక్షలకు 1708 మంది హాజరు కాగా 137 మంది గైర్హాజరయ్యారు. 125 మంది ఒకేషనల్ విద్యార్థులకు 97 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం పరీక్షకు 306 మంది జనరల్ విద్యార్థులకు 273 మంది హాజరయ్యారు. 77 మంది ఒకేషనల్ విద్యార్థులకు 60 మంది హాజరయ్యారు. వంటా వార్పుతో నిరసన ఏలూరు (టూటౌన్): అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత నెల 28 నుంచి సమ్మె చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్ఓ)లు సమ్మెలో భాగంగా సోమవారం వంటా వార్పు కార్యక్రమంతో కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఇప్పటికై న రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పట్ల స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనకు చర్యలు ఏలూరు (మెట్రో): నాటుసారా తయారీ, అమ్మకాలు సంపూర్ణంగా వదిలిన వారికి వారికి ప్రత్యమ్నాయ ఉపాధి కల్పించే చర్యలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఎకై ్సజ్, వివిధ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా గుర్తించిన అర్హులైన వారికి ప్రత్యమ్నాయంగా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల అధికారులు చర్చించి వారంలోగా తుది జాబితా తయారుచేసి నాటుసారా తయారీకి స్వస్తిపలికిన కుటుంబాలకు జీవనోపాధి మార్గం చూపించాలని ఆదేశించారు. సమావేశంలో ఎకై ్సజ్ అధికారి ఎ.ఆవులయ్య, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం ధర్నా ఏలూరు (టూటౌన్): తమకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలంటూ మండవల్లికి చెందిన హిందూ మాస్టిన్ కుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏలూరు కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరుకు చర్యలు చేపట్టాలని ఆమె ఆర్డీవోకి ఆదేశాలు జారీ చేశారు. -
నేత్ర పర్వం.. రథోత్సవం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో జరుగుతున్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామికి జరిగిన రథోత్సవం నేత్రపర్వమైంది. చినవెంకన్న తిరుకల్యాణ మహోత్సవం జరిగిన మరుసటి రోజు రాత్రి రథత్సవం జరపడం సంప్రదాయంగా వస్తోంది. అధిక సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నా రు. ముందుగా ఆలయంలో అర్చకులు స్వామి, అమ్మవార్లను తొళక్క వాహనంపై ఉంచి, పూజాదికాలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మగళ వాయిద్యాలు, కోలాట భజనలు, అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్ధుల వేద మంత్రోచ్ఛరణల నడుమ వాహనాన్ని రథం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేసి, హారతులిచ్చారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త నివృతరావు, ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తదితరులు రథం వద్ద పూజలు నిర్వహించి, బలిహరణను సమర్పించగా, రథోత్సవం ప్రారంభమైంది. డప్పు వాద్యాలు, కళాకారుల వేషధారణలు, కోలాట భజనలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ శ్రీవారి దివ్య రథం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. ఆలయ ముఖ మండపంలో ప్రత్యేక అలంకరణలో భాగంగా స్వామివారు రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బ్రహ్మోత్సవాల్లో నేడు : ● ఉదయం 7గంటల నుంచి–భజన కార్యక్రమాలు ● 8 గంటల నుంచి – భక్తిరంజని ● 9 గంటల నుంచి–కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● 10.30 గంటల నుంచి–చక్రవారి–అపభృధోత్సవం ● మధ్యాహ్నం 3 గంటల నుంచి – వేద సభ ● సాయంత్రం 4 గంటల నుంచి–నాదస్వర కచేరీ ● 5 గంటల నుంచి – సంగీత విభావరి ● రాత్రి 7 గంటల నుంచి–కూచిపూడి నృత్య ప్రదర్శన ● 8 గంటల నుంచి – పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ ● 9 గంటల నుంచి–అశ్వవాహనంపై గ్రామోత్సవం ● శ్రీవారి ప్రత్యేక అలంకారం – కాళీయమర్దనం -
నాణ్యతతో అర్జీలు పరిష్కరించాలి
ఏలూరు (మెట్రో): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 258 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్రా థీమ్ కార్యక్రమంపై విస్తృతంగా అనేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నెలలుగా వేతనాలు బంద్ ఎంపీటీసీలకు గత 20 నెలలుగా ఎలాంటి వేతనాలు ఇవ్వడం లేదని భీమడోలు మండల ఎంపీటీసీలు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసారు. తక్షణం బకాయి ఉన్న గౌరవ వేతనాలను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీలు కోరారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసి.. లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించే కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్లో ఇళ్ల నిర్మాణాలు, ప్రగతిపై కలెక్టరు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇచ్చిన లక్ష్యం పూర్తి చేయకపోవడంతో కలెక్టరు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా 788 ఇళ్ల రూఫ్ కాస్ట్ పూర్తి చేయాలన్నారు. రూఫ్ లెవెల్లో ఉన్న ఇళ్లకు వారం రోజుల్లో స్లాబులు వేయించాలన్నారు. 20 -
కిట్టువల్లనే కుటుంబంలో కల్లోలం, సంధ్య చచ్చిపోయింది!
పశ్చిమ గోదావరి: తనను ఆర్థికంగా మోసగించారన్న మనస్తాపంతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో భార్య మృతి చెందింది. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మాదు శ్రీనివాస్ దంపతులు ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం భార్య సంధ్య (23) మృతి చెందడంతో బంధువులు విషాదంలో మునిగిపోయారు. దగ్గర బంధువైన కిట్టుకు 20 ఏళ్ల క్రితం నగదు ఇచ్చాడని ఆ నగదుతో పొలం కొన్నారని బంధువులు తెలిపారు. ప్రస్తుతం తాను అప్పుల్లో ఉన్నానని తన వాటాగా ఎంత వస్తే అంత ఇవ్వాలని శ్రీనివాస్ కిట్టును అడగ్గా.. ఇచ్చేది లేదని చెప్పడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. మేకా రామకృష్ణ (కిట్టు) వల్ల ఒక కుటుంబం నాశనమైందని బంధువులు ఆరోపించారు. ఈ చావుకు అతనిదే బాధ్యతని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, స్థానికులు ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. -
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం
వైఎస్సార్సీపీ ఇన్చార్జి విజయరాజు చింతలపూడి: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం న డుస్తోందని వైఎస్సార్ సీపీ చింతలపూడి ని యోజకవర్గ సమన్వయ కర్త కంభం విజయరా జు అన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత విడదల రజిని విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు రౌడీల్లా వ్యవహరించడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ స్థాయి లో దిగజారాయో అర్థమవుతుందని, మాజీ మంత్రి రజినీ విషయంలో చిలకలూరిపేట సీఐ సుబ్బారాయుడు వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం అన్నారు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభు త్వం ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తోంద ని విమర్శించారు. మాజీ సీఎం జగన్ చుట్టూ ఉన్న నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి కక్ష రాజకీయాలకు తెరలేపారన్నా రు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలన్నారు. కూట మి ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచినా ఇప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం ప్రజాన్యాయస్థానంలో జవాబు చెప్పాల్సి ఉంటుందని అన్నారు. చి లకలూరిపేట సీఐపై చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. కూటమి పాలనలో మహిళల కు రక్షణ కరువయ్యిందని ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రజలన్నీ గమనిస్తున్నారని చంద్రబాబు రాక్షస పాలనకు తగిన సమయంలో బుద్ధి చెబుతారని విజయరాజు హెచ్చరించారు. -
పంచాయతీ ఆస్తుల పరిరక్షణ
భీమవరం(ప్రకాశం చౌక్): ఆక్రమణల చెరలో ఉన్న గ్రామ పంచాయతీల భూములు, ఆస్తుల పరిరక్షణకు హైకోర్టు ఉత్తర్వులు అమలు చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగనుంది. ఇటీవల కలెక్టర్ సీహెచ్ నాగరాణి జిల్లాలో హైపర్ కమిటీ ఏర్పాటు చేసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పంచాయతీ భూమి, ఆస్తులు ఆక్రమణలను గుర్తించడం, వాటిని తొలగించడం, బాధ్యులపై కేసులు నమోదు తదితర చర్యలపై హైపర్ కమిటీకి సృష్టమైన అదేశాలు ఇచ్చారు. పంచాయతీ భూమి ఆక్రమణను గుర్తించిన వెంటనే పోలీసుల సహకారంతో పంచాయతీ అధికారులు ఆక్రమణలు తొలగిస్తారు. సమస్యలు తలెత్తితే హైపర్ కమిటీలోని అధికారులు చర్యలు తీసుకుంటారు. ప్రతి మూడు నెలలకోసారి హైపర్ కమిటీ సమావేశమై ఆక్రమణల గుర్తింపు, తొలగింపు పురోగతిని సమీక్షిస్తుంది. అలాగే ప్రతినెలా డివిజన్ పంచాయతీ అధికారి సమీక్షిస్తారు. వీరిచ్చే నివేదిక ఆధారంగా రెండు నెలలకు ఓసారి జిల్లా పంచాయతీ అధికారి కేసులను సమీక్షిస్తారు. జిల్లాలోని 409 పంచాయతీల్లో.. పశ్చిమగోదావరి జిల్లాలో 409 పంచాయతీలు ఉండగా.. పలు ప్రాంతాల్లో పంచాయతీల ఆస్తులు ఆక్రమణలకు గురయ్యాయి. పంచాయతీ భూములు, చెరువులు, డ్రెయిన్లను ఆక్రమించుకుని ఇళ్లు, షాపుల నిర్మాణం, లేఅవుట్లలోని పంచాయతీ భూమిని కలుపుకుని ప్లాట్ వేసి విక్రయించడం, పంచాయతీకి చెందిన భూమి పాడుకుని పాట చెల్లించకుండా స్వాధీనం చేసుకోవడం వంటి అతిక్రమణలు ఉన్నాయి. పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు ప్రతి సోమవారం భీమవరం కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పంచాయతీల్లో ఆక్రమణలపై పలు ఫిర్యాదులు అందుతున్నాయి. జిల్లాలోని 20 మండలాల్లో ప్రతివారం మూడు, నాలుగు పంచాయతీల ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తున్న క్రమంలో హైకోర్టు ఉత్తర్వులతో జిల్లా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. పంచాయతీకి చెందిన ఆస్తులు, భూములను మూడు వర్గాలుగా విభజించారు. పంచాయతీ ఆస్తుల వర్గీకరణ ఏ కేటగిరీ : సొంత, భూసేకరణలోని ఆస్తులు, సాధారణ రోడ్లు, డ్రెయిన్లు, పశువుల షెడ్లు, సాధారణ మార్కెట్ ప్రాంతాలు, లేఅవుట్లలోని 10 శాతం ఖాళీ స్థలాలు, పార్కులు, పంచాయతీ కొనుగోలు చేసిన భూములు. బీ కేటగిరీ : బహమతులు, విరాళాలు, పంచాయతీలకు భూముల బదిలీ ద్వారా వచ్చిన ఆస్తులు తదితరాలు. సీ కేటగిరీ : పంచాయతీల్లోని వాటర్ వర్క్స్, రిజర్వాయర్లు, ట్యాంకులు, సిస్టర్న్లు, ఫౌంటేన్లు, బావు లు, పైపులు, పంచాయతీరాజ్ చట్టంలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, ట్యాంక్ బండ్లు, నీటివనరులు, పోరంబోకు భూములు (మేత భూములు, నూర్పిడి అంతస్తులు), శ్మశాన వాటికలు, పశువుల స్టాండ్లు, బండి స్టాండ్లు. ఏ, బీ కేటగిరీల రక్షణ బాధ్యత పంచాయతీలది కాగా.. సీ కేటగిరీ రక్షణ బాధ్యత పంచాయతీతో పాటు రెవెన్యూ శాఖది. రోడ్లు, కాలువ గట్ల ఆక్రమణలపై సర్వే పంచాయతీ పరిధిలోని ఆర్అండ్బీ రోడ్లకు ఇరువైపులా, కాలువలు, డ్రెయిన్ల ఆక్రమణలపై సర్వే చేసి జాబితా రూపొందించాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు అధికారులు సర్వే పనులు చేపట్టారు. హైపర్ కమిటీ హైపర్ కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి, ఇరిగేషన్, సర్వే, ఆర్ అండ్ బీ, మైనింగ్ తదితర శాఖల జిల్లా అధికారులు కమిటీ సభ్యులుగా ఉంటారు. పారదర్శకంగా సాధ్యమేనా? పంచాయతీల్లో ఆక్రమణలు తొలగింపు అధికారులకు సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు తొలగింపులకు అడ్డుపడితే అధికారులు ముందుకు వెళ్లగలరా అన్నది అనుమానమే. పంచాయతీ ఆస్తుల పరిరక్షణలో కలెక్టర్, హైపర్ కమిటీ ఈ మేరకు విజయవంతం అవుతారో వేచి చూడాలి. హైకోర్టు ఆదేశాలతో చర్యలు కేటగిరీ వారీగా ఆస్తుల విభజన ఆక్రమణల తొలగింపు.. కేసుల నమోదు జిల్లాలో హైపవర్ కమిటీ ఏర్పాటు జిల్లా 409 గ్రామ పంచాయతీలు -
గూడుకట్టుకున్న నిర్లక్ష్యం
సాక్షి, భీమవరం : పేదల సొంతింటి కలను సాకా రం చేసే పక్కా ఇళ్ల నిర్మాణం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడా ది కాలంలో 9,107 ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు 3,434 మాత్రమే పూర్తయ్యాయి. నిర్మాణ వ్యయం పెరిగిపోవడం, ప్రభుత్వ సాయం చాలక ఇళ్ల నిర్మాణానికి పేదవర్గాల వారు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. లక్ష్యం ఆమడ దూరం గత ఏడాది జూన్‌లో అధికారంలోకి వచ్చిన కూ టమి ప్రభుత్వం ఈ ఏడాది మే నెలాఖరు నాటికి పునాది, లింటల్ తదితర దశల్లోని 9,107 ఇళ్లను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. రూ.1.80 లక్షలకు గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు అ దనంగా రూ.50 వేలు సాయాన్ని ప్రకటించింది. కా గా సిమెంట్, ఐరెన్, ఇటుక తదితర నిర్మాణ సా మగ్రి ధరలు పెరిగిపోవడంతో రూ.5 లక్షలు ఉంటేనే గాని ఇంటి నిర్మాణం పూర్తికాని పరిస్థితి. ప్రభుత్వ సాయం చాలడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. మరోపక్క సంక్షేమ పథకాల అమలు నిలిచిపోవడంతో పేదల దగ్గర డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. త్వరితగతిన ఇళ్లను నిర్మించుకోవాలని హౌసింగ్ అధికారులు ఒత్తిడి తెస్తున్నా ఆర్థిక ఇబ్బందులతో చాలామంది లబ్ధిదారులు ముందుకురాక ఇప్పటివరకు కేవలం 3,434 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. నిర్ణీత లక్ష్యంలో అత్యధికంగా భీమవరంలో 60 శాతం పూర్తి కాగా తాడేపల్లిగూడెం అర్బన్, పోడూరు, పాలకోడేరు, పెంటపాడులో 30 శాతంలోపే పూర్తయ్యాయి. నెలాఖరుకు పూర్తి చేయాలి రెండు రోజుల క్రితం ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. ఇళ్ల నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలో 14వ స్థానంలో ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. మిగిలిన 5,721 ఇళ్లను నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు అధికారులు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో ఉద్యమంలా.. సొంతిల్లు లేని పేదలు ఉండకూడదన్న లక్ష్యంతో మునుపెన్నడూ లేనివిధంగా జిల్లాలోని 626 లేఅవుట్లలో 47,362 మందికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. సొంతంగా స్థలం ఉన్న పేదలకు 22,757 మందితో మొత్తం 70,119 మందికి ఇళ్లను మంజూరు చేసింది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు సాయం అందించడంతో పాటు ఇంటి నిర్మాణంలో వారికి అండగా నిలిచింది. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న లబ్ధిదారులకు అదనంగా రూ.35,000 రుణ సాయాన్ని అందించింది. సబ్సిడీపై ఐరెన్, సిమెంట్, ఉచితంగా ఇసుకను అందజేసింది. పేదలపై రవాణా చార్జీల భారం పడకుండా లే అవుట్ల సమీపంలోనే వీటి స్టాక్ పాయింట్లను ఏర్పాటుచేసింది. పనుల వేగవంతానికి కోట్లాది రూపాయలు వెచ్చించి జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేసింది. అప్పట్లో దాదాపు 28 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. పడకేసిన ఇళ్ల నిర్మాణం పెరిగిన వ్యయం.. చాలని సాయం ముందుకు సాగని పనులు మే నెలాఖరుకు 9,107 ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యం ఏడాదిలో పూర్తయినవి కేవలం 3,434 గృహాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భారీగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జిల్లాలో 626 లేఅవుట్లలో 47,362 మందికి స్థలాల అందజేత జిల్లాలో ఇళ్ల నిర్మాణ ప్రగతి మండలం లక్ష్యం నిర్మించినవి నిర్మించాల్సినవి భీమవరం 274 165 109 కాళ్ల 177 105 72 పెనుగొండ 429 224 205 ఇరగవరం 254 127 127 మొగల్తూరు 282 134 148 ఆచంట 379 175 204 తాడేపల్లిగూడెం 628 287 341 తణుకు అర్బన్ 273 119 154 అత్తిలి 187 80 107 ఆకివీడు అర్బన్ 272 114 158 తణుకు 581 227 354 ఉండి 399 155 244 గణపవరం 300 112 188 నరసాపురం 412 149 263 యలమంచిలి 359 124 235 ఆకివీడు 314 108 206 వీరవాసరం 260 89 171 పాలకొల్లు అర్బన్ 94 31 63 పాలకొల్లు 200 64 136 నర్సాపురం అర్బన్ 172 55 117 పెనుమంట్ర 512 161 351 పాలకోడేరు 376 113 263 భీమవరం అర్బన్ 332 99 233 పెంటపాడు 443 117 326 పోడూరు 549 138 411 తాడేపల్లిగూడెం అర్బన్ 649 162 487 -
అప్రమత్తత.. ముందస్తు భద్రత
ఏలూరు టౌన్: జిల్లావ్యాప్తంగా పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లాలో వా హన తనిఖీలు మరింత ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో పుణ్యక్షేత్రాలు, రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, జనసంచారం అధికంగా ఉండే కూడళ్లలో పోలీసులు ఆదివారం సా యంత్రం సోదాలు నిర్వహించారు. ఏలూరు, జంగా రెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు పోలీస్ సబ్ డివి జన్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు జరిగా యి. ముఖ్యంగా ద్వారకాతిరుమల పుణ్యక్షేత్రం వద్ద, ప్రధాన రహదారుల్లో పోలీస్ అధికారులు డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. అక్రమ చొర బాట్లు, మద్యం, గంజాయి, డ్రగ్స్, పేలుడు పదార్థాలు, డబ్బు అక్రమ రవాణాను అడ్డుకునేందుకు, అసాంఘిక శక్తులను గుర్తించేందుకు తనిఖీలు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ శివకిషోర్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు దేశంలోకి చొరబడి బాంబు పేలుళ్లు వంటివి చేసే ప్రమాదం ఉండటంతో ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలనీ, ప్రజల భద్రత దృష్ట్యా నిత్యం నిఘాను మరింత పెంచామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లావ్యాప్తంగా పోలీసుల తనిఖీలు -
ఘనంగా నృసింహ జయంతి
ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం నృసింహ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. లక్ష్మీ నృసింహ మూలమంత్ర హోమం, నీరా జన మంత్రపుష్పం జరిపించారు. అనంతరం తీర్థ ప్రసాద వినియోగలను ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, జి.అనంత కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ ఈఓ సాయి పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. అరటి రైతులకు మాజీ సీఎం జగన్ చేయూత హర్షణీయందెందులూరు: కడప జిల్లాలో 2024 మార్చిలో కురిసిన వర్షాలు, వరదలకు నష్టపోయిన 670 మంది అరటి రైతులకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.1.14 కోట్ల ఆర్థిక సాయం అందించడం వైఎస్ కుటుంబానికి రైతులపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఏలూరు జిల్లా అరటి రైతు సంక్షేమ సంఘం నేత, వైఎస్సార్సీపీ నేత ఉప్పలపాటి సత్తిబాబు అన్నారు. ఆదివారం సంక్షేమ సంఘ నాయకులు విలేకరులతో మాట్లాడారు. అరటి రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకోకపోవడంతో మాజీ సీఎం జగన్ హెక్టారుకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లా అరటి రైతు సంక్షేమ సంఘం తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు సంఘ నేత సత్తిబాబు తెలిపారు. 14న ఏపీటీఎఫ్ ధర్నా ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 14న విజయవాడలో నిర్వహించనున్న భారీ ధర్నాకు టీచర్లు పెద్దఎత్తున హాజరై జయప్రదం చేయాలని జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రామారావు, బి.రెడ్డి దొర ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అమలు చేయనున్న 9 రకాల పాఠశాలల వ్యవస్థ అసంబద్ధంగా ఉందని, ప్రాథమిక పాఠశాల వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని మూడు రకాల పాఠశాల వ్యవస్థను అమలు చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను మంజూరు చేయాలని, సంపాదిత సెలవుల నగదును ఖాతాల్లో జమ చేయాలని, 11వ పీఆర్సీ ఆర్థిక బకాయిలతో పాటు అన్నిరకాల ఆర్థిక బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్జీటీలను హెచ్ఎంలుగా నియమించాలి నూజివీడు: సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ)కు పదోన్నతి కల్పించి ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా నియమించాలని సెకండరీ గ్రే డ్ టీచర్స్ ఫెడరేషన్ (ఎస్జీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొక్కెరగడ్డ సత్యం డిమాండ్ చేశారు. నూజివీడులో ఆదివారం ఆయన మాట్లాడుతూ హైస్కూళ్లలో మిగులుగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను ఆదర్శ పాఠశాలలకు హె చ్ఎంలుగా నియమించాలని ప్రభుత్వం ఆలోచన సమంజసం కాదన్నారు. అలాగే ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 1:20 ఉండాలని, మిగులు స్కూల్ అసిస్టెంట్లను ప్రాథమికోన్నత పాఠశాలల్లో నియమించాలని డిమాండ్ చేశారు. నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లావ్యాప్తంగా సోమ వారం నుంచి ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 13,103 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. ఫస్టియర్ విద్యార్థులు 10,068 మంది కోసం 34 పరీక్షా కేంద్రాలు, సెకండియర్ విద్యార్థులు 3,035 మంది కోసం 23 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రతి కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులను, ఇన్విజిలేటర్లను ఇప్పటికే నియమించి వారికి శిక్షణ ఇచ్చారు. ఆప్కాబ్ చైర్మన్‌గా గన్ని భీమడోలు: ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు రాష్ట్ర కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) చైర్మన్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా నియమితులయ్యారు. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనకు అభినందనలు తెలిపారు. భీమడోలులోని పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. -
కమనీయం.. శ్రీవారి కల్యాణం
నేత్రపర్వంగా చిన వెంకన్న కల్యాణోత్సవం ద్వారకాతిరుమల: సర్వాభరణ భూషితుడైన శ్రీవా రు నుదుటున కల్యాణ తిలకం, బుగ్గన చుక్కలతో సిగ్గులొలుకుతున్న అమ్మవార్లను పెండ్లాడారు. ద్వా రకాతిరుమల చినవెంకన్న బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన తిరుకల్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ తూ ర్పు రాజగోపురం వద్ద కల్యాణ వేదికపైకి శ్రీవారు, అమ్మవార్లను వేర్వేరు వాహనాల్లో తీసుకువచ్చి రజిత సింహాసనంపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు కల్యాణ తంతును ప్రారంభించి, పలు ఘట్టాలను పూర్తిచేసి శుభముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను జరిపించారు. దేవస్థానం తరఫున శ్రీవారికి ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు కుమారుడు నివృతరావు పట్టువస్త్రాలను సమర్పించగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవార్లకు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పట్టువస్త్రాలను అందించారు. పాంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమాన్ని అనుసరించి జరిపిన వేడుక భక్తజనులను పరవశింపజేసింది. కల్యాణోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లు వెండి గరుడ వాహనంపై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. ఆలయ ముఖ మండపంలో ప్రత్యేక అలంకరణలో భాగంగా స్వామివారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేడు రథోత్సవం ఆదివారం రాత్రి 8 గంటల నుంచి శ్రీవారి దివ్య రథోత్సవం నిర్వహించనున్నారు. శ్రీవా రి ప్రత్యేక అలంకారం రాజమన్నార్. దుర్గగుడి నుంచి పట్టువస్త్రాలు చినవెంకన్న బ్రహ్మోత్సవాలకు విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం వా రు పట్టువస్త్రాలు సమర్పించారు. దుర్గగుడి ఈ ఓ వీకే శీనానాయక్ దంపతులు పట్టువస్త్రాల ను ఇక్కడి ఈఓ సత్యనారాయణమూర్తి చేతులమీదుగా అర్చకులకు అందజేశారు. -
అనాథ మృతదేహానికి అంతిమ సంస్కారం
భీమవరం: పట్టణంలో అనాథ మృతదేహానికి శనివారం మానవత సంస్ధ ఆధ్వర్యంలో అంతిమ సంస్కారం నిర్వహించారు. పట్టణంలోని కొత్తబస్టాండ్ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందగా అనాథ మృతదేహంగా గుర్తించిన పోలీసులు మానవత సంస్థకు సమాచారం ఇచ్చారు. దీంతో సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, కో–చైర్మన్ కారుమూరి నర్సింహమూర్తిబాబు, అల్లు శ్రీనివాస్ స్పందించి మృతదేహాన్ని ఖననం చేశారు. చోరీకి గురైన బంగారం స్వాధీనం ముదినేపల్లి రూరల్ : చోరీకి గురైన బంగారు వస్తువులను స్థానిక పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని చిగురుకోటకు చెందిన గుబిలి సుబ్బారావు భార్యకు అనారోగ్యంగా ఉండడంతో ఈ నెల 6న విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తిరిగి రాగా గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉంచిన 45 గ్రాముల బంగారు నగలు, 50 గ్రాముల వెండి చోరీ చేశారు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేయగా కై కలూరు రూరల్ సీఐ వి రవికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది దర్యాప్తు చేసి చిగురుకోటకు చెందిన పిండి శ్రీనును శనివారం అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో చొరవ చూపిన సిబ్బంది బి.నాగబాబు, సీహెచ్ లక్ష్మీ శ్రీకాంత్, బి.పవన్‌ను సీఐతో పాటు ఎస్సై వీరభద్రరావు అభినందించారు. లారీ ఢీకొని వ్యక్తి మృతి తణుకు అర్బన్: లారీ ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు మృతిచెందిన ఘటన తణుకు జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామానికి చెందిన మట్టా సత్యనారాయణ (35) స్నేహితుడితో కలిసి తాడేపల్లిగూడెం నుంచి మోటారుసైకిల్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా ఉండ్రాజవరం జంక్షనన్ వద్ద టిప్పర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో సత్యనారాయణ లారీ కింద ఇరుక్కుని అక్కడిక్కడే మృతిచెందగా స్నేహితుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ గాదిరెడ్డి దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వరుస చోరీలు.. నిందితుడి అరెస్టు చింతలపూడి: వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని చింతలపూడి పోలీసులు శనివారం పట్టుకున్నారు. సీఐ సీహెచ్ రాజశేఖర్ వివరాలు వెల్లడిస్తూ.. స్థానిక ఫాతిమాపురం చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం, పాత రేపూడి గ్రామానికి చెందిన కొప్పుల వెంకటేశ్వరరావు అనుమానాస్పదంగా కనిపించడంతో అప్రమత్తమైన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో వెంకటేశ్వరరావుపై 35 దోపిడీ, దొంగతనాలు, కేసులు ఉన్నట్లు గుర్తించారన్నారు. నిందితుడు పామర్రు ప్రాంతంలో ఒక వ్యక్తిని మోసం చేసి అతని నుంచి బైక్ దొంగిలించినట్లు విచారణలో తేలిందన్నారు. చింతలపూడి మండలంలోని ఒక వ్యక్తిని జేసీబీ పని పేరుతో నమ్మించి, దాడి చేసి, అతని వద్ద రూ.7,500 నగదు, ఫోనన్ దొంగిలించినట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ తెలిపారు. శ్రీవారి క్షేత్రంలో వీధి కుక్కల పట్టివేత ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో సంచరిస్తున్న వీధి కుక్కలను దేవస్థానం అధికారులు శనివారం పట్టించి, అటవీ ప్రాంతానికి తరలించారు. ద్వారకాతిరుమల గ్రామం, ఆలయ పరిసరాల్లో వీధి కుక్కల సంచారం ఎక్కువగా ఉంది. దీంతో క్షేత్రానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీన్ని గమనించిన ఆలయ అధికారులు తాడేపల్లిగూడెంకు చెందిన సిబ్బందితో వాటిని పట్టించారు. మొత్తం 70 శునకాలను పట్టుకుని, దూర ప్రాంతానికి తరలించారు. వాటిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టమని చెప్పినట్టు అధికారులు తెలిపారు. -
కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ కార్యవర్గం ఎన్నిక
తణుకు అర్బన్: కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ ఏలూరు డివిజన్ నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం తణుకులో నిర్వహించారు. రాజమండ్రి డివిజన్ అధ్యక్షుడు టి.రాము ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఏలూరు డివిజన్ అధ్యక్షుడిగా పి.రాజేష్‌బాబు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా వై.నాగేంద్రప్రసాద్, కోశాధికారిగా బీవీ బాబు, అసోసియేట్ అధ్యక్షుడిగా కె.ప్రశాంత్‌కుమార్, ఆఫీస్ సెక్రటరీగా వై.జయశ్రీ, ఉపాధ్యక్షులుగా జి.సతీష్‌కుమార్, సీహెచ్ నరేష్, సహాయ కార్యదర్శులుగా కేఎన్ఎస్ యాదవ్, ఎం.రాజేష్‌ను ఎన్నుకున్నారు. -
ఇంటి పరిహారం ఎప్పుడు?
కుక్కునూరు: పోలవరం పరిహారం చెల్లింపులో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నిర్వాసితులను అయోమయానికి గురిచేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక గత జనవరిలో ప్రాజెక్ట్ 41.15 కాంటూర్ పరిధి బ్యాక్ వాటర్‌లో ముంపునకు గురవుతున్న గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ వ్యక్తిగత, ఇంటి విలువకు ప్యాకేజీ చెల్లించింది. వ్యక్తిగత ప్యాకేజీ దాదాపు అందరికీ జమ కాగా ఇంటి విలువకు సంబంధించిన పరిహారం మాత్రం కొందరికి మాత్రమే జమచేశారు. చాలా మంది నిర్వాసితులకు ఇంటి విలువలకు సంబంధించిన పరిహారం జమ కాలేదు.ఇ ఈ సంవత్సరం పరిహారం చెల్లింపు ఉంటుందా లేదా అన్న మీమాంసలో నిర్వాసితులు ఉన్నారు. పోలవరం సర్వేలో భాగంగా నిర్వాసితుల ఇళ్లకు సంబంధించి సర్వే చేసి కొలతలు సేకరించిన సిబ్బంది వాటిని కంప్యూటరైజ్డ్ చేశారు. అనంతరం ప్రదర్శించిన రెండు జాబితాల్లో ఉన్న నిర్వాసితుల పేర్లు మూడో జాబితాలో లేకుండా పోయాయి. తమ పేర్లు జాబితా నుంచి గల్లంతైన విషయం తెలిసిన నిర్వాసితులు అధికారులను కలిసి వివరించారు. అధికారులు సిబ్బందిని నిర్వాసితుల ఇళ్లకు పంపి ఇంటి కొలతలు, తగిన ఆధారాలు, ఇంటి ఫొటోలు సేకరించారు. అయితే జాబితాలో వారి పేర్లు నమోదు చేశారా? లేదా అనేది నిర్వాసితులకు చెప్పలేదు. మండల స్థాయి అధికారులు నిర్వాసితులకు సంబంధించిన వివరాలు నిజమేనని ధ్రువీకరించి జిల్లా అధికారులకు పంపినప్పటికీ జిల్లా స్థాయి అధికారులు నిర్వాసితులకు న్యాయం చేయడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పేర్లు గల్లంతైన నిర్వాసితులు ఎప్పటికి న్యాయం జరుగుతుందోనని ఎదురుచూస్తున్నారు. పోలవరం నిర్వాసితుల ఎదురుచూపులు -
పెండ్లి కుమారుడిగా మీసాల వెంకన్నస్వామి
కై కలూరు: మీసాల వెంకన్న వార్షిక బ్రహోత్సవాలు కై కలూరులో అత్యంత వైభవంగా శనివారం ప్రారంభమయ్యాయి. స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యాహవచన, పంచామృత అభిషేకాలు చేశారు. స్వామివారిని పెండ్లికుమారుడు, అమ్మవారిని పెండికుమార్తెగా అలంకరించారు. సుదర్శన హోమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మాడ వీధులలో గజ వాహనంపై స్వామిని ఊరేగించారు. ఆలయ ఈవో వీఎన్కే.శేఖర్ మాట్లాడుతూ ఆదివారం రాత్రి 7.10 గంటలకు స్వామి దివ్య కల్యాణం జరుగుతుందన్నారు. మద్దిలో అభిషేక సేవ జంగారెడ్డిగూడెం: గురవాయిగూడెంలో తెల్ల మద్ది చెట్టు తొర్రలో స్వయంభూగా వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించున్నారు. -
బతుకు పోరులో.. పీకల్లోతు మురుగులో !
బతుకు పోరులో నిజమైన హీరోలు వీరే.. డ్రైనేజీ పక్క నుంచి వెళ్లడానికే మనం చిరాకుపడతాం. రోడ్డుపై మురుగు కనిపిస్తే ఆ చాయలకు వెళ్లేందుకు ఇష్టపడం.. అలాంటిది తీవ్ర దుర్వాసన వెదజల్లే మురుగులో దిగి శుభ్రం చేసే వీరిని చూస్తే బతుకు పోరు ఎంత విచిత్రమో అనిపిస్తుంది. వారు ఒక్క రోజు పనిచేయకపోతే మన జీవనం ఎంత దుర్భరమో.. అందుకు ఈ చిత్రమే నిదర్శనం. ద్వారకాతిరుమలలోని రాణిచిన్నయమ్మారావుపేటలో మురుగుతో నిండిపోయిన డ్రైనేజీని శుభ్రం చేసేందుకు ఓ కార్మికుడు శనివారం అందులో దిగి ఎంతగానో శ్రమించాడు. మురుగు ముందుకు కదలకపోవడంతో పీకల్లోతున మునిగి డ్రైనేజీని శుభ్రం చేశాడు. – ద్వారకాతిరుమల -
మళ్లీ జగనన్న పాలన రావాలని..
జంగారెడ్డిగూడెం: మళ్లీ జగనన్న పాలన వచ్చి పేదల మోముల్లో చిరునవ్వు నిలవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్రెడ్డి రావాలని కోరుకుంటూ శనివారం ఆమె ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించి పూజలు చేయించారు. దక్షిణా ముఖంగా ఉన్న శ్రీవారి మెట్లకు బొట్లు పెట్టుకుంటూ ఆలయానికి చేరుకుని, ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమం అందక పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎటువంటి అభివృద్ధి, సంక్షేమం కానరాకపోగా, ఆర్భాటాలు, ప్రచారాలు, హడావుడి కనిపిస్తున్నాయన్నారు. కూటమి పాలన నుంచి విముక్తి కలిగి మళ్లీ జగనన్న రాజ్యం రావాలని ఆమె ఆకాక్షించారు.