కాలువ గట్టు.. పూడిక తీసికట్టు | - | Sakshi
Sakshi News home page

కాలువ గట్టు.. పూడిక తీసికట్టు

May 17 2025 6:32 AM | Updated on May 17 2025 6:32 AM

కాలువ గట్టు.. పూడిక తీసికట్టు

కాలువ గట్టు.. పూడిక తీసికట్టు

ఉండి: అనుకున్నంత అయ్యింది.. చెప్పినట్టే జరిగింది.. ఉండి కాలువ పూడికతీత పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుందని, చినుకుపడితే పూడిక తీసిన మట్టి మళ్లీ కాలువలోకి వెళ్లిపోతుందని ఈనెల 13న ‘సాక్షి’లో ‘మట్టి తీసి గట్టు మీద పెట్టు’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈనెల 15న సాయంత్రం ఉండి మండలంలో కురిసిన కొద్దిపాటి వర్షానికే కలిసిపూడి గ్రామంలో ఉండి కాలువలో చేపట్టిన పూడిక తీత మట్టి మళ్లీ కాలువలోకే జారిపోయింది. నామమాత్రంగా పనులు చేపట్టడం, పూడిక తీసిన మట్టి మరలా కాలువలోకే జారిపోవడంపై రైతులు మండిపడుతున్నారు. కలిసిపూడి రెగ్యులేటర్‌ నుంచి కాలువ శివారు అజ్జమూరు వరకు రూ.33 లక్షలు అంచనా కాగా అగ్రిమెంట్‌గా రూ.22 లక్షలతో పనులు చేపట్టారు. కాలువలో నీరు ఉండగానే పూడికతీత పనులు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఇవేమీ పట్టించుకోకుండా కాంట్రాక్టర్‌, అధికారులు తూతూమంత్రంగా రాత్రిళ్లు పనులు చేపట్టారు. కాలువలో తీసిన మట్టి గట్లపై వేస్తుండటంపై ప్రజల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. కాలువ నుంచి తీసిన పూడికతీత మట్టి గట్ల అంచుల్లో పూసేస్తున్నారు. దీంతో కొద్దిపాటి వర్షానికే అంచుల్లోని మట్టి కాలువలోకి జారిపోయింది.

నీళ్లు నములుతున్న అధికారులు

‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా నాయకులు, అధికారులు ఈనెల 14న ఉండి ఇరిగేషన్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాలువలో తీసిన మట్టి గట్లపై కాకుండా ఎక్కడ వేస్తారు అంటూ ఛలోక్తులు విసురుకున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు కాలువలోకి జారిన మట్టిపై ఎవ రు సమాధానం చెబుతారనేది ప్రశ్నార్థకం. దీనిపై అధికారులను వివరణ కోరగా నీళ్లు నములుతున్నారు. కాలువలోకి జారిన మట్టిని తొలగిస్తారా అని ఏఈ ఫణిశంకర్‌ను ప్రశ్నించగా కాలువలోకి జారితే తీసేస్తామంటూ సమాధానమిచ్చారు. దీనిని బట్టి పూడికతీత పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదని అర్థమవుతోంది. కాలువలోకి జారిపోయిన మట్టిన మరలా ఎప్పుడు తొలగిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

పూడిక తీసిన మట్టి మళ్లీ కాలువలోకే..

కొద్దిపాటి వర్షానికే జారిపోయిన గట్లు

‘సాక్షి’ చెప్పినట్టే జరిగింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement