
రేపు వైఎస్సార్‌సీపీ కార్యవర్గ సమావేశం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఈనెల 21న నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం ఏలూరులోని గన్‌బజారులోని ఓ కల్యాణ మండపంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఆ సమావేశంలో పార్టీకి సంబంధించిన జిల్లాస్థాయి కమిటీలతో పాటు మండల స్థాయి కమిటీల నియామకాల గురించి చర్చిస్తామన్నారు. పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ), నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. టి.వేదకుమారి (దెందులూరు)ని రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా, గురజాల పార్థసారథిని (చింతలపూడి) రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా, పోకల రాంబాబుని (దెందులూరు) రాష్ట్ర పంచాయతీ విభాగం ప్రధాన కార్యదర్శిగా, మేడూరి రంగబాబుని (చింతలపూడి) రాష్ట్ర పంచాయతీరాజ్ విబాగం కార్యదర్శిగా, కుంజ భూమయ్యని (పోలవరం) రాష్ట్ర దివ్యాంగుల విభాగం కార్యదర్శిగా నియమించారు.