గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి మృతి

May 22 2025 1:11 AM | Updated on May 22 2025 1:11 AM

గుర్త

గుర్తు తెలియని వ్యక్తి మృతి

ద్వారకాతిరుమల: స్థానిక లింగయ్య చెరువు వద్ద పడిపోయిన గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై టి.సుధీర్‌ తెలిపిన వివరాలు ప్రకారం. లింగయ్య చెరువు వద్ద సుమారు 50 సంవత్సరాల వయస్సుగల వ్యక్తి మంగళవారం ఉదయం పడిపోయాడు. వెంటనే దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని స్థానిక పీహెచ్‌సీకి, అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సెల్‌ నెంబర్‌ 94407 96653కు సమాచారం అందించాలని ఆయన కోరారు.

చికిత్స పొందుతూ జట్టు కూలీ మృతి

భీమడోలు: గుండుగొలను శివారు బీసీ కాలనీ వద్ద తవుడు లారీ బోల్తా ఘటనలో జట్టు కూలీ గొర్జి శ్రీనివాసరావు(52) బుధవారం మృతి చెందాడు. ఈనెల 20వ తేదీ సాయంత్రం రత్నాపురంలోని ఆక్వా చెరువుల వద్దకు తవుడు బస్తాలను దిగుమతి చేసేందుకు ఏడుగురు జట్టు కూలీలు లారీ ఎక్కారు. గుండుగొలను నుంచి రత్నాపురం వెళ్తుండగా మార్గమధ్యమైన గుండుగొలను బీసీ కాలనీ వద్ద లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలకు గాయాలయ్యాయి. వారిలో తీవ్ర గాయాలైన గొర్జి శ్రీను ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

దెందులూరు: విద్యుత్‌ షాక్‌తో ఒక వ్యక్తి మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఎలా ఉన్నాయి. బుధవారం ఏలూరు రూరల్‌ మండలం లింగారావు గూడెం చెరువు వద్ద పనికి వచ్చిన పెరుమాళ్ళ తాతారావు (50) విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ప్రమాదంలో చెరువు యజమాని మార్త శివకుమార్‌ కూడా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్సై దుర్గాప్రసాద్‌ తెలిపారు.

మనవడి దాడి.. అమ్మమ్మ మృతి

భీమవరం: మనవడు కొట్టడంతో అమ్మమ్మ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఇది. భీమవరం టూటౌన్‌ సీఐ జి.కాళీచరణ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్రి మాణిక్యం (79) అనే వృద్ధురాలు రాయలం ప్రాంతానికి చెందిన భూదేవి తోటలో తన కుమార్తె ఇంట్లో ఉంటుంది. కాగా ఆమె కుమార్తెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో పెద్ద మనవడికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఆ చిన్నారి ఇంటి ఆవరణలోని పూల మొక్కలు లాగేస్తుండగా మృతురాలు ఆగ్రహం వ్యక్తం చేసి తిట్టింది. అమ్మమ్మ తీరుపై ఆమె రెండో మనవడు తోట మధు ప్రశ్నించగా ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆవేశానికి గురైన మధు కొట్టడంతో అమ్మమ్మ మాణిక్యం కింద పడి మృతి చెందింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

తాతారావు మృతదేహం వద్ద రోదిస్తున్నబంధువులు

గుర్తు తెలియని వ్యక్తి మృతి 1
1/2

గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతి 2
2/2

గుర్తు తెలియని వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement