నేడు కాపాడుకుంటేనే.. రేపు మనది! | - | Sakshi
Sakshi News home page

నేడు కాపాడుకుంటేనే.. రేపు మనది!

May 22 2025 1:08 AM | Updated on May 22 2025 1:08 AM

నేడు

నేడు కాపాడుకుంటేనే.. రేపు మనది!

కై కలూరు: మానవ మనుగడలో ‘జీవ వైవిధ్యం’ అనే పదాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. జీవ వైవిధ్యం అంటే భూమిపై ఉండే.. జన్యువులు, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులుసహా పలు జాతులు, పర్యావరణ వ్యవస్థల సముదాయం. భవిష్యత్‌ తరాలకు అపారమైన విలువలను అందించే ప్రపంచ ఆస్తిగా ఈ అంశాన్ని పరిగణిస్తారు. ఏటా మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే, రాష్ట్రానిది జీవ వైవిధ్యంలో కీలక స్థానం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు (ఏపీఎస్‌బీబీ) బయోడైవర్సటీపై అవగాహన కల్పిస్తోంది.

రాష్ట్రం ప్రత్యేకతలు

రాష్ట్రంలో 37,258 చదరపు కిలోమీటర్లలో అటవీ విస్తీర్ణం ఉంది. తూర్పుతీరంలో రెండో అతిపెద్ద మడ అడవులు ఉన్నాయి. జీవ వైవిధ్య హాట్‌స్పాట్‌లుగా చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు వినతికెక్కాయి. మొట్టమొదటి బయోస్పియర్‌ రిజ ర్వ్‌గా శేషాచలం కొండలను గుర్తించారు. నల్లమల ఏపీలో అతిపెద్ద అడవి. జీవ వైవిధ్యపరంగా ఏపీలో 2,800కంటే ఎక్కువ మొక్కల జాతులు, 5,757కంటే ఎక్కువ వివిధ జాతుల జంతువులు ఉన్నాయి. రాష్ట్రంలో జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలు (బీఎంసీ) 14,157 ఉండగా, వీటిలో 1,800 కమిటీలకు అంతరించిపోతున్న జాతులు, ఔషద మొక్కల నర్సరీలను పెంచడానికి ఏపీఎస్‌బీబీ హోమ్‌ హెర్బల్‌ గార్డెన్‌ పైలెట్‌ ప్రాజక్టును మంజూరు చేసింది.

అంతరిస్తున్న అరుదైన జాతులు

అడవుల నరికివేత, రసాయనాల వాడకం, కాంక్రిట్‌ జంగిల్‌, ఆహార, ఆవాసాల కొరత వల్ల అరుదైన జాతులు అంతరించిపోతున్నాయి. ఈ పరిణామాలను 1964 స్థాపించిన ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) రెడ్‌ లిస్ట్‌ వెల్లడిస్తోంది. రాష్ట్రానికి చెందిన దాదాపు 65 రకాల జాతులకు చెందిన మొక్కలు, పక్షులు, క్షీరదాలు, చేపలు, సరిసృపాలు రెడ్‌ జాబితాలో ఉన్నాయి.

ఆరుదైన జీవ వైవిధ్యం.. మన సొంతం

పర్యాటకులను కట్టిపడేసే పర్యావరణ అందాలతో పాటు జీవ వైవిధ్య ఏపీ సొంతం. కొల్లేరు సరస్సు, రోళ్లపాడు, కోరింక, నాగార్జునసాగర్‌, శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌, పాపికొండలు, శ్రీ వేంకటేశ్వర జాతీయ ఉద్యానవనం, శేషాచల కొండలు, పులులు, చిరుతలు, ఏనుగులు, పక్షులు ఆకట్టుకుంటాయి. రాష్ట్రంలో ఆంజియో స్పెర్‌మ్స్‌ మొక్కల జాతులు 3,000, జిమ్నోస్పెర్‌మ్స్‌ జాతి మొక్కలు 3, ప్టెరిడోఫైట్‌ జాతులు 72, బ్రయోఫైట్స్‌ జాతులు 100 మొక్కలతో పాటు 550 చెట్ల జాతులు, 285 పొదలు, 1,765 మొక్కలు ఉన్నాయి. కొల్లేరు అభయారణ్య పరివాహక ప్రాంతాలో 185 జాతుల పక్షులు విహరిస్తాయి.

కొత్త జీవులను గుర్తించండి

ప్రజా నివాస పరిసరాలలో కొత్త జీవులు, మొక్కలను ప్రతి ఒక్కరూ నిశితంగా గమనించి గుర్తించండి. భావితరాలకు వాటిని అందించవచ్చు.

– ఫరిదా టంపాల్‌, డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌,

తెలుగు రాష్ట్రాల డైరెక్టర్‌, హైదరాబాద్‌

జీవ వైవిధ్యం ప్రమాదంలో ఉంది

మానవ తప్పిదాల వల్ల జీవ వైవిధ్యం ప్రమాదంలో ఉంది. అడవుల నరికివేత, అధిక కాలుష్యం, వాతావరణ మార్పులు ఇందుకు కారణం.

– డాక్టర్‌ ఎం.విజయ్‌కుమార్‌, జంతుశాస్త్ర అధ్యాపకులు, వైవీఎన్నార్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కై కలూరు.

జీవ వైవిధ్యం.. జిందగీ నేస్తం

ఈ విషయంలో రాష్ట్రానిది కీలక స్థానం

మీకు తెలుసా..?

ఒక ఎకరం వరి పొలాన్ని కీటకాలు లేకుండా కాపాడడానికి సుమారు 50 కప్పలు అవసరం. ఒకప్పుడు జరిగిన కప్పమాంసం ఎగుమతులను భారత్‌ నిషేధించింది.

1990 నుంచి రాష్ట్రంలో రాబందుల సంఖ్య 95 శాతం తగ్గింది.

మడ అడవులు ఏటా వాతావరణం నుంచి కార్బన్‌డయాకై ్సడ్‌ ఉద్గారాల్లో 15 శాతం తొలగించగలవు.

అమెజాన్‌ రెయిన్‌ ఫారెస్టు మాత్రమే ఏటా వాతావరణానికి 8 ట్రిలియన్‌ టన్నుల నీటి ఆవిరిని విడుదల చేస్తుంది. ఈ కారణంగానే ఎర్త్‌ లంగ్స్‌గా అమెజాన్‌ను పిలుస్తారు.

ప్రపంచంలో 53 శాతం అడవులు కేవలం బ్రెజిల్‌, చైనా, కెనడా, రష్యా, అమెరికా ఉన్నాయి.

నేడు కాపాడుకుంటేనే.. రేపు మనది!1
1/4

నేడు కాపాడుకుంటేనే.. రేపు మనది!

నేడు కాపాడుకుంటేనే.. రేపు మనది!2
2/4

నేడు కాపాడుకుంటేనే.. రేపు మనది!

నేడు కాపాడుకుంటేనే.. రేపు మనది!3
3/4

నేడు కాపాడుకుంటేనే.. రేపు మనది!

నేడు కాపాడుకుంటేనే.. రేపు మనది!4
4/4

నేడు కాపాడుకుంటేనే.. రేపు మనది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement