
యోగాతో మెరుగైన జీవనం
ఏలూరు (టూటౌన్): యోగా మెరుగైన జీవనానికి దోహద పడుతుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. వట్లూరు టీటీడీసీలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యోగా ఓరియెంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జెడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన పెంచేందుకు శ్రీయోగాంధ్రశ్రీ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ప్రతీ మండలంలో మాస్టర్ ట్రైనర్ల ద్వారా యోగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. శ్రీయోగాంధ్రశ్రీ కార్యక్రమం నిర్వహణలో భాగంగా రూపొందించిన యాప్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. వేముల ధర్మారావు ఆధ్వర్యంలో యోగా శిక్షణా జరిగింది. కార్యక్రమంలో డీఆర్‌ఓ వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం సుబ్రహ్మణ్యేశ్వ రరావు తదితరులు పాల్గొన్నారు.
యోగాంధ్ర 2025పై అవగాహన కల్పించాలి
ఏలూరు(మెట్రో): జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాంధ్ర 2025పై జిల్లాలో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం యోగాంధ్ర కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.