
వంకా రవీంద్రకు సత్కారం
జిల్లా పార్లమెంట్ పరిశీలకులుగా నియమితులైన ఎమ్మెల్సీ వంక రవీంద్ర జిల్లా సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆయనను సత్కరించి కార్యకర్తలు, నాయకులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా వంకా రవీంద్ర మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపే ధ్యేయంగా ప్రతీ కార్యకర్త ,నాయకుడు పనిచేయాలని పిలుపు నిచ్చారు. కార్యకర్తలకు అండగా ఉంటామని, ఏ కష్టం వచ్చినా ముందుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్, నియోజకవర్గాల ఇన్‌చార్జులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, మామిళ్ళపల్లి జయప్రకాష్(జేపీ), కంభం విజయ రాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు. నగర పార్టీ అధ్యక్షుడు గుడిదేశీ శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి గాదిరాజు సుబ్బరాజు, రాష్ట్ర కార్యదర్శులు చిత్తూరు మురళీకృష్ణ, దాసరి రమేష్, సూర్య బలిజ విభాగం అధ్యక్షుడు శక్తి త్యాగరాజు, వడ్డీల విభాగం అధ్యక్షుడు ముంగర సంజీవ్ కుమార్, పార్టీ ఉపాధ్యక్షులు జగ్గవరపు జానకి రెడ్డి, చేబోయిన వీర్రాజు, జెడ్పీటీసీలు ములుగుమాటి నీరజ, కడిమి రమేష్, పోల్నాటి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.